
స్థానిక సంస్థల్లో సత్తాచాటాలి
స్థానికం
పూడూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొప్పుల రాజశేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన పూడూరు మండల కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడనిగా రాఘవేందర్, ఉపాధ్యక్షులుగా నర్సింహారెడ్డి, వెంకటేష్, ప్రభాకర్‌యాదవ్, శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులుగా వడ్ల క్రిష్ణాచారి, రామచంద్రయ్య, కార్యదర్శులుగా శ్రీకాంత్‌రెడ్డి, బాలమణి, మనోహర్‌గౌడ్, ప్రభగౌడ్, కోశాధికారిగా మంజుల, కమిటీ సభ్యులుగా రాజు, శ్రీహరిచారి, శ్రీశైలం, రవి, రమేష్, సతీష్ తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో సినిమా సెన్సార్‌బోర్డు సభ్యుడు మల్లేష్‌పటేల్, నాయకులు సుభాన్, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి

స్థానిక సంస్థల్లో సత్తాచాటాలి