కాలుష్య రహిత గ్రామాలే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

కాలుష్య రహిత గ్రామాలే లక్ష్యం

May 14 2025 8:03 AM | Updated on May 14 2025 8:03 AM

కాలుష్య రహిత గ్రామాలే లక్ష్యం

కాలుష్య రహిత గ్రామాలే లక్ష్యం

కుల్కచర్ల: ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అల్లాపూర్‌, రాంరెడ్డిపల్లి, ముజాహిద్‌పూర్‌, పటెల్‌చెరువు తండా, కామునిపల్లి, కుల్కచర్ల గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో అన్ని సదుపాయాలు, మౌలిక వసతులు ఉండేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, మొక్కల పెంపకం చేపట్టి కాలుష్య రహితంగా గ్రామాలను తీర్చిదిద్దుతామని అన్నారు. కాంగ్రెస్‌ అంటేనే పేదల ప్రభుత్వమని అన్నారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్‌ సదుపా యం కల్పించినట్లు తెలిపారు. త్వరలో మరిన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. కార్య క్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆంజనేయులు, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, బ్లాక్‌ బీ అధ్యక్షుడు భరత్‌కుమార్‌, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్‌ నాయక్‌, మండల మాజీ అధ్యక్షుడు వెంకటయ్య, జిల్లా కార్యదర్శి యాదయ్య, నాయకులు చంద్రభూపాల్‌, రవి, భరత్‌కుమార్‌ రెడ్డి, సోమలింగం, షర్పొద్దీన్‌, భాస్కర్‌, కృష్ణయ్య పాల్గొన్నారు.

అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు

దోమ: అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని శివారెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇళ్లు రాని వారు ఆందోళన చెందరాదని, రెండో విడతలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పరిగి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పరశురాంరెడ్డి,ౖ డైరెక్టర్‌ శాంతుకుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ యాదవరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మాలి విజయ్‌కుమార్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, అధికార ప్రతినిధి ఈడిగి రమేశ్‌గౌడ్‌, యూత్‌ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్‌ బంగ్ల యాదయ్యగౌడ్‌, మాజీ సర్పంచ్‌ నరేందర్‌రెడ్డి, మాజీ ఉపసర్పంచ్‌ చెన్నయ్య, నాయకులు రాఘవేందర్‌రెడ్డి, అర్జున్‌రెడ్డి, మొగులయ్యగౌడ్‌, భీంరెడ్డి, ఆంజనేయులు, రామకృష్ణారెడ్డి, నర్సింహులు, వెంకట్‌రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement