
ఐస్‌క్రీం కేంద్రంపై దాడులు
కుల్కచర్ల: కాలం చెల్లిన పదార్థాలతో ఐస్‌క్రీంలు తయారు చేస్తున్న స్థావరంపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడి చేసి కేసు నమోదు చేసిన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ అన్వేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కొందుర్గు మండలం పార్వతీపురం గ్రామానికి చెందిన ఎండీ అజీం, యూపీకి చెందిన అనిల్, రాంపాల్ అనే ఇద్దరితో కలిసి కుల్కచర్ల మండల కేంద్రంలో ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని క్లాసిక్ అనే కంపెనీ పేరుతో ఐస్‌క్రీంలు తయారు చేసి విక్రయిస్తున్నారు. కాగా మంగళవారం టాస్క్‌ఫోర్స్ సీఐ అన్వర్ పాషా ఆధ్వర్యంలో సిబ్బంది ఆకస్మికంగా ఐస్‌క్రీం బండ్లపై దాడులు చేసి, తయారీ స్థావరాన్ని పరిశీలించారు. ఇందులో అన్నీ కాలం చెల్లిన పదార్థాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించి స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
కాలం చెల్లిన ముడిపదార్థాలతో తయారీ
ముగ్గురిపై కేసు నమోదు