
గోశాలకు 48 గోవుల తరలింపు
కుల్కచర్ల: నగరానికి అక్రమంగా తరలిచేందుకు సిద్ధంగా ఉంచిన గోవులను హిందూ సంఘాల నాయకులు అడ్డుకున్నారు. ఈ ఘటన మండల పరిధిలోని బండవెల్కిచర్లలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ అన్వేశ్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన మోహన్ గోవులను నగరానికి తరలిస్తున్నాడనే సమాచారం తెలసుకున్న హిందూ సంఘాలు, గోసంరక్షణ సంఘాలు అక్కడకు చేరుకున్నారు. వారు మోహన్‌ను ప్రశ్నించడంతో గోవులు నగరానికి చెందిన ఖాసీం అనే వ్యక్తివని వాటిని సంరక్షిస్తున్నందుకు గాను తనకు వేతనం ఇస్తున్నాడని చెప్పారు. విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. 48 గోవులను కరణ్‌కోట్ గోశాలకు తరలించారు. బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి చెంచు హన్మంత్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరణం ప్రహ్లాదరావు, మండల అధ్యక్షుడు వెంకటయ్యముదిరాజ్, ప్రధాన కార్యదర్శి హన్మంతు, రఘోత్తమస్వామిజీ, కాంగారి ఆంజనేయులు, రాజేశ్వర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.