గొప్ప పోరాటయోధుడు ఠానునాయక్
మీర్‌పేట: భూమి, భుక్తి, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం పోరాడిన గొప్పయోధుడు ఠానునాయక్ అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని చందన చెరువు కట్టపై ఆదివారం తెలంగాణ సాయుధ పోరాట యోధుడు జటోత్ ఠానునాయక్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఠానునాయక్ చరిత్రను, పోరాట స్ఫూర్తిని నేటి యువత, విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గిరిజనుల అభివృద్ధికి తన వంతు పాత్ర పోషిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీందర్‌నాయక్, స్థానిక బంజారా నాయకులు జటావత్ శ్రీనివాస్ నాయక్, హామునాయక్, రవీందర్‌నాయక్, సికిందర్‌నాయక్, డా.లక్ష్మణ్‌నాయక్, దేవానంద్ నాయక్, దీప్‌లాల్‌నాయక్, బాలునాయక్, లక్ష్మణ్‌నాయక్, మాజీ డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, బీజేపీ నాయకుడు కొలన్ శంకర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు అర్కల భూపాల్‌రెడ్డి, అర్కల కామేశ్‌రెడ్డి, దిండు భూపేష్‌గౌడ్, అనిల్‌యాదవ్, రాజ్‌కుమార్, మాదరి రమేష్, బాలరాజ్, సునీత, రజాక్, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి


