
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన
కడ్తాల్: మండల పరిధి న్యామతాపూర్ గ్రామంలో ఆదివారం శ్రీ మాత పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్‌గుప్తా, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథ్‌నాయక్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ.. ఆలయాల నిర్మాణంతో గ్రామాల్లో ఆధాత్మికత, భక్తిభావం మరింత పెంపొందుతుందన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి రూ.6 లక్షలు విరాళం అందజేసిన మహేశ్‌ను సన్మానించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన బొడ్రాయిపండుగలో నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవీందర్‌రెడ్డి, నాయకులు మహేశ్, రాములు పాల్గొన్నారు.