
మిషన్ భగీరథ నీరు వృథా!
దోమ: మండల పరిధిలో శివారెడ్డిపల్లి గ్రామంలో మిషన్‌భగీరథ నీరు రావడం లేదని ఫిర్యాదు రావడంతో అధికారులు కనెక్షన్‌ను తీసి నల్లాను ఏర్పాటు చేశారు. కానీ ఆ నల్లాకు ట్యాప్ పెట్టకుండానే అధికారులు వదిలేశారు. దీంతో నల్లా నుంచి నీరు వృథాగా పోతుంది. ఉదయం, రాత్రి తేడా లేకుండా తాగునీరు నేల పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీరు రోడ్డుపై చేరడంతో బురదగా తయారయ్యి నడవలేకపోతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. అంతేకాకుండా ఆ నీరు పొలాల్లో చేరి నిండుతున్నాయని చెబుతున్నారు. సంబంధిత అధికారులకు విషయం తెలిసినా అటు వైపుగా కన్నెత్తి చూడడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు నల్లా కనెక్షన్లకు ఆన్‌ఆఫ్‌లను వెంటనే అమర్చి నీటి వృథాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు
పట్టించుకోని అధికారులు