
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
మొయినాబాద్ రూరల్: హిమాయత్‌నగర్‌లోని పల్లవి ఇంటర్నేషనల్ పాఠశాలలో పని చేస్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ నాయకులు రుద్రకుమార్, అల్లి దేవేందర్‌గౌడ్ డిమాండ్ చేశారు. నాన్ టీచింగ్ స్టాఫ్‌తో కలిసి సోమవారం పాఠశాల ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్రైవర్లు, క్లీనర్లు, ఆయాలుగా పనిచేస్తున్న కార్మికుల వేతనాలు చెల్లించకుండా యాజమాన్యాం ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. వీరందరికీ వెంటనే గుర్తింపు కార్డులు, నెలాంతర, సాధారణ సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల ఉపాధ్యక్షుడు ముంజగళ్ల ప్రభుదాస్, నాన్ టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఎదుట
సీఐటీయూ నాయకుల ధర్నా