
విమర్శలను తిప్పికొట్టాలి
తాండూరు: కాంగ్రెస్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను నాయకులు తిప్పికొట్టాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని తులసీ గార్డెన్‌లో స్థానిక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఆర్ మాట్లాడుతూ.. పార్టీ కోసం ఏళ్ల నుంచి కష్టపడి పని చేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు పదవుల్లో పెద్దపీట వేస్తామన్నారు. పార్టీ పదవులకు ఆశావహులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. శాసన సభ ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలను హస్తగతం చేసుకున్నామని గుర్తు చేశారు. కార్యకర్తల శ్రమతోనే తాము ఈ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రమేష్ మహరాజ్, పార్టీ జిల్లా ఇన్‌చార్జి వినోద్‌కుమార్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, అధికార ప్రతినిధి నరేందర్, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, తాండూరు ఏఎంసీ చైర్మన్ బాల్‌రెడ్డి, నాయకులు డాక్టర్ సంపత్‌కుమార్, ఉత్తమ్‌చంద్, నారాయణరెడ్డి, అజయ్‌ప్రసాద్, ప్రభాకర్‌గౌడ్, గోపాల్, వేణు, మల్లప్ప, ఆయా మండలాల మండల, గ్రామ కమిటీ ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు తదితరులున్నారు.
పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు
డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి