
గ్రామాలకు కార్యదర్శులే పట్టుకొమ్మలు
అబ్దుల్లాపూర్‌మెట్: పంచాయతీ కార్యదర్శుఽలే గ్రామాలకు పట్టు కొమ్మలని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేటలోని వీఆర్‌సీ కన్వెన్షన్ హాల్‌లో శనివారం నిర్వహించిన రాష్ట్ర పంచాయతీ కార్యదర్శులు ఆత్మీయ సమ్మేళనానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెరెడ్డి, ఎమ్మెల్సీలు మహేఽశ్‌గౌడ్, కోదండరాంతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో కార్యదర్శులు లేని వ్యవస్థను ఊహించలేమన్నారు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రతీ సంక్షేమ పథకాన్ని ప్రజల వద్దకు చేర్చడంలో వీరి పాత్ర కీలకమన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో గ్రామాలు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. పంచాయతీ అధికారులు, సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఈక్రమంలో మానసిక ఒత్తిడికి గురై సుమారు 50 మంది పంచాయతీ కార్యదర్శులు ప్రాణాలు కోల్పోయారని స్పష్టంచేశారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి పాలనలో ఇలాంటి సమస్యలన్నీ దూరమై పంచాయతీ అధికారులు, సిబ్బంది ఆనందంగా ఉన్నారన్నారు. ఇంకా కొన్ని సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని వాటిని కూడా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సమావేశం ప్రారంభానికి ముందు పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో మరణించిన అమరవీరుల ఆత్మకుశాంతి చేకూరాలని కోరుతూ మౌనం పాటించి, అంజలి ఘటించారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ కార్యదర్శిగా పనిచేస్తూ ఆత్మహత్యకు పాల్పడిన పీర్ల వెంకన్న భార్యకు రూ.3 లక్షల చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎ.శ్రీకాంత్‌గౌడ్, సంఘం రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి ఎన్.నాగరాజు, గౌరవ అధ్యక్షుడు ఎం.సందీప్, కోశాధికారి ఎం.శశింద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ రాజ్,సీ్త్రశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
పంచాయతీ సిబ్బంది సమస్యలపరిష్కారానికి హామీ