
అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన
పరిగి: అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పరిగి పట్టణంలో రూ.200 కోట్లతో చేపట్టనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం రాష్ట్ర విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ గణపతిరెడ్డితో బుధవారం భూ పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలకు సంబంధించి విద్యార్థులు ఒకే చోట విద్యనభ్యసించాలని ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. తుంకుల్‌గడ్డలో అన్ని వసతులతో పాఠశాల భవనం నిర్మించనున్నట్లు తెలిపారు. త్వరలో పనులను ప్రారంభిస్తామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆనంద్‌రావు, ఏ బ్లాక్ అధ్యక్షుడు పార్థసారథి, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, వైస్ చైర్మన్ అయూబ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, నాయకులు ఆంజనేయులు, చిన్న నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలి
సీఎం సహాయ నిధిని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి సూచించారు. మండలంలోని రాపోల్ గ్రామానికి చెందిన తిరుపతి అనారోగ్యానికి గురై చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేస్తుకున్నాడు. బాధితునికి రూ.1.28 లక్షలు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన చెక్కును బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సీఎం సహాయ నిధి పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పార్టీ రాపోల్ గ్రామ అధ్యక్షుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆ దిశగా ప్రభుత్వం కృషి
రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి