
ఆదర్శప్రాయుడు పుచ్చలపల్లి
తాండూరు టౌన్: సాయుధ రైతాంగ పోరాట యోధుడు, స్వాతంత్య్ర సమర యోధుడు పుచ్చల పల్లి సుందరయ్య అందరికీ ఆదర్శనీయుడని సీపీ ఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె శ్రీనివాస్ అన్నారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో ఆయన వర్ధంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సాయుధ రైతాంగ పోరాటంలో నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా పోరాడి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టిన ధీరుడని కొనియాడారు. పార్లమెంటుకు సైకిల్‌పై వెళ్లి తన నిరాడంబరతను చాటుకున్న మహనీయుడన్నారు. రైతాంగ సమస్యలపై పోరాటం చేసిన ఆయన చరిత్ర అందరికీ ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో నాయకులు బుగ్గప్ప, మల్కయ్య, సాదిక్, బాలస్వామి, రాజు, సురేష్, సంజు తదితరులు పాల్గొన్నారు.