
సాగులో రసాయనాలు నియంత్రించాలి
తాండూరు రూరల్: పంటలపై రసాయన మందుల వాడకాన్ని నియంత్రించాలని తాండూరు వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి సూచించారు. మంగళవారం మండలంలోని బెల్కటూర్ గ్రామంలోని రైతు వేదిక వద్ద రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు యూరియాను అధికారులు సూచించిన మోతాదులోనే వాడాలన్నారు. విత్తనాలు, ఎరువులు కొనేటప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు పంట మార్పిడి చేసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న ఆధునిక పద్ధతులు ఉపయోగించి అధిక దిగుబడులు సాధించాలన్నారు. అనంతరం శాస్త్రవేత్తలు శేఖరర్, యమున పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ కొమరయ్య, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి