
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
యాలాల: పొలం వద్ద అకారణంగా దళిత యువకుడిపై దాడికి పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య డిమాండ్ చేశారు. ఆదివారం యాలాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కోకట్ గ్రామానికి చెందిన మాస్త అంజిలప్ప సర్వే నంబరు 183లోని ఐదెకరాల పొలంలో ట్రాక్టర్ కల్టివేటర్‌తో దున్నుతున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పురుషోత్తంరెడ్డి, బబ్లూ రెడ్డిలు తమ పొలం గట్టు దున్నుతావా అంటూ విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్లు తెలిపారు. గతంలో కూడా అంజిలప్పపై ఇటువంటి దాడి జరిగిందన్నారు. దాడికి పాల్పడిన వారిపై అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాంచందర్, వెంకటయ్య, చిన్న అనంతయ్య తదితరులు ఉన్నారు.
కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య