
గుప్త నిధుల కోసం తవ్వకాలు?
కేశంపేట: గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన సంఘటన మండల పరిఽధిలోని వేములనర్వ గ్రామ శివారులోని పాత బీరప్ప దేవాయలం సమీపంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములనర్వ గ్రామం నుంచి అల్వాల వైపు వెళ్లే దారిలో పాత బీరప్ప దేదాలయం సమీపంలో ఓ రైతుకు చెందిన వ్యవసాయ పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు మూడు రోజుల క్రితం జేసీబీ సాయంతో గుంతను తీసి పూడ్చివేశారు. ఆదివారం సమీపంలోని రైతులు గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. గుంత సమీపంలో పూజా సామగ్రితో పాటు నిమ్మకాయలు, గుమ్మడికాయలు కన్పించాయి. ఓ కుండను పగులగొట్టిన ఆనవాళ్లు కన్పించాయి. గతంలో పాత బీరప్ప గుడి సమీపంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగినట్టు గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న సీఐ నరహరి సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుంత తీసి మళ్లీ పూడ్చిన ఆనవాళ్లు ఉన్నట్టు తెలిపారు.