
17లోగా దరఖాస్తు చేసుకోండి
● కలెక్టర్ ప్రతీక్ జైన్
అనంతగిరి: తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ (తాలిమ్) నుంచి లైసెన్స్ సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అన్ని మీ సేవ కేంద్రాల్లో రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 17వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. ఇంటర్‌లో గణితం ఒక అంశంగా ఉండాలన్నారు.(కనీసం 60శాతం మార్కులు సాధించిన వారు), ఐటీఐ డ్రాఫ్ట్‌స్ మెన్ (సివిల్) డిప్లొమా (సివిల్), బీటెక్ (సివిల్) లేదా సమానమైన అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు జిల్లా ప్రధాన కేంద్రాలలో మే 26 నుంచి జూలై 26వ తేదీ వరకు పని దినాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఓసీ అభ్యర్థులు రూ.10 వేలు, బీసీ అభ్యర్థులు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.