
ధాన్యాన్ని మిల్లులకు తరలించండి
ధారూరు: కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే సేకరించి రైస్ మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ ఆదేశించారు. మండలంలోని గట్టేపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 128 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటి ద్వారా 17,459.920 మెట్రిక్ టన్నులు వడ్లు సేకరించినట్లు తెలిపారు. రైతుల ఖాతాల్లో రూ.18 కోట్లు జమ చేసినట్లు వివరించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని, దళారులను నమ్మి మోసపోరాదని రైతులకు సూచించారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ మోహన్‌బాబు, డీటీసీఎస్ శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండలంలోని దోర్నాల్ గ్రామంలో నిర్వహించిన భూభారతి సదస్సులో పాల్గొని రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు.
అదనపు కలెక్టర్ లింగ్యానాయక్