
నేటి నుంచి కెపాసిటీ బిల్డింగ్‌పై టీచర్లకు శిక్షణ
దుద్యాల్: ఐదు రోజుల పాటు ఉపాధ్యాయులకు నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు మండల విద్యాధికారి విజయరామారావు తెలిపారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఈ శిక్షణకు జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. ప్రాథమిక స్థాయి ఎల్‌ఎఫ్‌ఎల్ హెడ్‌మాస్టర్లకు, టీచర్లకు కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. దాదాపుగా 50 మందికి పైగా ఉపాధ్యాయులు శిక్షణకు హాజరవుతారని చెప్పారు. శిక్షణకు హాజరయ్యే ఉపాధ్యాయులకు జియో ట్యాగింగ్ హాజరు ఉంటుందని, శిక్షణ కేంద్రంలోకి వచ్చిన తర్వాతే హాజరు పడుతుందని, ఈ విషయం ప్రతీ ఉపాధ్యాయుడు గుర్తుంచుకోవాలని సూచించారు.
సెల్‌ఫోన్ అప్పగింత
కొడంగల్ రూరల్: యాలాల మండలం గిరిజాపురం గ్రామానికి చెందిన మైలారం గోపాల్ ఇటీవల కొడంగల్ వచ్చినప్పుడు తన ఫోన్ పోగొట్టుకున్నాడు. అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ సాయంతో ఫోన్‌ను ట్రాక్ చేశారు. సోమవారం ఎస్ రాజ్‌కుమార్, కానిస్టేబుల్స్ బలరాంనాయక్, పరమేశ్ బాధితుడికి ఫోన్ అందజేశారు.

నేటి నుంచి కెపాసిటీ బిల్డింగ్‌పై టీచర్లకు శిక్షణ