Adilabad
-
‘ఉపాధి’ పనుల్లో నాణ్యత పాటించాలి
● కలెక్టర్ రాజర్షి షా బైక్‌పై వెళ్లిన కలెక్టర్.. మండలంలోని చిట్యాల్బోరి శివారు అటవీ ప్రాంతంలో ఉపాధి హామీ పనులు కొనసాగుతుండగా అక్కడికి కారు వెళ్లేందుకు రోడ్డు మా ర్గం సరిగా లేదు. ఈ క్రమంలో కలెక్టర్ ఇలా ఐకేపీ ఏపీవో జాకీర్ హుస్సేన్ బైక్‌పై వెళ్లారు. ఆదిలాబాద్‌రూరల్: ఉపాధి హామీ పనుల్లో నాణ్యత పాటించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలంలోని చిట్యాల్బోరి, కచికంటి, యాపల్‌గూడ గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న పనులను పరిశీలించారు. యాపల్‌గూడలో రామాలయ ఆవరణలో కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణ పనులు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుక్నారు. కూలీలతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. పనుల నాణ్యత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించారు. ఈ ఏడాది సాధ్యమైనంత త్వరగా మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో రాథోడ్ రవిందర్, ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి, ఈజీఎస్ ఎపీవో జాకిర్ ఉస్సేన్, పీఆర్ ఎఈ సంతోష్, తదితరులు ఉన్నారు. -
కొనసాగిన ఆక్రమణల తొలగింపు
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధానచౌక్‌ల్లో చేపట్టిన ఆక్రమణల తొలగింపు ప్రక్రి య రెండో రోజు కొనసాగింది. సినిమారోడ్, అంబేడ్కర్‌చౌక్, శివాజీచౌక్ ఏరియాల్లో ఫుట్‌పాత్‌లు ఆక్రమించి వేసిన షెడ్లు, టేలాలను అధికారులు బుధవారం తొలగింపజేశారు. ఈ ప్రక్రియను డీఎస్పీ జీవన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజు పర్యవేక్షించారు. అధికారుల సూచన మేరకు పలువురు స్వచ్ఛందంగానే వాటిని తొలగించుకున్నారు. అనంతరం ప్రత్యామ్నాయంగా కేటాయించిన గణేశ్ థియేటర్ స్థలానికి తరలివెళ్లారు. టౌన్ ప్లానింగ్ అధికారులు సాయంత్రం వరకు అక్కడే ఉండి ప్రక్రియను పూర్తి చేశారు. కార్యక్రమంలో టీపీవో సుమలత, టీపీబీవో సాయికృష్ణ, టీపీఎస్ నవీన్‌కుమార్, ట్రాఫిక్ సీఐ ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట చిరు వ్యాపారుల ధర్నా తమ షెడ్లను తొలగించడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని చిరువ్యాపారులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రత్యామ్నాయంగా కేటాయించిన స్థల ప్రొసీడింగ్‌లను తాత్కాలికంగా కాకుండా పర్మినెంట్ పదంతో జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో యథావిధిగా తమ వ్యాపారాలను ప్రధాన చౌక్ల్లోనే కొనసాగించుకునేలా అవకాశం కల్పించాలని కోరారు. అనంతరం ఆర్డీవో వినోద్ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వారికి ఎంఐఎం, కాంగ్రెస్ మైనార్టీ నాయకులు మద్దతు తెలిపారు. -
బడిబాట పట్టేనా?
● ప్రణాళిక సిద్ధం చేస్తున్న విద్యాశాఖ ● వచ్చే నెల 6 నుంచి 19 వరకు కార్యక్రమాలు ● సర్కారు బడుల్లో పిల్లల్ని చేర్పించడమే లక్ష్యం ● ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలల ప్రచార హోరుఆదిలాబాద్టౌన్: సర్కారు బడుల బలోపేతం కో సం ప్రభుత్వం ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఏటా చేపడుతుంది. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరం జూన్ 6 నుంచి 19 వరకు ప్రత్యేక కార్యక్రమాలను ఖరారు చేసింది. కొత్తగా చేరే వారితో పాటు బడిబయటి పిల్లల్ని పాఠశాలలో చేర్పించడమే ప్రధాన లక్ష్యం. గతేడాది నెల పాటు నిర్వహించినా ఆశించిన ప్రగతి సాధించలేదు. ప్రైవేట్‌లోనే విద్యార్థులు అధిక సంఖ్యలో చేరారు. అయితే ఈ ఏడాది ప్రభుత్వం సర్కారు బడులపై ప్రత్యేక దృష్టి సారించింది. మౌలిక వసతుల కల్పనతో పాటు ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతులు చేపట్టింది. మెగా డీఎస్సీద్వారా ఖాళీ పోస్టులను భర్తీ చేసింది. ప్రస్తుతం ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. పక్షం పాటు పండగ వాతావరణం కల్పించేలా ప్రణాళిక రూపొందించింది. అయితే విద్యార్థులు ఈ ఏడాది ఏ మేరకు సర్కారు బడుల్లో చేరుతారో వేచి చూడాల్సిందే. బడిబయట పిల్లలు చేరేనా.. ఏటా విద్యా సంవత్సరం ఆరంభంలో విద్యాశాఖ పలు కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ డ్రాపౌట్ సంఖ్య మాత్రం తగ్గడం లేదు. బడిబయట పిల్లల్ని బడిలో చేర్పించినా మళ్లీ చెత్తకుప్పల వెంట, హోటళ్లు, లాడ్జీలు, తదితర పరిశ్రమల్లో పనిచేస్తూనే ఉన్నారు. వారం, పది రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించినా అనుబంధ శాఖలు పట్టించుకోకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారవుతుందని పలువురు పేర్కొంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 500కు పైగా బడిబయట పిల్లలు ఉన్నట్లు చెబుతున్నారు. అనధికారికంగా ఈ సంఖ్య వెయ్యికి పైనే ఉంటుందని సమాచారం. ఇదిలా ఉండగా పిల్లల తల్లిదండ్రులను ఒప్పించి పాఠశాలల్లో చేర్పించేందుకు ఉపాధ్యాయులు సన్నద్ధమవుతున్నారు. లక్ష్యం నెరవేరేనా.. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు విస్తృతంగా ప్రచారం చేపడుతున్నాయి. తల్లిదండ్రులను మ భ్యపెట్టి తమ పాఠశాలల్లో చేర్పించుకుంటున్నారు. గతేడాది ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్‌లోనే అడ్మిషన్లు అధికంగా కావడం గమనార్హం. ఈ ఏడాదైనా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందా అని పలువురు చర్చించుకుంటున్నారు. పకడ్బందీగా నిర్వహిస్తాం బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం. బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి సర్కారు బడిలో చేర్పించేలా చర్యలు చేపడతాం. జూన్ 6 నుంచి 19 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లోనే చేర్పించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారు. నాణ్యమైన విద్య అందుతుంది. – ఏనుగు శ్రీనివాస్ రెడ్డి, డీఈవో -
వడపోత పక్కానేనా..!?
● ఔట్సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపునకు కొనసాగుతున్న ప్రక్రియ ● ఈపీఎఫ్, ఈఎస్ఐ ఎన్వోసీలపై ఆరా.. ● బడా ఏజెన్సీల తీరుపై విమర్శలుసాక్షి,ఆదిలాబాద్: ‘ఎక్స్’ అనే ఔట్సోర్సింగ్ ఏజెన్సీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎంప్యానల్మెంట్లో గుర్తింపు పొంది ఉంది. ఆయా జిల్లాల్లో వివిధ శాఖల్లో వర్క్ ఆర్డర్ పొంది ఉద్యోగుల నిర్వహణ చేస్తుంది. అయితే ఒకట్రెండు జిల్లాల్లో ఉద్యోగులకు సంబంధించిన ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులు చేసిన సదరు ఏజెన్సీ మిగతా జిల్లాల్లో మాత్రం విస్మరించింది. చెల్లింపు చేసిన శాఖల నుంచి ఎన్వోసీ తీసుకొని ఆ పత్రాలను వేరే జిల్లాల్లో దరఖాస్తుతో జత పరిచారు. తద్వారా ఏజెన్సీ ఇతర జిల్లాల్లోని అక్రమ బాగోతం పైకి కనిపించకుండా పోతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జిల్లాలో కొత్త ఎంప్యానల్మెంట్ కోసం అనేక దరఖాస్తులు రాగా, ఆ ఏజెన్సీల అ సలు బాగోతాలను సూక్ష్మంగా పరిశీలించాలన్న అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతుంది. కొనసాగుతున్న పరిశీలన.. జిల్లాలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపునకు సంబంధించి కొత్త ఎంప్యానల్మెంట్ ఏర్పాటు కోసం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనెల 2 నుంచి 13వరకు జిల్లా ఉపాధికల్పన శాఖ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించారు. 32 దరఖాస్తులు విక్రయించగా, 29 ఏజెన్సీలు దరఖాస్తు చేసుకున్నాయి. కాగా గత 14వ తేదీన అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సమక్షంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ టెండర్ తెరిచారు. అందులో ఒక ఏజెన్సీ వివిధ సర్టిఫికెట్లు లేని కారణంగా తిరస్కరణకు గురైంది. మిగతా 28 ఏజెన్సీలకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ఇందులో దరఖాస్తు చేసుకున్న ఏజెన్సీల్లో కొన్ని రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎంప్యానల్మెంట్లో గుర్తింపు కలిగి ఉన్నాయి. ఆ ఏజెన్సీలు కొన్ని జిల్లాల్లో ఉద్యోగులకు సంబంధించి ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులు చేసినప్పటికీ పలు జిల్లాల్లో వాటిని చెల్లించకుండా ఉద్యోగుల ప్రయోజనాలను కాలరాశారనే అపవాదు ఉంది. అయితే ఏయే జిల్లాలోనైతే ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లించారో ఆ సర్టిఫికెట్లను ఈ కొత్త ఎంప్యానల్మెంట్లో చోటు కోసం దరఖాస్తుతో పాటు జతచేశారు. ఈ నేపథ్యంలో ఆయా ఏజెన్సీలు ఏయే జిల్లాలోనైతే ఎంప్యానల్మెంట్లో చోటు కలిగి ఉన్నాయో, అక్కడ ఏయే శాఖల్లో వర్క్ ఆర్డర్ కలిగి ఉన్నాయో, అన్నింటి నుంచి ఎన్వోసీలను సూక్ష్మంగా పరిశీలించాలని పలు ఏజెన్సీల నిర్వాహకులు పేర్కొంటున్నారు. కొంత మంది బడా ఏజెన్సీలు అధికారులను మచ్చిక చేసుకొని ఇలాంటి బాగోతాలను తెరపైకి రానివ్వకుండా చూసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. జిల్లాలో కొత్త ఎంప్యానల్మెంట్ ఏర్పాటులో ఉన్నతాధికారులు పారదర్శకంగా వ్యవహరించి అన్ని అర్హతలు ఉన్న ఏజెన్సీలనే పరిగణలోకి తీసుకోవాలని, తద్వారా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వారి ప్రయోజనాలు పూర్తిగా దక్కేలా అధికారులు చూడాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. సూక్ష్మంగా పరిశీలన చేస్తున్నాం.. కొత్త ఎంప్యానల్మెంట్ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్న ఏజెన్సీలకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతుంది. ప్రస్తుతం లేబర్, కాంట్రాక్ట్ లైసెన్స్‌ల పరిశీలన చివరి దశలో ఉంది. ఈపీఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీ ఇలా అన్ని అంశాల్లో ఏజెన్సీలకు సంబంధించి ఏయే జిల్లాల్లోనైతే వారు వర్క్ ఆర్డర్ పొంది ఉద్యోగుల నిర్వహణ చేస్తున్నారో ఆయా జిల్లాల్లో నుంచి శాఖల వారీగా ఎన్వోసీలను పరిశీలన చేస్తున్నాం. కమిటీ ఆధ్వర్యంలో అన్ని అంశాలను లోతుగా పరిశీలన చేసి లిస్టును ఫైనల్ చేయడం జరుగుతుంది. జాబితా పెట్టిన తర్వాత ఇతర ఏజెన్సీల నుంచి ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేసేందుకు ఒకట్రెండు రోజులు గడువు కూడా ఇస్తాం. – మిల్కా, ఉపాధికల్పన శాఖ ఇన్చార్జి జిల్లా అధికారి -
● ఈ సారి తొలకరి త్వరగా పలకరించే అవకాశం ● సాగుకు రైతుల సమాయత్తం ● అందుబాటులో ఎరువులు, విత్తనాలు ● నేల తడిసాకే విత్తుకోవాలంటున్న అధికారులు
ఆదిలాబాద్‌అర్బన్: వానాకాలం (ఖరీఫ్) సాగుకు వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో అవసరమ య్యే విత్తనాలు, ఎరువులను ఆయా గ్రామాల రైతులకు అందుబా టులో ఉంచేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది సీజన్ ప్రారంభంలోనే వర్షాలు పడే అవకాశాలున్నందున ఆ దిశగా అన్నదాతలు సైతం సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఇప్పటికే దుక్కులు దున్నే పనులు జోరందుకున్నాయి. రొటవేటర్‌తో చదును చేయడం, పొలాల్లో ఉన్న పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించడం వంటి పనులు కొనసాగుతున్నాయి. వర్షాలు కురిసిన వెంటనే విత్తనాలు విత్తేందుకు రైతులు రెడీ అవుతున్నారు. దీనికి తోడు ఈ సారి నై రుతి రుతుపవనాలు ముందుగానే పలకరించనున్న ట్లు వాతావరణ శాఖ చెప్పిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా రైతులు సిద్ధమవుతున్నారు. పంట మార్పిడిపై దృష్టి గతేడాది ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలను మళ్లీ ఈ సీజన్లో వేయకుండా రైతులు పంట మార్పిడిపై దృష్టి సారిస్తున్నారు. గతంలో సోయా వేసిన నేలల్లో ఈ సారి పత్తి, కంది, అలాగే పత్తి వేసిన చోట ఈ సారి సోయా లేదా మొక్కజొన్న పంటల సాగు దిశగా ఆలోచన చేస్తున్నారు. అలాగే పెసర, మినుమును అంతర పంటగా వేయాలని భావిస్తున్నారు. పంట మార్పిడిపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు అవగాహన కల్పిస్తుండడంతో ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. మరికొందరు తక్కువ సమయంలో అధిక దిగుబడినిచ్చే పంటలు సాగుకు మొగ్గుచూపుతున్నారు. 6లక్షల ఎకరాల సాగు అంచనా.. జిల్లాలో ఈ ఏడాది 6 లక్షలకుపైగా ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రధానంగా పత్తి ఉండనుంది. తర్వాత సోయా, కంది, మినుము, వరి, జొన్న, మొక్కజొన్న, పెసర పంటలు ఉంటాయని భావిస్తున్నారు. కాగా ఈ ఏడాది ఎరువులు, విత్తనాలకు ఎలాంటి కొరత లేకుండా రైతులకు సరిపడా మించి అందుబాటులో ఉంచినట్లు జిల్లా వ్యవసాయ శాఖ చెబుతోంది. గత అనుభవాల దృష్ట్యా.. గత అనుభవాల దృష్ట్యా రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని చాలామంది రైతులు గతంలో వర్షాలు సరిగా కురవక రెండు, మూడు సార్లు విత్తనాలు వేసిన సంఘటనలు ఉన్నాయి. దీంతో మళ్లీ మళ్లీ విత్తనాలు కొనుగోలు చేయాల్సి రావడంతో వారిపై ఆర్థిక భారం పడడంతో పాటు కొందరికి నాసిరకం విత్తనాలు సరఫరా అయ్యాయి. పంట ఏపుగా పెరిగినా పూత, కాత లేకపోవడంతో నష్టపోవాల్సి వచ్చింది. వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ సారి ముందుకు సాగుతున్నారు. వ్యవసాయ శాఖ సైతం ఈ సారి అంచనాకు మించి విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాయని వెల్లడించడంతో మార్కెట్లో డిమాండ్ రకం విత్తన ప్యాకెట్లు విరివిగా లభ్యమయ్యే అవకాశాలున్నాయి. ట్రాక్టర్‌తో చదును చేస్తున్న రైతు నేల తడిసాకే విత్తుకోవాలి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు చూసి విత్తనాలు వేసుకోవద్దు. వర్షాకాలం ప్రారంభానికి ఇంకా సమయం ఉంది. క్రమం తప్పకుండా కురిసి భూమి కొంత లోతు వరకు తడిసాకే విత్తుకోవాలి. తేలికపాటి వర్షాలకు వేసినట్లైతే ఎండ వేడిమికి నేల పొడిబారి విత్తనాలు చెడిపోయే అవకాశం ఉంది. ఈ సారి సరిపడా మించి ఎరువులు, విత్తనాలను సైతం అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాం. ఎలాంటి ఆందోళన అవసరం లేదు. – శ్రీధర్‌స్వామి, జిల్లా వ్యవసాయాధికారి ఈ ఏడాది పంటల సాగు అంచనా.. పంట రకం సాగు అవసరమయ్యే (ఎకరాల్లో) విత్తనాలు(క్వింటాళ్లలో) పత్తి 4,40,000 11,00,840 ప్యాకెట్లు సోయాబీన్ 62,500 18,725 కంది 55,000 21,960 జొన్న 1600 66 మొక్కజొన్న 23000 1,834 వరి 1900 489 పెసర 550 22 మినుము 550 44 ఇతర పంటలు 250 12 -
ట్రాఫిక్ క్లియర్
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధానచౌక్‌ల్లో దశాబ్దకాలంగా ఉన్న ట్రాఫిక్ సమస్య ఎ ట్టకేలకు తొలగింది. అంబేడ్కర్‌చౌక్, గాంధీచౌక్, దేవిచంద్చౌక్, శివాజీచౌక్ల్లోని ఫుట్‌పాత్‌లు, డివైడర్లు, రోడ్లను ఆనుకుని ఉన్న ఆక్రమణలను అధి కారులు మంగళవారం తొలగించారు. ఇది వరకే వారికి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించిన అధికారులు ప్రధాన చౌక్ల నుంచి వెళ్లిపోవాలంటూ పలుమార్లు నోటీసులు సైతం జారీచేశారు. అయినా వారు స్పందించకుండా అక్కడే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్లన్నీ రద్దీగా మారి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిన పరిస్థితి. ఒక వాహనం వెళితే మరో వాహనం వెళ్లలేని దుస్థితి. దీంతో పాదాచారులు, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధి కారులు పొక్లెయిన్ల సాయంతో ఆక్రమణలన్నీ తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ చర్యలపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది. ప్రత్యేక బలగాల నడుమ కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం 8గంటల సమయంలో ప్రత్యేక పోలీసు బలగాల నడుమ ము న్సిపల్, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఆయా చౌక్‌ల్లోని డివైడర్లు, టేలాలు, షెడ్లను పూర్తిగా తొలగింపజేశారు. కొంతమంది వ్యాపారులు స్వచ్ఛందంగా వాటిని తొలగించుకోగా, మరికొందరు వీధి వ్యాపారులు, మైనార్టీ నాయకులు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొనగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి వన్‌టౌన్‌కు తరలించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలకు చెందిన మైనార్టీ నాయకులను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ అఖిల్ మహాజ న్, ఏఎస్పీ కాజల్, డీఎస్పీ జీవన్‌రెడ్డి భద్రతను పర్యవేక్షించారు. ఆర్డీవో వినోద్‌కుమార్, మున్సి పల్ కమిషనర్ సీవీఎన్. రాజు ఆధ్వర్యంలో ఈ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగింది. ఆయా చౌక్‌ల్లోని సుమారు 201 ఆక్రమణలను తొలగించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఆక్రమణల తొలగింపు అనంతరం రోడ్లు విశాలంగా మారాయి. వాహనదారులు ఇబ్బందులు లేకుండా వెళ్లే అవకాశం కలిగింది. ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపు ప్రధాన చౌక్‌ల్లో తొలగించిన వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా జిల్లా కేంద్రంలోని గణేశ్ థియేటర్ స్థలం కేటాయించారు. 208 మంది వ్యాపారులకు గత నెలలో లక్కీ డ్రా నిర్వహించి స్థలాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఐదు వరుసలుగా స్థలాలను ఎంపిక చేశారు. మరో వైపు తొలగించిన ఆక్రమణదారుల్లో 101 మంది తొలిరోజే గణేశ్ థియేటర్ స్థలానికి చేరుకుని దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు ప్రా రంభించారు. మున్సిపల్ కమిషనర్ రాజు, టీపీవో సుమలత, టీపీబీవో సాయికృష్ణ, టీపీఎస్ నవీన్ కుమార్ సాయంత్రం వరకు అక్కడే ఉండి వ్యాపారులకు స్థలాల కేటాయింపు ప్రక్రియను పర్యవేక్షించారు. మళ్లీ ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు.. ఆక్రమణలు తొలగించిన ప్రాంతాల్లో తిరిగి ఎవరైనా టేలాలు, తోపుడుబండ్లు, షెడ్లను ఏర్పాటు చేసినట్లైతే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లు హెచ్చరించారు. పట్టణంలోని ప్రధాన చౌక్‌లతో పాటు రోడ్ల వెంబడి కొత్తగా ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. పట్టణంలోని ప్రధానచౌక్‌ల్లో ఆక్రమణల తొలగింపు పలువురి ముందస్తు అరెస్ట్ ప్రత్యామ్నాయంగా స్థల కేటాయింపు -
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
ఆదిలాబాద్: కార్మికుల హక్కులను హరించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి భీంరావు డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలతో డిపో ఎదుట మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాల ను సవరించడం సరికాదని మండిపడ్డారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీనే కొనుగోలు చేసి నడపాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకం వల్ల సంస్థ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆ సమస్యను వెంటనే పరి ష్కరించాలన్నారు.అంతేకాకుండా ఆర్టీసీలో కార్మి క సంఘాలను అనుమతించాలన్నారు. జూలై 9న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సమ్మె జయప్ర దం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లాఅధ్యక్షుడు భీంరావ్, డిపో కార్యదర్శి ఆశన్న, గంగన్న, నారాయణ, దత్తు, వెంకటి, సురేశ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే చర్యలు
● కలెక్టర్ రాజర్షి షా కై లాస్‌నగర్: రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను డీలర్లు అందుబాటులో ఉంచాలని, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విత్తన డీలర్లకు కలెక్టరేట్లో ఎరువులు, విత్తనాల విక్రయాలు, వివరాల నమోదుపై మంగళవారం ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అనంతరం వారికి ఈపీవోఎస్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతీ దుకాణ ం వద్ద ఎరువులు, విత్తనాల లభ్యత స్టాక్ వివరాలు ప్రదర్శించడంతో పాటు టాస్క్‌ఫోర్స్ సభ్యు ల వివరాలు రైతులకు తెలిపేలా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌స్వామి, ఇచ్చోడ ఏడీఏ రాంకిషన్, సాంకేతిక వ్యవసాయాధికారి విశ్వామిత్ర,తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్ర, మహారాష్ట్ర టు ఆదిలాబాద్
ఇచ్చోడ: జిల్లాలో జొన్నల దందా జోరుగా సాగుతుంది. కొంతమంది వ్యాపారులు ముఠాగా ఏర్పడి బినామీ రైతుల పేరిట జొన్నలు విక్రయిస్తూ స్వల్ప వ్యవధిలో భారీగా ఆర్జిస్తున్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గడిచిన పక్షం రోజుల వ్యవధిలో జిల్లాలో నిత్యం ఎక్కడో ఓ చోట జొన్నలతో వాహనాలు పట్టుబడిన ఘటనలు అనేకం వెలుగుచూశాయి. అయినా యంత్రాంగం పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆన్లైన్ నమోదు నుంచే.. రబీలో ఆయా పంటలు సాగు చేసిన రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఏఈవోలు ముందుగానే ఆన్లైన్లో నమోదు చేశారు. వీటి ఆధారంగానే పంట దిగుబడిని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుంది. ఈ పద్ధతి ద్వారా నేరుగా రైతు మాత్రమే తన పంట దిగుబడిని విక్రయించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే కొంతమంది రైతులు పంట సాగు చేయకుండానే చేసినట్లుగా సంబంధిత అధికారులను మచ్చిక చేసుకుని ఆన్లైన్లో వివరాలు నమోదు చేసినట్లుగా ఆరోపణలున్నాయి. ఇచ్చోడ మండలంలో ఈ ఏడాది రబీలో 5,815 ఎకరాల్లో జొన్న సాగైనట్లు ఆన్లైన్లో నమోదై ఉంది. అయితే మండలంలో మెజార్టీ గ్రామాల్లో సాగునీటి సౌకర్యం లేదు. జొన్న సాగు అంతంతే ఉంది. అయితే ఆన్లైన్ నమోదులో ఉన్న దాంట్లో సగం కూడా సాగు కాలేదని తెలుస్తోంది. జిల్లాలో చాలా మండలాల్లో ఇదే పరిస్థితి. సాంకేతికత అడ్డు పెట్టుకుని.. సాంకేతికత అడ్డుపెట్టుకొని కొంతమంది వ్యాపారులు జొన్నలను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఎంపికచేసుకున్న రైతులనువారి ఆధార్‌కార్డు, పట్టాపాస్‌బుక్ ద్వారా కొనుగోలు కేంద్రాలకు పంపిస్తారు. అక్కడ ఆన్లైన్ ఆధారంగా విక్రయింపజేస్తా రు. తర్వాత ఆ రైతు విక్రయించిన వివరాలు సహకార సంఘాలు, మార్క్‌ఫెడ్ వద్ద ఎక్కడా కనిపించడం లేదు. దీనిని ఆసరాగా చేసుకుని వ్యాపారులు తమకు సహకరించిన రైతులకు కొంత ముట్టజెబు తూ, అధికారులతో ‘మామూలు’గా వ్యవహరిస్తూ దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆన్లైన్లో పంట నమోదై ఉన్న రైతులనుంచి మాత్రమే జొన్నలు కొనుగోలు చేస్తున్నామని, బినామీలను నిర్ధారించలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. జిల్లాలో జోరుగా జొన్నల దందా ప్రైవేట్ వ్యాపారులదే హవా అక్కడ తక్కువ ధరకు కొని ఇక్కడ ‘మద్దతు’తో అమ్మకం పట్టుబడుతున్నా స్పందించని అధికారులుజిల్లాలో జొన్న సాగు వివరాలు పంట సాగు 1,10,901 ఎకరాలు సాగు చేసిన రైతులు 39,764 మంది కొనుగోలు కేంద్రాలు 12 ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 3,84,000 క్వింటాళ్లు నిర్మల్‌కు చెందిన ఓ ట్రేడర్ ఆంధ్రప్రదేశ్ నుంచి లారీలో 250 క్వింటాళ్ల జొన్నలను ఆదిలాబాద్ జిల్లాకు తరలిస్తుండగా నేరడిగొండ మండలం వాంకిడి గ్రామ సమీపంలో పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఏపీలోని గుంటూరు జిల్లా కావలి నుంచి జొన్నలను ఆదిలాబాద్ జిల్లాకు లారీలో అక్రమంగా తరలిస్తుండగా సిరికొండ మండలం రాంపూర్(బి) వద్ద పోలీసులు పట్టుకున్నారు. 30 క్వింటాళ్ల జొన్నలతో పాటు లారీని సీజ్ చేశారు. ఇలా ఒక్క రోజులోనే 280 క్వింటాళ్ల జొన్నలు పట్టుబడడం గమనార్హం. ఈ నెల 14న తాంసిలోని సబ్‌మార్కెట్ యార్డులో మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చిన జొన్నలను విక్రయించేందుకు యత్నిస్తుండగా అనుమానం వచ్చిన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అక్కడికి చేరుకుని 136 క్వింటాళ్ల జొన్నలతో పాటు మాక్స్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ నమోదులో పొరపాట్లు లేవు.. పంటల ఆన్లైన్ నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగలేదు. ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాతే వివరాలను ఆన్లైన్ నమోదు చేశారు. ఈ ఏడాది జొన్న పంట దిగుబడి కూడా ఎక్కువగానే వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న జొన్నలను పోలీసులు అడ్డుకట్ట వేయాలి. – శ్రీధర్‌స్వామి, డీఏవో -
ఆదిలాబాద్–గడ్చందూర్ రైల్వేలైన్ ఏర్పాటు చేయాలి●
ఆదిలాబాద్:ఆదిలాబాద్–గడ్చందూర్ నూత న రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ జైన్‌ను మంగళవారం సికింద్రాబాద్‌లో కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆర్మూర్–ఆదిలాబాద్ రైల్వేలైన్ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని విన్నవించినట్లు తెలిపారు. అ లాగే జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న రైల్వేఓవర్, అండర్ బ్రిడ్జిలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఉన్నారు. శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ..తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఎంపీ నగేశ్ మంగళవారం త్రిపుర మాజీ సీఎం విప్లవ్ కు మార్దేవ్తో పాటు దర్శించుకున్నారు. వారి వెంట ఎంపీ హిమాద్రిసింగ్ ఉన్నారు. -
అభివృద్ధి పనులు ఇలా..
సాక్షి, ఆదిలాబాద్: పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు చేయూత అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి కుటుంబ ఆదా యం రెట్టింపు చేయడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సమగ్ర భూమి అభివృద్ధి పనులతో పాటు సౌర విద్యుత్‌తో కూడిన సాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఇందిరా సౌర గిరి జలవికాసం అనే ప్రత్యేక పథకాన్ని రూపొందించింది. సోమవా రం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఈ పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ ఈ పథకాన్ని ఈ వారంలో లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని గిరిజనులకు ఈమేరకు లబ్ధి చేకూరనుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో అమలు.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో అనేక మంది గిరిజన రైతులకు అటవీ హక్కుల చట్టం కింద పోడు వ్యవసాయం చేసుకునేందుకు భూ యాజమాన్య హక్కు ను కల్పించింది. ఆ భూముల్లో రాబోయే ఐదేళ్లల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రస్తుతం సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా సోమవారం నల్లమల డిక్లరేషన్ ప్రకటించింది. గిరిజనుల సంక్షేమం కోసం పలు అంశాలను ఇందులో పొందుపర్చారు. ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ప్రకారం సంక్రమించిన పోడు భూములకు ఈ పథకంతో లబ్ధి చేకూర్చాలని నిర్ణయించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. లబ్ధి ఇలా.. పోడు భూముల్లో వంద శాతం సబ్సిడీతో సమగ్ర భూమి అభివృద్ధి పనులతో పాటు సౌర విద్యుత్‌తో కూడిన సాగునీటి సౌకర్యం కల్పిస్తారు. తద్వారా ఆ భూములను సాగుకు యోగ్యంగా మార్చి గిరి రైతు కుటుంబాల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఇదిలా ఉంటే.. ఉమ్మడి జిల్లాలో బోరుబావుల స్థానంలో చేతిబావులు తవ్వించాలని ఐటీడీఏ నిర్ణయించింది. దీనికి ఇందిరా సౌరజల వికాస పథకం ద్వారా సౌర పలకలు బిగించనున్నారు. శాఖల సమన్వయం.. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ ఇందులో అటవీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భజల, వ్యవసాయ, ఉద్యానవన శాఖల సమన్వయంతో ముందుకెళ్తున్నారు. తద్వారా వివిధ అభివృద్ధి పనులు పోడు భూముల్లో చేపట్టనున్నారు. పోడు భూముల్లో సాగుకు సర్కారు తోడ్పాటు ‘ఇందిరా సౌర జల వికాసం’తో ముందడుగు ఉమ్మడి జిల్లాలో పలువురికి చేకూరనున్న లబ్ధి డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ఈ వారంలో ప్రారంభం ఏర్పాట్లపై ఐటీడీఏ దృష్టిఉమ్మడి జిల్లాలో గిరి తెగల జనాభా.. (2011 జనాభా లెక్కల ప్రకారం) గోండు 2,63,515 లంబాడా 1,12,793 కొలాం 38,176 కోయ, ఇతరులు 30,739 పర్దాన్ 26,029 మన్నెవార్ 15,370 నాయక్‌పోడ్ 5,206 తోటి 2,231 ఎరుకల 1,735 మొత్తం జనాభా 4,95,794 పోడు భూముల వివరాలు.. విస్తీర్ణం 2,12,256 ఎకరాలు రైతుల సంఖ్య 66,839 పట్టాల జారీ సంఖ్య 66,839 ఈ పథకం కింద వివిధ అభివృద్ధి పనులు పోడు భూముల్లో చేపట్టనున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద భూమి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ భూముల్లో భూగర్భ, నీటి సర్వే చేపట్టి రైతుకు లబ్ధి చేకూరేలా చేతిబావులు తవ్వకం చేపట్టనున్నారు. 5 హెచ్‌పీ, 7.5 హెచ్‌పీ సోలార్ పంపుసెట్లు, సోలార్ ప్యానళ్ల ఏర్పాటు ద్వారా విద్యుత్ అందించి సాగునీటి సౌకర్యం కల్పిస్తారు. వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలు, యాంత్రీకరణకు సహకారం అందించనున్నారు. ఉద్యానవన శాఖ ద్వారా మెరుగైన నీటి యాజమాన్యం కోసం డ్రిప్, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయనున్నారు. అర్హులు వీరు.. అటవీ హక్కు చట్టం కింద జారీ చేయబడిన భూ యాజమాన్యం హక్కు కలిగిన ప్రతీ గిరిజన రైతును అర్హులుగా నిర్ణయించారు. సదరు రైతుకు రెండున్నర ఎకరాలు(హెక్టా రు), అంతకంటే ఎక్కువ ఉంటే ఒక యూని ట్‌గా మాత్రమే మంజూరు చేస్తారు. అంతకంటే తక్కువ విస్తీర్ణం కలిగి ఉన్నట్లయితే సరిహద్దులో గల ఇద్దరి నుంచి ఐదుగురిని గ్రూప్‌గా ఏర్పాటు చేసి యూనిట్‌గా మంజూరు చేయనున్నారు. ఒకవేళ సరిహద్దులో అటువంటి రైతుల భూములు లేనిపక్షంలో ఆ రైతుకు వ్యక్తిగతంగా యూనిట్ మంజూ రు చేసేలా ఇందులో ప్రణాళిక చేశారు.డిప్యూటీ సీఎం రానున్నారు.. ఇందిరా సౌర జల గిరి వికాస పథకాన్ని జిల్లాలో లాంఛనంగా ప్రారంభించేందుకు ఈ వారంలో ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి వేదికను ఖరారు చేస్తున్నాం. జిల్లాలో ఎంత మందికి లబ్ధి చేకూరుతుందనేది పథకం ప్రారంభించిన తర్వాత స్పష్టం అవుతుంది. – ఖుష్బూ గుప్తా, పీవో, ఉట్నూర్ ఐటీడీఏ -
పాఠశాలల అభివృద్ధిలో హెచ్‌ఎంలదే కీలకపాత్ర
ఆదిలాబాద్‌టౌన్: పాఠశాలల అభివృద్ధిలో ప్రధానో పాధ్యాయులదే కీలకపాత్ర అని వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సరస్వతినగర్ జెడ్పీఎస్‌ఎస్‌లో ప్రధానోపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్య పెంచడం, నాణ్యమైన విద్య అందించేందుకు దృష్టి సారించాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు చేయాలని పేర్కొన్నారు. అనంతరం సరస్వతినగర్ పాఠశాలలో ఆదిలాబాద్‌రూరల్ ప్రాథమిక ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రాథమిక విద్యావ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. అనంతరం డైట్ కళాశాలలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని, పుస్తకాల గోదాంను పరిశీలించారు. ఇందులో స్టేట్ రిసోర్స్ పర్సన్ అశోక్, రిసోర్స్ పర్సన్లు తిలావత్, ప్రత్యూష, దేవిదాస్, నర్సయ్య, అనురాధ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి నేరడిగొండ: మండల పరిధిలోని ఎంపీయూపీఎస్, ఎంపీపీఎస్‌ల్లో పనిచేస్తున్న ఎస్జీటీ, పీఎస్‌హెచ్‌ఎంలకు నేరడిగొండ జెడ్పీఎస్‌ఎస్‌లో ఐదు రోజుల ఎఫ్ఎల్ఎన్ శిక్షణ కేంద్రాన్ని వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణ మంగళవారం పరిశీలించారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఇందులో ఎంఈవో భూమారెడ్డి, ఎంఐఎస్ కోఆర్డినేటర్ రాం, అనిల్, ఆర్పీలు గంగాధర్, రాజ్‌కుమార్, సంతోష్, రవీందర్, చంద్ర శేఖర్, శివలీల, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు
రామగుండం(కరీంనగర్): పట్టణంలోని తబితా ఆశ్రమంలో 16ఏళ్లుగా ఆశ్రయం పొందుతున్న నక్క మానస వివాహ వేడుకలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం హల్దీవేడుకలు ఘనంగా నిర్వహించింది. యువతి పెళ్లి పెద్దగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష.. ఈనెల 21వ తేదీన కలెక్టరేట్లోని ఆలయంలో వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. తొలిరోజు వేడుకల కోసం సింగరేణి ఆర్జీ–1 జీఎం సతీమణి అనిత, ఆర్తి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు భీమనాథి విజయ పుస్తె, మట్టెలు, చీర, సారె, అంతర్గాం అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు రూ.ఐదు వేల నగదు, ఎనీ్టపీసీ శ్రీసీతారామ సేవాసమితి నిర్వాహకులు గోలివాడ చంద్రకళ, కంది సుజాత, బిల్లా శ్రీదేవి, కొండు రమాదేవి పెళ్లి బట్టలు అందజేశారు.ఫైట్‌ఫర్ బెటర్ సొసైటీ నిర్వాహకుడు మద్దెల దినేశ్, లెనిన్ జయహో సంస్థ ప్రతినిధి చక్కెన శ్రీలత పెళ్లి కుమార్తెను తయారు చేశారు. జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్‌రావు, అంతర్గాం తహసీల్దార్ రవీందర్‌పటేల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
జిల్లాలో ఇదీ పరిస్థితి..
అవగాహన కల్పిస్తున్నాం..అగ్నిప్రమాదాలు జరగకుండా ప్రతీ శుక్రవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. షాపింగ్ మాల్స్, పాఠశాలలు, అపార్ట్మెంట్లు, ఆస్పత్రులు, సూపర్ మార్కెట్లలో హోజరి మిషన్, హెచ్చింగ్ మిషన్, కెమికల్ పౌడర్, సీవో2 సిలిండర్లు అందుబాటులో ఉంచుకోవాలి. ఆయా యాజమాన్యాల వద్దకు వెళ్లి ఫైర్‌సేఫ్టీ పాటించాలని తెలియజేస్తున్నాం. – డి.జైత్రాం, ఎస్ఎఫ్ఓ, ఆదిలాబాద్ ● జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో కార్యా లయ సమీపంలోని ఓ డయాగ్నోస్టిక్ సెంటర్లో నాలుగేళ్ల క్రితం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అస్తినష్టం మినహా ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ● తాంసి మండలంలోని కప్పర్లలో ఇటీవల అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పశువుల పాకతో పాటు పక్కన నిలిపిన రెండు బొలెరో వాహనాలు కాలిపోయాయి. చుట్టుపక్కల వారు స్పందించి మంటల ను ఆర్పివేశారు. అయితే ప్రమాదం జరిగిన గంట తర్వాత జిల్లా కేంద్రం నుంచి ఫైరింజన్ చేరుకుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రాష్ట్ర రాజధానిలో తాజాగా చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నేపథ్యంలో జిల్లాలో పరిస్థితిపై సర్వత్రా చర్చ మొదలైంది. ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో ఆయా ఆస్పత్రులు.. అపార్ట్మెంట్లు.. పాఠశాలలు..తదితర కార్యాలయా ల్లో అగ్నిప్రమాదాలు వాటిల్లితే ప్రాణాలు గాలిలో కలిసే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ వైద్యశాలల్లో రోగుల ప్రాణాలకు భరోసా లేకపోగా, కాలనీలు, ప్రైవేట్ బడుల్లో సైతం రక్షణ చర్యలు కనిపించని పరిస్థితి. కేవలం ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం తప్పా మళ్లీ షరామామూలే అన్నవిధంగా మారింది జిల్లాలోని సంబంధిత శాఖ అధి కారులు తీరు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఆది వారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 17 మంది సజీవ దహనంకాగా, మరికొంత మంది గా యాల పాలయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మనమెంత భద్రమనే అనుమానం వ్యక్తమవుతుంది. గతంలో జిల్లాలోనూ పలు అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అయితే ప్రాణ నష్టం జరగలేదు. నిబంధనలు బేఖాతరు.. ● జిల్లా కేంద్రంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులు నిత్యం రోగులతో కిటకిటలాడుతూనే ఉంటాయి. రోగుల నుంచి యాజమాన్యాలు భారీగానే ఫీజులు వసూలు చేస్తారు. అయితే భద్రత విషయంలో మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అనుకోని ప్రమా దం జరిగితే రోగులతో పాటు వారి బంధువులు సైతం ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు న్నాయి. చాలా ప్రైవేట్ ఆస్పత్రులు ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్నారు. అలాగే పైఅంతస్తుల్లో నిర్వహణ కొనసాగుతుంది. మెట్లు ఇరుకుగా ఉండడంతో ప్రమాదం జరిగితే పరుగు తీసే అవకాశం కూడా లేకుండాపోతోంది. తొక్కిసలాట జరిగితే ప్రాణాలు సైతం పోయే అవకా శం ఉంటుంది. ● మరోవైపు ప్రైవేట్ పాఠశాలలు అనుమతులు పొందే సమయంలో తప్పనిసరిగా ఫైర్‌సేఫ్టీ పొందాలి. పాఠశాలల్లో హోజరి, షబ్బింగ్ మిషన్, వాటర్ ట్యాంక్, కెమికల్ పౌడర్‌ను అందుబాటులో ఉంచాలి. జిల్లాలో చాలా పాఠశాలల్లో ఈ ఫైర్ సేఫ్టీ నిబంధనలు కానరాని పరి స్థితి. యాజమాన్యాలు సంబంధిత అధికారులను మచ్చిక చేసుకొని సర్టిఫికెట్లు పొందుతున్నారనే ఆరోపణలున్నాయి. ఒకవేళ ప్రమాదం జరిగితే పెద్దఎత్తున ప్రాణనష్టం వాటిల్లే అవకాశాముంటుంది. ● జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాల్లోనూ పలు అపార్ట్మెంట్ల నిర్మాణాలు చేపడుతున్నారు. చాలా వాటిలో ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదు. ఇరుకుగా ఉండడంతో ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం సంభవించే అవకాశం లేకపోలేదు. జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో కనీసం ఫైర్ ఇంజన్ కూడా రాలేని పరిస్థితి. అశోక్ రోడ్, బ్రాహ్మణవాడ, తిర్పెల్లి, కోలిపుర, పంజేషా తదితర కాలనీల్లో రోడ్లు ఇరుకుగా ఉన్నాయి. ఫైర్ ఇంజన్ వెళ్లేసరికి కాలి బూడిదే.. జిల్లాలో మూడు ఫైర్స్టేషన్లు ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్‌లో ఉన్నాయి. జిల్లాకేంద్రంలోని ఫైర్స్టేషన్లో 2 ఫైరింజన్లు ఉండగా, ఒకటి మార్కెట్ యార్డు కు సంబంధించి ఉంది. ఈస్టేషన్ ద్వారా ఆదిలాబా ద్, జైనథ్, బేలతో పాటు తాంసి, తలమడుగు, భీంపూర్మండలాల పరిధిలో ప్రమాదాలుజరిగితే ఇక్క డి నుంచే ఫైరింజన్లు వెళ్తాయి. ఉట్నూర్, ఇచ్చోడ పరిధిలోని మండలాల్లో దాదాపు 50కిలోమీటర్లకు పైగా దూరంలో ప్రమాదం జరిగినప్పుడు ఫైరింజ న్లు వెళ్లేసరికి ఆస్తులు కాలి బూడిదవుతాయి. బోథ్, బేలలో ఫైర్స్టేషన్లు ఏర్పాటు చేయాలని కొన్నేళ్లుగా డిమాండ్ ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని ఆ ప్రాంతవాసులు పేర్కొంటున్నారు. అగ్ని ప్రమాదం జరిగితే అంతేనా.. ఆస్పత్రులు, పాఠశాలల్లో కనిపించని ‘ఫైర్‌సేఫ్టీ’ అపార్ట్మెంట్లలోనూ కానరాని నిబంధనలు ‘మామూలు’గా వ్యవహరిస్తున్న అగ్నిమాపక శాఖజిల్లాలో 200 వరకు ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, అందులో కేవలం 40 మాత్రమే ఫైర్‌సేఫ్టీ పరికరాలు కలిగి ఉన్నాయి. ఇక 50 వరకు ప్రైవేట్ ఆస్పత్రులు ఉండగా, కేవలం ఐదారుకు మించి వాటిలో ఈ పరికరాలు కనిపించని పరిస్థితి. నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలలు 2009 సంవత్సరం తర్వాత అన్నింటికి ఫైర్‌సేఫ్టీ అనుమతి తప్పనిసరి. అలాగే అపార్ట్మెంట్లకు 18 మీటర్లు, ఆస్పత్రులు 15 మీటర్ల ఎత్తులో ఉన్నవాటికి అనుమతులు పొందాలి. చాలా అపార్ట్మెంట్లలో ఈ పరికరాలు అందుబాటులో లేవు. -
అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు
కై లాస్‌నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా సత్వరం పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివి ధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి అర్జీలు స్వీ కరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నా రు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేస్తూ త్వరితగతిన పరిష్కరించేలా శ్రద్ధ వహించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, బ్యాంకు రుణా ల మంజూరు, స్వయం ఉపాధి, బోరుబావుల మంజూరు, భూసమస్యలు వంటి వివిధ అంశాలకు సంబంధించి ఈవారం మొత్తం 104 అర్జీలు అందాయి. అనంతరం శాఖల వారీగా అర్జీల ప్రగతిపై కలెక్టర్ సమీక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్‌కుమార్, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజు, కలెక్టరేట్ ఏవో వర్ణ, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన వారి మాటల్లోనే.. కలెక్టర్ రాజర్షి షా గ్రీవెన్స్‌కు 104 దరఖాస్తులు ‘ఇందిరమ్మ’కు 18 ఫిర్యాదులుఇందిరమ్మ ఇళ్ల ఫిర్యాదుల స్వీకరణకు గాను కలెక్టరేట్ సమావేశ మందిరం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ సోమవారం కూడా కొనసాగింది. జెడ్పీ, మున్సిపల్, హౌసింగ్ శా ఖల ఉద్యోగులు ఈ కౌంటర్లో మధ్యాహ్నం 2గంటల వరకు అందుబాటులో ఉండి ప్రజ ల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ వా రం ఆదిలాబాద్ పట్టణం నుంచి తొమ్మిది, గ్రామీణ ప్రాంతాల నుంచి మరో తొమ్మిది మొత్తం 18 ఫిర్యాదులు అందినట్లుగా ఆయా శాఖల అధికారులు తెలిపారు. -
సమస్యలు సత్వరం పరిష్కరించాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గ్రీవెన్స్‌లో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 23 మంది ఎస్పీకి వినతులు అందజేశారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, ఆయా స్టేషన్ల అధికారులకు ఎస్పీ ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఈ వారం ప్రధానంగా కబ్జాలు, కుటుంబ కలహాలు, అధిక వడ్డీ, కోర్టు కేసులు, గ్రామాల్లో ఎదురయ్యే సమస్యలు తది తర వాటిని ప్రజలు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. బాధితుల సమస్యలను ఓపిగ్గా విని వారికి భరో సా కల్పించేలా వ్యవహరించారు. ఇందులో సీసీ రాజు, ప్రజాఫిర్యాదుల విభాగం అధికారి జైస్వా ల్ కవిత, వామన్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆక్రమణపై ఫోకస్
● మున్సిపల్ స్థలం కాజేసిన వారిపై కేసు ● ఉద్యోగుల తీరుపై అనుమానాలు ● విచారణ నివేదిక కోరిన పోలీసులు ● కసరత్తు చేస్తున్న బల్దియా అధికారులుదర్జాగా షెడ్డు నిర్మాణం..రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికావడంతో ఆ స్థలంలో ఈ ఏడాది మార్చిలో షెడ్డు నిర్మాణం చేపట్టారు. మున్సిపల్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా పనులు కానిచ్చారు. దీనిపై ఫిర్యాదులు అందగా టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆ స్థలానికి వెళ్లి పరిశీలించారు. నిర్మాణ పనులు నిలిపివేయాలని చెప్పినా సదరు అక్రమార్కులు లెక్కచేయలేదు. విషయాన్ని అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో పోలీసులు, మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో అక్రమార్కులు షెడ్డు నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తు తం ఎస్పీ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించడంతో పోలీసులు అక్రమార్కులపై కేసు నమోదు చేశారు. బల్దియా స్థలాన్ని కాజేసిన వారిలో ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా మరొకరు పరారీలో ఉన్నారు. కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయ ఇంటి దొంగల్లో గుబులు మొదలైంది. రూ.కోట్లాది విలువైన మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకుని, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకు న్న ఇద్దరిపై కేసు నమోదైంది. అందులో ఒకరు కట కటాల్లోకి వెళ్లగా,మరొకరు పరారీలోఉన్నారు. అయి తే ఇందులో మున్సిపల్ ఉద్యోగుల పాత్రపై పోలీ సులు విచారణ నివేదిక కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో వారిపైన కూడాకేసులు నమో దు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లుగా పోలీసు అధికారులుప్రకటించడంతో వారిలో వణుకు మొద లైంది. భవిష్యత్తులో ఇలాంటి వాటికితావులేకుండా ఉండాలంటే అక్రమార్కులతో పాటుఅందుకు సహకరించిన వారిపైన కఠినంగా వ్యవహరించా ల నే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. ఈ వ్యవహరంలో ఎవరిపైవేటు పడుతుందనేది ఆసక్తి కలిగిస్తోంది. ఆక్రమణ తీరు ఇలా.. ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ కాలనీ మున్సిపల్‌కు సంబంధించి పాత లీజు స్థలం ఖాళీగా ఉంది. దీనిపై కన్నేసిన అక్రమార్కులు నకిలీ పత్రాలు సృష్టించారు. భుక్తాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి తన బంధువుపై రిజిస్ట్రేషన్ చేసి తన పేరిట మార్చుకున్నారు. 469.44 చదరపు అడుగుల స్థలం ధర ప్రస్తుతం రూ.కోట్లలో పలుకుతుంది. ఇంతటి విలు వైన భూమిని తమ హస్తగతం చేసుకుకోవాలని వ్యూహం పన్నారు. 35 ఏళ్లుగా అక్కడే ఉంటున్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి బల్దియా అధికారులను ఆశ్రయించారు. మున్సిపల్ రెవెన్యూ ఉద్యోగులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి దానిపై విచారణ చేయాల్సి ఉండగా ‘మామూలు’గా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ఎలాంటి విచారణ చేపట్టకుండానే ఆ స్థలానికి వార్డు పరిధిలోనే లేనటువంటి ఇంటి నంబర్లు కేటాయించారు. నిబంధనల ప్రకారం నిర్మాణంలో ఉన్న, నిర్మించిన ఇళ్లకే నంబర్ (అసెస్మెంట్) కేటాయించాల్సి ఉంటుంది. కానీ అక్రమార్కులతో కుమ్మక్కై ఇంటి నంబర్ కేటాయించారని తెలు స్తోంది. దాని ఆధారంగా సదరు ఆక్రమణదారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. -
ప్రయాణికులకు మెరుగైన సేవలు
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదిలాబాద్: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఆదిలాబాద్ డిపోను సోమవారం ఆయన సందర్శించారు. ఉద్యోగుల సమస్యలు అడిగి తె లుసుకున్నారు. ముందుగా డిపో ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా మాట్లాడా రు. రాష్ట్రంలో మహాలక్ష్మి పథకంతో మహిళలు ఎంతగానో లబ్ధి పొందుతున్నారన్నారు. ఆర్టీసీ లో ప్రయాణించేటప్పుడు ఎలాంటి ఇబ్బంది క లగకుండా కృషి చేస్తున్నామన్నారు. అలాగే అ వసరం మేరకు ప్రతీ గ్రామానికి బస్సు నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. నూతన బ స్సులను సైతం కొనుగోలు చేస్తున్నామని, ప ర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సులను సైతం పలు రీజియన్లలో ప్రవేశపెట్టామన్నారు. ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సు ల ఏర్పాటు విషయంలో దూరం సమస్యగా మారిందన్నారు. నిజామాబాద్‌లో చార్జింగ్ పా యింట్తో అనుసంధానం చేస్తే ఎలక్ట్రిక్ బస్సులు నడపవచ్చన్నారు. ఆయన వెంట డిపో మే నేజర్ కల్పన తదితరులు ఉన్నారు. -
జిల్లాలో పటిష్ట చర్యలు చేపట్టాలి
● డీజీపీ (పర్సనల్) అనిల్ కుమార్ ● పోలీసు కార్యాలయం పరిశీలన ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పో లీసు వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని డీజీపీ (పర్సనల్) అనిల్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు ముఖ్య కార్యాలయాన్ని సోమవారం సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. అంతకుముందు పోలీ సుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాలో జరిగే వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలని అధి కారులను ఆదేశించారు. హెచ్ఆర్ఎంఎస్ అప్లికేషన్ సిబ్బంది ప్రతి ఒక్కరూ వినియోగించేలా చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, మాదకద్రవ్యాలను పూర్తిగా అరికట్టాలని సూ చించారు. జిల్లాలో శాంతిభద్రతల సమస్యలు,అమలుచేస్తున్న విధానాలు, సమ్మర్ క్యాంపులు, చిల్డ్రన్ పార్కులు, సైబర్‌క్రైమ్ తదితర విషయాలను డీజీపీకి ఎస్పీ అఖిల్ మహాజన్ వివరించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్ట డానికి ప్రత్యేకంగా హైవేలపై ర్యాంబుస్టిప్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విలేజ్ పోలీసు ఆఫీసర్ వ్యవస్థ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నేరాలను అరికట్టేందుకు రాత్రి వేళల్లో గస్తీ, పెట్రోలింగ్, ఆపరేషన్ చబుత్రా, మైనర్లు వాహనాలు నడపకుండా ప్రత్యేక స్పెషల్ డ్రై వ్, కార్డెన్‌సెర్చ్ నిర్వహిస్తున్నట్లు వివరించా రు. సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, అదనపు ఎస్పీ సురేందర్ రావు, స్పెష ల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, సీఐ లు, ఎస్సైలు పాల్గొన్నారు. -
బీసీ గురుకుల ‘సీవోఈ’
● ఉమ్మడి జిల్లాకు ఒకటి మంజూరు ● ఆదిలాబాద్ పరిధిలో లక్సెట్టిపేటలో బాలుర కళాశాల ● ఈ విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి..ఆదిలాబాద్‌రూరల్: బీసీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ఆంగ్లమాధ్యమంలో నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017లో మహాత్మజ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 పాఠశాలలను ఏర్పాటు చేశారు. అనంతరం వాటిని ఇంటర్మీడియెట్ వరకు అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం వీటి సంఖ్య 22కు చేరింది. ఈ విద్యా సంవత్సరం నుంచి లక్సెట్టిపేటలో బీసీ సీవోఈ(సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్) సైతం అందుబాటులోకి రానుంది. ఇక్కడి విద్యార్థులు ఇంటర్ ఫలి తాల్లో ప్రైవేట్‌కు ధీటుగా ఫలితాలు సాధిస్తుండడంతో ప్రవేశాలకు పోటీ పెరిగింది. ఒక్కో సీవోఈలో 160 సీట్లు .. కొన్నేళ్లుగా సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలో సీవోఈలు కొనసాగుతున్నాయి. బీసీ సంక్షేమశాఖ పరిధిలోనూ హైదరాబాద్‌లో బాలురు, బాలికల సీవోఈలు ఒక్కోటి చొప్పున నిర్వహిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలో కొత్తగా మరో 10 సీవోఈలను ఉమ్మ డి జిల్లా ప్రాతిపదికన అందుబాటులోకి తెస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలను యూనిట్‌గా తీసుకుని రెండు ఏర్పా టు చేస్తున్నారు. ఇందులో మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో బాలుర, నిజామాబాద్‌లో బాలి కల సీవోఈలను ప్రారంభించనున్నట్లు అధికా రులు పేర్కొంటున్నారు. ఒక్కో సీవోఈలో ఎంపీసీలో 80సీట్లు, బైపీసీలో 80 సీట్లు అందుబా టులోకి రానున్నాయి. శిక్షణ.. ఎంపిక ఇందులో ఇంటర్మీడియెట్‌తో పాటు జేఈఈ మెయిన్స్, నీట్, ఐఐటీ తదితర పోటీ పరీక్షలకు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వీటిలో ప్రవేశాలకు గాను 75 శాతం బీసీ విద్యార్థులకు, 25 శాతం ఇతరులకు కేటా యించనున్నారు. పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో చదివిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. జిల్లాలో 22 బీసీ గురుకులాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2017లో 11మహాత్మా జ్యోతి బాపూలే గురుకులాలను ప్రారంభించగా ప్రస్తుతం వీటి సంఖ్య 22కు చే రింది. ఇందులో 11 బాలికలు, 11 బాలుర కళా శాలలు ఉన్నాయి. వీటిలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గాను శనివారం వరకు దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి.. ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలను యూనిట్‌గా తీసుకుని ఈ విద్యా సంవత్సరం నుంచి రెండు సీవోఈలు అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో బాలుర సీవోఈ ప్రారంభం కానుంది. అలాగే నిజామాబాద్‌లో బాలికల సీవోఈ ఏర్పాటు కానుంది. ఒక్కో దానిలో 160 (ఎంపీసీ 80, బైపీసీ 80) సీట్లు అందుబాటులో ఉంటాయి. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. – ఎస్ శ్రీధర్, మహాత్మాజ్యోతి బాపూలే గురుకులాల ఆర్సీవో -
● ఐపీ మైదానానికి టెండర్ల భయం ● ప్రభుత్వ ఆస్తులపై ప్రైవేటు పెత్తనం ● నిరుపేద క్రీడాకారులు ఆటలకు దూరమయ్యే అవకాశం ● ఇప్పటికే వసతులు లేక అవస్థలు
ఆదిలాబాద్: అసలే అరకొర వసతులు.. క్రీడా శిక్షకులు సైతం లేరు.. పర్యవేక్షణ కూడా అంతంతే.. వీటికి తోడు క్రీడాకారులను మైదానానికి దూరం చేసేలా అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో ఆటలు ఆడాలన్నా, వ్యాయామ సాధన చేయాలన్నా పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని(ఐపీ) స్టేడియమే పెద్దదిక్కుగా నిలుస్తోంది. అయితే దీనిని నెమ్మదిగా ప్రైవేట్ పరం చేసేందుకు యువజన క్రీడా శాఖ చర్యలు క్రీడాకారులకు శరాఘాతంగా మారుతుంది. ఇప్పటికే స్విమ్మింగ్ పూల్ నిర్వహణను కాంట్రాక్టర్ కు అప్పగించడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. రాబోయే రోజుల్లో స్టేడియంలో పేఅండ్ప్లే విధానం అమలుకు అధికారులు చేస్తున్న కసరత్తు క్రీడాకారులను ఆందోళనకు గురి చేస్తోంది. గతమెంతో ఘనం.. ఈ స్టేడియం ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిభగల క్రీడాకారులకు నెలవుగా మారింది. ఎంతోమంది రాష్ట్ర జాతీయ స్థాయి వేదికల్లో మెరిసి ప్రభుత్వ ఉద్యోగాలు సైతం సాధించారు. పలు క్రీడాంశాల్లో నిరంతరం శిక్షణ ఇచ్చేవారు. జిల్లా కేంద్రం నుంచే కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి సైతం క్రీడాకారులు వచ్చి తర్ఫీదు పొందేవారు. పలు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను నిర్వహించిన చరిత్ర స్టేడియానికి ఉంది. అయితే ఇదంతా గతం.. దశాబ్ద కాలంగా ఈ మైదానంలో క్రీడా శిక్షణలు లేకపోవడంతో ఎంతోమంది ప్రతిభ ఉన్నా వెలుగులోకి రాక కనుమరుగైపోతున్నారు. ఆడాలనే అభిలాష ఉన్నా సరైన వసతులు లేక క్రీడల్లో రాణించలేని పరిస్థితి. శిక్షణకు మంగళం.. గతంలో మైదానంలో కబడ్డీ, వాలీబాల్, జూడో, హాకీ, ఖోఖో వంటి క్రీడల్లో శిక్షణ అందించేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. క్రీడాకారులకు శిక్షణ అందించేందుకు ఒక్క శిక్షకుడు లేకపోవడం గమనార్హం. స్టేడియంలోని తెలంగాణ క్రీడా పాఠశాలలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు రెజ్లింగ్, బాక్సింగ్, జూడో, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలకు శిక్షకులను నియమించింది. అయితే క్రీడల్లో రాణించాలనే ఔత్సాహికులకు కోచ్‌లు లేకపోవడం ఇబ్బందులకు కారణమవుతోంది. ఆదాయమే పరమావధిగా.. స్టేడియం నిర్వహణలో భాగంగా కాంట్రాక్టర్‌కు స్విమ్మింగ్ పూల్ నిర్వహణ అప్పజెప్పినట్లు అధి కారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అందుకు సంబంధించిన అభివృద్ధి దాఖలాలేవి కనిపించట్లేదు. గతంలో లీజుకు ఇచ్చిన సమయంలో స్టేడియంలో ఆశించదగ్గ ప్రగతి జరిగిందా అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికీ స్టేడియానికి దుకాణ సముదాయాలతో ఆదాయం లభిస్తుంది. అయినప్పటికీ స్విమ్మింగ్ పూల్ నిర్వహణను ప్రైవేటుపరం చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో విఫలయత్నం.. ఐపీ స్టేడియంలో పే అండ్ ప్లే విధానాన్ని గతంలో అందుబాటులోకి తీసుకోవచ్చారు. నిర్ణీత ఫీజు చెల్లించిన వారికి మాత్రమే మైదానంలోకి అనుమతించారు. అయితే క్రీడాకారులు, క్రీడా సంఘాల నుంచి విమర్శలు, పలువురు అధికారులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో వెనక్కి తగ్గారు. అంతేకాకుండా క్రీడాకారులు, వ్యాయామ సాధకులు విముఖత ప్రదర్శించడంతో డీఎస్ఏ అధికారులు తలొగ్గక తప్పలేదు.తాజాగా మళ్లీ అదే ప్రయత్నాలు షురూ చేసినట్లు తెలుస్తోంది. స్విమ్మింగ్‌పూల్ కాంట్రాక్టర్ చేతిలోకి.. జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఒకే ఒక్క స్విమ్మింగ్ పూల్ స్టేడియంలోనే ఉంది. అయి తే కొంతమంది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో దీని నిర్వహణను రూ. 21లక్షలకు అద్దె ప్రాతిపదికన అప్పగించారు. గతంలో లీజులో కొనసాగిన సమయంలో నిర్వహణ ఇష్టారాజ్యంగా సాగిందనే విమర్శలున్నాయి. తాజాగా మున్సిపల్ ఆధ్వర్యంలో లీజు విధానానికి సైతం స్వస్తి పలికి టెండర్ ద్వారా కాంట్రాక్టర్‌కు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. అవకాశం ఉంటే ప్రయత్నిస్తాం.. స్టేడియం నిర్వహణ, అభివృద్ధి కోసమే స్విమ్మింగ్ పూల్ కాంట్రాక్టర్‌కు అప్పగించడం జరిగింది. ప్రస్తుతమైతే స్టేడియంలో మరిన్ని అంశాలు, స్థలాలు టెండర్‌కు ఇచ్చే ప్రతిపాదనలైతే ఏమీ లేవు. ఏవైనా ప్రతిపాదనలో ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆ దిశగా కృషి చేస్తాం. నిర్వహణకు సంబంధించి అవకాశం ఉంటే ప్రయత్నిస్తాం. – వెంకటేశ్వర్లు, డీవైఎస్వో -
● గూడ్స్ వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరం ● అదుపుతప్పి బోల్తా పడుతున్న వాహనాలు ● గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు ● డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగంతోనే ఘటనలు ● చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న రవాణాశాఖ
●గతేడాది ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ నిర్మల్ ఘాట్ సెక్షన్ సమీపంలో బోల్తా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం, ఓవర్ లోడ్ కారణంగా ఓ ప్రయాణికుడు మృత్యువాత పడగా, అందులో ప్రయాణిస్తున్న 25 మంది గాయాల పాలయ్యారు. ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో రహదారి ప్రమాదాలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. శుభకార్యాలు, దైవదర్శనం, ఇతర పనుల నిమిత్తం గూడ్స్ వా హనాల్లో వెళ్తున్న సమయంలో అతివేగం, డ్రైవర్ ని ర్లక్ష్యం, మద్యం మత్తులో నడపడం, పరిమితికి మించి వెళ్లడంతో వాహనాలు బోల్తా పడుతున్నాయి.ఈ ఘటనల్లో అందులో ప్రయాణిస్తున్న వారి లో పలు వురు మృతిచెందగా,మరికొంతమంది తీవ్ర గాయా లై కోలుకోలేని స్థితికి చేరుకుంటున్నారు. కుటుంబ పెద్దలను కోల్పోవడంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొంత మంది తెలిసి ఇలాంటి ప్రయాణాలు చేస్తుండగా, మరికొందరు అవగాహ న లేకపోవడం, ఆర్థిక పరిస్థితుల కారణంగా గూడ్స్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. రవాణా శాఖాధికారుల నిర్లక్ష్యమో, అలసత్వమో ఏమోగానీ ఇలాంటివి పునరావృతం అవుతూనే ఉన్నాయి. ప్ర మాదాలు జరిగినప్పుడు హడావుడి చేయడం తప్పా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు చేపట్టకపోవడంతో ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా.. నిబంధనల ప్రకారం గూడ్స్ వాహనాల్లో ప్రయాణికులను తరలించరాదు. అయితే కొంతమంది యజ మానులు శుభకార్యాలు, దైవదర్శనాలు ఇతర పను ల నిమిత్తం గూడ్స్ వాహనాల్లో తరలిస్తున్నారు. ఘా ట్ సెక్షన్లు, మూలమలుపుల వద్ద అతివేగం కారణంగా వాహనాలు బోల్తా పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారు క్షతగాత్రులుగా మారుతుండగా, మరి కొంత మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఐచర్, బొలెరో, లారీలు, టాటాఏస్, ఆటో ట్రాలీ వంటి వాహనాల్లోనే ఈ ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు.. గూడ్స్వాహనాలతో పాటు ఆటోలు, జీపుల్లో పరిమి తికిమించి ప్రయాణికులను తరలిస్తున్నారు. ఇచ్చో డ, బజార్హత్నూర్, సిరికొండ, సాత్నాల, నేరడిగొండ, తదితర ప్రాంతాల్లో జీపులు, ఆటోల్లో పరి మితికి మించి ప్రయాణా లుసాగిస్తున్నారు. గతంలో బోథ్, తలమడుగు మండలంలో, ఇచ్చోడ సమీపంలో ఆటోలు బోల్తా పడడం, రోడ్డు ప్రమాదాలకు గురికావడంతో పలువురు మృతిచెందారు. సిరికొండ మండలంలోని నేరడిగొండ(జి) వద్ద శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో మూలమలుపు వద్ద బొలెరో వాహనం బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 30 మందిలో 11 మంది గాయాలపాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ అతివేగం కారణంగానే ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు -
నేమ్ విత్ సంథింగ్ స్పెషల్
హోటల్ మల్లేశ్ సిరికొండ: మండల కేంద్రానికి చెందిన రుద్రారపు మల్లేశ్ దశాబ్దాలుగా హోటల్ నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. ఏళ్లుగా ఇదే పనిచేస్తున్న ఇతడిని ఇంటిపేరు చెబితే ఎక్కువ మంది గుర్తుపట్టరు. అదే హోటల్ మల్లేశ్ అంటే మాత్రం టక్కున చెప్పేస్తారు. తన తండ్రి చాలాకాలం హోటల్ నడిపాడని, తానూ అదే కొనసాగిస్తుండడంతో ఆ పేరు కాస్త ఇంటిపేరుగా మారిందని అంటున్నాడు మల్లేశ్. కూరగాయల పోశెట్టి తాంసి: మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన పాముల పోశెట్టి 35 ఏళ్లుగా కూరగాయలు సాగుచేస్తున్నా డు. వాటిని ప్రతిరోజు ఉదయాన్నే జిల్లా కేంద్రంలోని రైతుబజార్‌కు తీసుకువచ్చి విక్రయిస్తాడు. దశాబ్దాలుగా ఇదే పని చేస్తుండడంతో ఇతడిని కూరగాయల పొశెట్టిగా పిలుస్తుంటారు స్థానికులు. తన ఇంటిపేరు చాలా మందికి తెలియదని కూరగాయల పొశెట్టి అంటేనే గుర్తుపడతారని అంటున్నాడు ఇతడు. -
అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
కైలాస్‌నగర్: పైలెట్ ప్రజావాణిలో అందించే అర్జీలు సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ రాజ ర్షి షా అన్నారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి, తలమడుగు, జైనథ్ మండలాల జేఆర్వోలు, జిల్లాస్థాయి, ప్రత్యేక అధికారులు, గ్యాస్ డీలర్లతో పైలెట్ ప్రజావాణి అమలుపై సమీక్ష నిర్వహించారు. అందుతున్న అర్జీలు, పరిష్కారానికి చేపట్టిన చర్యలపై మండలాల వారీగా సమీ క్షించారు. గ్యాస్ సబ్సిడీ, రుణమాఫీ, పింఛన్, గృహజ్యోతి అంశాలపైనే అధిక ఫిర్యాదులు అందుతున్నట్లుగా సంబంధిత అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తూ బాధితుల సమస్యలు సత్వరం పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో ఆర్డీవో వినోద్‌కుమార్, జెడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీఎస్వో వాజీద్‌అలీ పాల్గొన్నారు. ఈవీఎంల గోదాం పరిశీలనజిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో గల ఈవీ ఎంలను భద్రపర్చిన గోడౌన్‌ను కలెక్టర్ రాజర్షి షా శనివారం సందర్శించారు. నెలవారి సందర్శనలో భాగంగా స్ట్రాంగ్‌రూంలోని ఈవీఎంలను పరిశీలించారు. భద్రత సిబ్బందితో మా ట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయ న వెంట అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాథోడ్ పంచపూల తదితరులున్నారు. -
సమాజంలో ప్రతీ ఒక్కరికి ఓ పేరు ఉంటుంది. ఇందులో ఇంటి పేరును వ్యక్తి పేరు అనుసరిస్తుంది. కొందరికి మాత్రం తమ వృత్తి, ప్రవృత్తి, మర్చిపోలేని ఘటనలతో వచ్చే గుర్తింపు శాశ్వతమవుతోంది. అది ఏకంగా తమ ఇంటిపేరు స్థానంలో నిలిచిపోతుంది. వారికి ఆ పేరుతోనే ప్రత్యేకత లభిస్త
– ఆదిలాబాద్తెలంగాణ కిరణ్ నేరడిగొండ మండలం కుమారి గ్రామానికి వెళ్లి కుంట కిరణ్ కుమార్‌రెడ్డి ఇల్లు ఎక్కడ అని అడిగితే గుర్తుపట్టేవారు తక్కువే. అదే తెలంగాణ కిరణ్ అంటే మాత్రం టక్కున చెబుతారు. గ్రామంలో ఈయన చిన్నప్పటినుంచి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. పలు నిరసన కార్యక్రమాల్లో ముందుండి నినదించాడు. ఈ క్రమంలోనే ఈయన పేరు కాస్తా తెలంగాణ కిరణ్‌గా మారిపోయింది. 2001 నుంచి 2014 వరకూ ఉద్యమంలో భాగస్వామ్యం అవ్వడమే తనకు ప్రత్యేక గుర్తింపునిచ్చిందని సంతోషంగా చెబుతున్నాడు కిరణ్‌కుమార్‌రెడ్డి. -
ముందస్తు చర్యలు చేపట్టాలి
● రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ ● ప్రకృతి వైపరీత్యాలపై అధికారులతో సమీక్ష ఉట్నూర్‌రూరల్: ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ అన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో పీవీటీజీ, వరద ముంపు ప్రభావిత ప్రాంతాలపై ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, సబ్‌కలెక్టర్ యువరాజ్‌తో కలిసి సంబంధిత అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీసుకుంటున్న చర్యలను అడిగితెలు సుకున్నారు. గతంలో వరద ప్రభావిత ప్రాంతా ల్లో దెబ్బతిన్న కల్వర్టులు, రోడ్ల మరమ్మతులు, నిధులు కేటాయింపు, నిర్మాణ పనుల వివరాలపై ఆరా తీశా రు. ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు. అరవింద్ కుమార్‌కు స్వాగతం పలికిన కలెక్టర్ కైలాస్‌నగర్: రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ శనివారం సాయంత్రం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. స్థానిక పెన్‌గంగ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న ఆయనకు కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఆర్డీవో వినోద్ కుమార్ పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. జిల్లాలో వేసవి వడగాలుల తీవ్రతను నియంత్రించేందుకు చేపట్టిన చర్యలపై కలెక్టర్ ముఖ్య కార్యదర్శికి వివరించారు. -
కేసుల దర్యాప్తులో ప్రమాణాలు పాటించాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: కేసుల దర్యాప్తు, పరిశోధనలో నా ణ్యత ప్రమాణాలు పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. కోర్టుల్లో శిక్షల శాతం పెంచేలా దర్యాప్తు పరిశోధన నిర్వహించే అధికారులు, రైట ర్లకు పీపీ ద్వారా శనివారం ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేశారు. ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లోని సమావేశ మంది రంలో నిర్వహించిన కార్యక్రమానికి స్టేషన్, సీఐ ఆఫీస్ రైటర్లు, సీసీటీఎన్ఎస్, కోర్టు డ్యూటీ అధికా రులు ప్రత్యక్షంగా పాల్గొనగా.. ఎస్‌హెచ్‌వోలు, సీఐ లు, పోలీసు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వా రా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సరైన దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేసే క్రమంలో ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఇందులో పీపీ నవీన్‌కుమార్, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్‌రెడ్డి,డీసీఆర్బీ ఎస్సై మహేందర్పాల్గొన్నారు. తెలియని వెబ్సైట్లతో జాగ్రత్తగా ఉండాలి సైబర్ నేరాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. వాట్సాప్, టెలీగ్రాం, సోషల్ మీడియాలో వచ్చే ఏపీకే ఫైల్స్ ద్వారా మొబైల్ కంట్రోల్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే అవకాశముంటుందన్నారు. అప్రమత్తతోనే వాటిని అడ్డుకోవచ్చని తెలిపారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లైతే వెంటనే 1930కి లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలన్నారు. గడిచిన వారంలో జిల్లా వ్యాప్తంగా 15 ఫిర్యాదులు అందాయన్నారు. -
అకాల వర్షం.. ఆగమాగం
● విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలు ● తడిసిన వరి ధాన్యం, జొన్నలు ● రైతులకు తీవ్ర ఇబ్బందులుఆదిలాబాద్టౌన్/ఇంద్రవెల్లి/జైనథ్/తాంసి/ఉట్నూర్‌రూరల్: జిల్లాలో పలు మండలాల్లో శుక్రవారం రాత్రి అకాల వర్షం కురిసింది. ఈదురుగాలులు తోడవడంతో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇంటిపైకప్పులు ఎగిరిపోయాయి. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఇబ్బందులకు గురయ్యారు. జిల్లాలో 12.2 మి.మీ. వర్షం జిల్లాలో 12.2 మిల్లీ మీటర్ల వర్షం నమోదైంది. సాయంత్రం 6నుంచి రాత్రి 10 గంటల వరకు వర్షం కురిసింది. ఇంద్రవెల్లి ఏరియాలో 28 వి ద్యుత్స్తంభాలు పడిపోయాయి. అలాగే ఉట్నూర్‌లో మూడు విద్యుత్ స్తంభాలు నేలకొరగగా మూడు కండక్టర్లు కాలిపోయాయి. విద్యుత్ శాఖ ఎస్ఈ జేఆర్ చౌహాన్ ఆయా ప్రాంతాలను పరిశీలించారు. నష్టాన్ని అంచనా వేశారు. అలా గే ఇంద్రవెల్లి, జైనథ్, ఉట్నూర్, బేల, సాత్నాల, ఇచ్చోడ తదితర కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలకు తెచ్చిన జొన్న పంట తడిసింది. దీంతో రైతులు వాటిని ఆరబెట్టారు. ● ఇంద్రవెల్లి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలపై చెట్లు పడిపోయాయి. క రెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డీఈ సుభాష్ ఆధ్వర్యంలో సిబ్బంది మరమ్మ తులు చేపట్టారు. మండలంలోని కేస్లాగూడలో వెడ్మ అంబాజీ, ధ ర్మసాగర్లో గోతి సర్ధార్, సాబ్లే జైత్రం, సాబ్లే లాల్‌సింగ్, గోతి సైనా బాయి, శ్యామ్‌రావ్, నాథ్‌సింగ్, రాజేందర్‌కు చెందిన ఇళ్ల పైకప్పులుదెబ్బతిన్నాయి. తమ కు పరిహారం అందించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ● జైనథ్, తాంసి మండలకేంద్రాల్లో మార్కెట్ యార్డులకు తీసుకువచ్చిన జొన్నలు వర్షానికి తడిసిపోయాయి. రైతులు టార్పాలిన్లు కప్పినా తడిసిపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ● ఉట్నూర్ మండలకేంద్రంలోని గంగన్నపేట వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వర్షానికి ధాన్యం కొంతమేర తడిసింది. విషయం తెలుసుకున్న ఏపీడీ గోవింద్రావు అక్కడికి చేరుకొని ధాన్యాన్ని పరిశీలించారు. -
బడి బాటలో బుక్స్
● జిల్లాకు చేరిన 84 శాతం పాఠ్యపుస్తకాలు ● మండల పాయింట్లకు సరఫరా షురూ జిల్లాలో.. మొత్తం పాఠశాలలు : 1,439 కావాల్సిన పాఠ్యపుస్తకాలు : 4,83,110 ఇప్పటివరకు చేరుకున్నవి : 4,05,700 ఇంకా రావాల్సినవి : 77,410 ఆదిలాబాద్‌టౌన్: పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరుకుంటున్నాయి. బడులు తెరిచే నాటికి విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందించేలా విద్యాశాఖ కసరత్తు చే స్తోంది. పాఠ్యపుస్తకాల సరఫరా సైతం ప్రారంభించారు. అయితే పూర్తిస్థాయిలో ఇంకా జిల్లాకు చేరుకోలేదు. మరాఠీమీడియం పుస్తకాలు ఒక్కటి కూడా రాకపోగా , హిందీ మీడియంకు సంబంధించి లాంగ్వేజ్ పుస్తకాలు మాత్రమే వచ్చాయి. జూన్ 12న పా ఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. అప్పటి వరకు అన్ని తరగతులకు సంబంధించిన పుస్తకాలు అందించేలా చర్యలు చేపడుతామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా సర్కారు బడుల ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమి టీల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తోంది. అలాగే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు సైతం బడులు తెరిచే రోజు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో హైదరాబాద్ పాఠ్యపుస్తకాల ప్రింటింగ్ ప్రెస్ నుంచి జిల్లాకు సరఫరా చేస్తుంది. జిల్లా కేంద్రంలో మూడు గోదాములు ఏర్పాటు చేసి వాటిని భద్రపర్చారు. వాటిని ప్రస్తుతం మండల పాయింట్లకు చేరవేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని కేజీబీవీలకు పాఠ్యపుస్తకాలను సరఫరా చేయగా ఆదివారం నుంచి మోడల్ స్కూళ్లకు ఈ ప్రక్రియ షురూ చేయనున్నారు. మరో రెండు రోజుల తర్వాత మండలాల వారీగా అందించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. అయితే వీటిని ట్రాన్స్‌పోర్టు చేసేందుకు నిధులు విడుదల కాకపోవడంతో అధికారులు అయోమయంలో ఉన్నారు. రవాణా చార్జీలను పాఠ్యపుస్తకా ల సరఫరా ఇన్చార్జి వెచ్చించి స్కూళ్లకు పుస్తకాలను సరఫరా చేస్తున్నారు. జిల్లాకు చేరిన 84శాతం పాఠ్యపుస్తకాలు జిల్లాలో ప్రైవేట్ మినహా మిగతా అన్ని యాజమాన్యాలకు పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్‌లను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఇప్పటివరకు జిల్లాకు చేరుకున్న పాఠ్యపుస్తకాలను స్థానిక ఆర్వీ ఎం గోదాం, మార్కెట్ యార్డు, పాలశీతలీకరణ కేంద్రాల్లో భద్రపర్చారు. ఇంకా 77,410 వేల పుస్తకాలు రావాల్సిఉంది. మరో 24 రోజుల వరకు గడువు ఉంది. జిల్లా కేంద్రంలో భద్రపర్చిన పుస్తకాలను ప్రస్తు తం ఆయా మండలాల ఎమ్మార్సీలకు పంపిస్తున్నా రు. అక్కడి నుంచి పాఠశాలలకు చేరవేస్తున్నారు. వీటికి గాను రూ.3లక్షల 50వేల వరకు ట్రాన్స్‌పోర్టు చార్జీలు అవసరం కాగా, ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదని అధికారులు చెబుతున్నారు.ఎంఈవోలు, పాఠ్యపుస్తకాల గోదాం ఇన్చార్జీలు ఈ చార్జీలు భరిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిధులు వచ్చిన తర్వాత వారికి బిల్లులు అందించనున్నట్లు సమాచారం. చేరుకున్న పార్ట్–1 పుస్తకాలు ప్రస్తుతం పాఠ్యపుస్తకాల్లో ఓ వైపు తెలుగు, మరో పక్క ఇంగ్లీష్‌లో పాఠాలను ముద్రించారు. ఆంగ్ల మాధ్యమం అమలు చేయడంతో పార్ట్–1, పార్ట్–2గా విభజించి అందిస్తున్నారు. ప్రస్తుతం పార్ట్–1 పుస్తకాలు జిల్లాకు చేరుకోగా, పార్ట్–2 బుక్స్ ఆగస్టు, సెప్టెంబర్ వరకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని విభజించడం ద్వారా పుస్తకాల బరువు కూడా తగ్గింది. అయితే రెండేళ్లుగా విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ కూడా పంపిణీ చేస్తున్నారు. ఇది వరకు పాఠ్య పుస్తకాల గోదాం నుంచే వీటిని సరఫరా చేయగా ఈ ఏడాది హైదరాబాద్ నుంచి నేరుగా పాఠశాలలకే సరఫరా అవుతున్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో ఉన్నత తరగతులకు నోట్ బుక్స్ పంపిణీ చేయగా, ఈ సారి ప్రాథమిక తరగతులకు సైతం పంపిణీ చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. చేరని హిందీ, మరాఠీ మీడియం బుక్స్ జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లో 81,151 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికి ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించనున్నారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియాలకు సంబంధించిన పుస్తకాలు 84శాతం వరకు చేరుకోగా, మరాఠీ మీడియంకు సంబంధించి ఏ ఒక్క తరగతికి పుస్తకాలు రాలేదు. హిందీ మీడియంలో కేవలం ఫస్ట్ లాంగ్వేజ్ పుస్తకాలు మాత్రమే వచ్చాయి. అలాగే మూడో తరగతి ఇంగ్లీష్, ఈవీఎస్ (ఇంగ్లీష్ మీడియం), నాల్గో తరగతి తెలుగు, ఆరో తరగతి గణితం (తెలుగు మీడియం), 7,8,9వ తరగతుల హిందీ, పదో తరగతి సాంఘిక శాస్త్రం, గణితం (ఇంగ్లీష్ మీడియం) పుస్తకాలు రాలేదు. అయితే బడులు తెరిచే నాటికి పాఠ్యపుస్తకాలు సరఫరా అవుతాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. పాఠ్య పుస్తకాల సరఫరా ప్రారంభించాం జిల్లాకు 84శాతం పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. ఇప్పటికే కేజీబీవీలకు సరఫరా చేశాం. మోడల్ స్కూళ్లకు సరఫరా చేస్తున్నాం. మరో రెండు రోజుల్లో మండలాల పాయింట్లకు పుస్తకాలను పంపిస్తాం. బడిబాట కార్యక్రమానికి ముందుగానే బుక్స్ చేరవేసే విధంగా చర్యలు చేపడుతున్నాం. హిందీ, మరాఠీ మీడియం పుస్తకాలు జిల్లాకు చేరాల్సి ఉంది. – ఎన్. సత్యనారాయణ, పాఠ్యపుస్తకాల మేనేజర్, ఆదిలాబాద్ -
హాయ్.. అయాం పూజ అంటూ టోకరా
● మహిళల పేరిట చాటింగ్ ● కోరిక తీరుస్తామంటూ ఎర ● తీరా వచ్చాక నిలువు దోపిడీ ● ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు కొత్తపల్లి(కరీంనగర్): ముగ్గురు యువకులు ముఠాగా ఏర్పడ్డారు. మహిళల పేరిట యువకులతో చాటింగ్ చేస్తూ కోరికలు తీరుస్తామంటూ ఎరవేస్తున్నారు. ఈ ఓ వ్యక్తిని మభ్యపెట్టి దోపిడీకి పాల్పడిన సంఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో వెలుగు చూసింది. ఇద్దరు యువకులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నాడు. కొత్తపల్లి పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపల్లి మండలం చింతకుంట శాంతినగర్‌కు చెందిన సరళ సందీప్(19), మల్కాపూర్ లక్ష్మిపూర్‌కు చెందిన పొన్నాల ప్రణయ్‌కుమార్(18), ఎండీ రెహాన్ జల్సాలకు అలవాటు పడి, దోపిడీలకు కొత్తరకం పన్నాగం పన్నారు. మహిళల పేరిట కోరిక తీరుస్తామంటూ వాట్సాప్‌లో యువకులకు మెసేజ్ చేస్తారు. ఆకర్షితులైన యువకులను చాటింగ్‌తో మభ్యపెడతారు. సరళ సందీప్ ఈ నెల 6న తన ఫోన్ ద్వారా మంచిర్యాల ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి వాట్సాప్‌లో హాయ్ అయాం పూజ అంటూ మెసేజ్ చేశాడు. స్పందించి యువకుడు చాటింగ్ చేశాడు. కోరిక తీరుస్తానంటూ ఆశ చూపడంతో అది నమ్మి ఈ నెల 11న కరీంనగర్ వచ్చాడు. పథకం ప్రకారం దోపిడీకి సిద్ధమైన ముగ్గురు యువకులు కొత్తపల్లికి రప్పించారు. ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై యువకుడిని వెలిచాల శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడికి చేరుకున్న రెహాన్‌తో కలిసి యువకుడిని చిత్రహింసలకు గురి చేశారు. రూ.50వేలు డిమాండ్ చేశారు. ఇవ్వకుంటే చంపుతామని బెదిరించడంతో తన వద్ద ఉన్న రూ.10వేలు ఇచ్చాడు. బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి మరో రూ.12వేలు ఫోన్ పే ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. ముగ్గురు నిందితులు సదరు యువకుడిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. బాధితుడు కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై ఎస్ సాంబమూర్తి ఆధ్వర్యంలోని బృందం శుక్రవారం రేకుర్తి బస్టాండ్ ప్రాంతంలో సరళ సందీప్, పొన్నాల ప్రణయ్ కుమార్‌ను అరెస్టు చేశారు. రెహాన్ పరారీలో ఉన్నాడు. -
కడుపునొప్పి భరించలేక యువకుడి ఆత్మహత్య
తిర్యాణి: కడుపునొప్పి భరించలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం.. మండలంలోని దేవాయిగూడ పంచాయతీ పరిధిలోని చందగూడ గ్రామానికి చెందిన కుర్సెంగ గోపాల్ (27) గత మూడేళ్లుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడేవాడు. స్థానికంగా మందులు వాడినా నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలో మనస్తాపం చెంది గురువారం మధ్యాహం గ్రామశివారులోని పంట చేనులో గుర్తు తెలియని పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని సోదరి అయిన కమలకు ఫోన్ చేసి చెప్పాడు. కుటుంబీకులు ఘటన స్థలానికి చేరుకుని గోపాల్‌ను గోలేటిలోని సింగరేణి ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడి తండ్రి రాము ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.పెళ్లి ఇష్టం లేక యువతి..ఖానాపూర్: పెళ్లిచేసుకోవడం ఇష్టం లేక యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై రాహుల్ గైక్వాడ్ కథనం ప్రకారం..మండలంలోని పాత ఎల్లాపూర్ పంచాయతీ పరిధిలోని ఒడ్డెవాడకు చెందిన అల్లెపు పోశాని, రాజేందర్ దంపతుల కూతురు అక్షయ (18) ఇంటర్ చదువుతోంది. గతకొన్ని రోజులుగా యువతికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని కోరగా యువతికి ఇష్టం లేదు. ఈక్రమంలో మనస్తాపంతో గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుంది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతితిర్యాణి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..మండలంలోని మార్కగూడ పంచాయతీ పరిధి వాడిగూడ గ్రామానికి చెందిన మెస్రం యేసు (50)గురువారం గృహ అవసరాల వస్తువుల కొనుగోలు కోసం బైక్‌పై తిర్యాణికి వచ్చాడు. తిరిగి రాత్రి ఇంటికి వెళ్తుండగా కై రిగూడ సమీపంలో రెండు ఎద్దులు పొట్లాడుకుంటూ వచ్చి అటుగా బైక్‌ను ఢీకొట్టాయి. యేసు తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతన్ని చెలిమల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమచికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి కుమారుడు సంతోశ్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.గోదావరి నదిలో పడి యువకుడు..బాసర: బాసర గోదావరి నదిలో ప్రమాదవశాత్తు యువకుడి పడి మృతిచెందినట్లు ఎస్సై శ్రావణి తెలిపారు. ఆమె కథనం ప్రకారం..బిహార్ రాష్ట్రానికి చెందిన శర్మ దిల్కుష్(19) బాసరలో హమాలీ పనిచేస్తున్నాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి కొన్నిరోజుల క్రితం ఇక్కడకు వచ్చాడు. శుక్రవారం బాసర గోదావరి రెండో ఘాట్ వద్ద స్నానాలు ఆచరించేందుకు కుటుంబ సభ్యులు రాగా, ప్రమాదవశాత్తు నీటిలో మునిగాడు. ఈత రాకపోవడంతో మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లతో గాలించి యువకుడి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. మృతదేహాన్ని భైంసా ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.రైలు ఢీకొని ఒకరు..కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ రాళ్లపేట రైల్వేస్టేషన్ల మధ్య వంజీరి రైల్వేగేటు సమీపంలో శుక్రవారం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. రైలు పట్టాలు దాటుతుండగా బల్లార్షా నుంచి మంచిర్యాల వైపు వెళ్లే రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్ సురేష్ తెలిపారు. మృతుడికి 50 నుంచి 55 వయస్సు ఉంటుందని, బ్రౌన్, వైట్ లైనింగ్కలర్ ఫుల్‌షర్టు, సిమెంట్ కలర్ నైట్ ప్యాంట్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు.ట్రాక్టర్ కిందపడ్డ మహిళా కూలీ..ఖానాపూర్: మండలంలోని మస్కాపూర్ పంచాయతీ పరిధి గంగాయిపేట్ గ్రామ శివారులో ఇటుకబట్టి వద్ద ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి గాయపడ్డ గిరిజన కూలీ మృతిచెందింది. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గంగాయిపేట్ గ్రామానికి చెందిన మేస్రం స్వప్న(35) ఇటుక బట్టి వద్ద ట్రాక్టర్లో ఇటుకలు నింపేందుకు వెళ్లింది. ఇటుకలు నింపిన తర్వాత ట్రాక్టర్‌ను వెనక్కి తీస్తుండగా ఆమెకు తగిలి కింద పండింది. ఆమె పై నుంచి ట్రాక్టర్ టైరు వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం నిర్మల్‌కు తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయింది. స్వప్నకు భర్త, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
నిజాయతీ చాటుకున్న యువకుడు
బాసర: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తుడు పోగొట్టుకున్న బ్యాగును యువకుడు అప్పగించి నిజాయతీ చాటుకున్నాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రకాశ్ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం బాసరకు వచ్చారు. గోదావరి నదిలో స్నానాలు ఆచరించారు. మొదటి పుష్కర ఘాట్ వద్ద రెండు సెల్ఫోన్లు, బ్యాగును మరిచిపోయారు. అక్కడే ఉన్న యువకుడు మారుతి గమనించి ప్రకాశ్‌కు బ్యాగు, సెల్ఫోన్లు తిరిగి అప్పగించాడు. యువకుడిని స్థానికులు అభినందించారు. అధిక మద్యం తాగి ఒకరి మృతి జైనథ్: మండలంలోని బె ల్గాం గ్రామంలో అధిక మ ద్యం తాగి చౌహన్ (32)మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. మహారాష్ట్ర నుంచి చౌహన్ ఇక్కడకు వలస వచ్చి రోజువారి కూలీగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత రెండు రోజుల నుంచి అధిక మద్యం తాగడంతో మృతిచెందినట్లు తెలిసింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉరేసుకుని రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి మచ్చ వీరయ్య (78) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్ తెలిపారు. గురువారం రాత్రి బాత్రూమ్లో ఐరన్ రాడ్‌కు ఉరేసుకుని కనిపించాడు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కళ్లు సరిగ్గా కనిపించకపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. మృతుడి కుమారుడు శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. -
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే పీడీయాక్ట్
● మున్సిపల్ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి రిమాండ్ ● ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే పీడీయాక్ట్ కేసులు నమోదు చేస్తామని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. పట్టణంలో కోట్ల రూపాయల మున్సిపల్ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. పట్టణంలోని భుక్తాపూర్‌కు చెందిన ఏ–2 అక్రమ్ మున్సిపల్ ఖాళీ స్థలాన్ని ఆక్రమించాలనే ఉద్దేశంతో తన బంధువు షాబొద్దీన్ పేరిట దస్తావేజులు సృష్టించినట్లు తెలిపారు. 35 ఏళ్లుగా అక్కడే ఉంటున్నట్లు ఇంటినంబర్ తీసుకున్నాడు. అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్ నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదుతో పలు కేసులు నమోదు చేసినట్లు వివరించారు. భుక్తాపూర్‌లో 469.44 స్వేర్ యార్డ్స్ ఆక్రమించి ఇంటి నం.6–6–36/2/1 తీసుకున్నాడు. మున్సిపల్ సిబ్బంది పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిపై నాన్‌బెయిలబుల్ కేసులతోపాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. ల్యాండ్ మాఫియా, రౌడీలు గతంలో బెదిరింపులకు పాల్పడి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే పోలీసులను ఆశ్రయించాలన్నారు. సమావేశంలో వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్, పోలీసుసిబ్బంది పాల్గొన్నారు. -
చిన్నయ్యగుట్టను చూసొద్దాం
లక్సెట్టిపేట: మండలంలోని హన్మంతుపల్లి గ్రామ పంచాయతీ పరిధి చల్లంపేట గ్రామశివారు అటవీప్రాంతంలో సుమారు 150 ఏళ్లక్రితం నుంచి చిన్నయ్యగుట్టపై చిన్నయ్య దేవుడు కొలువై ఉన్నాడు. గిరిజనుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతూ ఈ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధిగాంచాడు. చారిత్రాత్మకంగా వెలిసిన చిన్నయ్య దేవుడిని గిరిజనులు, భక్తులు తరలివచ్చి పూజిస్తుంటారు. ప్రాచీనకాలంలో పాండవులు ఇక్కడ వ్యవసాయం చేసేవారు. ద్రౌపది స్నానం చేయడానికి కొల్లు గుంటలు, పరుపు బండపై వ్యవసాయం చేసినట్లు నాగళి సాళ్లు, గుడి లోపల దొనలో పట్టే మంచం దేవుని విగ్రహాలు ఉన్నట్లు ఇప్పటికి పూర్వీకులు చెబుతుంటారు. వర్షాకాలం ప్రారంభ సమయంలో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడకు దర్శనం కోసం వస్తుంటారు. రైతులు వరదపాశం బోనాలు వండి చిన్నయ్య దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. పంట పొలాలకు పురుగులు సోకితే ఇక్కడి తీర్థపు నీరు పొలాలపై చల్లితే పోతాయనే వారి నమ్మకం. అల్లుబండ..గుడిలో అల్లుబండకు ప్రత్యేక స్థానం. అక్కడికి వచ్చిన భక్తులు తమ మనసులో కోర్కెలు కోరుకుని అల్లుబండ లేపితే సులభంగా లేచినట్లైతే కోరిక నెరవేరుతుంది. అల్లుబండ బరువుగా ఉంటే కోరిక నెరవేరదని నమ్మకం. అల్లుబండ ప్రదేశం వద్ద భక్తులు వారి కోర్కెలు కోరుకుంటారు. పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలి అటవీప్రాంతంలో ఉన్న చిన్నయ్యగుట్టను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలి. రహదారి మధ్యలో మత్తడి నీటిని నిల్వచేయడంతోపాటు వాటికి అనుకూలంగా రోడ్డు ఏర్పాటు చేస్తే పుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా ఏర్పడుతుంది. ఆలయానికి ప్రత్యేక హోదా లభిస్తుంది. గిరిజనుల ప్రత్యేక అలయం ప్రత్యేకంగా ఉంటుంది. భక్తుల సంఖ్య పెరుగుతుంది. – అన్నం చిన్నన్న, గ్రామస్తుడు, చందారం పర్యాటక కేంద్రంగా ప్రకటించాలి గిరిజనుల ఆరాధ్యుడు చిన్నయ్యదేవుడు దర్శనం కోసం తరలివస్తున్న భక్తులు చిన్నయ్య దేవుడి ప్రత్యేకతపంట పొలాలు దుక్కి దున్నే ముందు దేవుడి దర్శనం చేసుకుంటారు. బండారు(పసుపు) తెచ్చుకుని ధాన్యం వేసేటప్పుడు అందులో కలిపి వ్యవసాయం సాగు చేస్తారు. పంట చేతికి వచ్చిన తర్వాత దినుసును దేవుడికి అప్పజెప్పి మొక్కిన మొక్కు చెల్లించుకుంటారు. వేసవికాలం ముగింపు సమయంలో చిన్నయ్య గుడి భక్తులతో కిటకిటలాడుతుంది. ఇలా వెళ్లాలి..పట్టణం నుంచి చందారం, హన్మంతుపల్లి, దౌడపల్లి, రంగపేట, జెండావెంకటాపూర్ గ్రామాల మీదుగా 10 కి.మీ దూరం వాహనాలపై చల్లంపేట వరకు చేరుకోవాలి. అక్కడి నుంచి అటవీ ప్రాంతంగుండా సుమారు 3 కి.మీ కాలినడకన వెళ్తే చిన్నయ్యగుట్ట దేవుడి గుడికి చేరుకోవచ్చు. ఇక్కడికి వచ్చేందుకు అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉంది. సమీప ప్రాంతంలో నీళ్ల సదుపాయం చిన్నపాటి బుగ్గవాగు లాంటిది ఉంటుంది. అందులోని నీటిని తాగడానికి వాడుతారు. ఇప్పటికి అక్కడ గిరిజనులే పూజార్లుగా కొనసాగుతుంటారు. ప్రతీ ఆది, గురువారాల్లో పూజలు నిర్వహిస్తారు. మేకలు, కోళ్లతో దేవుడికి మొక్కలు చెల్లించి ఆ తర్వాత వంట చేసుకుని సహపంక్తి భోజనాలు చేస్తారు. కాగా, బుగ్గవాగు ప్రాంతంపై బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు ఇటీవల రూ.కోటి నిధులు మంజూరు చేసి శిలాఫలకం వేశారు. ఇంకా పనులు ప్రారంభించలేదు. -
తప్పిపోయిన బాలుడి అప్పగింత
ఆసిఫాబాద్‌రూరల్: తప్పిపోయిన బాలుడిని క్షేమంగా తల్లికి శుక్రవారం అప్పగించినట్లు డీసీపీవో మహేశ్ తెలిపారు. సికింద్రాబాద్ నుంచి తప్పిపోయి దక్షిణ ఎక్స్‌ప్రెస్ రైలులో కాగజ్‌నగర్ రైల్వే పోలీసులకు పట్టుకుని, ఈనెల 9న జిల్లా కేంద్రంలో బాల రక్షభవన్కు అప్పగించారు. రక్షభవన్ సిబ్బంది బాలుడికి కౌన్సెలింగ్ నిర్వహించి మాట్లాడి వారి సొంత గ్రామమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాగా గుర్తించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించగా, తల్లి ఇక్కడకు రాగా, బాలుడిని అప్పగించినట్లు డీసీపీవో మహేశ్ తెలిపారు. సిబ్బంది శ్రావణ్, వ్రవీణ్ కుమార్, ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
నెన్నెల: మండలంలోని నందులపల్లి గ్రామానికి చెందిన తోట వెంకటేశం వద్ద శుక్రవారం రూ.1.20 లక్షల విలువ కలిగిన 40 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నామని ఎస్సై ప్రసాద్ తెలిపారు. నందులపల్లిలో నకిలీ విత్తనాల క్రయవిక్రయాలు జరుగుతున్నట్లు ఏవో పుప్పాల సృజన ఫిర్యాదు చేయగా సోదాలు చేశామన్నారు. నందులపల్లి ప్రాజెక్టు ప్రాంతంలో 40 కిలోల విత్తనాలను తన చేనులో దాచేందుకు ప్రయత్నిస్తూ వెంకటేశం పట్టుబడ్డాడని చెప్పారు. మందమర్రికి చెందిన పిండి సురేశ్ వద్ద లూజ్ విత్తనాలు కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. రెండు విత్తన సంచులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్సై వివరించారు. -
ఇక ఊరూరా క్షయ పరీక్షలు
సంవత్సరం టీబీ కేసులు2022 1565 2023 1476 2024 1602 2025 1038 (ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు)ఆదిలాబాద్‌టౌన్: టీబీ మహమ్మారికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశంలో 2025 ముగిసే సరికి క్షయను సమూలంగా నిర్మూలించేందుకు కసరత్తు చేస్తోంది. వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో నిక్షయ్ శివిర్ వంద రోజుల కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాలో సైతం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 522 మంది వ్యాధిగ్రస్తులను గుర్తించారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీబీ ముక్త్ భారత్ అభియాన్‌కి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇకనుంచి పల్లెల్లో ఇంటింటికీ టీబీ పరీక్షలు చేయనుంది. నిరంతర ప్రక్రియగా కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇప్పటికే వైద్యాధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఊరూరా వైద్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో టీబీని అంతమొందించే అవకాశం ఉంది. చాపకింద నీరులా.. టీబీ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. అంటువ్యాధి కావడంతో ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. చాలా మంది ప రీక్షలు చేసుకునేందుకు ముందుకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, చుట్టుపక్కల వా రికి సోకుతుంది. వ్యాధి సోకినవారు చికిత్స తీసుకో కపోవడంతో టీబీ ముదిరి మృత్యువాత పడుతున్నారు. 3 నుంచి 5 శాతం మంది చనిపోతున్నట్లు తెలుస్తోంది. సకాలంలో మందులు వాడితే ఆరు నె లల్లోనే నయం అవుతుందని వైద్యులు సూచిస్తున్నా రు. టీబీలో రెండు రకాలు ఉండగా.. ఊపిరితిత్తులకు వచ్చిన టీబీ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుండగా, శరీరంలో ఇతర భాగాలకు వచ్చింది మాత్రం విస్తరించకుండా ఉంటుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు దాదాపు 2వేల మందికి సోకగా, దాదాపు 25 మంది మృతి చెందినట్లు సమాచారం. సత్ఫలితాలు ఇవ్వడంతో.. టీబీ నిక్షయ్ శివిర్ వంద రోజుల కార్యక్రమం ఆది లాబాద్ జిల్లాతో పాటు భద్రాచలం, మెదక్, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, కరీంనగర్, పెద్దపల్లి, సూర్యపేట్లలో నిర్వహించారు. జిల్లాలో వంద రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు, స్క్రీనింగ్, వైద్య పరీక్షలు నిర్వహించారు. 4లక్షల 9వేల మందికి స్క్రీనింగ్ చేశారు. 10వేల మందికి పరీక్షలు నిర్వహించగా, 522 మందికి టీబీ నిర్ధారణ అయ్యింది. 953 క్యాంపులు నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వంద రోజుల్లో జిల్లా అంతటా కార్యక్రమాలు నిర్వహించలేక పోయారు. ఇకనుంచి ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా చేపట్టనున్నారు. ముఖ్యంగా షుగర్, బీపీ, టీబీ వ్యాధిగ్రస్తుల ఇంట్లో వారికి, 60ఏళ్లు పైబడిన వారికి, మద్యం, దూమపానం సేవించే వారు, బరువు తక్కువగా ఉన్నవారికి, అనుమానితులకు పరీక్షలు చేయనున్నారు. గ్రామాల్లోనే ఎక్స్‌రేలు.. గ్రామ గ్రామాన నిర్వహించే పరీక్షల్లో అక్కడే ఎక్స్‌రేలు తీయనున్నారు. హ్యాండ్ హెల్డ్ ఎక్స్‌రే మిషన్ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే తెమడ సేకరించి ట్రూనాట్ యంత్రం ద్వారా పరీక్షలు చేస్తారు. ఆదిలాబాద్, నార్నూర్, ఉట్నూర్, జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ఈ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 1,038 మంది టీబీ మందులను వాడుతున్నారు. ఈనెల 19న టీబీ ముక్త్ భారత్ అభియాన్‌కు శ్రీకారం ప్రణాళిక సిద్ధం చేస్తున్న వైద్యశాఖ వంద రోజుల కార్యక్రమంలో 522 మందికి వ్యాధి నిర్ధారణ టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు కసరత్తుటీబీ నిర్మూలనే లక్ష్యం..టీబీ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా ముందు కు సాగుతున్నాం. వంద రోజుల కార్యక్రమంలో భాగంగా పరీక్షలు చేయగా, 522 మందికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం దేశంలో 2025 నాటికి ఈ వ్యాధిని నిర్మూలించేందుకు టీబీ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని చేపడుతోంది. ప్రతి ఒక్కరూ వైద్యపరీక్షలు చేసుకోవాలి. మందుల ద్వా రా వ్యాధి నయం అవుతుంది. అపోహలు వీడాలి. – నరేందర్ రాథోడ్, డీఎంహెచ్వోవ్యాధిగ్రస్తులకు ఉచిత చికిత్సటీబీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా పరీక్షలు చేయడంతో పాటు మందులు పంపిణీ చేస్తున్నాం. రిమ్స్, బోథ్, నార్నూర్, ఉట్నూర్ ఆస్పత్రుల్లో ట్రూనాట్ ద్వారా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. మందులు వాడితే ఆరు నెలల్లోనే వ్యాధి నయం అవుతుంది. వ్యాధిగ్రస్తులకు పోషకాహారం కోసం నెలకు రూ.వెయ్యి చొప్పున అందిస్తున్నాం. – డాక్టర్ సుమలత, జిల్లా టీబీ నిర్మూలన అధికారి -
నీటి సమస్య తలెత్తకుండా చూడాలి
● కలెక్టర్ రాజర్షి షా ● అధికారులతో సమీక్షకైలాస్నగర్: గ్రామాల్లో తాగునీటి సరఫరాలో సమ స్య తలెత్తకుండా చూడాలని, అవసరమైన చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, గ్రౌండ్‌వాటర్ శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. నీటి సరఫరా కోసం చేపట్టిన పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాకు 24 పనులు మంజూరు కాగా అందులో ఐదు పనులు పూర్తయ్యాయని మరో 11 పురోగతిలో ఉన్నాయని, 8 ప్రారంభం కాలేదని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవి ముగిసేవరకు ప్రజలకు తాగునీటి సరఫరా లో ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలన్నారు. అవసరం ఉన్నచోట స్థానిక నీటి వనరులను, ట్యాంకర్లను వినియోగించుకోవాలని సూచించారు. మిష న్ భగీరథ, పంచాయతీరాజ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నీరు వృథా కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇంట్రా, గ్రిడ్, పంచాయ తీ, ఆర్డబ్యూఎస్ అధికారులు తమ శాఖల ప్రగతిని కలెక్టర్‌కు వివరించారు. ఇందులో డీఆర్డీవో రాథోడ్ రవీందర్, పీఆర్ ఈఈ రాథోడ్ శివరాం, సీపీవో వెంకట రమణ, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ చంద్రమోహన్, గ్రౌండ్‌వాటర్ ఏడీ శ్రీవల్లి, డీఈలు, ఏఈ లు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యలు లేని మండలంగా తీర్చిదిద్దాలి సాత్నాల: పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న భోరజ్ను రెవెన్యూ సమస్యలు లేని మండలంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సద స్సుకు హాజరై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధి కారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దరఖాస్తుల వెరిఫికేషన్ టీం ఇక అందుబాటులో ఉంటుందన్నారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వినోద్ కుమార్, తహసీల్దార్ రాజేశ్వరి, నలందప్రియ,రైతులు, తదితరులు పాల్గొన్నారు.డెంగీ నిర్మూలనకు చర్యలుఆదిలాబాద్టౌన్: జిల్లాలో డెంగీ నియంత్రణ కు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జాతీయ డెంగీ దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలోని కేఆర్కే కాలనీ బస్తీ దవాఖానాలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. కరపత్రాలు విడుదల చేశారు. టీబీ రోగులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. డెంగీ నివారణ, అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డెంగీ నివారణ కు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ఇందులో డీఎంహెచ్‌వో నరేందర్‌రాథోడ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, టీబీ నిర్మూలన అధికారి సుమలత, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
● క్వింటాలుకు రూ.800 నుంచి రూ.1700 డౌన్ ● కొనుగోలుకు ఆసక్తి చూపని జనం ● రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ ప్రభావం ● గిరాకీ లేక వెలవెలబోతున్న దుకాణాలు
ఈ స్థాయిలో ధరలు తగ్గడం తొలిసారినేను 30 ఏళ్ల నుంచి బియ్యం అమ్ముతు న్నా. ఏటా వరి ధా న్యం చేతికచ్చినప్పటి నుంచి క్వింటాల్ ధర రూ.5వేలతో మొదలై బియ్యం పాతబడుతున్న కొద్ది వాటి ధర పెరిగేదే తప్పా తగ్గదే కాదు. పోయిన సంవత్సరంతో పోల్చితే ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.1000 నుంచి రూ.1700 దాకా తగ్గినయ్. ఇన్నేళ్ల నా వ్యాపార జీవితంలో ఇంత ధర తగ్గడం తొలిసారి చూస్తున్న. సన్నబియ్యం విక్రయాలు 70 శాతం పడిపోయాయి. వ్యాపారం ఆశించినంత లేదు. – కిరణ్ కుమార్, బియ్యం వ్యాపారి, ఆదిలాబాద్ పంట దిగుబడి పెరగడంతోనే.. రాష్ట్రంలో సన్నరకం వడ్ల సాగు గణనీ యంగా పెరిగింది. దిగుబడి కూడా అధికమైంది. దీనికితోడు ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తోంది. గతంలో చాలా మంది రేషన్ షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యం అమ్ముకొని సన్న బియ్యం కొనుక్కునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. దీంతోనే బియ్యం ధరలు మార్కెట్లో గణనీయంగా పడిపోయాయి. షాపుల కిరాయిలు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే కొనసాగితే దుకాణాలు మూసేయాల్సిందే. – సునీల్‌కుమార్, బియ్యం వ్యాపారి, ఆదిలాబాద్ కై లాస్‌నగర్: బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు భారీగా తగ్గాయి. గతేడాదితో పోల్చితే క్వింటాల్‌కు రూ.800 నుంచి రూ.1,600 వరకు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ ద్వారా పే దలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. లబ్ధిదారులు వీటి ని సద్వినియోగం చేసుకుంటుండగా.. మార్కెట్లో ధరలు దిగొస్తున్నాయి. గిరాకీ లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. మరోవైపు ఈ స్థాయిలో ధరలు పడిపోవడం ఇదే తొలిసారి అని వ్యాపారులు చెబు తున్నారు. ఇదీ పరిస్థితి.. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా పేదలకు ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించింది. తెల్లరేషన్ కార్డు కలిగిన కుటుంబాల్లోని ఒక్కో వ్యక్తి కి ఆరు కిలోల చొప్పున ఉచితంగా అందజేస్తోంది. ఇవి నాణ్యతతో ఉండటంతో లబ్ధిదారులు వాటిని తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకటో తారీకు వచ్చిందంటే చాలు షాపుల వద్ద బారులు తీరి మరీ తెచ్చుకుంటున్నారు. నెల మొదటి వారంలోనే 80 శాతం పంపిణీ పూర్తవుతుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చినప్పటి నుంచి సన్నరకాల వడ్లసాగును ప్రోత్సహిస్తోంది. రైతులకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ సైతం చెల్లిస్తోంది. తద్వారా సన్నాల దిగుబడి పెరిగింది. దీంతో ఇటు ప్రభుత్వం, అటు మిల్లర్లు పోటీపడి మరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తు న్న పరిస్థితి. ఈ క్రమంలో బియ్యం సరఫరా ఒక్కసారిగా పెరిగింది. అయితే రేషన్ పంపిణీ కారణంగాపేద,మధ్యతరగతి ప్రజలు మార్కెట్లో బియ్యం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. చేసేది లేక వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారు. గతేడాదితో పోల్చితే క్వింటాల్‌కు పాతవి రూ.800 నుంచి రూ.1600 వరకు, కొత్తవి రూ.1,250 నుంచి రూ.1,700 మేర ధర తగ్గడం గమనార్హం. తగ్గిన కొనుగోళ్లు.. గత ప్రభుత్వ హయాంలో తెల్లరేషన్ కార్డుదారులకు దొడు బియ్యం పంపిణీ చేసేవారు. దీంతో లబ్ధిదారులు వాటిని తినలేక రేషన్ డీలర్లకు తక్కువకు అమ్ముకుని మార్కెట్లో సన్నబియ్యం కొనుగోలు చేసేవారు. గతేడాది ప్రీమియం రకం (పాతవి) క్వింటాల్‌కు రూ.5,900 నుంచి నుంచి రూ. 6900 వరకు పలకగా.. ప్రస్తుతం ఇవి రూ.4,300 నుంచి రూ.6,100 వరకు లభిస్తున్నాయి. అలాగే కొత్తవి రకాన్ని బట్టి గతంలో రూ.5వేల నుంచి రూ.6,500 వరకు ధర పలకగా.. ప్రస్తుతం రూ.3,700 నుంచి రూ.5,250 వరకు విక్రయిస్తున్నారు. ధరలు తగ్గినా కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో ఉండకపోవడంతో జిల్లాలోని బియ్యం విక్రయ దుకాణాలు వెలవెలబోయి దర్శనమిస్తున్నాయి. జిల్లాలో బియ్యం ధరల వివరాలు .. (ప్రస్తుతం, గతేడాది ఇదే సీజన్లో)బియ్యం రకం పాతవి కొత్తవి గతేడాది ప్రస్తుతం గతేడాది ప్రస్తుతం బీపీటీ రూ.5,900 రూ.4,300 రూ.5,000 రూ.3,700 హెచ్ఎంటీ రూ.6,100 రూ.4,700 రూ.5,800 రూ.4,100 జైశ్రీరామ్ రూ.6,900 రూ.6,100 రూ.6,500 రూ.5,250 -
మార్పునకే రైతుల ఆసక్తి
అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పరిగణనలోకి తీసుకున్న రైతులు వానాకాలంలో స్వల్ప కాలిక పత్తి విత్తనాల సాగువైపు దృష్టి సారిస్తున్నారు. యాసంగిలో అదనపు పంట సాగు చేయాలనే దృక్పథం రైతుల్లో కనిపిస్తోంది. గతంలో దీర్ఘకాలిక రకాన్ని వేసి యాసంగి లోనూ దానికే నీటి తడులు అందించడం ద్వారా కొద్దిపాటి దిగుబడి తీసేవారు. వా నాకాలంలో స్వల్పకాలిక పత్తి రకం చేసి యా సంగిలో రెండో పంట తీయడమే లాభసాటి కావడంతో రైతులు కోరుకుంటున్నారు. – వివేక్, ఆదిలాబాద్ అర్బన్ ఏవో -
పెండింగ్ పనులు పూర్తి చేయాలి
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి జోగు రామన్న కలెక్టర్ రాజర్షి షాను కోరారు. గురువారం కలెక్టర్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన కళాశాలలు, ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. వ్యవసాయ కళాశాలకు స్థలం కేటాయించడంతోపాటు ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బేల, ఇచ్చోడ మండలాల పరిధిలో మార్క్‌ఫెడ్ ద్వారా శనగలు విక్రయించిన రైతులకు డబ్బులు జమ చేయాలని కోరారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో రైతులకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జైనథ్ మండలంలో 132/33 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపారు. వెంటనే సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. సమస్యల పరి ష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చి నట్లు జోగు రామన్న తెలిపారు. ఆయన వెంట మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, బీఆర్ఎస్ నాయకుడు కుమ్ర రాజు తదితరులున్నారు. -
‘లంబాడీలపై సవతి తల్లి ప్రేమ’
నార్నూర్: ఏజెన్సీ ప్రాంతంలో లంబాడీలపై రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు భరత్ చౌహాన్ ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలోని విజయ్‌నగర్ కాలనీ సేవాలాల్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లంబాడీలకు కులధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు అధికారులు ఇష్టారీతిన నిబంధనలు విధించడం సరికాదని పేర్కొన్నారు. భవిష్యత్‌లో లంబాడీలపై వివక్ష చూపిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. పాక్స్ చైర్మన్ అడే సురేశ్, సేవాలాల్ మహరాజ్ ఉత్సవ సమితి ఉట్నూర్ అధ్యక్షుడు జాదవ్ మధుకర్, నాయకులు అడే డిగంబర్, కై లాస్‌నాయక్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
ఆదిలాబాద్‌టౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నా లుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 44 చట్టా లను యథావిధిగా కొనసాగించాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మడావి గణేశ్ డిమాండ్ చే శారు. జిల్లా కేంద్రంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఎర్రజి హరీశ్, నాయకులు అంకిత్, విక్రమ్ ఉన్నారు. ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో గు రువారం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్య తిరేకంగా కార్మికులంతా పోరాడాలని పిలుపునిచ్చా రు. నాయకులు గౌరాల సుభాష్, మారుతి, నర్సింగ్, దేవిదాస్, రాజు, విక్రమ్ తదితరులున్నారు. కార్పొరేట్లకు అనుగుణంగా 29 కార్మిక చట్టాలు, నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడం సమంజసం కాదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంకా రాఘవులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల ఉద్యోగ భద్రతను కేంద్రం దూరం చేస్తోందని ఆరోపించారు. కార్మికులంతా ఐకమత్యంతో పోరాడి సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బండి దత్తా త్రే, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్, నాయకులు రేసు సురేందర్, పండుగ పోచన్న, కే రమేశ్, ఆశన్న, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నేళ్ల స్వామి, గంగారాం తదితరులు పాల్గొన్నారు. -
ఏఆర్ కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా ప్రమోషన్
ఆదిలాబాద్‌టౌన్: ఏడుగురు ఏఆర్ కానిస్టేబు ళ్లకు హెడ్‌కానిస్టేబుల్‌గా ప్రమోషన్ లభించింది. హెడ్‌కానిస్టేబుల్‌గా ప్రమోషన్ పొందిన ఎన్.కిషన్‌రావు, ఎం.అశోక్, జే దుదిరామ్, ఆర్.గోవింద్, ఎల్.దినేశ్, ఎన్.అరవింద్, ఆర్.రామారావు గురువారం స్థానిక పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వీరికి ప్రమోషన్ చిహ్నం అలంకరించి అభినందనలు తెలిపారు. వీరిని జోన్ పరిధిలోని నిర్మల్, జగిత్యాల జిల్లాలకు బదిలీ చేశారు. అడిషనల్ ఎస్పీ సురేందర్‌రావు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులున్నారు. అటవీ అధికారులతో రైతుల వాగ్వాదంనేరడిగొండ: మండలంలోని పీచర, రాంపూర్ గ్రామాల రైతులకు సంబంధించిన అటవీ భూ ముల్లో రెండురోజులుగా అటవీ అధికారులు వి త్తనాలు చల్లడంతో గురువారం ఇరువర్గాల మ ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గ్రామంలో అ టవీ హక్కుపత్రాలున్న ఆదివాసీ రైతులకు చెందిన 15 ఎకరాల్లో అటవీ అధికారులు విత్తనా లు చల్లారని రైతులు ఆరోపించారు. దీంతో గు రువారం గ్రామస్తులు, అధికారులకు మధ్య వా గ్వాదం చోటుచేసుకుంది. రైతులు ఎమ్మెల్యే అ నిల్ జాదవ్ దృష్టికి తీసుకెళ్లగా.. డీఎఫ్‌వోతో మాట్లాడుతానని చెప్పినట్లు రైతులు తెలిపారు. -
గడువు పెంచినా గగనమే!
● ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపుపై అనాసక్తి ● ఇప్పటికే మూడుసార్లు గడువు పెంపు ● రాయితీ ప్రకటించినా స్పందన కరువు కై లాస్‌నగర్: అక్రమ లేఅవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్)కు రాష్ట్ర ప్రభుత్వం మ రో అవకాశం కల్పించింది. ఎల్ఆర్ఎస్–2020 స్కీం కింద 25శాతం రాయితీ ప్రకటించింది. ఫీ జు చెల్లింపు గడువు ఇప్పటికే మూడుసార్లు పొడిగించింది. అయినా ఆశించిన స్థాయిలో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదు. దీంతో క్రమబద్దీకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఫీజు చెల్లింపునకు మరో 15రోజుల గడువు ఉండగా దరఖా స్తుదారుల్లో పెద్దగా స్పందన కనిపించడంలేదు. 25శాతం రాయితీతో ఓటీఎస్ ప్లాట్ల క్రమబద్ధీకరణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రకటించింది. రూ.వెయ్యి చెల్లించి మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నవారి ప్లాట్లు క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. వేలల్లో దరఖాస్తులు రావడం, వాటి పరిశీలనకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ వి భాగంలో తగినంత సిబ్బంది లేక ప్రక్రియ మందకొడిగా సాగింది. కాంగ్రెస్ అధికారంలోకి వ చ్చాక ఎల్ఆర్ఎస్ నిబంధనలు సడలించింది. గ తంలో దరఖాస్తు చేసుకున్న వారితోపాటు అక్ర మ లేఅవుట్లలో 10శాతం ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయితే విక్రయించకుండా ఉన్న ప్లాట్లకూ అవకాశం కల్పించింది. ఫీజులో 25శాతం రాయితీ కల్పిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో వన్‌టైం సెటిల్మెంట్ అవకాశం కూడా కల్పించింది. పదేపదే గడువు పెంచినా.. ఎల్ఆర్ఎస్కు 25శాతం ఫీజు రాయితీ ప్రకటించి న ప్రభుత్వం తొలుత మార్చి 31వ తేదీ వరకు గడువు విధించగా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో మరోసారి ఏప్రిల్ 30వరకు గడు వు పొడిగించింది. అయినా నామమాత్రంగానే స్పందన వచ్చింది. దీంతో ఈ నెల 3వ తేదీ వరకు మళ్లీ గడువు పెంచినా ఆశించిన స్థాయిలో చెల్లింపులు లేవు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నెల 31వ తేదీ వరకు చెల్లింపు గడువు పెంచుతూ ఈనెల 12న ఉత్తర్వులు జారీ చేసింది. కారణాలనేకం.. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపుల్లోనూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. పలు ప్లాట్లను నిషేధిత భూముల జాబితాలో చూపడం, వాటిని సరి దిద్దాల్సిన అధికారుల మధ్య సమన్వయం కొరవడటం, ఫీజు చెల్లించినా సకాలంలో ప్రొసీడింగ్‌లు అందించకపోవడం, ఎల్ఆర్ఎస్పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకపోవడం లాంటి కారణాలతోనే దరఖాస్తుదారులు ఫీజు చెల్లింపునకు ముందుకు రావడం లేదు. ఫలితంగా ప్రభుత్వ ఖ జానాకు అనుకున్న స్థాయిలో ఆదాయం రాలేదు. ఇప్పటివరకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల ఫీజు చెల్లింపు ద్వారా ఆదిలాబాద్ మున్సిపాలిటీకి రూ.7.60 కోట్ల ఆదాయమే సమకూరింది. పరిశీలనలోనూ జాప్యం రెవెన్యూ, నీటి పారుదల, మున్సిపల్ శాఖల అధి కారులు, సిబ్బంది వివిధ దశల్లో ప్లాట్లను పరిశీ లించి నిబంధనల మేరకు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. చెరువు శిఖం, బఫర్ జోన్లను నీటి పారుదల శాఖాధికారులు గుర్తించాల్సి ఉండగా ప్రభు త్వ, అసైన్డ్ ఇతర వివాదాస్పద భూములను రెవె న్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి మున్సి పల్ అధికారులకు వివరాలు అందించాల్సి ఉంది. వాటిపై ఎలాంటి అభ్యంతరాలు లేవని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు నివేదిక ఇచ్చిన తర్వాత బల్దియా అధికారులు క్రమబద్ధీకరణ ప్రొసీడింగ్స్ ఇస్తున్నారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తమ పనుల్లో నిమగ్నమవడం, ఎల్ఆర్ఎస్ ప్లాట్ల పరిశీలనలో జాప్యం చేస్తుండటం కూడా క్రమబద్ధీకరణ ప్రక్రియపై ప్రభావం చూపుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మున్సిపల్ పరిధిలోని వార్డులు : 49 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు : 22,489 ఫీజు చెల్లించినవారు: 4,369 జారీ చేసిన ప్రోసిడింగ్లు: 2,015 ఫీజు రాయితీని సద్వినియోగం చేసుకోవాలి 25శాతం ఫీజు రాయితీతో ప్లాట్లు క్రమబద్ధీ కరించుకునే గడువు ప్రభుత్వం ఈ నెల 31 వరకు పొడిగించింది. ప్లాట్లు క్రమబద్ధీకరించుకుంటే భవన నిర్మాణాలకు అనుమతులు పొందవచ్చు. ప్రక్రియపై దరఖాస్తుదారుల కు ఎలాంటి సందేహాలున్నా కార్యాలయంలో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలి. – సుమలత, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, ఆదిలాబాద్ -
సబ్‌స్టేషన్ కోసం స్థల పరిశీలన
ఇంద్రవెల్లి: మండలంలోని దనోరా(బీ) గ్రా మంలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి గురువారం విద్యుత్‌శాఖ డీఈ ప్రభాకర్ స్థలాన్ని పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రూ.10కోట్లతో 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు చేసిందని తెలిపా రు. త్వరలో పనులు పూర్తి చేసి వినియోగదా రులకు మెరుగైన విద్యుత్ అందిస్తామని పే ర్కొన్నారు. కొత్తగా సబ్‌స్టేషన్ ఏర్పాటు చేస్తే హీరాపూర్లోని సబ్‌స్టేషన్‌పై భారం తగ్గుతుందని తెలిపారు. గ్రామాలు, వ్యవసాయ బావుల వరకు కొత్త విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆయన వెంట ఇంద్రవెల్లి ఏఈ జాదవ్ రోహిదాస్, మాజీ సర్పంచ్ యేర్మ జాకేశ్వర్, అధికారులు పాల్గొన్నారు. -
అర్హుల జాబితా సిద్ధం చేయాలి
కై లాస్‌నగర్: రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను నాలుగు రోజుల్లో పరిశీలించి అర్హులు, అనర్హుల జాబితాలు సిద్ధం చేయాలని కలెక్టర్ రాజర్షి షా సూ చించారు. ఇందుకోసం రెండు షిఫ్ట్‌లుగా ఆపరేటర్ల ను నియమించుకుని ఈ నెల 19లోపు ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, బ్యాంక్ అధి కారులు, మండల ప్రత్యేకాధికారులతో సమీక్షా స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశీలించిన దరఖాస్తులపై రోజు వారీ నివేదిక అందించాలని సూచించారు. మండల స్థాయిలో పరిశీలించిన దరఖాస్తుల వివరాలను సంబంధిత బ్యాంకులకు పంపించాలని తెలిపారు. జి ల్లావ్యాప్తంగా 48,296 దరఖాస్తులు రాగా 43,417 (డెస్క్ వెరిఫికేషన్) దరఖాస్తులను మండల స్థాయిలో పరిశీలించినట్లు చెప్పారు. 32,283 దరఖాస్తులను బ్యాంక్‌లకు పంపించినట్లు తెలిపారు. బ్యాంక్ మేనేజర్లు పరిశీలన ప్రక్రియ వేగవంతం చేసి సోమవారంలోపు జాబితా అందించాలని ఆదేశించారు. బ్యాంకుల ద్వారా జాబితా పూర్తయిన అనంతరం ఎంపీడీవోలు తుది జాబితా తయారు చేసి పంపించాలని సూచించారు. సమావేశంలో ఐటీడీఏ పీవో కుష్బు గుప్తా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్‌రావు, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఉత్పల్కుమార్, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజర్షి షా రాజీవ్ యువ వికాసంపై సమీక్ష -
పథకాలను వినియోగించుకోవాలి
ఆదిలాబాద్‌టౌన్: సంక్షేమ పథకాలను సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికా రి మిల్కా సూచించారు. జిల్లా సంక్షేమాధికా రి కార్యాలయంలో గురువారం ట్రాన్స్జెండర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్లంతా ఐడీ కార్డు తీసుకోవాలని, ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జనవరిలో రిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేయనున్న మైత్రి క్లినిక్ ద్వారా మంగళ, గురువారాల్లో సేవలందించనున్నట్లు తె లిపారు. ధ్రువపత్రాలు తీసుకోవడంలో ఇ బ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో ట్రాన్స్జెండర్లు కామేశ్వరి, అలిజా, హర్షిత, కావ్య, మైత్రి క్లిని క్ కౌన్సిలర్ లావణ్య, యశోద, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు. -
నేటితో ముగియనున్న ఫిట్నెస్ గడువు
ఆదిలాబాద్‌టౌన్: బడి బస్సుల భద్రమెంతా అనే ఆందోళన వ్యక్తమవుతుంది. స్కూల్ పిల్లలను తీసుకెళ్లాల్సిన సంబంధిత వాహనాల కండీషన్ దారుణంగా ఉంది. ఎప్పటికప్పుడు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన పాఠశాల యాజమాన్యాలు ఆ దిశగా దృష్టి సారించడం లేదు. కాలం చెల్లిన వాటిని రోడ్లపై తిప్పుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. గతంలో జిల్లాలో పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. నేటితో బడి బ స్సుల ఫిట్నెస్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ మంగళవారం జిల్లాలోని ఆయా పాఠశాలల స్కూల్ యా జమాన్యాలు, బస్సు డ్రైవర్లు, అటెండర్లతో సమావే శం నిర్వహించారు. బస్సుల నిర్వహణ, తదితర వి షయాలపై సమీక్షించారు. నిబంధనలు అతిక్రమిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభంప్రస్తుతం పాఠశాలలకు సెలవులు ఉండడంతో స్కూల్ బస్సులు మూలనపడ్డాయి. చాలావరకు మరమ్మతులో ఉన్నాయి. చిరిగిన సీట్లు, పగిలిన అద్దాలు, అరిగిన టైర్లు, ఫిట్నెస్ లేకపోవడం, కాలం చెల్లినవే దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బడి బస్సులను ముందస్తుగా సిద్ధం చేసుకోవాల్సిన ప్రైవేట్ యాజమాన్యాలు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది. ఫిట్నెస్ లేకుండా బస్సులు తిప్పితే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. రవాణాశాఖ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.నిబంధనలు బేఖాతరు..పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేలోగా ఆయా బస్సులను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాల్సి ఉంటుంది. సీట్లు, అద్దాలు, టైర్లు, తదితర అన్నీ సక్రమంగా ఉన్నాయా.. లేదా.? అనేది చూసుకోవాలని రవా ణాశాఖ అధికారులు సూచిస్తున్నారు. స్కూల్ బస్సులకు సంబంధించి 32 అంశాలతో కూడిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. డ్రైవర్ వయసు 60 ఏళ్లు మించొద్దు. ఫిట్నెస్, ఇన్సూరెన్స్ తప్పనిసరి. అలాగే వాహనంలో విద్యార్థుల వివరాలు పట్టిక నమోదు చేసి ఉంచాలి. బస్సును 15ఏళ్లు మించి నడపరాదు వంటి తదితర నిబంధనలున్నాయి. అయితే జిల్లాలో మాత్రం చాలా పాఠశాలలు వీటిని పట్టించుకోవడం లేదు. కండీషన్ లేని బస్సుల్లో విద్యార్థులను తరలిస్తున్నారు. గతంలో ప్రమాదాలు సైతం చోటు చేసుకున్న ఘటనలున్నాయి. ప్రమాదాలు జరగకముందే అప్రమత్తంగా ఉండాల్సిన ఆ శాఖ అధికారులు నామమాత్రంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాఠశాలల పునఃప్రారంభం తర్వాత వారం పాటు తూతూమంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలున్నాయి.ముగియనున్న ఫిట్నెస్ గడువు జిల్లాలో 167 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. ఇందులో 45వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో సగానికిపైగా స్కూల్ బస్సుల్లోనే ఇంటికి రాకపోకలకు సాగిస్తుంటారు. జిల్లా వ్యాప్తంగా 123 ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు సంబంధించి 140 బస్సులు ఉన్నాయి. వీటికి మే 15 వరకు ఫిట్నెస్ గడువు ముగిసింది. దాదాపు అన్ని బస్సులకు కూడా ఇన్సూరెన్స్ ముగిసింది.ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తాం..ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు బస్సుల ఫిట్నెస్ తప్పనిసరిగా చేయించాలి. పాఠశాలలు పునఃప్రారంభానికి ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డు పైకి వస్తే సీజ్ చేస్తాం. నిబంధనలకు సంబంధించి డ్రైవర్లు, యాజమాన్యాలకు అవగాహన కల్పించాం. భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు చేపడతాం. స్కూల్ బస్సులను ఇతర కార్యక్రమాలకు వినియోగించరాదు.– సీపెల్లి శ్రీనివాస్, జిల్లా రవాణాశాఖ అధికారి -
ఆదివాసీ గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు
బోథ్: జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని ఎస్పీ అఖిల్ మహా జన్ అన్నారు. పోలీసుల ఆధ్వర్యంలో మండలంలో ని పట్నాపూర్‌లో నిర్మల్‌లోని స్వప్న ఆసుపత్రి సహకారంతో బుధవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. యు వత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. లైసెన్స్ ఉంటేనే వాహనాలను నడపాలని, ఖచ్చితంగా హెల్మట్ ధరించాలని పేర్కొన్నా రు. అనంతరం వైద్యులు గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐ వెంకటేశ్వరరావ్, ఎస్సై ప్రవీణ్ కుమార్, బోథ్ సీహెచ్‌సీ సూపరింటెండెంట్ రవీంద్ర ప్రసాద్, ఏజీపీ శంకర్, వైద్యులు శశికాంత్, స్వప్న, మల్లేశ్, సచిన్ బాబు, ధృవన్ కుమార్, రాహుల్, దినేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
‘ఆమె’కు అండగా..
● 8,439 సంఘాలు.. రూ.275 కోట్లు ● జిల్లా బ్యాంకు లింకేజీ రుణలక్ష్యం ఖరారు ● మండలాల వారీగా టార్గెట్లు నిర్దేశం ● మహిళల ఆర్థికాభ్యున్నతికి దోహదం కైలాస్‌నగర్: స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా విరివిగా రుణాలు అందజేస్తోంది. కుటీర పరిశ్రమల ఏర్పాటుతో పాటు వివిధ వ్యాపారాల్లో రాణించేలా బ్యాంకు లింకేజీ ద్వారా ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఎస్‌హెచ్‌జీ సభ్యులు స్వయం సమృద్ధి సాధించేలా ప్రభుత్వం ఏటా రుణ లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది. ఇందులో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యాన్ని ఖరారు చేసింది. జిల్లాలోని 8,439 సంఘాలకు గాను రూ.275.50 కోట్లను బ్యాంకు లింకేజీ ద్వారా అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు మండలాల వారీగా రుణ లక్ష్యాలను ఖరారు చేసి జిల్లాకు పంపించింది. దాన్ని సాధించే దిశగా జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అతివల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా.. అతివల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా బ్యాంకు లింకేజీ ద్వారా ఒక్కో సంఘానికి రూ. 2లక్షల నుంచి రూ.20లక్షల వరకు రుణాలు అందించనున్నారు. వీటితో కిరాణ, వస్త్ర దుకాణాలు, టైలరింగ్ యూనిట్లు, నాటు కోళ్లు, చేపల పెంపకం, కూరగాయల సాగు, పండ్ల విక్రయాలు, ఫుడ్ క్యాటరింగ్, ఆహార ఉత్పత్తుల తయారీ, టిఫిన్ సెంటర్ల నిర్వహణ వంటి పలు రకాల వ్యాపారాలతో ఉపాధి పొందనున్నారు. పురుషులతో సమానంగా మహిళలు రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో వారు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. గతేడాది లక్ష్యానికి మించి రుణాలు.. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను వందశాతానికి మించి సంఘాలకు రుణాలు అందజేశారు. జిల్లాలోని 8,993 సంఘాలకు గాను రూ.274.80 కోట్లను బ్యాంకు లింకేజీ కింద అందించేలా ప్రణాళిక ఖరారు చేశారు. అందులో 4,072 సంఘాలకు గాను రూ.285.50 కోట్ల రుణాలు అందజేశారు. లక్ష్యానికి మించి మరో రూ.10.70లక్షలు అందజేశారు. ఈ క్రమంలో గతేడాదితో పోల్చితే కొంత పెంచి ఈ సారి రుణ లక్ష్యం ఖరారు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం మరో రూ.70లక్షలు అదనంగా సంఘాలకు అందజేయాలని నిర్ణయించారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు, వాటికి కేటాయించిన నిధుల వివరాలు మండలం స్వయం కేటాయించిన సహాయక నిధులు సంఘాలు (రూ.లక్షల్లో ) ఆదిలాబాద్‌రూరల్ 464 1,818.58 బజార్హత్నూర్ 477 1,644.29 బేల 518 1,676.62 భీంపూర్ 439 909.77 బోథ్ 785 2,674.45 గాదిగూడ 263 578.06 గుడిహత్నూర్ 501 1,608.23 ఇచ్చోడ 599 2,094.63 ఇంద్రవెల్లి 517 1,300.29 జైనథ్ 704 2702.69 మావల 88 289.23 నార్నూర్ 447 1276.44 నేరడిగొండ 569 1834.30 సిరికొండ 269 710.52 తలమడుగు 593 2,196.16 తాంసి 330 1,073.90 ఉట్నూర్ 876 3,162.49 మహిళలు ఆర్థికంగా ఎదగాలి స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు మంజూరు చేస్తోంది. రుణాలు పొందిన మహిళలు వ్యాపారాలు ప్రారంభించి స్వయం సమృద్ధి సాధించేలా ముందుకు సాగాలి. రుణ వడ్డీలు ఎప్పటికప్పుడు చెల్లించినట్లైతే కొత్త రుణాలు పొందేందుకు అవకాశముంటుంది. గతేడాది లక్ష్యానికి మించిఅందజేశాం. ఈ సారి కూడా కేటాయించిన లక్ష్యాలను వందశాతం సాధించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతాం. – రాథోడ్ రవీందర్ ,డీఆర్డీవో -
గిరి‘జనులకు’ రైలు కూత!
● మంచిర్యాల–ఉట్నూరు– ఆదిలాబాద్‌కు ముందడుగు ● నిజామాబాద్–నిర్మల్, పటాన్చెరు–ఆదిలాబాద్ దాకా ● కొత్త లైన్లకు ఇంజినీరింగ్, ట్రాఫిక్, ఫిజిబిలిటీ సర్వేలకు ప్రతిపాదనలు ● పింక్‌బుక్ 2025–26లో నిధులు అంచనా వేసిన రైల్వేశాఖ ● పట్టాలెక్కితే ఏజెన్సీ ప్రాంతవాసులకు రైలు యోగం సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గిరిజన ప్రాంతాల్లో కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు ముందడుగు పడింది. తొలిసారిగా ఉమ్మడి జిల్లా గిరిజన, అడవుల వెంట రైలు మార్గాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందుతోంది. ఈమేరకు 2025–26 ఆర్థిక సంవత్సర రైల్వే బడ్జెట్ కేటాయింపులు తెలిపే కీలక పింక్‌బుక్‌లో వెల్లడించింది. గత ఫిబ్రవరిలోనే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ తాజాగా రైల్వే శాఖ ఈ బుక్‌లో ఉమ్మడి జిల్లాకు పలు కొత్త మార్గాలు, ట్రాఫిక్ సర్వేల కోసం నిధుల ప్రతిపాదనలు ఉన్నాయి. భవిష్యత్‌లో కాజిపేట–బల్లార్షా 234కి.మీ. నాలు గో లైన్ సర్వేకు రూ.4.68కోట్లు, వన్యప్రాణులకు ప్రాణనష్టం జరగకండా బల్లర్షా, ఆసిఫాబాద్ రోడ్ వరకు రైల్వే పట్టాల ఫెన్సింగ్‌కు నిధులు ప్రతిపాదించారు. మంచిర్యాల టు ఆదిలాబాద్ వయా ఉట్నూరు మంచిర్యాల నుంచి వయా ఉట్నూరు ఆదిలాబా ద్ దాక ప్రతిపాదిత కొత్తమార్గం 186కి.మీ నిడివి. ఇందుకు రూ.వంద కోట్లు అంచనా ప్రతిపాదించారు. ఈ లైను ఏర్పాటు కోసం భూమి, ట్రాఫిక్, ఫిజిబిలిటీ సర్వేలకు ఈ నిధులు వెచ్చించనున్నా రు. కొత్తగా నిజామాబాద్–నిర్మల్–ఆదిలాబాద్ మధ్య మార్గం 125కి.మీ. కోసం ఇంజనీరింగ్, ట్రాఫిక్ సర్వే కోసం రూ.31లక్షలు, మరో కొత్త మార్గమైన పటాన్చెరు(నాగలపల్లి) వయా బోధ న్ ఆర్మూర్ మీదుగా ఆదిలాబాద్ వరకు ఫైనల్ లొకేషన్ సర్వే 317కి.మీ కోసం రూ.7.92కోట్లు, ముత్కేడ్–ఆదిలాబాద్–పింపల్కుటి 183కి.మీ ఫైనల్ లోకేషన్ సర్వే కోసం రూ.3.66కోట్లు, ఆది లాబాద్–గడ్చాందూర్ 70కి.మీ సర్వేకోసం రూ. 1.75కోట్లు, యావత్మాల్–ఆదిలాబాద్– వయా గంటిజి, పందర్కావందన్, చానఖా వరకు 100కి.మీ సర్వే కోసం రూ.25లక్షలు, సికింద్రాబాద్–ముత్కేడ్– ఆదిలాబాద్ 420కి.మీ ఇంజనీరింగ్, ట్రాఫిక్ ప్రాథమిక డబ్లింగ్ సర్వేకు రూ.1.64కోట్లు ప్రతిపాదించారు. ఆర్వోబీలు, స్టేషన్ల ఆధునికీకరణ ఆర్వోబీలు, వంతెనలకు ఆర్ఆర్ఎస్కే(రాష్ట్రీయ రేల్ సంరక్ష కోశ్), ఆర్ఎస్ నిధులు(రైల్వే సేఫ్టీ ఫండ్) కేటాయిస్తుంది. ఆదిలాబాద్ యార్డు–రో డ్ ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) లెవల్ క్రాసింగ్‌కు రూ.5. 69కోట్లు, ముత్కేడ్ ఆదిలాబాద్ పింపల్‌కుట్టి 68కి.మీ. రూ.4.71కోట్లు, ముత్కేడ్–ఆదిలాబాద్ 8.16కి.మీ. రూ.1.04కోట్లు, ఆర్ఆర్ఎస్కే రూ. 1.93కోట్లు, ఆర్ఎస్ఎఫ్ రూ.9.73కోట్లు, ముత్కేడ్–ఆదిలాబాద్ ఘాట్సెక్షన్లో ఆర్ఆర్ఎస్కే నుంచి రూ.6.40కోట్లు, ఆదిలాబాద్ పిట్‌లైన్ నిర్మా ణం కోసం మూలధన నిధులు రూ.22. 28కో ట్లు, మంచిర్యాల–పెద్దంపేట మధ్య మూడో లైనుకు 4.37కి.మీ, మంచిర్యాల జిల్లా తాండూ రు మండలం రేచ్నీ, రేపల్లెవాడ మధ్య రోడ్ కొత్తగా అండర్ బ్రిడ్జికి రూ.7.64కోట్లు, ఆది లాబాద్ రైల్వేస్టేషన్లో భవనాలు, మరుగుదొడ్లు, విస్తరణ అభివృద్ధి కోసం రూ.4.44కోట్లు, ‘అమృత్’ స్కీం కింద ఆదిలాబాద్ స్టేషన్లో ఎఫ్వోబీ(ఫుట్ ఓవర్ బ్రిడ్జి) నిర్మాణం, దివ్యాంగుల ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు, ఇతర ఏర్పాట్లకు ఎంపిక చేశారు. స్టేషన్లో లెస్ ట్రాక్, క్విక్ వాటరింగ్ కోసం రూ.14.95కోట్లు, ప్లాట్ ఫాంలపైన కవర్ నిర్మించేందుకు రూ.4.61కోట్లు ప్రతి పాదించారు. మంచిర్యాలకు అమృత్ స్కీం కింద నిధులు ప్రతిపాదించారు. కార్యరూపం దాల్చితేనే.. నిధుల ప్రతిపాదనలతో సరిపెట్టకుండా ఆ మేర కు మంజూరు చేసి కార్యరూపం దాల్చితేనే కొత్త మార్గాల్లో రైలు ప్రయాణ యోగం కలుగనుంది. గత కొన్నేళ్లుగా రైల్వేలో ఫైనల్ లొకేషన్ సర్వే జరి గిన పనులు సైతం ఇప్పటికీ పట్టాలెక్కడం లేదు. తాజా ప్రతిపాదిత రైలు మార్గాలు అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలతోపాటు అనేక గిరి జన ప్రాంతాల నుంచి వెళ్లనుంది. దీంతో భూ సేకరణ, అటవీ అనుమతులు, పరిహరం రూ. వందల కోట్లలోనే ఉండనుంది. ఈ నేపథ్యంలో కేవలం పింక్‌బుక్‌లో కాగితాలపైనే సరిపెడితే మారుమూల ప్రాంతాలకు రైలు కూత అందని ద్రాక్షగానే మారనుంది. -
భూభారతితో సమస్యలు పరిష్కారం●
● కలెక్టర్ రాజర్షిషా సాత్నాల: భూభారతితో రైతుల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. భోరజ్ మండలంలోని పెండల్వాడ, హషింపూర్ గ్రామాల్లో బుధవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించారు. ఎలాంటి భూసమస్యలు ఉన్నా రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార మార్గాలు చూపాలని అధికారులను ఆదేశించా రు. అలాగే మండలంలోని గూడ గ్రామంలో ని ర్వహించిన సదస్సుకు అదనపు కలెక్టర్ శ్యామలాదేవి హాజరయ్యారు. వచ్చిన 136 దరఖాస్తులను పరిశీలించారు. ఇందులో తహసీల్దార్ రాజేశ్వరి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
● ఔట్సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపు నిబంధనల్లో మార్పులు ● కొత్త ఏజెన్సీలకు మినహాయింపు ● టెండర్లు తెరిచిన అధికారులు ● కొనసాగుతున్న పత్రాల పరిశీలన ● త్వరలోనే ఎంప్యానల్మెంట్ ఖరారు
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఎంప్యానల్మెంట్ గుర్తింపు అంశంలో అధికారులు ఎట్టకేలకు సడలింపులు ఇచ్చారు. నిబంధనల్లో మార్పులు చేశారు. అనంతరం టెండర్లు తెరిచి పత్రాలను పరిశీలన ప్రక్రియ చేపట్టారు. త్వరలోనే ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. నిబంధనల్లో మార్పులిలా.. ఔట్సోర్సింగ్ ఏజెన్సీ రెండేళ్లలో రూ.కోటి టర్నోవర్ కలిగి ఉండాలి.. వంద మంది ఉద్యోగుల నిర్వహణ చేసిన అనుభవం ఉండాలి.. ఇది టెండర్ నోటిఫికేషన్లో పొందుపర్చిన నిబంధనలు.. వీటిపై పలు విమర్శలు వ్యక్తమయ్యాయి.. ‘సాక్షి’లో దీనిపై ఈనెల 9, 13 తేదీల్లో ‘అంతా మా ఇష్టం’.. ‘టెండర్ వివాదాస్పదం’ శీర్షికలతో కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. ఇటీవల ప్రజావాణిలో కొంత మంది ఏజెన్సీ నిర్వాహకులు ఈ నిబంధనలపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో పరిశీలన చేయాలని కలెక్టర్ రాజర్షిషా అప్పుడే ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఈ రెండు అంశాల్లో కొత్త ఏజెన్సీలకు మినహాయింపు ఇచ్చారు. 29 దరఖాస్తులు రాక.. జిల్లాలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపునకు సంబంధించి కొత్త ఎంప్యానల్మెంట్ ఏర్పాటు కోసం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనెల 2 నుంచి 13వరకు జిల్లా ఉపాధికల్పన శాఖ కార్యాలయంలో ఏజెన్సీల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 32 దరఖాస్తులు విక్రయించగా, 29 ఏజెన్సీలు దరఖాస్తు చేసుకున్నాయి. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సమక్షంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఈ టెండర్లు తెరిచారు. కమిటీకి కన్వీనర్ కమ్ మెంబర్ అయిన ఉపాధి కల్పనశాఖ ఇన్చార్జి అధికారి మిల్కా, సభ్యులైన కార్మికశాఖ అధికారులు ముత్యం రెడ్డి, రాజలింగు పాల్గొన్నారు. దరఖాస్తు చేసుకున్న ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. ఆ ఏజెన్సీలకు సంబంధించి డీడీ నంబర్, సొసైటీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఈపీఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీ, పాన్‌కార్డు, వారు పొందుపర్చిన కమీషన్ పర్సెంటేజ్ వంటి వివరాలు పరిశీలించారు. ఈ సర్టిఫికెట్లన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా.. లేదా అనే దానిపై సూక్ష్మంగా పరిశీలన చేసిన తర్వాత కొత్త ఎంప్యానల్‌మెంట్‌కు ఎంపికయ్యే ఏజెన్సీల పేర్లను ప్రకటించనున్నారు. దానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.ఔట్సోర్సింగ్ ఏజెన్సీల పత్రాలను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, అధికారులులోకల్.. నాన్‌లోకల్ లొల్లి దరఖాస్తుదారుల్లో లోకల్, నాన్‌లోకల్ లొల్లి మొ దలైంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి ఏజెన్సీ నిర్వాహకులు కొత్త ఎంప్యానల్మెంట్లో గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై స్థానిక ఏజెన్సీల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతుంది. ప్రధానంగా ఇ తర జిల్లాలో తాము దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లినప్పుడు వారు విభేదిస్తూ తమను దూరంగా ఉంచుతున్నారని, అలాంటప్పుడు జిల్లా అధికారులు ఈ విషయంలో పరిశీలన చేసి ఇక్కడ కూడా నాన్‌లోకల్ ఏజెన్సీలను గుర్తించవద్దని డిమాండ్ చేస్తున్నారు. అయితే కొంత మంది అధికారులే నాన్‌లోకల్ ఏజెన్సీలకు వంత పాడుతున్నారనే విమర్శలున్నాయి. ప్రధానంగా ఈ ఏజెన్సీలతో ఆ అధికారులకు సంబంధం ఉందని పలువురు స్థానిక ఏజెన్సీల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.పరిశీలిస్తున్నాం.. దరఖాస్తు చేసుకున్న ఏజెన్సీలలో వారికి అన్ని విధాలా అర్హత ఉందా.. లేదా అనేది పరిశీలన చేస్తాం. నాన్‌లోకల్ ఏజెన్సీలు దరఖాస్తు చేసుకోవద్దని నిబంధన లేదు. టెండర్ నిబంధనలో పొందుపర్చిన అంశాల్లో కొత్త ఏజెన్సీలకు టర్నోవర్, పోస్టుల నిర్వహణలో అనుభవాన్ని మినహాయించాం. పాత ఏజెన్సీలకు మాత్రం ఈ నిబంధనలు యథావిధిగా వర్తిస్తాయి. గతంలో వివిధ ఏజెన్సీలు ఉద్యోగులకు వేతనాలు సరిగ్గా చెల్లించని అంశాన్ని దృష్టిలో ఉంచుకొని సెక్యూరిటీ డిపాజిట్ కింద ఈఎండీ రూ.5లక్షలను ఖరారు చేశాం. – మిల్కా, ఉపాధికల్పన జిల్లా ఇన్చార్జి అధికారి, ఆదిలాబాద్ -
● బిల్లులు పెండింగ్.. పనులు స్టాప్ ● ఒత్తిడికి లోనవుతున్న కాంట్రాక్టర్లు ● ఇటీవల గుండెపోటుతో ఒకరు మృతి ● పలుచోట్ల అభివృద్ధి పనులకు బ్రేక్
ఇతని పేరు గుట్ట ప్రవీణ్. 46 సంవత్సరాలు. ఆదిలా బాద్ పట్టణం పాత హౌసింగ్ బోర్డు కాలనీ. క్లాస్–1 కాంట్రాక్టర్‌గా వ్యవహరించాడు. నాలుగు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ప్రధానంగా ఈయన ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీలకు సంబంధించిన అనేక రోడ్లు, వంతెనలు, ఇతరత్రా పనులు నిర్వహించాడు. ఇతడికి సంబంధించి సుమారు రూ.60 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి క్లియరెన్స్ కోసం తిరుగుతున్న మంజూరు కావడం లేదు. ఈ క్రమంలో ఒత్తిడికి గురై గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ప్రవీణ్ మాత్రమే కాదు.. పలువురు కాంట్రాక్టర్లు ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బిల్లుల కోసం తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.ఇది జిల్లా కేంద్రంలోని మావల నుంచి దస్నాపూర్ వచ్చే ప్రధాన రహదారి డివైడర్‌కు ఒక వైపు భాగం. 2023–24లో ఈ రహదారిని అభివృద్ధి పర్చేందుకు ఆర్అండ్బీ ద్వారా రూ.13కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం వర్క్ మంజూరు చేసింది. డివైడర్‌కు మరోవైపు పనులు పూర్తయ్యాయి. అయితే ప్రభుత్వం నుంచి అరకొరగా బిల్లులు వచ్చాయి. మంజూరులో తాత్సారం కావడంతో కాంట్రాక్టర్ చేసేది లేక ఆ పనులు చేపట్టలేకపోయాడు. ప్రస్తుతం ప్రభుత్వం ఆ బిల్లులను చెల్లించడం లేదు. మరో వైపు ఇలాంటి అనేక రోడ్ల పనులు జిల్లాలో నిలిచిపోయాయి. దీంతో ఈ మార్గంలో వెళ్లే జనం ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి.●సాక్షి,ఆదిలాబాద్: ఈ రెండు అంశాలు జిల్లాలో బ్రేక్ పడిన అభివృద్ధి పనులు, పలుచోట్ల పనులు చేపట్టినా బిల్లులు అందని కాంట్రాక్టర్ల పరిస్థితికి అద్దం పడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ప్రస్తుతం పెండింగ్ బిల్లులు చెల్లించే పరిస్థితి లేదని స్పష్టం చేస్తుండడంతో కాంట్రాక్టర్లు మనోవేదనకు గురవుతున్నారు. బిల్లుల కోసం తరచూ హైదరాబాద్ బా ట పడుతున్నారు. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలోనే కాంట్రాక్టర్ ప్రవీణ్ మృతి చెంది నట్లు తెలుస్తోంది. బడాకాంట్రాక్టర్లతో పాటు చోటా మోటా కాంట్రాక్టర్లు కూడా పెండింగ్‌లో ఉన్న బిల్లులతో సతమతం అవుతున్నట్లు చెబుతున్నారు. లైసెన్స్ వదులుకున్న బడా కాంట్రాక్టర్.. తాజాగా ప్రవీణ్ మృతి తర్వాత కొంత మంది రిటైర్డ్ ఇంజినీరింగ్ అధికారలు ఏకంగా కాంట్రాక్టర్లకు సల హా ఇస్తున్నారు. పెండింగ్ బిల్లుల నేపథ్యంలో ఇప్ప ట్లో ఎలాంటి పనులు చేపట్టవద్దని, అనవసరంగా బయట అప్పు చేసి ఇబ్బందులకుగురికావద్దని పే ర్కొనడం సంచలనం కలిగిస్తుంది. ఇదిలా ఉంటే.. జిల్లాలో కొన్నేళ్ల క్రితం తిరుమల, బాలాజీ కన్స్ట్రక్షన్స్ కంపెనీల మధ్య పెద్ద పెద్ద రోడ్ల పనులు చేపట్టేందుకు పోటీ ఉండేది. మధ్యలో బిల్లుల పెండింగ్ నేపథ్యంలో బాలాజీ కన్స్ట్రక్షన్స్ కంపెనీ పూర్తిగా కా ంట్రాక్ట్ పనులు మానుకొని లైసెన్స్ వదులుకుందనే ప్రచారం ఉంది. ఆ సమయంలో సదరు యజమాని సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఈ రంగం నుంచి తప్పుకున్నారని ప్రస్తుతం ఆదిలాబాద్‌లో చర్చ సాగుతుంది. మిగతా కాంట్రాక్టర్లు పనులు చేపట్టి ఒత్తిడిని మూటగట్టుకున్నారని పేర్కొంటున్నారు. సందెట్లో సడేమియా.. పెండింగ్ బిల్లుల పరిస్థితి ఇలా ఉంటే.. ప్రస్తుతం ఆ బిల్లులను క్లియర్ చేపిస్తామని చెబుతూ పలువురు దళారులు తయారయ్యారనే ప్రచారం సాగుతుంది. ఇలా పెండింగ్ బిల్లులకు సంబంధించి ముందుగానే కమీషన్ తీసుకొని బిల్లు మంజూరు చేయిస్తామని చెబుతూ నెలలు గడిచినా ఆ డబ్బులు రాకపోవడంతో ఇలాంటి బాధితులు మరింత నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని పలువురు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఖమ్మం, వరంగల్, ఇతర జిల్లాలకు సంబంధించి పెండింగ్ బిల్లులు కొంతమేర మంజూరవుతున్నప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ కు సంబంధించిన బిల్లుల క్లియరెన్స్‌లో మాత్రం వివక్ష సాగుతుందనే ప్రచారం లేకపోలేదు. ఇదిలా ఉంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు పలువురు కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున పనులు చేపట్టారు. ఆ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ సమయంలో అనేక పనులకు సంబంధించి అగ్రిమెంట్లు జరిగినప్పటికీ పనులు షురూ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు చేపట్టాలని కాంట్రాక్టర్ల మీదా ఒత్తిడి తీసుకురావడంతో వారు ఆ పనులు చేపట్టారు. అయితే పెండింగ్ బిల్లుల విషయంలో మా త్రం ఆ కాంట్రాక్టర్లకు మొండి చెయే ఎదురైందన్న అపవాదు ఉంది. ఈ పరిస్థితుల్లో బిల్లులు చెల్లించి, అభివృద్ధి పనుల పరంగా ప్రజలకు అసౌకర్యాలను దూరం చేయాలన్న అభిప్రాయం పలు వురి నుంచి వ్యక్తమవుతుంది. కాగా, పెండింగ్ బిల్లులు, నిలిచి పోయిన అభివృద్ధి పనుల విషయంపై ‘సాక్షి’ ఆర్ అండ్‌బీకి చెందిన ఓ అధికారి వివరణ కోరగా, ఆయన స్పందించేందుకు నిరాకరించారు. -
● ఎస్పీ అఖిల్ మహాజన్
‘వీపీవో’ పటిష్టంగా అమలు చేయాలి నేరడిగొండ: విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థ పటిష్టంగా అమలు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. నేరడిగొండ పోలీస్ స్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతీ పోలీసుకు కేటాయించిన గ్రామాన్ని ఎప్పటికప్పుడు సందర్శించాలన్నారు. సమాచార వ్యవస్థ పటిష్టం చేసుకొని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. అలాగే మైనర్ డ్రైవింగ్‌పై దృష్టి సారించాలన్నారు. బహిరంగ మాద్యపానం జరగకుండా డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు సంబంధించి సీఈఐఆర్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేస్తూ వారికి భరోసా కల్పించాలన్నారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఎస్పీ వెంట ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, ఇచ్చోడ సీఐ భీమేష్, నేరడిగొండ ఎస్సై ఎల్.శ్రీకాంత్, సిబ్బంది ఉన్నారు. చిల్డ్రన్ పార్క్ ప్రారంభం చిన్ననాటి నుంచే వ్యాయామం అలవర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేసిన పార్కును మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇందులో ఏఎస్పీ కాజల్‌సింగ్ తదితరులున్నారు. దరఖాస్తుల ఆహ్వానంఆదిలాబాద్టౌన్: హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నికల్ శిక్షణ సంస్థలో 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి పాలి టెక్నిక్ డిప్లొమా కోర్సుల కోసం దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి కె.మిల్కా ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన అ నాథలు, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన బాలికలు మాత్రమే దరఖాస్తుకు అర్హులని పేర్కొన్నారు. కు లం,ఆదాయం(అనాథ బాలికలకు అవసరంలేదు), మరణ ధ్రువీకరణ పత్రం, బోనఫైడ్ పత్రాలు దరఖాస్తుకు జతచేసి జిల్లా కేంద్రంలోని బాలరక్షా భవన్లో ఈనెల 18లోగా అందించాలని సూచించా రు. వివరాల కోసం 9493433400, 9966490203 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. -
కేయూ తీరు.. విమర్శల పాలు
● నేటి నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ● ఒకరోజు ముందు హాల్‌టికెట్లు.. చివరి నిమిషంలో కేంద్రాల మార్పు ● మాది ఏ సెంటర్ అంటూ విద్యార్థుల్లో గందరగోళం బోథ్: డిగ్రీపరీక్షల విషయంలో కాకతీయ యూని వర్సిటీ తీరు విమర్శలకు తావిస్తోంది. పరీక్షలు ప్రారంభమయ్యే ఒకరోజు ముందు హాల్‌టికెట్లు ఆన్లైన్లో ఉంచడం, తీరా వాటిని విద్యార్థులకు పంపిణీ చేశాక.. కేంద్రాలు మార్చడంపై గందరగోళం నెలకొంది. కేయూ పరిధిలో బుధవారం నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు షురూ కానున్నా యి. జిల్లాలో బోథ్, నేరడిగొండ, ఇచ్చోడ, బజా ర్‌హత్నూర్, గుడిహత్నూర్, ఉట్నూర్, ఆదిలా బాద్‌లో పరీక్ష కేంద్రాలను అధికారులు కేటా యించారు. ఆయాకేంద్రాల్లో పరీక్షలురాసే విద్యా ర్థుల హాల్‌టికెట్లను ఒకరోజు ముందు సంబంధిత కళాశాలలకు ఆన్లైన్లోఅందుబాటులో ఉం చారు. విద్యార్థులు ఉదయం కాలేజీకి వెళ్లి వాటి ని తీసకున్నారు. తీరా మధ్యాహ్నం 3.30గంటల ప్రాంతంలో వర్సిటీ అధికారులు దాదాపు అన్ని పరీక్ష కేంద్రాలను మార్చారు. దీంతో విద్యార్థులు తమది ఏ సెంటర్ అంటూ అయోమయానికి గు రవుతున్నారు. -
పుట్టుక.. చావులో వైవిధ్యం!
● ‘ఆడ’ కంటే ‘మగ’ జననమే అధికం ● అధిక మరణాలు కూడా పురుషులవే.. ● ఆగని గర్భస్త, నవజాత శిశు మరణాలు ● ‘సీఆర్ఎస్– 2021’ నివేదికలో వెల్లడిసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పుట్టుక, చావు మానవ జీవనంలో కీలక ఘట్టాలు. దేశ వ్యాప్తంగా జనన, మరణాలను అధికారికంగా నమోదు చేసే కేంద్ర హోంశాఖ పరిధి రిజిస్ట్రార్ జనరల్, గణాంక కమిషనర్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (సీఆర్ఎస్)–2021 నివేదిక ఇటీవల విడుదల చేసింది. ఈ నివేదికలో ఉమ్మడి జిల్లాలో జననాలు, మరణాలతో పాటు ఏడాదిలోపు శిశువులు, గర్భంలోనే చనిపోతున్న శిశువుల వివరాల్లో ఎంతో వైవిధ్యం కనిపిస్తోంది. ఇక గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సీ్త్ర, పురుష నిష్పత్తిలో ఏర్పడిన అసమానతలు, జనన, మరణాల్లో నమోదవుతున్న వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తున్నాయి.కన్నుమూస్తే మరణం..ఉమ్మడి ఆదిలాబాద్‌లో నిర్మల్ జిల్లాలో మరణాలు అధికంగా నమోదవుతుండగా, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ సంఖ్య తక్కువగా ఉంది. మహిళల కంటే మగవారి మరణాలే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ వివరాల ప్రకారం 10,455మంది పురుషులు చనిపోతే, సీ్త్రలు 7,832 మంది మరణించారు.మగ శిశువుల జననమే అధికం ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నిర్మల్ జిల్లాలో అధికంగా జననాలు నమోదవుతుండగా, కుమురంభీం ఆసిఫాబాద్‌లో తక్కువగా ఉంది. ఇందులో మగ శిశువుల జననాలే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆడ శిశుల సంఖ్య తగ్గుతోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో లింగనిష్పత్తి తగ్గుతుండగా ఈ నివేదికలోనూ ఇదే తీరువెల్లడైంది. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 26,576 మంది అబ్బాయిలు పుట్టగా, అమ్మాయిలు మాత్రం 25,124 మంది జన్మించారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జననాలు.. జిల్లా గ్రామీణం పట్టణం మొత్తం పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు మొత్తం ఆదిలాబాద్ 2,073 1,865 2,710 2,729 4,783 4,594 9,377 నిర్మల్ 4,490 4,218 7,002 6,599 11,492 10,817 22,309 మంచిర్యాల 333 320 5,377 5,065 5,710 5,385 11,095 కు.ఆసిఫాబాద్ 3,458 3,240 1,132 1,088 4,590 4,328 8,918ఆందోళన కలిగిస్తున్న శిశు మరణాలుశిశు మరణాలు ఇంకా ఆందోళన కలిగిస్తున్నాయి. పుట్టినప్పటి నుంచి మొదటి పుట్టిన రోజు కూడా జరుపుకోకుండానే ఎంతోమంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో పుట్టిన సమయంలోనే అనేక సమస్యలుండగా, కొందరు పెరిగే కొద్దీ వచ్చే అనారోగ్య కారణాలతో మృత్యువాత పడుతున్నారు. నిర్మల్ జిల్లాలో 84మంది, మంచిర్యాలలో గ్రామీణ ప్రాంతంలో ఒక్కరూ చనిపోనప్పటికీ.. పట్టణ ప్రాంతంలో 11మంది, ఆదిలాబాద్‌లో 61, కుమురంభీం ఆసిఫాబాద్‌లో అధికంగా 77మంది నవజాత శిశు మరణాలు నమోదయ్యాయి. స్టిల్ బర్త్ మరణాలూ అధికమే..20 వారాలు దాటిన పిండం నుంచి ప్రసవ దశ శిశువు వరకు గర్భంలోనే మరణించే స్థితిని స్టిల్ బర్త్‌గా పేర్కొంటారు. ఈ పరిస్థితిని చాలామంది గర్భిణులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ పరిస్థితి అధికంగా ఉంది. ఈ నివేదిక ప్రకారం ఈ జిల్లాలో 178 మృతశిశువుల జననాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ తర్వాత మంచిర్యాల జిల్లాలో గ్రామీణ పరిధిలో నమోదు లేనప్పటికీ పట్టణాల్లోనే 174 నమోదయ్యాయి. ఇక ఆదిలాబాద్‌లో 61, నిర్మల్‌లో 26 నమోదయ్యాయి. గర్భం దాల్చి పిండ వృద్ధి దశలో ఎదురవుతున్న పలు సమస్యలతో గర్భంలోనే ఈ మరణాలు సంభవిస్తున్నాయి.శిశుమరణాలు ఇలా..జిల్లా గ్రామీణం పట్టణం మొత్తం పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు మొత్తం ఆదిలాబాద్ 27 18 10 06 37 24 61 నిర్మల్ 36 42 3 3 39 45 84 మంచిర్యాల 0 0 06 05 6 5 11 కు.ఆసిఫాబాద్ 43 29 02 03 45 32 77 ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరణాలు..జిల్లా గ్రామీణం పట్టణం మొత్తం పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు మొత్తం ఆదిలాబాద్ 1,367 1,206 890 842 2,257 2,048 4,305 నిర్మల్ 2,400 1,850 1,356 1,054 3,756 2,904 6,660 మంచిర్యాల 653 574 1,636 1,003 2,289 1,577 3,866 కు.ఆసిఫాబాద్ 1,890 1,172 263 131 2,153 1,303 3,456 గర్భస్రావాలు (స్టిల్ బర్త్) ఇలా..జిల్లా గ్రామీణం పట్టణం మొత్తం పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు పురుషులు సీ్త్రలు మొత్తం ఆదిలాబాద్ 21 20 14 06 35 26 61 నిర్మల్ 12 14 0 0 12 14 26 మంచిర్యాల 0 0 94 80 94 80 174 కు.ఆసిఫాబాద్ 98 74 04 02 102 76 178 -
దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించాలి
● కలెక్టర్ రాజర్షిషాసాత్నాల: భూభారతి చట్టం కింద రైతులు, ప్రజ ల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరి శీలించి క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టా లని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. భూభారతి రెవె న్యు సదస్సుల్లో భాగంగా భోరజ్ మండలంలోని డొల్లారా గ్రామాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం ఆధారంగా రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. పైలెట్ ప్రాతిపాదికన జిల్లాలోని భోరజ్ మండలంలో గల 28 గ్రామాల్లో ఈనెల 16వరకు సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వచ్చిన 17 దరఖాస్తులను స్వయంగా పరిశీలించారు. అనంతరం దరఖాస్తుదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అధికా రులకు పలు సూచనలు చేశారు. రెవెన్యూ రికార్డుల్లో వివరాలు సమగ్రంగా పరిశీలించాలని, అనంతరం క్షేత్రస్థాయికి వెళ్లి నిబంధనలకు అనుగుణంగా విచారణ చేపట్టాలని పేర్కొన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, తహసీల్దా ర్ వేణుగోపాల్, రెవెన్యూ సిబ్బంది తదితరులున్నారు. -
● ఔట్సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపు నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు ● నిబంధనలు పాటించలేదంటున్న పలు ఏజెన్సీల నిర్వాహకులు ● రద్దు చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు ● నేడు దరఖాస్తుకు చివరి తేది
సాక్షి, ఆదిలాబాద్: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కొంత మంది ఔట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులు కలెక్టర్‌ను కలిశారు. నూతన ఎంప్యానల్మెంట్ ఏర్పాటు కోసం ఇటీవల విడుదల చేసిన టెండర్ నోటిఫికేష న్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. జీవో 4459 ప్రకా రం నిబంధనలు జారీ చేయాల్సి ఉండగా, ఆ జీవో ను బేఖాతరు చేస్తూ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారని, అందులో అడ్డగోలు నిబంధనలు పెట్టడంతో అనేక ఏజెన్సీలకు కనీసం దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఉందని వాపోయారు. ఇది కేవలం ప్రస్తు తం కొనసాగుతున్న కొన్ని ఏజెన్సీలకు మేలు చేసే లా నోటిఫికేషన్ రూపొందించినట్లు ఆ నిర్వాహకులు నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దరఖాస్తుకు మంగళవారం తుది గడువు కావడంతో ఆ నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరారు. నిబంధనల ప్రకారం కొత్తది జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన కలెక్టర్ ప్రజావాణిలో జిల్లాఇన్చార్జి ఉపాధికల్పన అధికారి మిల్కా అందుబాటులో లేకపోవడంతో ఫోన్ చేసి అక్కడినుంచే మాట్లాడారు. అభ్యంతరాలు ఇలా.. టెండర్ నోటిఫికేషన్లో పొందుపర్చిన పలు నిబంధనల విషయంలో ఏజెన్సీ నిర్వాహకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 2006లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 4459ను పూర్తిగా బేఖాతరు చేస్తూ కొందరికి మాత్రమే మేలు చేసేలా ఈ నిబంధనలు రూపొందించారని పలువురు ఏజెన్సీల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. అందులో ప్రధానంగా దరఖాస్తు ఫీజు రూ.10వేలు, ఈఎండీ రూ.5లక్షలు చెల్లించాలని, రెండేళ్లలో రూ.కోటి టర్నోవర్ కలిగి ఉండాలని, వంద మంది ఉద్యోగుల నిర్వహణ చేసిన అనుభవం ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ విషయంలో పలువురు ఏజెన్సీ నిర్వాహకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా కొత్త ఏజెన్సీలకు ఈ నిబంధనల కారణంగా ఎలా అవకాశం లభిస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా వంద మంది ఉద్యోగుల నిర్వహణ కంటే తక్కువ సంఖ్యలో అనుభవం ఉన్న ఏజెన్సీల పరిస్థితి ఏమిటని అంటున్నారు. ప్రభుత్వ జీవోలో అసలు ఈఎండే తీసుకోవద్దని ఉన్నప్పటికీ రూ.5లక్షలు ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నిస్తున్నారు. నామమాత్రంగా దరఖాస్తు ఫీజు ఉండాల్సి ఉండగా, ఏకంగా రూ.10వేలు ఎలా నిర్ణయించారని ప్రశ్న లేవనెత్తుతున్నారు. అంతేకాకుండా నూతన ఎంప్యానల్మెంట్ రూపొందించేందుకు టెండర్లు నిర్వహిస్తుండగా, కమిటీ ఆమోదంతోనే ఈ నోటిఫికేషన్ జారీ అయ్యిందా అని అడుగుతున్నారు. ‘ఔట్సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపునకు సంబంధించిన టెండర్ నోటిఫికేషన్‌పై ఫిర్యాదులు వస్తున్నాయి.. ఈ విషయంలో ఏజెన్సీ నిర్వాహకులతో మంగళవారం సమావేశమై చర్చించి కొలిక్కి తేవాలి..’ ఇది జిల్లా ఇన్చార్జి ఉపాధికల్పన అధికారి మిల్కాకు కలెక్టర్ రాజర్షిషా ఫోన్లో చేసిన ఆదేశాలు. పరిశీలిస్తున్నాం.. ప్రజావాణిలో కొంత మంది ఏజెన్సీ నిర్వాహకులు నోటిఫికేషన్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దరఖాస్తు ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పరిశీలన చేస్తున్నాం. ఉపాధికల్పన అధికారి సోమవారం అందుబాటులో లేకపోవడంతో మంగళవారం ఈ విషయంలో ఆమె నుంచి స్పష్టత తీసుకొని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. అనంతరం తదుపరి చర్యలు చేపడతాం. – శ్యామలాదేవి, అదనపు కలెక్టర్ -
‘ఇందిరమ్మ’ కోసం ప్రత్యేక కౌంటర్
కై లాస్‌నగర్: ఇందిరమ్మ ఇళ్ల ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టరేట్ సమావేశ మందిరం వద్ద సోమవారం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. జెడ్పీ, మున్సిపల్, హౌసింగ్ శాఖల ఉద్యోగులు మధ్యాహ్నం 2గంటల వరకు అందుబాటులో ఉండి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆదిలాబాద్ పట్టణంతో పాటు వివిధ మండలాల నుంచి 25 ఫిర్యాదులు అందాయి. ఇందులో అత్యధికంగా అనర్హులకే ఇళ్లు కేటా యించారని పేర్కొనడం గమనార్హం. కాగా గత సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఇందిర మ్మ ఇళ్లపైనే అత్యధిక ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో కలెక్టర్ స్పందించి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తదుకనుగుణంగా మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ కౌంటర్ అందుబాటులోకి తెచ్చారు. ‘విద్యుత్ గ్రీవెన్స్’ సద్వినియోగం చేసుకోండి ● ఎస్ఈ జేఆర్ చౌహాన్ఆదిలాబాద్టౌన్: వి ద్యుత్ వినియోగదా రుల సమస్యల పరి ష్కారామే ధ్యేయంగా చేపట్టిన విద్యుత్ ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రాన్స్‌కో ఎస్ఈ జేఆర్. చౌ హాన్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ, 2024 జూన్ 17న శ్రీ కారం చుట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఇ ప్పటి వరకు 754 ఫిర్యాదులు అందగా 699 ప రిష్కరించామన్నారు. విద్యుత్ బిల్లులు, మీ టర్లు, కరెంట్ సరఫరాలో హెచ్చు తగ్గులు, కేట గిరీ, పేరు మార్పు, ప్రమాద భరిత స్తంభాలు వంటి ఫిర్యాదుల్లోని సమస్య తీవ్రత ప్రకారం అప్పటికప్పుడు పరిష్కరించినట్లు తెలిపారు. కొన్ని సమస్యలను సమయం తీసుకొని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సర్కిల్ పరిధిలోని డివిజన్ ఆఫీస్, ఈఆర్వో, సబ్‌డివిజన్ ఆఫీస్, సెక్షన్ ఆఫీస్‌లలో ఈ ప్రజావాణి ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సర్కిల్ ఆఫీస్‌లో అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఫిర్యాదులు అందించవచ్చని తెలిపారు. గ్రీవెన్స్‌లో అందిన ఆయా సమస్యలను సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి
ఆదిలాబాద్: ఈ నెల 20న దేశవ్యాప్తంగా ని ర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్ర ధాన కార్యదర్శి దేవేందర్ కోరారు. జిల్లా కేంద్రంలోని యూనియన్ జిల్లా కార్యాలయంలో సమ్మెకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని సంఘటి త, అసంఘటిత రంగాల కార్మికులంతా పా ల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఇందులో ఖాసీం, అఫ్రోజ్, మహేందర్, సలీం, జమీల్ తదితరులు పాల్గొన్నారు. -
బారులు తీరి.. సమస్యలు నివేదించి
● ప్రజావాణికి 107 దరఖాస్తులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్కైలాస్నగర్: ప్రజాసమస్యల పరిష్కారం కోసం కలె క్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు అర్జీదారులు బారులు తీరారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారంతా కలెక్టర్ రాజర్షి షాకు తమ గోడు విన్నవించి దరఖాస్తులు అందజేశారు. వాటిని కలెక్టర్ సంబంధిత అధికారులకు అందజేస్తూ పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉంచొద్దని సూచించారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, ఆర్డీవో వినోద్‌కుమార్‌తోపాటు ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ వారం మొత్తం 107 అర్జీలు అందాయి. ఇందులో భూ సమస్యలు, పింఛన్, విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు వంటి సమస్యలే అధికంగా ఉన్నాయి. కాగా, ఈ వారం వచ్చిన దరఖాస్తుదారుల్లో కొందరి నివేదన వారి మాటల్లోనే.. -
సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ
ఆదిలాబాద్‌టౌన్: బాధితుల సమస్యలను సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 30 మంది తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ఈ మేరకు ఆయన సంబంధిత అధికారులతో వెంటనే ఫోన్లో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఎలాంటి అత్యవసర సమయంలో అయినా బాధితులు డయల్ 100లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలు దృష్టికి వస్తే ‘డయల్ ఎస్పీ’ కార్యక్రమంలో భాగంగా 8712659973 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో సీసీ కొండ రాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి కవిత తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ -
సర్కారు బడుల్లోనే చేర్పించాలి..
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లల్ని అందులోనే చేర్పించాలి. ఇటీవల పదో తరగతి ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు 97శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇందులో 58 బడుల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన అందిస్తున్నాం. మరింత నాణ్యమైన బోధన అందించేందుకు ఐదు రోజుల పాటు వారికి శిక్షణ కల్పిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టారు. – ఏనుగు శ్రీనివాస్‌రెడ్డి, డీఈవో -
సైనికుల సేవలు చిరస్మరణీయం
ఆదిలాబాద్: భారత్–పాకిస్తాన్ సరిహద్దులో విధి నిర్వహణలో వీరమరణం పొందిన సైనికుల సేవలు చిరస్మరణీయమని మాజీ మంత్రి జోగు రామ న్న అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన భారతీయులు, సరిహద్దుల్లో మరణించిన సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆదివారం వినాయక్ చౌక్‌లోని కార్గిల్ అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న సైనికుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఇందులో సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్ దాస్, మజారుద్దీన్, వామన్‌రెడ్డి, రమేశ్, వినోద్, నాయకులు అలాల్ అజయ్, మెట్టు ప్రహ్లాద్, యూనుస్ అక్బానీ, కస్తాల ప్రేమల, చందాల రాజన్న, దాసరి రమేష్, సలీం పాషా, కొండ గణేశ్ తదితరులున్నారు. -
భూసర్వే సమస్యకు ఇక చెక్
● త్వరలోనే లైసెన్స్డ్ సర్వేయర్లు ● శిక్షణ కోసం దరఖాస్తుల స్వీకరణ ● ఈ నెల 17వరకు గడువుశిక్షణ ఫీజు వివరాలు అభ్యర్థులు ఫీజు ఓసీ రూ.10వేలు బీసీ రూ.5వేలు ఎస్సీ, ఎస్టీ రూ.2,500 కై లాస్‌నగర్: జిల్లాలో సర్వేయర్ల కొరత వేధిస్తోంది. సరిపడా లేకపోవడంతో భూసర్వే పనులకు ఆటంకం కలుగుతుంది. ధరణితో ఏర్పడ్డ భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు మండల సర్వేయర్ల కోసం కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. దరఖాస్తు చేసుకుని నెలలు గడిచినా సర్వేయర్ వచ్చే పరిస్థితి లేదు. ఈ ఇక్కట్లను దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకంపై దృష్టి సా రించింది. ప్రైవేట్ సర్వేయర్లతో పాటు ఆసక్తి, అర్హత గల వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఎంపిక చేసిన వారికి శిక్షణ ఇచ్చి లైసెన్స్‌లు జారీ చేయాలని నిర్ణయించింది. మండలానికి కనీసం ఇద్దరు ఉండేలా ... భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకంపై దృష్టి సారించింది. 60 శాతం మార్కులతో గణితం ఓ సబ్జెక్టుగా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన వారు, ఐటీఐ డ్రాఫ్ట్‌మెన్(సివిల్), డిప్లొ మా, బీటెక్ సివిల్ లేదా తత్సమాన అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. పాత సర్వేయర్లతో పాటు ఆసక్తి గల వారు ఈ నెల 17లోపు మీసేవ కేంద్రాల్లో రూ.100 చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందులో అర్హులైన వారిని ఎంపిక చేసి వారికి ఈ నెల 26 నుంచి జూలై 26వరకు జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఒక్కో మండలానికి కనీసం ఇద్దరు చొప్పున నియమించనున్నట్లుగా తెలుస్తోంది. మూడు విడతల్లో శిక్షణ ... ఎంపిక చేసిన వారికి మూడు దశల్లో శిక్షణ ఇవ్వనున్నారు. థియరీ, టిప్పన్ ప్లాటింగ్, ఫిల్డ్ లెవల్లో ట్రెయినింగ్ ఉంటుంది. అనంతరం 40 రోజుల పాటు మండల సర్వేయర్ కింద ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. విజయవంతంగా పూర్తి చేసిన వారికి జిల్లా స్థాయిలో పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఫైనల్ అసెస్మెంట్ టెస్టు నిర్వహిస్తారు. ప్రతిభ కనబరిచిన వారికి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ విభాగం ద్వారా లైసెన్స్‌లు జారీ చేస్తారు. అలాంటి వారికి రైతుల భూములను సర్వే చేసేందుకు అధికారికంగా గుర్తింపు లభించనుంది. సర్వేయర్ల కొరత లేకుండా ... ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లాలో సర్వేయర్ల కొ రత తీరనుంది. ప్రస్తుతం 21 మండలాలకు గాను 8మంది మండల సర్వేయర్లు, ఇద్దరు డిప్యూటీ సర్వేయర్లు మాత్రమే పనిచేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్ర భుత్వం తెచ్చిన ధరణి చట్టంతో జిల్లాలో భూ సమస్యలు కుప్పలుగా పేరుకుపోయాయి. ల్యాండ్ మి స్సింగ్, పట్టాదారు పేరు తారుమారు, విస్తీర్ణంలో తేడా వంటి అనేక సమస్యలున్నాయి. దీంతో సర్వే కోసం అందిన దరఖాస్తులు వందల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. దీనికి తోడు రియల్ ఎస్టేట్ కారణంగా జిల్లాలో వ్యవసాయ భూములు పెద్ద ఎత్తున వెంచర్లుగా మారుతున్నాయి. నాలా కన్వర్షన్ కోసం సైతం అప్లికేషన్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో లైసెన్స్డ్ సర్వేయర్లు అందుబాటులోకి వస్తే భూ సర్వే పనులు వేగవంతంగా సాగే అవకాశముంది. సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న భూభారతి చట్టంలో అర్హులైన వారి సేవలను సర్వేయర్లుగా వినియోగించుకో వాలని భావిస్తోంది. వారికి శిక్షణ ఇచ్చి లైసెన్స్‌లు జారీ చేయనుంది. నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం. అర్హులైన వారు ఈనెల 17వరకు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. – ఎం.రాజేందర్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ, ఆదిలాబాద్ -
పర్యవేక్షణపై దృష్టి సారించాలి
అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలి. ఎంఈవో, డిప్యూటీ ఈవో, డీఈవో పోస్టులు భర్తీ చేస్తేనే సర్కారు విద్య గాడిన పడుతుంది. డైట్ కళాశాలలో లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యావ్యవ్థ కుంటుపడుతుంది. వీటిపై దృష్టి సారిస్తే సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. – బి.రవీంద్ర, ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
ఆ వ్యాపారులకు సహకరిస్తే కేసులు
● కలెక్టర్ రాజర్షి షా ● జొన్నల విక్రయాలపై అధికారులతో సమీక్ష కైలాస్‌నగర్: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మ ద్దతు ధరతో జొన్నలు విక్రయించే వ్యాపారులకు సహకరించే రైతులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. జొన్న ల కొనుగోళ్లపై సంబంధిత శాఖ అధికారులతో ఆదివారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 15 కేంద్రాల్లో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోళ్లు చేపడుతున్నట్లు తెలిపారు. క్వింటాల్‌కు రూ.3,371 మద్దతు ధరతో రైతుల నుంచి విక్రయిస్తున్నట్లు తెలిపారు. అయితే కొంతమంది వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు జొన్నలను తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. విజిలెన్స్ బృందాల ద్వారా నిరంతర నిఘా ఉంచినట్లు తెలిపారు. అక్రమంగా తీసుకువస్తే జొన్న బస్తాలతో పాటు వాహనాలను సీజ్ చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఇప్పటికే భీంపూర్ మండలంలో రెండు బొలేరో వాహనాలు, ట్రాక్టర్, అలాగే ఇచ్చోడలోని మాదాపూర్‌లో 500 బస్తాల జొన్నలు, ఇంద్రవెల్లిలో 87 బస్తాలు, బజార్హత్నూర్లో 54 బస్తాలను సీజ్ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 7780 మంది రైతుల నుంచి రూ.83.21 కోట్ల విలువైన 2.46లక్షల క్వింటాళ్ల జొన్నలను కొనుగోలు చేసినట్లు వివరించారు. సమావేశంలో డీఏవో శ్రీధర్ స్వామి, డీసీవో మోహన్, మార్కెటింగ్ అధికారి గజానంద్, మార్క్‌ఫెడ్ డీఎం ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సైన్యానికి మద్దతుగా పూజలు
తాంసి: ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా సరి హద్దులో పోరాటం చేస్తున్న భారత త్రివిధ దళాలకు, ఆపరేషన్ సిందూర్‌కు ప్రతి ఒకరూ మద్దతుగా నిలవాలని ఎంపీ గోడం నగేశ్ కోరారు. త్రివిధ దళాలకు మద్దతుగా మండలంలోని పొన్నారి సంకట్యోచన్ హనుమా న్ ఆలయంలో ఎంపీ ఆదివారం ప్రత్యేక పూ జలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, పాక్ ఉగ్రవాదులు సరిహద్దు వెంట దాడులకు పాల్పడుతుండగా భారత త్రి విధ దళాలు ధీటుగా తిప్పికొడుతున్నాయన్నారు. ఇందులో మాజీ జెడ్పీటీసీ రాజు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంతోష్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు చంద్రకిరణ్, నాయకులు సదానంద్, అరుణ్, నారాయణ, ప్రవీణ్ రెడ్డి తదితరులున్నారు. -
‘యువ వికాసం’పై కసరత్తు
కై లాస్‌నగర్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా రూ.50వేల నుంచి రూ.4.లక్షల వరకు ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించింది. ఇందుకోసం గత నెల 7నుంచి 14వరకు ఆఫ్‌లైన్, ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించింది. జిల్లాలో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇందులో అర్హులను గుర్తించేందుకు చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలన ముమ్మరంగా సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో వార్డు ఆఫీసర్లు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తుదారుల వివరాలు, స్థితిగతులను ఆరా తీస్తున్నారు. వారు ఎంపిక చేసిన జాబితాలను సోమవారం (నేటి)లోగా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్‌కు అందజేయాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ సంక్షేమశాఖలన్నింటివి కలిపి 47,762 దరఖాస్తులు అందగా, ఇప్పటివరకు 39,727 పరిశీలించారు. మిగతా దరఖాస్తులు పరిశీలించాల్సి ఉంది. వాటి పరిశీలనను నేటితో పూర్తిచేసేందుకు అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ విషయమై కలెక్టర్ ఇటీవల సంబంధిత శాఖల అధికారులు, బ్యాంకర్లతో పలుమార్లు సమీక్షించారు. ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. 13 నుంచి మండల స్థాయిలో.. ఎంపీడీవోలకు అందిన దరఖాస్తుల ఆధారంగా ఈనెల 13 నుంచి 19వరకు మండల స్థాయిలో లబ్ధిదారుల ఎంపికకు మండల కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎంపీడీవో నేతృత్వంలోని ఈ కమిటీలో ఎంపీవో, మండల ప్రత్యేక అధికారి, బ్యాంక్ మేనేజర్లు సంబంధిత శాఖల నుంచి ఎంపిక చేసిన అధికారులు ప్రాతినిధ్యం వహిస్తారు. సంక్షేమ శాఖలకు సంబంధించి మండల స్థాయి కమిటీలో హెచ్‌డబ్ల్యూవోలను నియమించారు. మున్సిపాలిటీలో గెజిటెడ్ అధికారులను కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు. వీరి ఆధ్వర్యంలో అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి మండలాలకు కేటాయించిన యూనిట్ల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఇలా ఎంపిక చేసిన వారి వివరాలను జిల్లా కమిటీకి ప్రతిపాదిస్తారు. అయితే యూనిట్ల సంఖ్య తక్కువగా ఉండి, దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో లబ్ధిదారుల ఎంపిక అధికారులకు తలనొప్పిగా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అర్హులను గుర్తిస్తేనే నిరుద్యోగులకు లబ్ధి చేకూరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 20 నుంచి జిల్లా స్థాయిలో.. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఈనెల 20 నుంచి 30 వరకు మండల కమిటీలు అందజేసిన అర్హుల వివరాలను జిల్లా కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా, అడిషనల్ కలెక్టర్ వైస్ చైర్మన్‌గా, డీఆర్డీవో నోడల్ అధికారిగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల అధికారులు, బ్యాంకు ఉన్నతాధికారులు కమిటీ సభ్యులుగా ఉండనున్నారు. ఈ కమిటీ మండల స్థాయి నుంచి అందిన దరఖాస్తులను, వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అర్హత ఆధారంగా యూనిట్ల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. ఈ ప్రక్రియను ఈనెల 25 నుంచి 30వ తేదీ వరకు పూర్తి చేయనుంది. ఆయా తేదీల్లోనే ప్రొసీడింగ్‌లను సైతం సిద్ధం చేయనుంది. జిల్లా కమిటీ ఎంపిక చేసిన లబ్ధిదారులకు జూన్ 2న మంజూరు పత్రాలు అందజేయనున్నారు. తొలివిడతలో రూ.50వేలు, రూ.లక్ష లోపు రుణాలు అందజేయనున్నట్లుగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వారి సంఖ్య తక్కువగా ఉండటంతో తొలివిడతలోనే వారికి లబ్ధి చేకూరే అవకాశముంది. నేటితో ముగియనున్న క్షేత్రస్థాయి పరిశీలన 13 నుంచి మండలస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ 20 నుంచి జిల్లా స్థాయిలో గుర్తింపు శాఖల వారీగా అందిన దరఖాస్తులు, పరిశీలన వివరాలు శాఖ అందిన పరిశీలించినవి దరఖాస్తులు ఎస్సీ కార్పొరేషన్ 9804 8143 ఎస్టీ సంక్షేమ శాఖ 12855 11039 బీసీ 18581 15773 ఈబీసీ 653 376 మైనార్టీ 5814 4364 క్రిస్టియన్ మైనార్టీ 55 32 జిల్లాలో కులాల వారీగా కేటాయించిన యూనిట్లు ఎస్సీ 2,662 ఎస్టీ 6,480 బీసీ 2,403 ఈబీసీ 724 ముస్లిం మైనారిటీ 1,003 క్రిస్టియన్ మైనారిటీ 31 పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ రాజీవ్ యువ వికాసం పథకం కింద ప్రభుత్వ ఆర్థికసాయం కోసం అందిన దరఖాస్తులకు సంబంధించిన వివరాల క్షేత్రస్థాయి పరిశీలన సోమవారంలోగా ముగియనుంది. ఈ నెల 13 నుంచి 20వరకు మండల స్థాయిలో లబ్ధిదారుల ఎంపికకు మండల కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు ఉంటాయి. 20 నుంచి 30వరకు జిల్లా స్థాయిలో ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. కలెక్టర్ నేతృత్వంలో పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. ఎంపికై న లబ్ధిదారులకు జూన్ 2న రుణ మంజూరు పత్రాలు అందించేలా ముందుకు సాగుతున్నాం. – మనోహర్‌రావు, రాజీవ్ యువ వికాసం జిల్లా కన్వీనర్ -
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం●
● డీఎస్పీ జీవన్‌రెడ్డి ఆదిలాబాద్‌టౌన్: అసాంఘిక కార్యకలాపాల పై ఉక్కుపాదం మోపుతామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని వడ్డెర కాలనీలో ఆదివారం కమ్యూనిటీ కాంటాక్ట్ కమ్ కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. ఇళ్లలో సోదాలు చేపట్టారు. కాలనీకి చెందిన ఒల్లెపు బాబన్న బైక్ నంబర్ మార్ఫింగ్ చేసి మరో నంబర్ బిగించినట్లు గుర్తించారు. ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాలనీకి చెందిన దారంగుల గంగమ్మ ఇంట్లో సోదాలు చేయగా 17దేశీదారు బాటిళ్లతో పా టు ఒక బీర్ లభించినట్లు పేర్కొన్నారు. ఆమె పై కూడా కేసు నమోదు చేసినట్లు వివరించారు. స్క్రాప్ యజమానులు దొంగతనం చేసిన వస్తువులను కొనుగోలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రెండు రోజుల పాటు ఆదిలాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని స్క్రాప్ దుకాణాలను తనిఖీ చేయగా, సర్వీస్ వైర్లు, అగ్రికల్చర్‌కు సంబంధించిన సబ్మెర్సిబుల్ మో టార్లు, కాపర్ తీగలు కొనుగోలు చేసినట్లు తేలిందన్నారు. తొ మ్మిది మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఎవరైనా కాపర్‌వైర్లు, ఇతర వస్తువులు అమ్మడానికి వస్తే వారి వివరాలు, ఫోన్ నంబర్లు నమోదు చేయాలని సూచించారు. అలాగే దుకాణాల్లో సీసీ కెమెరాలు బిగించుకోవాలన్నారు. డీఎస్పీ వెంట టూ టౌన్ ఎస్సైలు తిరుపతి, విష్ణుప్రకాశ్, హెడ్‌కానిస్టేబుల్ బబిత తదితరులున్నారు. -
ఎనిమిది కాళ్ల వింత మేకపిల్ల జననం
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని బొక్కల్‌గూడలో నివాసం ఉంటున్న రాజలింగుకు చెందిన మేక ఆదివారం ఎనిమిది కాళ్లతో వింత మేకపిల్లకు జన్మనిచ్చింది. కొద్ది సేపటికే మృతి చెందింది. మేక ఈత కోసం యజమాని పశువైద్యశాలకు తీసుకెళ్లాడు. వైద్యుడు దూద్‌రాం రాథోడ్ సిజేరియన్ అవసరం ఉందని గ్రహించి ఆపరేషన్ చేశాడు. ఒక తల, ఎని మిది కాళ్లతో వింతగా జన్మించింది. జన్యులోపం కారణంగా ఇలాంటివి జన్మిస్తాయని, శాస్త్ర పరిభాషలో అక్టోగోట్ ఫీటస్, పాలిమేలియా అంటారని వైద్యుడు తెలిపారు. మేక కు శస్త్ర చికిత్స చేసిన వారిలో రాథోడ్ లావణ్య, సిబ్బంది ఉన్నారు. -
పట్టుదలకు ప్రోత్సాహం
బెల్లంపల్లి: తాండూర్ మండలం మాదారం టౌన్‌షిప్‌కు చెందిన ఎనగంటి శ్యామలకు దేశమన్నా.. దేశభక్తి అన్నా ఎనలేని అభిమానం. అణువణువునా మాతృదేశంపై మమకారం పెంచుకుంది. ఎనగంటి శ్యామల, సమ్మిరెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. సమ్మిరెడ్డి సింగరేణి కంపెనీలో కార్మికుడిగా పని చేసేవారు. పిల్లలు చిన్నతనంలో ఉండగానే 1988లో అకాల మరణం చెందారు. దీంతో కుటుంబ బాధ్యతలు శ్యామలపై పడ్డాయి. భర్త వారసత్వంగా వచ్చిన సింగరేణి ఉద్యో గం చేస్తూ ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేసింది. చిన్న కుమారుడు రాజశేఖర్ డిగ్రీ చదువుతూనే 2006లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం సాధించాడు. తల్లి ఆశించినట్లుగానే దేశ రక్షణలో విధులు నిర్వర్తిస్తున్నాడు. రాజశేఖర్ పెద్దనాన్న కుమారులు ఒకరు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, మరొకరు నేవీలో పని చేసేవారు. వారి స్ఫూర్తితో మూ డో ప్రయత్నంలో ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం సాధించి తల్లి కలను సాకారం చేశాడు. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో సార్జెంట్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. దేశ సేవ చేయాలనే పట్టుదల కుమారుడికి ఉండడంతో ప్రోత్సహించింది. రెండు సార్లు విఫలమైనా వెన్నుతట్టి అండగా నిలబడడంతో నేడు దేశ సేవలో ముందున్నాడు. -
తండ్రిని రోకలితో కొట్టి చంపిన తనయుడు
● నిర్మల్ జిల్లా రాజూరలో ఘటన లోకేశ్వరం: తండ్రిని రోకలితో కొట్టి తనయుడు చంపాడు. నిర్మల్ జిల్లా మండలంలోని రాజూర గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ముధోల్ సీఐ మల్లేశ్ కథనం ప్రకారం.. రాజూర గ్రామానికి చెందిన గన్నారం భూమన్న(80)కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు భూమన్న, రెండో కుమారుడు సుదర్శన్, మూడో కుమారుడు సాయికృష్ణ. సుదర్శన్ మూడేళ్ల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు. సాయికృష్ణ హైదరాబాద్‌లో పనిచేస్తూ జీవిస్తున్నాడు. పెద్దకుమారుడు భూమన్న భార్య సునీతకు ఏడాది క్రితం గొడవల కారణంగా పుట్టింటికి నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌కు వెళ్లిపోయింది. రాజురాలో తనకున్న మూడెకరాల్లో పెద్దకుమారుడు వ్యవసాయంతోపాటు కూలీ పని వెళ్లి తండ్రి భూమన్నకు పోషించుకుంటున్నాడు. ఇద్దరు ఇంట్లో ఉంటున్నారు. మూడు రోజులుగా తిండి పెట్టటం లేదని తండ్రి, పెద్దకుమారుడి మధ్య గొడవ జరిగింది. శనివారం తెల్లవారుజామున ఇద్దరు గొడవపడ్డారు. క్షణికావేశానికి లోనైన కుమారుడు రోకలితో తండ్రి తలపై కొట్టి హత్య చేశాడు. మృతుడి కుమారై సుజాత ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అంతకుముందు భైంసా ఏఎస్పీ అవినాష్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ముధోల్ సీఐ మల్లేశ్, లోకేశ్వరం ఎస్సై అశోక్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసుపై విచారణ జరిపి నిందితుడిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
అదృష్టంగా భావిస్తున్నా
బోథ్: నాపేరు తక్కల స్వరూప. నాకు కుమారుడు, కూతురు ఉన్నారు. భర్త మృతిచెందిన కొంతకాలానికి కుమారుడు శైలన్ రెడ్డికి ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. ఆర్మీలో విధులు నిర్వహించడం ఆనందంగా ఉంది. దేశం కోసం పోరాడే అవకాశం రావడం సంతోషంగా ఉంది. బోథ్: నా పేరు కదం అనసూయ. నాకు ఐదుగురు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు ఆర్మీలో విధులు నిర్వహిస్తారు. రెండవ కుమారుడు ప్రవీణ్ కుమార్, మూడవ కుమారుడు ప్రతాప్‌లు ఆర్మీలో పనిచేస్తున్నారు. నా ఇద్దరు కుమారులు ఆర్మీలో విధులు నిర్వహించడం ఆనందంగా ఉంది. అదృష్టంగా భావిస్తున్నా. తానూరు: భోసికి చెందిన బాయి లక్ష్మి బాయి–భూమన్న దంపతుల కుమారుడు సాయినాథ్. 2004లో ఆర్మీలో ఉద్యోగం సాధించి విరమణ పొదాడు. తల్లి ఆశయం నెరవేర్చేందుకు 2024లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికై నిజామాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. తల్లి కల నేరవేర్చడంతో తల్లి సంతోషం వ్యక్తం చేస్తోంది. – లక్ష్మిబాయి సంతోషంగా ఉంది. నా కల నెరవేర్చాడు -
బైక్‌పై నుంచి పడి మహిళ మృతి
లోకేశ్వరం: ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి పడి మహిళ మృతి చెందింది. ఎస్సై ఆశోక్ కథనం ప్రకారం.. కుంటాల మండలం కల్లూర్ గ్రామానికి చెందిన పసుల సాయన్న– పసుల గోదావరి (40) దంపతులు. వీరు ఈనెల 6న బావమరిది కూతురు పెళ్లికి మండలంలోని పిప్రి గ్రామానికి బైక్‌పై వచ్చారు. పెళ్లి ముగించుకుని శనివారం బైక్‌పై స్వగ్రామానికి బయల్దేరారు. మండలంలోని హవర్గ సమీపంలోని శ్మశానవాటిక వద్ద బైక్‌పై నుంచి కళ్లు తిరిగి గోదావరి కింద పడడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలు గోదావరి తమ్ముడు దాస శేఖర్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
లైంగికవేధింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్: ఓ మహిళ పేరిట సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్ తెలిపారు. శనివారం పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన ఓ మహిళ బంధువులు పంజాబ్‌లో నివసిస్తున్నారు. కొన్ని అవసరాల నిమిత్తం అమృత్‌సర్‌కు చెందిన అసిస్టెంట్ ట్రెజరర్ మునీష్ కుమార్‌ను వీరు సంప్రదించారు. సదరు అధికారి డబ్బులు ఆశించాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో పనులు చేసేందుకు నిరాకరించాడు. దీంతో అతన్ని మహిళ తరపు బంధువులు విజిలెన్స్ అధికారులకు పట్టించారు. వారిపై కక్ష పెంచుకున్న మునీష్ కుమార్ ఆదిలాబాద్‌కు చెందిన మహిళ పేరిట పేస్‌బుక్‌లో ఫేక్ ఐడీని క్రియేట్ చేసి, సదరు మహిళ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆదిలాబాద్ సైబర్ క్రైమ్ బృందం సహకారంతో, వన్‌టౌన్ పోలీసులు నిందితుడిని గుర్తించి అమృత్సర్ నుంచి ఆదిలాబాద్‌కు తీసుకువచ్చారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. -
అమ్మా వందనం..
తల్లులకు పిల్లలన్నా.. ఇల్లన్నా ఎంతో ప్రేమ. ఆ తల్లుల ప్రేమ ఇల్లు, పిల్లలకే పరిమితం కాలేదు. దేశాన్నీ ప్రేమించారు. మాతృభూమిపై మమకారంతో దేశ సేవ కోసం పిల్లలకు ఉగ్గుపాల నుంచే దేశభక్తిని నూరిపోశారు. నేడు ఎంతోమంది సైనికులు సరిహద్దులో దేశ సేవ చేస్తున్నారంటే ఆ మాతృమూర్తులే కారణం. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న సైనికుల విజయం వెనుక ఉన్నది ఆ తల్లులే. దేశానికి ఎంతోమంది వీర సైనికులను అందించిన తల్లులపై నేడు మదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. ● దేశ సేవకు పిల్లలను పంపిన మాతృమూర్తులు ఎందరో.. ● నేడు మదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. -
ఎడారి దేశంలో జిల్లావాసి జైలు జీవితం
● చేయని నేరానికి గల్ఫ్ బాధితుడి నరకయాతన ● న్యాయ సహాయం కోసం కుటుంబసభ్యుల వేడుకోలు నిర్మల్‌ఖిల్లా: చేయని నేరానికి అకారణంగా ఎడారి దేశంలో జైలుశిక్ష అనుభవిస్తున్న తమ కుటుంబ సభ్యుడికి న్యాయ సహాయం అందించాలని గల్ఫ్ బాధిత కుటుంబ సభ్యులు కోరారు. జిల్లా కేంద్రంలో శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ స్వదేశ్ వర్కిపండ్లతో కలిసి కలిసి వివరాలు వెల్లడించారు. కుంటాల మండలం అంబకంటి గ్రామానికి చెందిన గజకరెడ్ల సాయన్న (51) ఉపాధి నిమిత్తం గతేడాది దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఏప్రిల్ 16న స్థానిక పోలీసులు అరెస్టు చేసి అబుదాబీ జైలుకు తరలించారు. సమాచారం తెలిసిన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై ఎవరిని సంప్రదించాలని తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో ఎన్ఆర్ఐ రాష్ట్ర అడ్వైజరీ కమిటీ సభ్యుడు స్వదేశ్ పరికిపండ్లను కలిసి సమస్యను వివరించారు. నిరక్షరాస్యత కారణంగా తన పేరిట ఇతరులకు తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైలులో వేసినట్లు కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వదేశ్ మాట్లాడుతూ బాధితుడి సమగ్ర వివరాలతో అక్కడి ఎంబసీకి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చామన్నారు. న్యాయసహాయం ద్వారా జైలు నుంచి విడిపించే ప్రయత్నం చేస్తామని కుటుంబసభ్యులకు భరోసానిచ్చారు. బాధితుడి తల్లి భోజవ్వ, భార్య మంజుల, కుమారుడు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దేశ సేవకే అంకితమయ్యాడు
నా పెద్ద కొడుకు రంగారావ్ ఆర్మీలో చేరి దేశ రక్షణ కోసం పోరాడాడు. విధి నిర్వహణలోనే ప్రాణాలొదిలాడు. 2005లో హిమాచల్ ప్రదేశ్‌లో సట్లేజ్ నది దాటుతున్న క్రమంలో అందులో పడి అమరుడయ్యాడు. కనీసం మృతదేహం కూడా లభ్యం కాలేదు. అయినా దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్‌ను కన్న తల్లిగా నేను గర్వపడుతున్నా. బిడ్డ గుర్తుకు వచ్చినప్పుడల్లా కన్నీళ్లు ఆగవు. అయినా వాటిని దిగమింగుతా. నా కొడుకు విగ్రహాన్ని సమాఖా చౌరస్తాలో ఏర్పాటు చేశారు. గుర్తుకొచ్చినప్పుడల్లా అక్కడికి పోతా. విగ్రహాన్ని తాకుతా. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటా. – అంతర్వేది దాసోదిబాయి (రంగారావ్ తల్లి), గోపాల్సింగ్తండా, ఇంద్రవెల్లి -
ఆలయం వెనుక ఆలయం!
● వేంకటేశ్వర టెంపుల్ వెనుకాల కొత్త మందిరం ● గతంలో వివాదాలతో పనులకు బ్రేక్ ● పదేళ్లుగా ముందుకు సాగని ప్రక్రియ ● అరిష్టమంటున్న భక్తులు సాక్షి, ఆదిలాబాద్: ప్రస్తుతం ఉన్న ఆలయం శాస్త్రప్రకారం లేదని దాని వెనుకాలే కొత్త ఆలయం నిర్మించాలని పదేళ్ల క్రితం తలపెట్టారు. మండలం, అంతరాలు, అన్ని నియమాలతో కట్టాలని నిర్ణయించారు. రూ.80లక్షలతో పనులకు శ్రీకారం కూడా చుట్టారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే పనులు తుది దశకు వచ్చాయి. ముందుగా అనుకున్నట్లే కొత్త ఆలయం పూర్తవుతుందని భక్తులు భావించారు. ఆ తర్వాత ఏమైందో కానీ ప్రక్రియ నిలిచిపోయింది. ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగని పరిస్థితి. పాత ఆలయం యథావిధిగా కొనసాగుతోంది. కొత్త ఆలయంపై మొక్కలు దర్శనమిస్తున్నాయి. పట్టించుకునే వారే లేరు. అయితే అశాసీ్త్రయాన్ని శాసీ్త్రయం చేసే విషయంలో నాడు అడ్డుపుల్ల వేసిన వారికే ఇది మంచిది కాదని కొంతమంది భక్తులు అంటున్నారు. ఆలయం వెనకాల కొత్త ఆలయాన్ని నిర్మించి మధ్యలోనే వదిలిపెట్టడం ఆదిలాబాద్‌కు అరిష్టమని పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీవేంకటేశ్వర ఆలయం దేవాదాయశాఖ, ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంయుక్తంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే సంయుక్త నిర్ణయాలు ఆలయ అభ్యున్నతికి తోడ్పడకపోగా, అరిష్టాలను మూటగట్టుకుంటుందని భక్తులు పేర్కొంటున్నారు. తాజాగా రూ.7.30 కోట్లతో నిర్మాణం తలపెట్టడం, ఆ టెండర్ నోటిఫికేషన్లో దేవాదాయశాఖ ప్రస్తావన లేకపోవడం వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’లో శనివారం ‘గోవిందా.. గోవింద’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ క్రమంలో పలువురు భక్తులు ‘సాక్షి’కి ఫోన్ చేసి ఆలయంలో ప్రణాళికాబద్ధంలేని పనుల విషయాన్ని వివరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆలయం వెనుక ఆలయం నిర్మించి వదిలేసిన తీరు సరికాదని పేర్కొన్నారు. వైఫల్యమా.. నిధుల వృథా ప్రయాసా జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌చౌక్‌లో ఉన్న ఈ ఆలయానికి నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలో హుండీ ఆదాయం కూడా అధికమే. తాజాగా ఆలయ ఆవరణలో ఫంక్షన్ హాల్ నిర్మిస్తుండగా, ఆ వ్యయం రూ.7.30 కోట్లు హుండీ నుంచి వచ్చిన డబ్బులేనని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే పదేళ్ల క్రితం ఆలయం వెనుకాల మరో ఆలయం నిర్మించే విషయంలో ఓ దాత ముందుకు వచ్చి దాని వ్యయాన్ని భరించారని పేర్కొంటున్నారు. అయితే ఆ దాత ట్రస్ట్‌కు సంబంధం లేకుండా ఆలయ నిర్మాణం చేపట్టడం, దీంతో ప్రధాన ట్రస్టీ ఈ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేశారనేది ప్రచారంలో ఉంది. పాత ఆలయం ప్రాశస్త్యం మరుగున పడుతుందనే కోణంలో ట్రస్టీ అలా వ్యవహరించారని చెప్పుకుంటారు. ఈ విషయంలో అప్పట్లో ట్రస్టీ, సభ్యుల మధ్య కూడా విభేదాలు వచ్చి వర్గాలుగా విడిపోయారని, దేవాదాయశాఖ కూడా ఈ విషయంలో సమన్వయం సాధించలేక మిన్నకుండిపోయిందనే ప్రచారం ఉంది. అంతే కాకుండా ఆలయం విషయంలో రాజకీయాలు కూడా తోడవడంతో అప్పట్లో పనులు తుది దశకు వచ్చినా చివరకు నిలిచిపోయిందని పలువురు పేర్కొంటున్నారు. మొత్తంగా విభేదాల కారణంగా ఏళ్లుగా నిర్మాణ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆలయానికి పెద్ద మొత్తంలో ఆదాయం ఉన్నా పర్యవేక్షణలోపం, ప్రణాళిక అమలుపర్చడంలో వైఫల్యం చెందారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నిధులు వృథా ప్రయాస అవుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారనే ఆరోపణలు బాహాటంగానే వ్యక్తమవుతున్నాయి. ఆ విషయం నాకు తెలియదు కొత్త ఆలయం ఎందుకు అసంపూర్తిగా ఆగిపోయిందో తెలియదు. ఈ విషయంలో నాకు స్పష్టత లేదు. ఫంక్షన్ హాల్ నిర్మాణానికి సంబంధించిన టెండర్ నోటిఫికేషన్లో దేవాదాయశాఖ అని ప్రస్తావించకపోవడం ఐఅండ్పీఆర్లో లోపం. మేము ఇక్కడి నుంచి ఇచ్చిన దాంట్లో దేవాదాయశాఖ అని వారికి పంపించాం. – రమేశ్, ఈవో, దేవాదాయశాఖ, ఆదిలాబాద్ -
జిల్లావాసికి డాక్టరేట్
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని కేఆర్కే కాలనీకి చెందిన తస్కండే లక్ష్మణ్–గంగ దంపతుల కుమార్తె ప్రియాంకకు డాక్టరేట్ లభించింది. జియో ఫిజిక్స్‌లో చేసిన పరిశోధనలకు గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పట్టా అందుకోనున్నారు. ఈమె ప్రొఫెసర్ వీరయ్య మార్గదర్శకత్వంలో పరిశోధనలు చేశారు. నిర్మల్ జిల్లాలోని సుద్దవాగు బేసిన్లో జలాశయ సంభావ్య మండలాల మూల్యాంకనంతో పరిశోధనలు చేశారు. జియో మార్పోలాజికల్, జియో ఎలక్ట్రికల్ , జియో కెమికల్ విధానాలు ఉపయోగించి సమగ్ర అధ్యయనం చేశారు. ఇందుకు గాను ఓయూ డాక్టరేట్ ప్రకటించింది. ప్రస్తుతం ఈమె హైదరాబాద్‌లోని స్వయంకృషి స్పెషల్ బీఎడ్ కళాశాలలో కో ఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. డాక్టరేట్ రావడంపై కుటుంబసభ్యులు, స్థానికులు వ్యక్తం చేఽశారు. -
భారత్ మాతాకీ జై..
● ఉగ్రవాదంపై త్రివిధ దళాలది అద్వితీయ పోరాటం : ఎంపీ నగేశ్ ఆదిలాబాద్: అమాయకుల ప్రాణాలు బలిగొన్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై త్రివిధ దళాలది అద్వితీయ పోరాటమని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం త్రివిధ దళాలకు, ఆపరేషన్ సిందూర్‌కు సంఘీభావంగా భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకీ జై.. జైహింద్ నినాదాలు హోరెత్తాయి. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, భారత్ సంయమనంతో వ్యవహరిస్తుంటే పాక్ ఉగ్రవాదంతో రెచ్చగొడుతుందన్నారు. వారిని దీటుగా ఎదుర్కొనేందుకు చేసిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిందన్నారు. మనపై ఎన్ని రకాలుగా దాడులు చేయాలని యత్నిస్తున్నా, సైనికులు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారన్నారు. వారందరికీ ప్రతి భారతీయుడు మద్దతుగా నిలవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, భారత త్రివిధ దళాలు పాక్ కుయుక్తులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు ఆదినాథ్, వేద వ్యాస్, ప్రమోద్ కుమార్ ఖత్రి తదితరులు పాల్గొన్నారు. -
అమ్మే నా రోల్‌మోడల్..
అఖిల్ మహాజన్, ఎస్పీ అమ్మ ఉర్మిల్ నాకు రోల్‌మోడల్. ప్రతీ విజయం వెనుక ఆమె ప్రోత్సాహం ఎంతో ఉంది. సివిల్స్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఎంతగానో మోటివేట్ చేశారు. కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యం సాధించవచ్చని పదే పదే చెప్పేవారు. ఏ పనిలోనూ వెనుకడుగు వేయద్దనే వారు. ఇప్పటికీ అమ్మ మాటలు గుర్తుకొస్తాయి. క్రమశిక్షణ, ఎదుటి వ్యక్తులతో ఎలా ఉండాలనే విషయాలను చిన్నప్పటి నుంచే నేర్పించారు. ఉద్యోగం సాధించేంత వరకు వెన్నుదన్నుగా నిలిచారు. అందరి జీవితాల్లో అమ్మ ప్రత్యేకమే. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. – ఆదిలాబాద్‌టౌన్ -
ఇంకుడుగుంతలు.. మరుగుదొడ్లు
కై లాస్‌నగర్: గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉంచాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం స్వచ్ఛభారత్ గ్రామీణ మిషన్(ఎస్బీఎం) ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగానే 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాకు రూ.17.06 కోట్ల నిధులను ఆ విభాగానికి కేటాయించింది. వాటి ద్వారా వివిధ కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణను సిద్ధం చేసింది. ఏడాది లోపు పూర్తిచేసేలా మండలాల వారీగా లక్ష్యాలను నిర్దేశిస్దూ కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశా రు. తదనుగుణంగా పనులు ప్రారంభించే దిశగా అఽ దికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రతీ ఇంటిలో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మింపజేసేలా ప్రజలను చైతన్యవంతులు చేయడంతో పాటు ఇంకుడుగుంతలు నిర్మించేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. స్వచ్ఛత.. పరిశుభ్రతే లక్ష్యం ప్రతీ ఇంటిలో వ్యక్తిగత మరుగుదొడ్డితో పాటు ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. తద్వారా పరిశుభ్రతతో పాటు వర్షపునీటిని ఒడిసిపట్టి భూగర్భజలాలు పునరుద్ధరించే దిశగా నిర్మాణాలను ప్రోత్సహిస్తోంది. వీటి నిర్మాణాలకు రూ.12వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తోంది. అ లాగే మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో కమ్యూనిటీ టాయ్‌లెట్స్‌కు రూ.3లక్షల చొ ప్పున వెచ్చిస్తోంది. అలాగే భారీ కమ్యూనిటీ సోక్పి ట్స్ సైతం చేపట్టనున్నారు. గ్రామాల్లో పోగైన చెత్త ను సేకరించి సెగ్రిగేషన్ చేసేందుకు వీలుగా షెడ్లను నిర్మించనున్నారు. జిల్లాలో కొత్తగా ఐదు గ్రామ పంచాయతీలు ఏర్పడగా తలమడుగు మండలంలోని పూనగూడ, ఇచ్చోడ మండలంలోని ఎల్లమ్మగూడలో వీటిని నిర్మించాలని ప్రతిపాదించారు. వీటితో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రాసెస్ చేసేందుకోసం ఈ సారి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్పై కేంద్రం దృష్టి సారించింది. జిల్లాలో తొలిసారిగా మూడు యూ నిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో యూనిట్‌కు రూ.64లక్షల చొప్పున కేటాయించనున్నారు. పైలట్ ప్రాజెక్ట్‌గా ఇచ్చోడ మండలం ముఖరా(కే)లో నిర్మించాలని భావిస్తున్నారు. కార్యదర్శులకు దరఖాస్తు చేసుకోవాలి .. వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలనే ఆసక్తి గల కుటుంబాలు సంబంధిత పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించి మంజూరు చేస్తారు. నిర్మాణాలు పూర్తయ్యాక రూ.12వేల చొప్పున నిధులు మంజూరు చేస్తారు. ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే ఉంటుంది. అలాగే కమ్యూనిటీ టాయ్‌లెట్స్, సోక్పిట్స్ నిర్మాణాలను ఎక్కడ చేపట్టాలనే దానిపై ఎంపీడీవోలు నిర్ణయించనున్నారు. అందుకు ప్రభుత్వ స్థలాలు అవసరమున్నందున రెవెన్యూ అధికారులతో కలిసి వాటిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. బహిరంగ మల విసర్జన రహితంగా గ్రామాలను తీర్చిదిద్దడంతో పాటు నీటి వనరులు సంరక్షించేదిశగా నిర్మాణాలు సాగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. స్వచ్ఛభారత్ మిషన్ వార్షిక లక్ష్యం ఖరారు జిల్లాకు రూ.17.06 కోట్ల నిధులు పనుల ప్రారంభానికి అధికారుల కసరత్తు ఇంద్రవెల్లి మండలం ముత్నూర్‌లో ఓ కుటుంబం తమ ఇంటి వద్ద ఎస్బీఎం నిధులతో నిర్మించుకున్న ఇంకుడుగుంత ఇది. వర్షపునీటిని సంరక్షించి బోరులో నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు దోహదపడుతుంది. ఇక్కడ కనిపిస్తున్న చేదబావి నీరు వృథాగా పోకుండా చూడటంతో పాటు వర్షపునీటిని ఒడిసిపట్టేలా చేపట్టిన కమ్యూనిటీ ఇంకుడుగుంత ఇది. ఇచ్చోడ మండలం ముఖరా (కే)లో నిర్మించారు. భూగర్భజలాలు పెంపొంది బావిలో నీటి ఎద్దడి తలెత్తకుండా దోహదపడుతుంది. రూ.94వేల వ్యయంతో దీన్ని నిర్మించుకోవచ్చు.సద్వినియోగం చేసుకోవాలి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునే ఆర్థిక స్థోమత లేనటువంటి వారికి ఎస్బీఎం మంచి అవకాశం. ఈ నిధులను సద్వినియోగం చేసుకుని ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి నిర్మించుకోవాలి. అలాగే కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారు తప్పనిసరిగా ఇంటి ఆవరణలో ఇంకుడుగుంత నిర్మించుకోవాలి. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వాటి నిర్మాణాలు చేపట్టాలి. – రాథోడ్ రవీందర్, డీఆర్డీవోకంపోనెంట్ యూనిట్లు నిధులు (రూ.లక్షల్లో ) వ్యక్తిగత మరుగుదొడ్లు 5,573 668.76 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ 14 29.4 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ 03 192.00 కమ్యూనిటీ మరుగుదొడ్లు 5,522 358.93 డ్రెయిన్ల చివరన ఇంకుడుగుంతలు 376 348.73 ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడుగుంతలు 47 43.59 సామాజిక ఇంకుడుగుంతలు 393 49.41 సెగ్రిగేషన్ షెడ్లు 02 3.00 -
అమ్మ.. సృష్టికి మూలం. పదాలు తెలియని పెదవులకు ఓ అమృతం. పేరులో ప్రేమని, పిలుపులో మాధుర్యాన్ని పంచే కనిపించే దైవం. ఆ అనుబంధాన్ని ఎంత వర్ణించినా తక్కువే. దేశ రక్షణకు పేగుబంధాన్ని సైతం లెక్కచేయని వారెందరో. పొత్తిళ్ల నుంచి బిడ్డకు లోకం చూపి.. సరిహద్దు పోరుబాటకు
మాతృమూర్తులంతా త్యాగధునులే.. చిన్నప్పటి నుంచే ప్రకాశ్ సైన్యంలో పనిచేయాలని అంటుండేవాడు. ఇందుకు తగ్గట్టుగానే ఆర్మీలో జాయిన్ అయ్యాడు. మూడేళ్ల పాటు పనిచేశాడు. జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో విధులు నిర్వహించాడు. ఈ క్రమంలో 2003 నవంబర్ 16న దేశంలోకి ప్రవేశించడానికి యత్నించిన ఉగ్రవాదులతో పోరాడాడు. వారిలో కొంతమందిని చంపి, ఇద్దరు సైనికులను కాపాడి వీరమరణం పొందాడు. నా కొడుకు త్యాగాన్ని గుర్తించి 2004లో రాష్ట్రపతి చేతుల మీదుగా శౌర్య చక్ర అవార్డు అందుకున్నాను. నా లాంటి ఎంతోమంది తల్లులు దేశ రక్షణ కోసం తమ బిడ్డలను సరిహద్దుకు పంపిస్తున్నారు. వారంతా త్యాగధునులే. – లారీ బాయి, సైనిక అమరుడు గోతి ప్రకాశ్ తల్లి, అందునాయక్తండా, ఇంద్రవెల్లి -
పత్రిక స్వేచ్ఛపై దాడి
కై లాస్‌నగర్: సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై ఏపీ ప్రభుత్వం పోలీసులతో దౌర్జన్యం చేయించడాన్ని ఆదిలాబాద్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండించారు. ఏపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. నల్లబ్యాడ్జీ లు ధరించి ప్రెస్‌క్లబ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ప్రధాన ద్వా రం ఎదుట ధర్నా చేశారు. ఏపీ ప్రభుత్వానికి, పోలీ సులకు వ్యతిరేకంగా నినదించారు. ఈసందర్భంగా సాక్షిపత్రిక స్టాఫ్ రిపోర్టర్ గొడిసెల కృష్ణకాంత్‌గౌడ్, టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం.సురేశ్, టీయుడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, ఎడిటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్ మాట్లాడారు. సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేయడం సరికాదన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులతో తనిఖీలు చేసి భయభ్రాంతులకు గురిచేయడం పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకు అణచివేత వైఖరి అవలంభించడం దుర్మార్గమమని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశా రు. లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతా మని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో బి.వినోద్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో ప్రెస్‌క్లబ్ కన్వీనర్ వై.సుధాకర్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సారంగపాణి, సత్యనారాయణ, సందేశ్, వినోద్, వెంకటేశ్, రాజేష్, రాజేశ్వర్, రవి, ప్రవీణ్, సుభాష్, శ్రీకాంత్, నీలేష్, అభిలాష్, విజ య్‌రెడ్డి, మహేష్, సతీశ్‌రెడ్డి, అరుణ్‌రెడ్డి, మహేందర్, శ్రీనివాస్, పవన్, దీపక్, నరేష్, జైపాల్, అశోక్, రాజు, అస్మత్, రాకేశ్, నర్సింగ్, రాము, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ పోలీసుల తీరుపై జర్నలిస్టుల ఆందోళన కలెక్టరేట్ ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన -
● వేంకటేశ్వర ఆలయ ఆస్తులు సురక్షితమేనా..? ● ఆవరణలో చేపట్టిన ఫంక్షన్‌హాల్ నిర్మాణం వివాదాస్పదం ● దేవాదాయ శాఖ ప్రస్తావన లేకుండానే టెండర్ నోటిఫికేషన్ ● ఓ ట్రస్ట్ తీరుపై సర్వత్రా విమర్శలు
రెండంతస్తులకే అన్ని రూ. కోట్లా..? వేంకటేశ్వర ఆలయ ఆవరణలో 70 x 130 చదరపు అడుగుల స్థలంలో సెల్లార్‌తో కూడిన రెండంతస్తుల్లో ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్నారు. దీనికి రూ.7.30 కోట్ల అంచనా వ్య యం చూపిస్తున్నారు. అయితే అందులో ఎ లాంటి హంగులు కల్పిస్తున్నారు.. రాజ భవ నం ఉట్టిపడేలా ఏవైన సదుపాయాలు కల్పి స్తున్నారా.. రెండంతస్తులకే అన్ని కోట్లు ఎందుకు.. అనేది ఇప్పుడు అందరిలో వ్యక్తమవుతున్న సందేహాలు. కాగా, ట్రస్ట్ సభ్యులు భారీగా స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారనే విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ అంటేనే ప్రధాన మార్కెట్ ప్రాంతం. వ్యాపార, వాణిజ్య సముదా యాలతో నిండిపోయి ఉంటుంది. అలాంటి చోట ఓ రెండెకరాల స్థలం దేవాదాయ శాఖ, ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంయుక్తంగా కొనసాగుతుంది. స్థలం మధ్యలో వేంకటేశ్వర ఆలయం ఉండగా, చుట్టూ 46 వ్యాపార దుకాణాలు కొనసాగుతున్నాయి. వీటి ద్వారా ఏటా సుమారు రూ.50లక్షల ఆదాయం సమకూరుతుంది. అంతే కాకుండా గుడిహత్నూర్ మండలం సీతాగోందిలో ఈ ఆలయానికి సంబంధించి ఆరెకరాల భూమి కూడా ఉంది. మొత్తంగా ఏడాదికి సుమారు కోటి రూపాయల ఆదాయం వరకు లభిస్తుందని అధికారులే చెబుతున్నారు. విలువైన ఆస్తులే కాకుండా నిత్యం ఆలయానికి వచ్చే భక్తుల ద్వారా పెద్ద ఎత్తున హుండీ ఆదాయం సమకూరుతుంది. అయితే సంయుక్త నిర్వహణలో ఉన్నప్పుడు దేవాదాయ శాఖ ప్రస్తావనే లేకుండా ట్రస్ట్ పేరిట టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడం, ఆలయ ఆవరణ స్థలంలో ఫంక్షన్‌హాల్ నిర్మిస్తుండటం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. సంయుక్తంగా నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే ఇది వివాదాస్పదమయ్యేది కాదు. తద్వారా ఆలయం ఉన్న ఈ భూములపై ట్రస్ట్ కన్నేసిందా.. పూర్తిగా ఆ ఆస్తిని కాజేయాలనే కుటిల యత్నాలకేమైనా పాల్పడుతుందా అనే అనుమానాలు పట్టణ ప్రజలకు కలుగుతున్నాయి. దీంతో ఆలయ భూములు సురక్షితమేనా.. లేని ప క్షంలో అన్యాక్రాంతం అయ్యే ప్రమాదమేమైన ఉందా.. అనే సందేహాలు భక్తుల్లో వ్యక్తమవుతున్నాయి. హుండీ ఆదాయంతో నిర్మాణం.. సాధారణంగా ఆలయానికి వచ్చే భక్తుల ద్వారా కానుకలు, డబ్బులు వంటివి వచ్చినప్పుడు దా నికి సంబంధించిన లెక్కలు స్పష్టంగా ఉండాలి. సంయుక్త నిర్వహణలో ఉన్నప్పుడు అసలు ఇవి అటు దేవాదాయ శాఖకు, ఇటు ట్రస్ట్‌కు ఎంత చెందాలనే విషయాల్లోనూ ఒక స్పష్టత ఉండా లి. అంతే కాకుండా వీటిని అభివృద్ధి పనులకు వెచ్చించినప్పుడు అందులో దేవాదాయ శాఖ సొమ్ము ఎంత..? ట్రస్ట్ భాగస్వామ్యం ఎంత అనే వివరాలు స్పష్టంగా ఉంటే భవిష్యత్తులో వివాదాలకు ఆస్కారం ఉండదనే అభిప్రాయం పలువురు భక్తుల్లో ఉంది. అయితే ట్రస్ట్ ఏకపక్షంగా నోటిఫికేషన్ ఇవ్వడం, అందులో ఒక అధికారి హోదాను ప్రస్తావించినప్పటికీ కనీసం ఆయనది ఏ శాఖ అనేది కూడా దానికింద పేర్కొనకపోవడం అనుమానాలకు తావిస్తోంది.ఆ టెండర్‌పై స్పష్టత లేదు..టెండర్ నోటిఫికేషన్లో దేవాదాయ శాఖ ప్రస్తావన ఎందుకు లేదనే విషయంలో నాకు స్పష్టత లేదు. అయితే దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తిగా ఇక్కడి నుంచి జరిగిన తర్వాత హెడ్ ఆఫీస్ నుంచి టెండర్ ఆన్లైన్ ద్వారా నిర్వహించారు. ఈవో వద్దే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంది. – నవీన్‌కుమార్, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, ఆదిలాబాద్శాఖ పేరు రాశాం.. ప్రచురణల్లో మారింది టెండర్ నోటిఫికేషన్‌కు సంబంధించి మేము శాఖాపరంగా రాసిచ్చిన దాంట్లో ఎగ్జిక్యూటి వ్ ఆఫీసర్, దేవాదాయశాఖ అని పొందుపరి చాం. ఐఅండ్పీఆర్లో మారి ఉండవచ్చు. ట్రస్ట్వాళ్లకు పూర్తిగా ఇచ్చే అధికారం లేదు. – రమేశ్, ఈవో, దేవాదాయ శాఖ -
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయండి
● కలెక్టర్ రాజర్షి షా కై లాస్‌నగర్: నీతి ఆయోగ్ ఆస్పరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో భాగంగా నార్నూర్ మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వర్షాలు కురిసేలోపు వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. రీచార్జ్ స్ట్రక్చర్స్, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాల పనుల పురోగతిపై శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పూడికతీతలో భాగంగా ఇంకా ప్రారంభం కాని చెరువుల్లో వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. కమ్యూనిటీ సోక్పిట్స్ను 63 గ్రామాలకు మంజూరు చేశామని వాటిని ప్రారంభించేలా చూడాలన్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రారంభించి ప్రతి ఒక్కరూ నిర్మించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సామ్.. మామ్ పిల్లల పురోగతి, ఐరన్ ఫోలిక్ మాత్రలు, ఫాంపాండ్, బోర్‌వెల్స్, తాగునీరు, పొలంబాట, ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఇందులో డీఆర్డీవో రవీందర్ రాథోడ్, డీడబ్ల్యూవో మిల్కా, పీఆర్ ఈఈ రాథోడ్ శివరాం, బీఏఐఎఫ్ ఎన్జీవో ప్రతినిధులు సాయి, సుధాకర్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే తప్పకుండా విజయం సాధిస్తారని తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లభోజు గోపీకృష్ణ అన్నారు. ఇటీవల వెల్లడైన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల నుంచి టాపర్లుగా నిలిచిన ముగ్గురు విద్యార్థులను సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. బంగా రుగూడ మోడల్ స్కూల్ విద్యార్థి చిల్కూరి రమ(578 మా ర్కులు), జెడ్పీఎస్ఎస్ కజ్జర్ల విద్యార్థి గిజ్జ అ నుశ్రీ (576 మార్కులు), బంగారుగూడ మోడ ల్ స్కూల్ విద్యార్థి సట్లావార్ హరీష్(575మార్కులతో) టాపర్లుగా నిలిచా రు. వారిని శాలువాలతో సత్కరించారు. జ్ఞాపికలు అందజేసి అభినందించారు. మున్ముందు మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంఘం మహిళా అధ్యక్షురాలు జీజాబాయి, కప్పర్ల పాఠశాల ప్రధానోపాధ్యా యుడు ఆనంద్, బంగారుగూడ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజశేఖర్, విశ్రాంత అధ్యాపకులు విజయబాబు, తపస్ నాయకులు కృష్ణ సాగర్, గోపీచంద్, గంభీర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్‌టౌన్: కేసుల దర్యాప్తులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని నేరస్తుల ను పట్టుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన సెంట్రల్ డిటెక్టివ్ ద్వారా స్థానిక పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని సమావేశ మందిరంలో నూతన ఎస్సైలు, సిబ్బందికి రెండు రోజుల శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరస్తులు వినియోగించే ఆపరేటింగ్ సిస్టం, ఐపీ అడ్రస్, లొకేషన్ వంటివి కనుగొనే పద్ధతులను వివరించారు. అలాగే న్యాయస్థానంలో నేరస్తులకు శిక్షలు పడేందుకు కావాల్సిన పంచనామా రాసే విధానం, ముఖ్యంగా మహిళల మి స్సింగ్ కేసులు, సైబర్ క్రైమ్ ఫ్రాడ్ కేసుల్లో విచారణ చేసే పద్ధతులపై పూర్తి పరిజ్ఞానం సంపాదించాలని సూచించారు. ఇందులో జైనథ్ సీఐ డి.సాయినాథ్, రూరల్ సీఐ కె.ఫణిదర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి.వెంకటి, అఖిలేష్రావు, సైబర్ ఎక్స్పర్ట్ శ్రీధర్, డిజిటల్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ మహేందర్‌రెడ్డి, సీడీఆర్, ఐపీడీఆర్ ఎక్స్పర్ట్ హైదరాబాద్, సిబ్బంది పాల్గొన్నారు. మట్టి తవ్వకాలకు దరఖాస్తుల స్వీకరణకై లాస్‌నగర్: జిల్లాలో మట్టి తవ్వకాల అనుమతి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవా లని కలెక్టర్ రాజర్షి షా ప్రకటనలో తెలి పారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ గనులు, భూగర్భశాఖ, నిజామాబాద్ (mines.telangana.go v.in) వెబ్సైట్లో సంప్రదించాలని పేర్కొన్నారు. మొద టి మట్టి/గ్రావెల్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించి, మండల సర్వేయర్, లైసెన్స్ సర్వేయర్‌తో స్కెచ్ గీయించుకుని, పాస్‌బుక్, ఆధార్‌కార్డుతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వాటిని పరిశీలించి సర్వే, తనిఖీ అనంతరం ఆదిలాబాద్ ఉప సంచాలకులకు పంపించనున్నట్లు తెలిపారు. అనంతరం అనుమతులు మంజూరు చేస్తారని పేర్కొన్నారు. -
‘సెర్ప్’ బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
● ప్రత్యేక జీవో జారీ చేసిన ప్రభుత్వం ● మార్గదర్శకాల కోసం ఉద్యోగుల నిరీక్షణ ● నెలాఖరు వరకు ప్రక్రియ పూర్తయ్యే అవకాశంజిల్లాలో సెర్ప్ ఉద్యోగుల వివరాలు ఏడీఆర్డీవో: 01 డీపీఎంలు : 07 ఏపీఎంలు : 23 సీసీలు (ఎల్1, ఎల్2): 68 ఎంఎస్‌సీసీలు : 45 అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు : 06 ఆఫీస్ అసిస్టెంట్లు : 03 కై లాస్‌నగర్: సెర్ప్ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో అన్ని కేటగిరీల వారు ఉంటారని ఇటీవల ప్రత్యేక జీవో జారీ చేసింది. విధి విధానాలు ఖరారు చేసి త్వరలోనే మరో ఉత్తర్వు జారీ చేస్తామని అందులో స్పష్టం చేసింది. దీంతో ఏడేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న వారికి స్థానచలనం కలగనుంది. ఇతర జిల్లాల్లో పనిచేసే వారు సొంత జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ ఈ నెలాఖరులోపు పూర్తి కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏడేళ్లుగా తప్పని ఎదురుచూపులు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో సెర్ప్, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ వంటి రెండు విభాగాల్లో ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. సెర్ప్ పరిధిలో పనిచేసే ఏపీడీలు, డీపీఎంలు, ఏపీవో పోస్టులకు జోనల్ స్థాయిలో, ఏపీఎంలు, సీసీలకు జిల్లాస్థాయిలో బదిలీలు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారిలో ఏపీవో, ఈసీలు, టీసీ, డీఆర్పీ, డీడీ సీఎల్ఆర్సీ, డీబీటీ మేనేజర్, ప్లాన్డ్ సూపర్వైజర్ పోస్టులకు జోనల్ స్థాయిలో, అలాగే టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు జిల్లాస్థాయిలో బదిలీలు చేపట్టాల్సి ఉంటుంది. ఇతర అన్ని ప్రభుత్వ శాఖల్లో మాదిరిగానే మూడేళ్లకోసారి వీరికి కూడా బదిలీలు నిర్వహించాలనేది ప్రభుత్వ నిబంధన. అయితే ఆయా విభాగాల్లో ఏడేళ్లుగా ఈ ప్రక్రియ నిర్వహించలేదు. దీంతో సదరు ఉద్యోగులు దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తూ బదిలీ కోసం నిరీక్షిస్తున్నారు. నిరీక్షణకు తెరపడే అవకాశం సెర్ప్, ఈజీఎస్ ఉద్యోగులకు చివరిసారిగా 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బదిలీల ప్ర క్రియ నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వ వచ్చాక గతేడాది జూలై, ఆగస్టు నెలల్లో అన్ని ప్రభుత్వ శా ఖల్లో బదిలీలు చేపట్టింది. అయితే తమకు కూడా బదిలీ అవుతుందని ఆయా విభాగాల్లో పనిచేసే అ ధికారులు, ఉద్యోగులు ఆశపడ్డారు. డీఆర్డీఏ అధికా రులు కసరత్తు కూడా చేపట్టారు. అయితే ప్రభుత్వం వారి బదిలీలకు నాడు అవకాశమివ్వలేదు. అప్పటి నుంచి వారు మంత్రి సీతక్కతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులకు విన్నవిస్తూనే ఉ న్నారు. వారి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఎట్టకేలకు బదిలీల ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్గదర్శకాలు అందిన వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించేలా జిల్లా గ్రామీ ణాభివృద్ధిశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తద్వారా జిల్లాలో దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేసిన ఉద్యోగులకు స్థానచలనం కలగనుండగా ఇతర జిల్లాల్లో పనిచేసే వారు సొంత జిల్లాకు వచ్చే అవకాశముంది. కొత్తగా ఏర్పడ్డ మండలాల్లోనూ పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ అయ్యే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ఉపాధి హామీ ఉద్యోగుల బదిలీల నిర్వహణకు సంబంధించి మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టతనివ్వలేదు.నెలాఖరులోపు పూర్తయ్యే అవకాశంసెర్ప్ ఉద్యోగుల బదిలీల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. త్వరలోనే మార్గదర్శకాలను ప్రకటింనుంది. వాటి ఆధారంగా ఈ నెలాఖరులోపూ ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది. ‘ఉపాధి’ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రానప్పటికి వారిని కూడా బదిలీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే అందుకు సంబంధించిన ఉత్తర్వులు అందే అవకాశముంది. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా కౌన్సెలింగ్ ప్రక్రియ పారదర్శకంగా చేపడుతాం. – రాథోడ్ రవీందర్, డీఆర్డీవో -
‘మహా’జొన్నలు రాకుండా తనిఖీలు
తలమడుగు: మహారాష్ట్ర నుంచి తెలంగాణకు అక్రమంగా జొన్నలు రాకుండా పకడ్బందీ తనిఖీలు చే పడుతున్నట్లు వ్యవసాయాధికారి ప్రమోద్‌రెడ్డి తెలి పారు. గురువారం మండలంలోని లక్ష్మీపూర్ చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాన్ని పరిశీ లించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మ హారాష్ట్ర నుంచి కొందరు దళారులు తక్కువ ధరకు జొన్నలు కొనుగోలు చేసి ఆదిలాబాద్ మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మహారాష్ట్ర నుంచి అనుమతి లేకుండా జొన్నలు తరలిస్తే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లక్ష్మీపూర్ చెక్‌పోస్టుతోపాటు రెవెన్యూ, పోలీస్, వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి మహారాష్ట్రకు అనుమతి లేకుండా పత్తి విత్తనాలు తీసుకువెళ్లేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం చెక్‌పోస్ట్ సిబ్బంది ద్వారా వివరాలు తెలుసుకున్నారు. పోలీస్, వ్యవసాయ, రెవెన్యూ, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
● జిల్లాలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపు కమిటీ తీరుపై విమర్శలు ● నోటిఫికేషన్లో ప్రస్తావించకుండానే ఈఏండీ రూ.5లక్షలకు పెంపు ● దరఖాస్తు ఫారం కూర్పుపై సందేహాలు ● బోరుమంటున్న ఏజెన్సీ నిర్వాహకులు
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపునకు సంబంధించి కొత్త ఎంప్యానల్మెంట్ టెండర్ల వ్యవహారంలో ఉపాధికల్పన శా ఖ, ఏజెన్సీల గు ర్తింపు కమిటీ తీ రుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో దరఖాస్తు ఫీ జు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు ఉండేది. ఈ ఎండీ రూ.2లక్షలుండే ది. తాజా టెండర్లలో ఎ న్నో రెట్లు అధికంగా నిర్ధారించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కమిటీలో కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా ఉపాధికల్పన అ ధికారి మెంబర్ కమ్ కన్వీనర్‌గా, కోశాధికారి, లేబర్ అధికారి సభ్యులుగా ఉంటారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు ఫీజు, ఈఎండీ పెంపునకు సంబంధించి నిర్ణయం కమిటీ తీసుకున్నదా.. ఉపాధికల్పన శాఖ నుంచి దీన్ని రూపొందించారా.. అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈఎండీ రూ.5లక్షలా? జిల్లాలోని వివిధ ప్రభుత్వ శా ఖల్లో అవుట్సోర్సింగ్ స ర్వీసులు ఏర్పాటుకు కొ త్త ఎంప్యానల్మెంట్ కు నమోదిత ఏజెన్సీల నుంచి ఈనె ల 2నుంచి 13వర కు జిల్లా ఉపాధికల్పన కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. టెండర్ నోటిఫికేషన్లో దరఖాస్తు ఫారం కో సం రూ.10వేల డీడీ చెల్లించి ఆఫీసులో తీసుకోవచ్చని స్పష్టంగా పేర్కొన్నారు. ఈఎండీ ఎంత చెల్లించాలనే విషయాన్ని దరఖాస్తులో ఎక్కడా ప్రస్తావించలేదు. ఇటీవల ఓ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు డీడీ చెల్లించి దరఖాస్తు ఫారం తీసుకున్నాడు. దాంట్లో రూ.5లక్షల ఈఎండీ దరఖాస్తు ఫారంతో పాటు జతచేసి ఇవ్వాలని నిబంధనల్లో పేర్కొనడంతో నిర్ఘాంతపోయాడు. అసలు ఇంత పెద్దమొత్తంలో ఈఎండీ చెల్లించాలని నోటిఫికేషన్లో పేర్కొని ఉంటే దరఖాస్తు ఫారం కొనుగోలు చేసేవాడిని కాదని లబోదిబోమంటున్నాడు. అడ్డగోలు నిబంధనలెలా? టెండర్ నోటిఫికేషన్లో ఈఎండీ ప్రస్తావన లేదు. దరఖాస్తు ఫారం కొన్న తర్వాత అందులో ఈఎండీ ప్రస్తావన, అడ్డగోలు నిబంధనలున్నాయి. ఈఎండీ కోసం రూ.5లక్షలు చెల్లించలేని పరిస్థితుల్లో ఆ ఏజెన్సీ నిర్వాహకుడు దరఖాస్తు ఫారం కోసం చెల్లించిన రూ.10వేలు నష్టపోవాల్సి వస్తోంది. రూ.కోటి టర్నోవర్ రెండేళ్లలో కలిగి ఉండాలని, అది కూడా గడిచిన మూడేళ్లదే పరిగణనలోకి తీసుకోనున్నట్లు దాంట్లో పేర్కొన్నారు. ఇదివరకు 100 మంది ఉద్యోగుల నిర్వహణ చేసిన అనుభవం కలిగి ఉండాలని వివరించారు. ఏజెన్సీ ఎంపికైన తర్వాత ఏదైన శాఖ లో అవుట్సోర్సింగ్ నిర్వహణ కల్పించినప్పుడు ఉ ద్యోగుల సంఖ్యకు అనుగుణంగా ఏజెన్సీ ముందుగానే ఒకనెల వేతనాల డబ్బులను డిపాజిట్ చేయాలని దాంట్లో పేర్కొన్నారు. ఈ నిబంధనలన్నీ దరఖాస్తు ఫారంలో పేర్కొని ఉండాల్సిందనే అభిప్రాయం ఏజెన్సీ నిర్వాహకులు వ్యక్తంజేస్తున్నారు. కొన్ని ఏజెన్సీలకు మేలు చేసేందుకే.. ఇతర జిల్లాల్లోనూ ఇలాగే.. జీవోలో ఈ నిబంధనలు లేకపోయినా ఇతర జిల్లాల్లో కొనసాగుతున్న విధానాన్నే మేము ఫాలో అయ్యాం. అక్కడ లేని అభ్యంతరాలు ఇక్కడే ఎందుకు. జిల్లా అవుట్సోర్సింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాల మేరకే వీటిని అమలు చేస్తాం. – మిల్కా, జిల్లా ఇన్చార్జి ఉపాధికల్పన అధికారి జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కొన్ని ఏజెన్సీలకు మేలు చేసేందుకే కొత్త ఎంప్యానల్మెంట్ ఏర్పాటులో ఇలా అడ్డగోలు నిబంధనలు రూపొందించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2006లో అవుట్సోర్సింగ్ ఏజెన్సీల గుర్తింపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 4459 ప్రకారమే వెళ్తున్నామని అధికారులు చెబుతుండగా, దాంట్లో ఈఎండీ, ఇతర నిబంధనలు ఇలా రూపొందించాలని లేదని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. కొన్నేళ్లుగా జిల్లాలో యాక్టివ్‌గా ఉన్న కొన్ని ఏజెన్సీలకు మేలు చేసేలా జిల్లా అధికారులు కుయుక్తులకు పాల్పడుతున్నారని వారు నేరుగా ఆరోపిస్తున్నారు. -
అర్హులకే ఇళ్లు కేటాయించాలి
నార్నూర్: అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించా లని రెండోరోజు గురువారం దరఖాస్తుదారులు మండల కేంద్రంలోని ప్రధాన మార్కెట్ గాంధీ చౌక్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం వీరికి సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ కమిటీలో కాంగ్రెస్ నాయకులే ఉండడంతో వారి కుటుంబ సభ్యులకే ఇళ్లు కేటాయించుకున్నారని ఆరోపించారు. కలెక్టర్ సూచన మేరకు కమిటీలో అన్ని వర్గాల వారికి భాగస్వామ్యం కల్పించాలని కోరారు. పాత కమిటీలు రద్దు చేసి, అన్ని వర్గాల వారితో కొత్త కమిటీలు వేసి అర్హులకే ఇళ్లు దక్కేలా చూడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ గంగాసింగ్ ఆందోళన వద్దకు చేరుకుని ఉన్నతాధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్తానని చెప్పగా ఆందోళన విరమించారు. కలెక్టర్, జెడ్పీ సీఈవో ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో డీఎల్పీవో ప్రత్యేకంగా ఇందిరమ్మ కమిటీ సభ్యులతో పా టు దరఖాస్తుదారులతో సమావేశమయ్యారు. అ క్కడా ఇందిరమ్మ కమిటీ రద్దు చేయాలని పట్టుపట్టారు. ఇందిరమ్మ కమిటీ నిర్ణయం ప్రకారమే ఇళ్లు కేటాయించామని, మార్పు ఉండదని డీఎల్పీవో చెప్పారు. రాని వారికి మరో విడతలో మంజూరు చేయనున్నట్లు చెప్పడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబితాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ దృష్టికి సమస్య తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో శాంతించారు. బీజేపీ మండలాఽ ద్యక్షుడు భిక్షపతి రాథోడ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు చాల్కుర్ ప్రకాశ్, పెసా చట్టం కోఆర్డినేటర్ రాథోడ్ సీకేందర్, అన్నాభావు సాఠె కమిటీ మాజీ మండలాధ్యక్షుడు రాజ్పంగే రాజు తదితరులున్నారు. -
బహిరంగ ప్రదేశాల్లో ఫ్లెక్సీలొద్దు
ఆదిలాబాద్‌టౌన్: అనుమతి లేకుండా బహిరంగ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఏడాది జైలు, రూ.5వేల వరకు జరిమానా విధించే అవకాశముందని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం వన్‌టౌన్‌లో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ శాఖ తరఫున ఏర్పాటు చేసిన ప్రదేశంలో రుసుం చెల్లించి అనుమతి తీసుకున్నాకే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు మాట్లాడుతూ.. ప్రమాదాలకు కారణమయ్యే ప్లాస్టిక్ ఫ్లెక్సీల ఏర్పాటు నిషేధమని తెలిపారు. వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్ పాల్గొన్నారు. -
23 ఏళ్లు.. 108 సామూహిక వివాహాలు
● పోలీసులు ‘మీ కోసం’లో భాగంగా ఇచ్చోడలో సామూహిక వివాహాలు ఇచ్చోడ: నేటికీ సరిగ్గా 23 ఏళ్ల క్రితం మండల కేంద్రంలో 108 ఆదివాసీ జంటలకు పోలీసులు సా మూహిక వివాహాలు జరిపించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ జంటలను ఏకం చేశారు. అప్పట్లో ఉమ్మడి జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లోని యువతపై నక్సలిజం ప్రభావం ఉండేది. కొందరు సానుభూతిపరులుగా, మరికొందరు నక్సలిజంలో పనిచేయడానికి ఆసక్తి చూపేవారు. వారు అటు వైపు మళ్లకుండా ప్రజాజీవితంలో అడుగులు వేయించడానికి అప్పటి ఎస్పీ మహేశ్ భగవత్ చర్యలు చేపట్టారు. ఆదివాసీ పెద్దలు, రాయి సెంటర్ సార్ మేడిలతో చర్చించి ఆదివాసీ యువతకు సంప్రదాయంగా సామూహిక వివాహాలు జరిపించడానికి నిర్ణయించారు. ఇందులో భాగంగా చాలా మంది నక్సల్స్ సానుభూతిపరులకు వివాహాలు జరిపించి వారి దృష్టి మళ్లించడంలో సఫలీకృతులయ్యారు. రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసికెళ్లి కొంతమందికి హోంగార్డ్ ఉద్యోగాలిప్పించారు. నక్సలిజం వైపు నుంచి దృష్టి మళ్లించేందుకే.. జిల్లాలో యువత నక్సలిజానికి ఆకర్షితులవడం, అందులో చేరడంతో వారి కార్యకలాపాలు జిల్లాలో ఉధృతంగా కొనసాగేవి. దీంతో యువతను గుర్తించి అప్పటి ఎస్పీ మహేశ్ భగవత్, కలెక్టర్ రామకృష్ణారావు (ప్రసుత సీఎస్) అప్పటి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. ‘పోలీసులు మీ కోసం’ కార్యక్రమం చేపట్టి 2002 మే 9న 108 ఆదివాసీ జంటల కు వివాహాలు జరిపించారు. తాళి, నూతన వస్త్రాలు అందించారు. 20వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. వధూవరులను మూడు ప్రత్యేక బస్సుల్లో తిరుపతికి తీసుకువెళ్లి వేంకటేశ్వరస్వామి దర్శన భా గ్యం కల్పించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2002లో ప్రారంభమైన ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇచ్చోడలో నిర్వహించిన సాముహిక వివాహాలకు ఉమ్మడి అంధ్రప్రదేశ్ సమాచారశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జౌళిశాఖ మంత్రి పడాల భూమ న్న, గిరిజన శాఖ మంత్రి, ప్రస్తుత ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, కలెక్టర్ రామకృష్ణారావు, ఎస్పీ మహేశ్ భగవత్, ఓఎస్టీ దేవేంద్రసింగ్ చౌహాన్, ఆదివాసీ సంఘాల నాయకులు హాజరయ్యారు. -
● నాలుగేళ్లుగా విత్తన సబ్సిడీ ఎత్తివేత ● ప్రైవేట్‌లో ఏటా పెరుగుతున్న ధరలు ● జిల్లాలో తగ్గుతున్న సాగు విస్తీర్ణం
ఈ ఫొటోలోని రైతు పేరు రాథోడ్ రాందాస్. ఇతనిది ఇచ్చోడ మండలం దేవుల్‌నాయక్ తండా. ఇతడు నాలుగేళ్లుగా వానాకాలంలో 6 నుంచి 8 ఎకరాల్లో సోయా సాగు చేస్తున్నాడు. ప్రభుత్వం నాలుగేళ్లుగా సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయకపోవడం, ప్రైవేట్‌లో విత్తనాల ధరలు భారీగా పెరగడంతో ఈ ఏడాది రెండెకరాల్లోనే సోయా సాగు చేశాడు. జిల్లాలో ఇలా అనేక మంది రైతులు సోయా సాగును తగ్గిస్తున్నారు. ఇచ్చోడ: జిల్లాలో సోయాసాగు నాలుగేళ్లుగా తగ్గు తూ వస్తోంది. పత్తికి ప్రత్యామ్నాయ పంటగా జిల్లాలో చాలామంది రైతులు సోయా సాగు చేసేవారు. సోయా విత్తనాలపై ప్రభుత్వంసబ్సిడీ ఎత్తివేయడం, ఏటేటా ప్రైవేట్‌లో విత్తనాల ధరలు పెరగడంతో రైతులు సాగుకు ముందుకు రావడంలేదు. జిల్లాలో గతంలో పత్తికి సమానంగా సోయా సాగయ్యేది. నాలుగేళ్లుగా సోయా సాగు సగానికి పడిపోయింది. పెరుగుతున్న విత్తనాల ధర ప్రభుత్వం 30కిలోల సోయా విత్తనాల సంచినిఽ రూ.1,718కు పంపిణీ చేసేది. ఎకరాకు 30 కిలోల విత్తనాలు సరిపోయేది. దీంతో రైతులు పత్తికి ప్రత్యామ్నాయంగా సోయా సాగు చేశారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు సరఫరా చేయడంలేదు. ప్రైవేట్‌లో సోయా విత్తనాల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. 2023–24లో 30 కిలోల విత్తనాల సంచి ధర రూ.2.650, 2024–25లో రూ.2,800కు పెరిగింది. 2025–26లో ప్రైవేట్ కంపెనీలు ఇంకా ధరలు నిర్ణయించలేదు. ప్రైవేట్‌లో విత్తనాల ధరలు ఏటేటా పెరుగుతుండడం రైతులకు భారంగా మారింది. ఐదెకరాల్లో సాగు చేయాలంటే ఐదు సోయా విత్తనాల బస్తాలకు ప్రైవేట్‌లో రూ.14 వేలు అవుతుండగా, ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తే రూ.8,590 మాత్రమే అయ్యేది. ఐదెకరాల్లో సాగు చేసే రైతుపై రూ.5,410 అదనపు భారం పడుతోంది. సబ్సిడీ విత్తనాల సరఫరా నిలిచిపోవడం, ప్రైవేట్‌లో విత్తనాల ధర ఏటా పెరిగిపోతుండడంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో సోయా సాగును తగ్గిస్తున్నారు. నీటి సౌకర్యముండి వానాకాలం, రబీలోనూ సోయా సాగు చేసిన రైతులు ఇప్పుడు ఒక్క సీజన్లో కూడా సాగు చేసేందుకు ముందుకు రావడంలేదు. జిల్లాలో సోయా సాగు వివరాలు సంవత్సరం విస్తీర్ణం (ఎకరాల్లో) 2023–24 1,32,363 2024–25 65,464 2025–26 62,500 -
ఆదిలాబాద్‌కు చేరిన రథయాత్ర
ఆదిలాబాద్‌రూరల్: బీసీలకు 42శాతం రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని, దేశ వ్యాప్తంగా కులగణన ప్రక్రియ శాసీ్త్రయ పద్ధతిలో వెంటనే చేపట్టాలని బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ మేలుకో రథయాత్ర గురువారం ఆదిలాబాద్‌కు చేరింది. బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ ఆవరణలోని జ్యోతీబాఫూలే విగ్రహానికి ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కని సంజయ్‌కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యమాన్ని ప్రతీ పల్లెలో బలోపేతం చేసి బీసీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో రథయాత్ర ప్రారంభించినట్లు చెప్పారు. సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్, నాయకులు జక్కుల సత్యనారాయణ, దాసరి రమేశ్, బొమ్మకంటి రమేశ్, చిలుక విలాస్, ఎర్రం నర్సింగ్‌రావ్, ఉదారి నగేశ్, అల్లూరి భూమన్న, దర్శనాల నగేశ్, తన్నీరు నవత, అసం రమాదేవి, ఊషన్న, కుర్ర రవి, చిప్ప గంగన్న, దాసరి రమేశ్ తదితరులున్నారు. -
తాగునీటి సమస్య రానివ్వద్దు
కై లాస్‌నగర్: గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా ఆ దేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తాగునీటి సరఫరాపై ఎంపీడీవోలు, ఎంపీవోలు, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. స్థానిక నీటి వనరులు, వా టర్ ట్యాంకర్లను వినియోగించుకోవాలని సూ చించారు. మిషన్ భగీరథ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల్లో క్లోరినేషన్ చేసి నీటిని సరఫరా చేయాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో మిషన్ భగీరథ నీరు వృథా కాకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. లాండసాంగ్వి ఇన్‌టెక్‌వెల్ పంప్‌హౌస్ వద్ద రూ.40లక్షలతో చేపట్టిన మరమ్మ తు పనుల అనంతరం సరిపడా నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. 170 సర్వే ప్లాట్ల వద్ద వి ద్యుత్ సరఫరా లేని కారణంగా ట్యాంకుల ద్వారా నీటిని అందించాలని సూచించారు. లీకేజీలుంటే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేసి నిరంతరం నీటి సరఫరా చేయాలని సూచించారు. చేతిపంపులకు సంబంధించిన విడిభాగాల టెండర్లను పూర్తి చేసి ఏరోజుకారోజు మరమ్మతు చేపట్టాలని ఆదేఽశించారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రావణ్‌కుమార్, డీపీవో శ్రీలత, డీఎల్పీవో ఫణీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజర్షిషా అధికారులతో సమీక్ష -
ట్రాక్టర్ల కొను‘గోల్మాల్’
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ట్రాక్ట ర్ల కొనుగోలుమాల్ చోటుచేసుకుంది. వాటిని సరఫ రా చేసిన కాంట్రాక్టర్‌కు బల్దియా అధికారులు బహిరంగ మార్కెట్ కంటే అధిక ధర చెల్లించడం ఇందు కు బలాన్ని చేకూరుస్తుంది. ఏదైన పనిచేసిన కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించేందుకు నెలల తరబడి తి ప్పుకునే అధికారులు ట్రాక్టర్లను సరఫరా చేసిన కాంట్రాక్టర్‌కు మాత్రం ట్రాలీలు అందించకుండానే అ డ్వాన్స్‌గా బిల్లులు పూర్తిగా చెల్లించడం అనుమానా లకు తావిస్తోంది. బల్దియాలోని ఓ కీలక అధికారి వెనుకుండి ఈ వ్యవహారాన్ని నడిపించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలోని పలు వార్డు ల నుంచి చెత్త సేకరణ కోసం మూడు కొత్త ట్రాక్టర్లు కొనుగోలు చేయాలని బల్దియా అధికారులు నిర్ణయించారు. వాటి సరఫరా కోసం గతేడాది డిసెంబ ర్లో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆదిలాబా ద్‌కు చెందిన ఇద్దరు టెండర్లు దాఖలుచేశారు.ఇందు లో చింతామణి ఏజెన్సీకి చెందిన కాంట్రాక్టర్‌కు టెండర్ కట్టబెట్టారు. సదరు కాంట్రాక్టర్ సోనాలిక కంపెనీకి చెందిన డిఐ35ఆర్ఎక్స్ 40హెచ్‌పీ సామర్థ్యంతో కూడిన మూడు ట్రాక్టర్లను ఈ ఏడాది జనవరిలో మున్సిపాలిటీకి అప్పగించారు. కేవలం ఇంజన్లను మాత్రమే అందించారు. చెత్తసేకరణలో కీలకమైన ట్రాలీలను సరఫరా చేయకపోవడంతో మూడు నెలలుగా బల్దియా కార్యాలయ సమీపంలోని వాటర్ ట్యాంక్ సమీపంలో వృథాగా దర్శనమిస్తున్నాయి. షోరూం కంటే అధిక ధరకు ... సోనాలిక కంపెనీ ట్రాక్టర్ ఇంజన్, ట్రాలీతో కలిపి షోరూం ధర రూ.9లక్షలుగా ఉంది. ఓ రైతు సంబంధిత ట్రాక్టర్ కొనుగోలు చేసేందుకు వెళ్లగా షోరూం ప్రతినిధులు ఆ ధరతో ట్రాక్టర్ డెలివరీ చేసేందుకు కొటేషన్ అందించారు. ఇందులో డీఐ 35 ఆర్ఎక్స్–హెచ్‌పీ 40 సామర్థ్యంతో కూడిన ఇంజన్‌తో పాటు టెంపరరీ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ కలిపి రూ. 6,70,000, ట్రాలీకి రూ.2,30,000కి గా అందులో పేర్కొన్నారు. బేరమాడితే ఇందులో నుంచి రూ. 50వేలు తగ్గించే అవకాశమున్నట్లు షోరూం ప్రతి నిధులు సదరు రైతుకు వెల్లడించారు. ఇదిలా ఉంటే బల్దియా అధికారులు కేవలం ఒక్కో ట్రాక్టర్ ఇంజన్‌కే రూ.8.70లక్షల చొప్పున మూడింటికి కలిపి రూ.26,10,000లను సదరు కాంట్రాక్టర్‌కు చెల్లించారు. జీఎస్టీతో కలిపి రూ.31,10,598లను బిల్లుగా అందజేశారు. వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ను బల్దియా నుంచే చెల్లించాల్సి ఉంటుందని ము న్సిపల్ అధికారులు చెబుతున్నారు. ట్రాలీ అందజే స్తే దానికి అందనంగా మరో సుమారు రూ.2.30లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈలెక్కన ఒక్కో ట్రాక్టర్‌కు రూ.11లక్షలను చెల్లించాల్సి వస్తోంది. ఇన్సూరెన్స్‌తో కలిపితే ఆ నిధులు మరింత అధికమమయ్యే అవకాశముంది. కంపెనీ షోరూం ధరతో పోల్చితే ఒక్కో ట్రాక్టర్‌కు సుమారు రూ.2.20లక్షలు అధికంగా చెల్లించినట్లైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. నిబంధనల ప్రకారం టెండర్ దాఖలు చేసే కాంట్రాక్టర్ మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ఇస్తేనే తీసుకోవాల్సి ఉంటుంది. పైగా పలు కంపెనీలకు సంబంధించిన ధరలను పరిశీలించాకే టెండర్లో వాటి ధరను నమోదు చేసి టెండర్ దాఖలు చేయాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బినామీగా.. ఆ అధికారి? నిబంధనలకు విరుద్ధంగా సాగిన ఈ కోనుగోల్మాల్లో బల్దియాకు సంబంధించిన ఓ అధికారి చక్రం తిప్పినట్లుగా ఆరోపణలున్నాయి. సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీ పేరిట సదరు అధికారే బినామీగా టెండర్ దాఖలు చేసి ఈ వ్యవహారాన్ని నడిపించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫలితంగానే షోరూం కంటే అధిక ధరకు వాటిని కొనుగోలు చేయడంతో పాటు ట్రాలీలు సరఫరా చేయకుండానే అడ్వాన్స్‌గా కాంట్రాక్టర్‌కు బిల్లులు పూర్తిగా చెల్లించారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి ప్రజాధనం వృథా కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. షోరూం ధర కంటే అధికంగా చెల్లింపు చక్రం తిప్పిన ఓ బల్దియా అధికారి? ట్రాలీలు లేకుండానే అడ్వాన్స్‌గా బిల్లుల చెల్లింపు ఆదిలాబాద్ బల్దియాలోని పరిస్థితి నిబంధనలకు అనుగుణంగానే .. ట్రాక్టర్ల కొనుగోలు కోసం నిబంధనల ప్రకారమే టెండర్ల ప్రక్రియ నిర్వహించాం. తక్కవ ధరకు కోడ్ చేసిన కాంట్రాక్టర్‌కే వాటి సరఫరా బాధ్యతలు అప్పగించాం. ఇంజన్లు మాత్రమే సరఫరా చేశారు. ట్రాలీలు రెండు మూడు రోజుల్లో రానున్నాయి. బహిరంగ మార్కెట్ ధర కంటే ఎక్కువకు కొనుగోలు చేశారనే దాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. – సీవీఎన్ రాజు, మున్సిపల్ కమిషనర్, ఆదిలాబాద్ -
పహల్గాం బాధితులకు సిందూర్‌తో నివాళి
ఆదిలాబాద్: పహల్గాం బాధితులకు ఆపరేషన్ సిందూర్ ఘన నివాళి అందించింది అని సనాతన హిందూ ఉత్స వ సమితి జిల్లా అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి అ న్నారు. ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ విజయవంతం అవడంపై సమితి ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో సంబరాలు నిర్వహించా రు. జాతీయ జెండాలను చేతబూని భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు ఇస్తూ టపాసులు కాల్చారు. ఇందులో శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగా నంద సరస్వతిస్వామి, సమితి సభ్యులు కె.రవీందర్, ఆర్. రవీందర్, వేణు, సత్యం, నర్సింలు, మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్ దాస్, అశోక్‌రెడ్డి, దేవన్న, ఎల్వి రావు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
దేశ రక్షణకు ఎప్పుడూ సిద్ధమే..
అమాయకులైన పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదుల స్థావరాలను తుద ముట్టించడమే లక్ష్యంగా భారత సేనలు ముందుకు వెళ్లడం గొప్ప విషయం. ఆ దేశ పౌరులకు ఎలాంటి హాని చేయకుండా సైనిక క్యాంపులకు ఎలాంటి నష్టం కలిగించకుండా కేవలం ఉగ్రవాద శిక్షణ శిబిరాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయింది. భారత సైన్యంలో 21ఏళ్ల పాటు పని చేసిన అనుభవం ఉంది. దేశభద్రత బాధ్యతలు చేపట్టడంలో ఎప్పుడైనా సిద్ధంగానే ఉంటా. ఈ విషయమై ఇండియన్ ఆర్మీకి రిక్వెస్ట్ లెటర్ సైతం పంపించాను. – గడ్డం అశోక్, మాజీ సైనిక ఉద్యోగి, మద్రాస్ ఇంజినీర్స్ రెజిమెంట్, ఆదిలాబాద్ -
భూభారతితో సమస్యలు పరిష్కారం
సాత్నాల: భూభారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. భోరజ్ మండలంలోని బా లాపూర్లో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలు సుకున్నారు. అలాగే గణేశ్‌పూర్ శివారులోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన రెవెన్యూ చట్టం ద్వారా రైతులకు వేగవంతంగా నాణ్యమైన సేవలు అందించనున్నట్లు తెలిపారు. రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్ చేసి వివరాలను సంబంధిత అధికారులకు పంపి క్షేత్రస్థాయిలో పరి ష్కరించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే అర్హులై న వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా మ రోసారి జాబితాలు పరిశీలించాలన్నారు. అనంతరం గణేశ్‌పూర్ శివారులోని సర్వేనంబర్–1లో కాస్తు, సాదాబైనామాలో పట్టాకోసం వచ్చి న దరఖాస్తులను, స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో వినోద్ కుమార్, తహసీల్దార్ రఘునాథ్‌రావ్, ఏఈ, డీటీ పాల్గొన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక పకడ్బందీగా చేపట్టాలి ఇచ్చోడ: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాజర్షిషా అన్నా రు. మండలకేంద్రంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, అధికారులతో మాట్లాడారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలన్నారు. ఆయన వెంట జెడ్పీసీఈవో జితేందర్‌రెడ్డి, ఎంపీడీవో లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి సూర్యప్రకాశ్ ఉన్నారు. సంస్కృతిని భావితరాలకు అందించాలి గుడిహత్నూర్: ఆదివాసీ సంస్కృతిని భావితరా లకు అందించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలంలోని శంభుగూడలో కొద్ది రోజులుగా ఆదివాసీ సకల కళా వెల్ఫేర్ సొసైటీ డైరెక్టర్ కాత్లే శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గుస్సాడీ, ఇతర ఆదివాసీ కళల శిక్షణ శిబిరంలో పాల్గొని మాట్లాడారు. ఇందులో ఎస్పీ అఖిల్ మహాజన్, డీటీ భాగ్యలక్ష్మి, ఎంపీడీవో అబ్ధుల్ హై, ఆర్ఐ అరుణ్, గ్రామ మాజీ సర్పంచ్ శంభు, ఆదివాసీ సంగీత విధ్వాంసులు పాల్గొన్నారు. -
పక్కా ప్రణాళికతో ప్రతీకారం
ఆపరేషన్ సిందూర్ ఎంతో పకడ్బందీగా చేపట్టారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పక్కా ప్రణాళికతో చేసిన మెరుపు దాడి ఇది. ఇప్పటివరకు జరిగింది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది. నేను ఉద్యోగ విధుల్లో ఉన్నప్పుడు చిన్నపాటి సంఘటనలు జరి గాయి. అయితే ఇన్ని సన్నాహాలు ఎప్పుడూ చూడలేదు. కార్గిల్ తర్వాత మొదటిసారి చూస్తున్నాను. యుద్ధం వచ్చినా ధీటుగా ఎదుర్కొనేందుకు మన సైన్యం సమర్ధంగా ఉంది. దేశ సరిహద్దు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – నారాయణ, మాజీ సైనిక ఉద్యోగి, ఆర్టీలరీ రెజిమెంట్, ఆదిలాబాద్ -
యుద్ధానికి సిద్ధం
18 ఏళ్ల పాటు సైనికుడిగా ఆర్మీలో విధులు నిర్వహించాను. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ప్రతిగా భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్‌తో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రస్థావరాలపై దాడులు నిర్వహి ంచడం గర్వంగా ఉంది. ఒకవేళ యుద్దమే వ స్తే మాజీ సైనికుడిగా అందులో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నా. ఇండియన్ ఆర్మీలో పని చేయడం గర్వంగా ఫీలవుతున్నా. దేశానికి హానిచేసే ఉగ్రవాదులను వదిలిపెట్టవద్దు. – రాసం ప్రవీణ్ కుమార్, మాజీ సైనికుడు, బోథ్ -
● భారత సేనల ఆపరేషన్‌పై హర్షాతిరేకాలు ● పహల్గాం ఉగ్రదాడికి సరైన సమాధానమని అభిప్రాయం
ఆదిలాబాద్/బోథ్: అది కశ్మీర్‌లోని పహల్గాం బైసారన్ వ్యాలీ. మినీ స్విట్జర్లాండ్‌గా పిలిచే పర్యాటక ప్రదేశంలో టూరిస్టుల తాకిడి ఎక్కువ. అయితే ఏప్రిల్ 22న ఆ పచ్చనిప్రాంతం ఎరుపెక్కింది. ప్రకృతిలో సేదతీరుతున్న పర్యాటకులతో ఉత్సా హంగా నిండిన ఆ ప్రాంతం ఒక్కసారిగా హాహాకారాలతో నిండిపోయింది. మనిషి ముసుగులో ముష్కరులు మారణ హోమం సృష్టించారు. మతాన్ని అడిగి మరీ రాక్షసత్వంతో మహిళల సింధూరాలను చెరిపేశారు. భార్యల ముందే వారి భర్తలను కిరాతకంగా కాల్చి చంపారు. ఈ ఉగ్రదాడిని దేశం అంతా ముక్తకంఠంతో ఖండించింది. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని నినదించింది. ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరుస్తూ ఏప్రిల్ 7న భారత సేనలు అర్ధరాత్రి సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్,పాక్‌లోని 9 ముష్కర స్థావరాలపై ముప్పేట దాడి చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరిట ఉగ్రస్థానాలను నేలమట్టం చేసింది. ఈ ఆపరేషన్ విజయవంతం అవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. జిల్లాకు చెందిన మాజీ సైనికులు మరోసారి బార్డర్‌కు వెళ్లేందుకు సిద్ధమంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన పలువురి అభిప్రాయాలు.. -
నాన్న కోరిక నెరవేర్చా..
– యనకి మధుకృష్ణ, ఎస్‌హెచ్‌వో, గుడిహత్నూర్ కుటుంబనేపథ్యం: మాది ఆర్మూర్. అమ్మ సరస్వతి గృహిణి. నాన్న ఉదయాద్రి కాంట్రాక్టర్. తమ్ముడు మనోన్ చదువుతున్నాడు. చెల్లి వివాహం అయ్యింది. విద్యాభ్యాసం: ఇంటర్‌వరకు ఆర్మూర్‌లోనే సాగింది. బీటెక్ హైదరాబాద్‌లో పూర్తయింది. లక్ష్యసాధన: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలేది నాన్న కోరిక. అది తీర్చడమే నా కర్తవ్యంగా భావించా. బీటెక్ పూర్తికాగానే ప్రిపరేషన్ మొదలుపెట్టా. మొదట బీట్ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. 2019 నుంచి 2023 వరకు ఉద్యోగం చేస్తూనే ఎస్సైకి ప్రిపరేషన్ అయ్యా. విజయం సాధించా. సమాజంలో మీరు కోరుకుంటున్న మార్పు: మానవుడు సంఘ జీవి. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండా లి. లా అండ్ ఆర్డర్ పాటించాలి. నిరుద్యోగులకు మీరిచ్చే సూచన..: లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందు సాగితే తప్పకుండా విజయం వరిస్తుంది. -
బావ ప్రోత్సాహంతో..
– జి. జీవన్‌రెడ్డి, గాదిగూడ కుటుంబ నేపథ్యం..: మాది నిజామాబాద్. వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్న రాజమణి– హన్మండ్లు. విద్యాభ్యాసం: ఒకటి నుంచి డిగ్రీ వరకు నిజామాబాద్‌లోనే సాగింది. లక్ష్యసాధన: 2002లో ఆర్మీలో చేరా. 2020లో రిటైర్ అయ్యా. మా బావ ఫైర్ ఆఫీసర్. ఆయన స్ఫూర్తితో ఎస్సై ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యాను. ఈ జనరేషన్‌తో పోటీపడి ఉద్యోగానికి ఎంపికయ్యా. సమాజంలో మీరు కోరుకునే మార్పు..: యువత గంజాయి, డ్రగ్స్‌వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇందు కోసం నా వంతు కృషి చేస్తా.. నిరుద్యోగులకు మీరిచ్చే సూచన: లక్ష సాధన కోసం విరామం లేకుండా ప్రయత్నం చేయాలి. -
రెండో ప్రయత్నంలో విజయం
కష్టాలను దిగమింగుతూ ఒకరు.. కన్నీళ్లు కనిపించకుండా మరొకరు.. అందరిదీ ఒకే లక్ష్యం.. యూనిఫామ్ జాబ్. పరిస్థితులు ఎలా ఉన్నా తమకు అనుకూలంగా మార్చుకున్నారు.. పుస్తకాలతో కుస్తీ పట్టి.. మైదానంలో చెమటోడ్చారు.. ప్రతీ క్షణం అదే ధ్యాసలో ఉండి కొలువు కోసం ఓ యజ్ఞమే చేశారు. విజయ తీరాలకు చేరువై కల సాకారం చేసుకున్నారు. వారే జిల్లాలో ఇటీవల విధుల్లో చేరిన ప్రొబేషనరీ ఎస్సైలు. ఎస్హెచ్వోలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారి మనోగతం ‘సాక్షి’తో పంచుకున్నారు ఇలా.. ఆదిలాబాద్‌టౌన్/తాంసి/ఇచ్చోడ/బజార్హత్నూర్/ ఆదిలాబాద్‌రూరల్/సిరికొండ/గుడిహత్నూర్/ ఉట్నూర్‌రూరల్/నార్నూర్– బోడ పీర్‌సింగ్‌నాయక్, ఎస్‌హెచ్‌వో, భీంపూర్ కుటుంబ నేపథ్యం..: మాది వ్యవసాయ కుటుంబం. సొంతూరు నిజామాబాద్ జిల్లాలోని మోపాల్. అమ్మానాన్న లక్ష్మీబాయి–రాయిచంద్. వ్యవసాయంలో వాళ్ల కష్టాన్ని దగ్గరిగా చూశా. ఎలాగైనా సర్కారు కొలువు సాధించాలనుకున్నా. విద్యాభ్యాసం : ఇంటర్ వరకు నిజామాబాద్‌లోనే సాగింది. కరీంనగర్లో బీటెక్ పూర్తి చేశా. లక్ష్య సాధన..: నాకు చిన్నప్పటి నుంచి పోలీస్ యూనిఫాం ధరించాలనే ఫ్యాషన్ ఉండేది. ఆ దిశగా లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ప్రిపేర్ అయ్యా. మొదటి ప్రయత్నంలో తృటిలో తప్పింది. నిరాశ చెందలే. మళ్లీ సన్నద్ధమయ్యా. రెండో ప్రయత్నంలో కొలువు సాధించా. సమాజంలో మీరు కోరుకునే మార్పు.. : అందులో మీ పాత్ర: అందరికీ సమన్యాయం జరగాలి. పేద, ధనిక తేడాలుండొద్దు. అలాంటి మార్పు కోసం నావంతు కృషి చేస్తా. నిరుద్యోగులకు మీరిచ్చే సూచన..: లక్ష్యసాధనకు లాంగ్‌టర్మ్ ప్రిపరేషన్ దోహదపడుతుంది. అపజయాలు ఎదురైనా కుంగిపోవద్దు. పట్టుదల వీడకుండా కష్టపడితే విజయం వరించడం ఖాయం. -
అమ్మానాన్నల కష్టమే నాకు దారి చూపింది
– గడ్డం రమ్య, జైనథ్, ఎస్‌హెచ్‌వో కుటుంబ నేపథ్యం..: స్వగ్రామం నిజా మాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని దేగామ. నాన్న భోజన్న వ్యవసాయ కూలీ. అమ్మ పద్మ బీడీ కార్మికురాలు. విద్యాభ్యాసం: 10వ తరగతి వరకు జెడ్పీఎస్ఎస్ దేగామలో చదివా. బాసర ట్రిపుల్‌ఐటీలో రెండేళ్లు చదివాను. ఆ తర్వాత ఓపెన్ డిగ్రీ బీఏ(ఈపీపీ) చేశా. నిజాం కళాశాలలో ఎంఏ పూర్తి చేశాను. లక్ష్యసాధన : 2021 నుంచి గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యాను. పేద కుటుంబం కావడంతో ఆర్థిక పరిస్థితులు బాగా లేకుండే. అన్నయ్య చదువుతూనే హైదరాబాద్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ తమ్ముడిని, నన్ను చదివించారు. అమ్మ నాన్నల కష్టమే నాకు దారి చూపించింది. గ్రూప్స్ ప్రిపరేషన్లో భాగంగా పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది. ఎస్సై, కానిస్టేబుల్ రెండింటికీ ఎంపికయ్యా. ఎస్సై ఉద్యోగం ఎంచుకున్నాను. సమాజంలో మీరు కోరుకునే మార్పు..: పోలీసుస్టేషన్‌కు రావడానికి చాలామంది భయపడుతుంటారు. వారికి అవగాహన కల్పించి న్యాయపరమైన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాను. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాను. నిరుద్యోగులకు మీరిచ్చే సూచన..: కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు. గమ్యం చేరేంత వరకు వదిలిపెట్టద్దు. -
‘హస్తం’లో కదలిక
● ఇక కాంగ్రెస్ కమిటీలు ● నేడు నియోజకవర్గ సమావేశాలు ● గ్రామ, మండల, బ్లాక్ కమిటీ అధ్యక్షుల ఎంపికకు.. ● ఒక్కోదానికి ఐదుగురి పేర్లు ● 20లోగా ఖరారు చేయనున్న పీసీసీ ● ఆ తర్వాత డీసీసీ అధ్యక్షుడి ఎంపిక సాక్షి,ఆదిలాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరవుతోంది. అయినా తమకు పదవుల పరంగా న్యాయం దక్కడం లేదని వాపోతున్న కార్యకర్తలకు త్వరలోనే తీపికబురు అందనుంది. ఎట్టకేలకు పార్టీలో అన్ని స్థాయిల్లో కమిటీల భర్తీకి అధిష్టానం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా టీపీసీసీ ఆదేశాల మేరకు జిల్లాకు కేటాయించిన పరిశీలకుల ద్వారా ఈ కమిటీల ఎంపికకు ముందడుగు పడింది. నేడు నియోజకవర్గం వారీగా హస్తం పార్టీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఆదిలాబాద్ సమావేశం జిల్లా కేంద్రంలోని విద్యుత్ తరంగిణి ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటలకు ఖరారు చేశారు. బోథ్ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు ఇచ్చోడలోని అభినందన్ గార్డెన్స్‌లో నిర్వహించనున్నారు. టీపీసీసీ నుంచి పరిశీలకులుగా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హుందాన్, టీపీసీసీ కార్యదర్శి చిట్ల సత్యనారాయణలను జిల్లాకు నియమించిన విషయం తెలిసిందే. వీరి ఆధ్వర్యంలో గతనెల 20న జిల్లా కేంద్రంలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అందులోనే ఈ కమిటీల నియామకం విషయాన్ని స్పష్టం చేశారు. మే 3 నుంచి ఎంపిక ప్రక్రియ షురూ అవుతుందని చెప్పారు. అందుకు అనుగుణంగా బుధవారం ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ సమావేశాలను వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. అన్ని స్థాయిల్లో కమిటీలు.. రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి కమిటీలు లేకపోవడంతో పార్టీలో నిస్తేజం కనిపించింది. కార్యకర్తల్లో ఉత్సాహం కొరవడింది. ప్రధానంగా రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవే ఖాళీగా ఉండడంతో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే వారే కరువయ్యారు. నియోజకవర్గ ఇన్చార్జీలు వారి వారి పరిధిలో కార్యకర్తలకు అండగా ఉంటూ వచ్చారు. అయితే పార్టీ పరంగా ఎలాంటి కమిటీలు లేకపోవడంతో వారిలో నిరాశ వ్యక్తమైంది. ఈ పరిస్థితిలో అధిష్టానం అన్ని స్థాయిల్లో కమిటీలను నియమించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామ, మండల, బ్లాక్ కమిటీలకు మొదట అధ్యక్షులను నియమించనున్నారు. ఇందుకోసమే నియోజకవర్గం వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో కమిటీకి ఐదుగురి పేర్లు.. గ్రామ, మండల, బ్లాక్ కమిటీలకు సంబంధించి ఒక్కో దాని కోసం ఐదుగురి పేర్ల చొప్పున పరిశీలకులు సేకరించనున్నారు. ఆ పేర్లను టీపీసీసీకి నివేదిస్తారు. ఆ తర్వాత అందరి ఆమోదంతో ఆ కమిటీలకు అధ్యక్షులను నియమిస్తారు. ఇదిలా ఉంటే పార్టీలో మొదటి నుంచి జెండా మోసిన కార్యకర్తలకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ జిల్లాలో అనేక మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో కొన్ని మండలాలు మినహాయిస్తే అనేక చోట్ల ఇతర పార్టీల నాయకులు పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందనేది అందరిలో ఆసక్తి కలిగిస్తుంది. పాత, కొత్త నాయకులను కలుపుకొని వెళ్తుందా.. లేనిపక్షంలో మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వారికే ప్రాధాన్యతనిస్తుందా.. అలా అయిన పక్షంలో కార్యకర్తల మద్దతు ఎలా ఉంటుంది.. ఇలా అన్ని అంశాలు పార్టీలో ప్రస్తుతం ప్రాధాన్యత కలిగిస్తున్నాయి. డీసీసీ అధ్యక్షుడు కూడా.. గ్రామ, మండల, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలను ఈనెల 20లోగా ఎంపిక చేయనున్నారు. అవి పూర్తయిన వెంటనే పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని ముఖ్య నాయకులు పేర్కొంటున్నారు. అందులో డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం ముగ్గురి పేర్లను పరిశీలకులు సేకరిస్తారని చెబుతున్నారు. టీపీసీసీకి నివేదించి, ఈనెల చివరిలోగా జిల్లా అధ్యక్షుడిని ఖరారు చేయనున్నట్లు పేర్కొంటున్నారు. తద్వారా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ పరంగా అన్ని స్థాయిల్లో కమిటీలను పటిష్టం చేయడం ద్వారా ముందుకెళ్లాలని అధిష్టానం భావిస్తుంది. ఆ మేరకు కార్యాచరణ మొదలైంది. -
అధిక కేసులు పరిష్కరించేలా చూడాలి
● జిల్లా జడ్జి ప్రభాకరరావుఆదిలాబాద్టౌన్: జాతీయ లోక్‌అదాలత్‌లో అధిక కేసులు పరిష్కరించేలా చూడాలని జిల్లా జడ్జి ప్రభా కరరావు అన్నారు. జిల్లా కోర్టులో పోలీసు అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆ యన మాట్లాడారు. జూన్ 14న జాతీయ లోక్‌అదా లత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. గతంతో పోల్చి తే ఈసారి మరిన్ని అధిక కేసులు పరిష్కరించేలా ప్ర తిఒక్కరూ కృషి చేయాలన్నారు. స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకోవాలన్నారు. రాజీ పడదగ్గ కేసుల కక్షిదారులతో మాట్లాడాలని సూచించారు.ఇందులో జడ్జిలు కుమార్‌వివేక్,లక్ష్మికుమారి, హుస్సేన్, పీపీలు రమణారెడ్డి, రహీం, డీఎస్పీ జీవ న్‌రెడ్డి, వన్‌టౌన్, టూటౌన్ సీఐలు సుని ల్‌కుమార్, కరుణాకర్, ఎక్సైజ్ సీఐ విజేందర్ పాల్గొన్నారు. -
అమ్మ కోరిక.. నాన్న ప్రోత్సాహం
– కే అఖిల్, ఎస్‌హెచ్‌వో, నార్నూర్ కుటుంబ నేపథ్యం..: మాది నిజామాబాద్ లోకల్. అమ్మ జ్యోతి పోలీస్‌శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేశారు. 2019లో లోకం విడిచారు. నాన్న రమేశ్ ఏఎస్సై నిజామాబాద్‌లో పని చేస్తున్నారు. తమ్ముడు సాఫ్ట్వేర్ ఉద్యోగి. విద్యాభ్యాసం: ఇంటర్ వరకు నిజామబాద్లోనే సాగింది. బీటెక్ హైదరాబాద్‌లో పూర్తి చేశా. లక్ష్యసాధన: కొంతకాలం సాఫ్ట్‌వేర్‌గా పనిచేశా. అది సంతృప్తి లేకుండే. అమ్మ కోరిక, నాన్న ప్రోత్సాహంతో పోలీస్ జాబ్ కోసం మళ్లీ ప్రిపరేషన్ మొదలుపెట్టా. తొలిప్రయత్నంలో ఓటమి ఎదురైంది. నిరాశ చెందలేదు. ప్రణాళికాబద్ధంగా చదివా. రెండో ప్రయత్నంలో ఎస్సై జాబ్ సాధించా. సమాజంలో మీరు కోరుకునే మార్పు..: సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొనాలి. ఇందుకోసం నావంతు ప్రయత్నం చేస్తా. నిరుద్యోగులకు మీరిచ్చే సూచన: లక్ష్యాన్ని ఏర్పర్చుకొని ప్రణాళికాబద్ధంగా సాధన చేస్తే విజయం తప్పకుండా సొంతమవుతుంది. -
ఏడేళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టా..
– కోట రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌హెచ్‌వో, బజార్హత్నూర్ కుటుంబ నేపథ్యం: సొంతూరు పాత నిజామాబాద్ జిల్లా సాలంపాడ్ గ్రామం. మాది వ్యవసాయ కుటుంబం. నాన్న సాయిరెడ్డి, అమ్మ అచ్చమ్మ. విద్యాభ్యాసం: పాఠశాల, ఇంటర్ విద్య బోధన్‌లో, డిగ్రీ హైదరాబాద్‌లోని ప్రైవేటు కళాశాలలో పూర్తి చేశాను. లక్ష్యసాధన: డిగ్రీ పూర్తి కాగానే ఎస్సై ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో చదివాను. హైదరాబాద్ అశోక్‌నగర్‌లోనే ఏడేళ్లు పుస్తకాలతోనే కుస్తీ పట్టా. 2019లో మొదటి ప్రయత్నంలో 1.5 మార్కుల తేడాతో చేజారింది. నిరాశ చెందకుండా మళ్లీ ప్రణాళికాబద్ధంగా చదివా. విజయం సాధించా. సమాజంలో మీరు కోరుకునే మార్పు..: యువత సన్మార్గంలో నడవాలి. ఆ దిశగా నావంతు ప్రయత్నం చేస్తా. నిరుద్యోగులకు మిరిచ్చే సూచన: లక్ష్యసాధనలో ఓటమి ఎదురైనా నిరాశ చెందొద్దు. ప్రణాళికాబద్ధంగా నిరంతర సాధన చేస్తే విజయం ఖాయం. -
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
కై లాస్‌నగర్: అర్హులైన వారినే ఇందిరమ్మ లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని, ఇందులో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. పట్టణంలోని కేఆర్కే, రాంనగర్, భాగ్యనగర్ కాలనీల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల దరఖాస్తులను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీ లించారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై మండుటెండను సైతం లెక్క చేయకుండా ఇంటింటికి వెళ్లి దరఖాస్తులను, చెక్లిస్ట్ను పరిశీలించారు. ప్రా థమిక జాబితాలో ఉన్న పేర్లను మరోసారి అన్ని కోణాల్లో పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజను ఆదేశించారు. అంతకు ముందు గూగుల్ మీట్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై అధికారులతో సమీక్షించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులని గుర్తిస్తే వారి పేర్లను చేర్చాలని సూచించారు. తాంసిలో.. తలమడుగు(తాంసి):తాంసి మండలంలోని హస్నాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను కలెక్టర్ పరిశీలించారు. అర్హులైనప్పటికీ తమపేరు జాబితాలో రాలేదని పలువురు దరఖాస్తుదారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండో విడతలో అర్హులందరికీ మంజూరు చేస్తామన్నారు. వారి వెంట జెడ్పీసీఈవో జితేందర్‌రెడ్డి, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, తహసీల్దార్ లక్ష్మి, హౌసింగ్ ఏఈ నజీర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు. ● కలెక్టర్ రాజర్షి షా -
అక్క స్ఫూర్తితో..
– సాల్లురి శ్రీసాయి, ఎస్‌హెచ్‌వో, సిరికొండ కుటుంబ నేపథ్యం : మాది నిజామాబాద్. నాన్న సాల్లురి కిషన్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మ లక్ష్మి గృహిణి. అక్క శ్రీలత, పంచాయతీ కార్యదర్శి. విద్యాభ్యాసం : ఒకటి నుంచి ఐదో తరగతి వరకు నిజామాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలోనే సాగింది. నవోదయలో ఇంటర్ వరకు చదివి హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేశా. మైసూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశా. లక్ష్యసాధన : కరోనా సమయంలో నేను వర్క్‌ఫ్రం హోం చేస్తుండగా.. అక్క పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుంది. గ్రామస్తుల సమస్యలను పరిష్కరిస్తున్న తీరు చూసి నేను కూడా సర్కారు కొలువు సాధించాలనుకున్నా. అక్క స్ఫూర్తితో ఇంటి వద్ద ప్రిపరేషన్ మొదలుపెట్టా. 2023 ఎస్సై ఫలితాల్లో విజయం సాధించా. చిన్నప్పుడు స్పోర్ట్స్ బాగా ఆడేది. ఉద్యోగ సాధనలో అది కలిసివచ్చింది. సమాజంలో మీరు కోరుకునే మార్పు..: మత్తు పదార్థాలతో కలిగే దుష్పరిణామలపై ప్రజలకు అవగాహన కల్పిస్తా. వాటిని పూర్తిస్థాయిలో రూపుమాపడంలో నా వంతు కృషి చేస్తా. నిరుద్యోగులకు మీరిచ్చే సూచన : కష్టపడి చదవాలి. లక్ష్యం సాధించే వరకు పట్టు సడలనివ్వొద్దు. -
కానిస్టేబుల్‌గా ఉంటూనే ప్రిపేరయ్యా..
– బి.సంజయ్‌కుమార్,ఎస్‌హెచ్‌వో,ఇచ్చోడ కుటుంబ నేపథ్యం: సొంతూరు నిజామాబాద్ జిల్లాలోని ఇత్వర్‌పేట్. మాది వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్న భూదేవి– చిన్నగంగారాం. విద్యాభ్యాసం..: ఏడో తరగతి వరకు ఊరి లోని ప్రభుత్వ పాఠశాలలోనే సాగింది. బాల్కొండలోని సర్కారు బడిలో టెన్త్ వరకు చదివా. ఇంటర్ ఆర్మూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి చేశా. బీటెక్ హైదరాబాద్‌లో పూర్తయింది. లక్ష్యసాధన: బీటెక్ పూర్తి కాగానే ప్రిపరేషన్ మొదలుపెట్టా. 2020లో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. నిజామాబాద్‌లో విధులు నిర్వర్తిస్తూనే ఎస్సై కోసం ప్రిపేర్ అయ్యా. నాలుగేళ్ల తర్వాత నా కల ఫలించింది. సమాజంలో మీరు కోరుకునే మార్పు.. : అందరికీ సమన్యాయం దక్కాలి. అందుకోసం నావంతు కృషి చేస్తా. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నాకు సమాజ పరిస్థితులపై అవగాహన ఉంది. నిరుద్యోగులకు మీరిచ్చే సూచన: కష్టపడితే ఫలితం దక్కుతుంది. అందుకు నేనే ఉదాహరణ. -
హేళన చేశారు.. ఆ కసితోనే చదివా
– పిల్లి ప్రణయ్‌కుమార్, ఎస్‌హెచ్‌వో, మావల కుటుంబ నేపథ్యం..: మాది నిజామాబాద్ జిల్లా భీంగల్. నాన్న సత్యనారాయణ వ్యాపారవేత్త, అమ్మ నర్సు గృహిణి. అన్నయ్య సాఫ్ట్వేర్ ఉద్యోగి. అక్కకు పెళ్లయింది. నేను చివరి సంతానం. విద్యాభ్యాసం: పదో తరగతి వరకు ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలోనే సాగింది. ఇంటర్ కూడా భీంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే పూర్తి చేశా. ఓపెన్ వర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాను. లక్ష్యసాధన: డిగ్రీ పూర్తి కాగానే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నా. అందులో భాగంగా పోలీస్ కొలువును ఎంచుకున్నా. ప్రిపేర్ అవుతున్న క్రమంలో కొంతమంది ‘ఏం ఉద్యోగం సాధిస్తావని’ హేళన చేశారు. అదే నాలో కసిని పెంచింది. దీంతో పట్టుదల పెరిగింది. ఉద్యోగం సాధించి వారికి సమాధానం చెప్పా. సమాజంలో మీరు కోరుకునే మార్పు..: తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలి. వారి లక్ష్యసాధనలో వెన్నంటి నిలవాలి. నిరుద్యోగులకు మీరిచ్చే సూచన: ప్రణాళికాబద్ధంగా చదివితే సర్కారు కొలువు సాధించడం సులువే. -
తొలి ప్రయత్నంలోనే సక్సెస్
–పూజ,ఎస్‌హెచ్‌వో, ఉట్నూర్ కుటుంబ నేపథ్యం: మాది నిజామాబాద్ జిల్లా ఆర్మూ ర్. నిరుపేద కుటుంబం. అమ్మ సాయమ్మ, నాన్న ముత్తన్న ఇద్దరూ కూలీలే. నేను ఒక్కదాన్నే సంతానం. విద్యాభ్యాసం: పదో తరగతి వరకు ఆర్మూర్ ప్రభుత్వ పాఠశాలలోనే చదివా. టెన్త్‌లో మండల టాపర్‌గా నిలిచా. ట్రిపుల్ ఐటీ బాసరలో బీటెక్ పూర్తి చేశాను. కొద్ది రోజులు సాఫ్ట్వేర్ జాబ్ చేశాను. అనంతరం యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను. ఈ క్రమంలో ఎస్సై నోటిఫికేషన్ రావడంతో పరీక్ష రాశాను. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించా. సమాజంలో మీరు కోరుకుంటున్న మార్పు : మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి. నిరుద్యోగ యువతకు మీరిచ్చే సలహా: చిన్నతనంలోనే లక్ష్యం ఎంచుకోవాలి. ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగితే విజయం సొంతమవుతుంది. -
నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి
తాంసి: రైతులు వానాకాలం సాగుకు సంబంధించి నాణ్యమైన విత్తనాలు, ఎరువుల ను ఎంపి క చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ స్వామి అన్నారు. మండలంలోని పొన్నారి గ్రా మంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. పంచాయ తీ కార్యాలయ ఆవరణలో రైతులతో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సా ధించే పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. పంటమార్పిడితో దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం సేంద్రియ ఎరువులు, రసాయనాల వినియోగం,సాగునీటిఆదా, మట్టి పరీక్షలు తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగా హన కల్పించారు. ముందుగా రైతులతో కలిసి ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ వై.ప్రవీణ్‌కుమార్,శాస్త్రవేత్తలు రాజ శేఖర్, మోహన్‌దాస్, శేషా ద్రి, సునీల్ కుమార్, జి.శివచరణ్, వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు రాజేందర్ రెడ్డి, ప్రవీణ్, తాంసి ఇన్చార్జ్ ఏడీఏ రవీందర్, మాజీ సర్పంచ్ అశోక్, మాజీ ఎంపీటీసీ రఘు, రైతులు పాల్గొన్నారు. -
ప్రజావాణిలో ‘ఇందిరమ్మ’ గోడు
● భారీగా తరలివచ్చిన దరఖాస్తుదారులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ కై లాస్‌నగర్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు ప్రజావాణిపై ప్రభావం చూపాయి. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి గతంలో ఎన్నడు లేని విధంగా భారీగా తరలివచ్చారు. ఇందులో అత్యధికులు ఇందిరమ్మ ఇళ్లు రాలేదని నివేదించిన వారే కావడం గమనార్హం. మండుటెండను సైతం లెక్కచేయకుండా తరలివచ్చిన వారు ఉన్నతాధికారుల ఎదుట తమగోడు వెల్లబోసుకున్నారు. కలెక్టర్ రాజర్షి షా బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 2గంటలు కావడంతో కార్యక్రమం ముగించినట్లుగా కలెక్టర్ ప్రకటించడంతో అధికారులంతా సమావేశ మందిరం నుంచి వెళ్లిపోయారు. కలెక్టర్ సైతం బయలుదేరుతుండగా అప్పటికే బయట పెద్ద సంఖ్యలో ఉన్న అర్జీదారులు ఒక్కసారిగా సమావేశ మందిరంలోకి వచ్చారు. దీంతో కలెక్టర్ అరగంట పాటు నిలబడే వారి నుంచి వినతులు స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో జరిగిన పొరపాట్లపై విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేస్తామని కలెక్టర్ భరోసానిచ్చారు. అధికారికంగా 148 అర్జీలు అందినట్లుగా అధికారులు చెబుతున్నప్పటికీ మరో 80 మంది వరకు ఆన్లైన్ చేయకుండానే చివ రి నిమిషంలో నేరుగా అందజేశారు. ఇందులో జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, కలెక్టరేట్ ఏవో వర్ణ, వివిధశాఖల అధికారులు పా ల్గొన్నారు. ఈవారం అర్జీదారుల్లో కొందరి నివేదన.. పనివేళలు కుదించాలి ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో పనిచేసే పారిశుధ్య కార్మికులతో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పనిచేయిస్తున్నారు. ఎండల తీవ్రత రోజురోజుకు పెరగడంతో కార్మికులు అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కార్మికుల ఆరోగ్యం దృష్ట్యా పని వేళలు ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకే కుదించాలి. – టీఎమ్మార్పీఎస్ నాయకులు, ఆదిలాబాద్ ఈ మేరకు స్పందించిన కలెక్టర్ వెంటనే కమిషనర్ రాజుతో మాట్లాడారు. కార్మికులతో ఉదయం 11గంటల వరకు మాత్రమే పనులు చేయించాలని ఆదేశించారు. -
సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి
కై లాస్‌నగర్: ఈ నెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని గ్రా మ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూని యన్ జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న కోరారు. ఈ మేరకు సోమవారం సంఘం ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ కార్యాలయ ఉద్యోగి శ్రీనివాస్ గౌడ్ కు సమ్మె నోటీసు అందజేశారు. పంచాయతీ కా ర్మికులకు అమలు చేస్తున్న మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ఉద్యోగ, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపడుతున్న సమ్మెలో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఇందులో యూనియన్ నాయకులు అశోక్, వెంకట్రావు, సోనేరావు, గంగన్న, కిరణ్, సంతోష్, రాజేందర్, శంకర్ ఉన్నారు. మున్సిపల్ కమిషనర్‌కు సమ్మె నోటీసు ఈ నెల 20న దేశవ్యాప్త కార్మిక సమ్మెలో ఆదిలా బాద్ మున్సిపాలిటీ కార్మికులు పాల్గొనాలని మున్సిపల్ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ నాయకులు కోరారు. ఈమేరకు సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో కమిషనర్ సీవీఎన్.రాజును కలిసి సమ్మె నోటీసు అందజేశారు. ఇందులో సంఘ బాధ్యులు జనార్దన్, భిక్షపతి, శ్యామ్ తదితరులున్నారు. -
● వానాకాలం పంటల కోసం.. ● దుక్కులు సిద్ధం చేస్తున్న రైతులు ● అంచనాకు మించి విత్తనాలు.. సరిపడా ఎరువులు ● ప్రణాళిక రెడీ అంటున్న వ్యవసాయశాఖ
సాక్షి,ఆదిలాబాద్: వానాకాలం పంటల సాగుకు జిల్లా రైతాంగం సన్నద్ధమవుతోంది. దుక్కులు దున్ని చేలను చదును చేసే పనుల్లో బిజీగా మా రారు. మరోవైపు భూసారం పెంచేందుకు అందుబాటులో ఉన్నవారు సేంద్రియ ఎరువులతో పాటు చెరువు మట్టిని పొలాల్లో వేస్తున్నారు. జిల్లాలో పరిస్థితి.. జిల్లాలో యాసంగితో పోల్చితే వానాకాలంలోనే పంటల సాగు అధికంగా ఉంటుంది. కేవలం వర్షాధారంగానే 70 శాతం వరకు సాగవుతుంటుంది. దీంతో ఈ సీజన్ వస్తుందంటే జిల్లా రైతులంతా బిజీ అవుతారు. ప్రధానంగా జిల్లాలో పత్తిని ఎక్కువగా పండిస్తారు. ఆ తర్వాత సోయా, కందులు, ఇతరత్రా పంటలు సాగు ఉంటుంది. గత వానాకాలంలో 5లక్షల 79వేల 124 ఎకరాల్లో పంటలు సాగు కాగా, ఈ ఏడాది 5లక్షల 85వేల 350 ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. పెరగనున్న పత్తి విస్తీర్ణం.. జిల్లాలో ఈ ఏడాది కూడా పత్తి, సోయా, కంది పంటలు అధిక విస్తీర్ణంలో సాగు కానున్నాయి. ఇందులో 75 శాతం వరకు పత్తి ఉండనుంది. గతేడాదితో పోల్చితే ఈ సారి పత్తి సాగు విస్తీర్ణం పెరగనుందని, అలాగే సోయా కొంత తగ్గే అవకాశముందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు ఈ ఏడాది పత్తి విత్తనాలు విరివిగా లభ్యమయ్యే పరిస్థితి ఉండడంతో రైతులు అటువైపే మొగ్గుచూపే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రణాళిక సిద్ధం.. వానాకాలం పంటల సాగు కోసం వ్యవసాయ శాఖ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ సీజన్లో ఏయే పంటలు ఎంత సాగవుతాయి.. దానికి అనుగుణంగా విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయా.. అనే అంశంలో ఇప్పటికే ఆయా విత్తన కంపెనీలతో వ్యవసాయ శాఖ సమావేశాలు పూర్తి చేసింది. ఈ సీజన్లో పత్తి విత్తనాల ప్యాకెట్లు అంచనాకు మించి అందజేసేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మాదిరి విత్తనాల కొరత ఏర్పడేందుకు ఆస్కారమే లేదని పేర్కొంటున్నారు. కలెక్టర్ రాజర్షిషా ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసి నకిలీ విత్తనాల విక్రయాలు అరికట్టేందుకు యంత్రాంగం పాటుపడుతుంది. దుక్కిదున్ని చేనును సాగుకు సిద్ధం చేస్తూ..జిల్లాలో వానాకాలం పంటల సాగు విస్తీర్ణం (ఎకరాల్లో).. పంట 2024లో 2025లో అవసరమయ్యే (అంచనా) విత్తనాలు(క్వింటాళ్లలో) పత్తి 4,36,473 4,40,000 11,00,840 ప్యాకెట్లు సోయాబీన్ 65,464 62,500 18,725 కంది 57,258 55,000 21,960 జొన్న 1493 1600 66 మొక్కజొన్న 15066 23000 1,834 వరి 2030 1900 489 పెసర 546 550 22 మినుము 561 550 44 ఇతరత్రా 231 250 12అవసరమయ్యే ఎరువులు (మెట్రిక్ టన్నుల్లో) ఎరువులు అవసరం అందుబాటులో ఉన్నది యూరియా 35,000 18,000 డీఏపీ 13,000 4,000 కాంప్లెక్స్ 36,000 24,000 ఎంఓపీ 7,000 1,134 ఎస్ఎస్పీ 4,000 1,071కొరత లేదు.. వానాకాలం సాగు కోసం రైతులకు పూర్తిస్థాయిలో విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాం. ఈసారి పత్తి విత్తనాలను అంచనాకు మించి సరఫరా చేసేందుకు ఆయా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఎలాంటి కొరత లేదు. ఇతర విత్తనాలు కూడా అందుబాటులో ఉంచుతున్నాం. ఎరువులను కోటా మేరకు సరిపడా ఉండేలా చర్యలు చేపడుతున్నాం. – శ్రీధర్ స్వామి, జిల్లా వ్యవసాయ అధికారి -
ఆరోగ్య పాఠశాలతో విద్యార్థుల్లో మార్పు
● కలెక్టర్ రాజర్షిషా ● ‘పది’లో సత్తా చాటిన విద్యార్థులకు సన్మానం ఆదిలాబాద్‌టౌన్: ఆరోగ్య పాఠశాల కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మార్పులు వచ్చాయని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. పదో తరగతిలో ఉత్తమ మా ర్కులు సాధించిన విద్యార్థులను జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరి సహకారంతో జిల్లా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిందన్నారు. రాష్ట్రస్థాయిలో 97.18 శాతం ఉత్తీర్ణతతో 9వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించడం అభినందనీయమని కొనియాడారు. ఇందులో డీఈవో శ్రీనివాస్ రెడ్డి, డీఐఈవో జాదవ్ గణేశ్‌కుమార్, డీసీఈబీ సెక్రెటరి గజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
మరిన్ని రహదారులు నిర్మించాలి
తెలంగాణ రాష్ట్రానికి పక్కన ఉన్న మహారాష్ట్రతో అనుసంధానిస్తూ మరిన్ని జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాలి. జిల్లాలో 300 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణం చేపట్టిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుంది. అదే తరహాలో ఆదిలాబాద్ నుంచి ఉట్నూర్, ఆసిఫాబాద్ మీదుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అల్లాపల్లి వరకు జాతీయ రహదారి నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలి. తద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. పెండింగ్ పనులు పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి.– ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ -
శిక్షణతో పిల్లల్లో ప్రత్యేక ప్రావీణ్యం
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: శిక్షణతో పిల్లల్లో ప్రత్యేక ప్రావీణ్యం లభిస్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీల అభివృద్ధి విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలని అన్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో నాలుగు చోట్ల ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆదిలాబాద్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, నార్నూర్‌లలో వీటిని ప్రారంభించినట్లు చెప్పారు. నాలుగు కేంద్రాల్లో 470 మంది విద్యార్థులకు యోగా, కరాటే, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్ బాల్ తదితర కీడాంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. తద్వారా చిన్నారుల్లో మానసిక, శారీరక దృఢత్వం పెంపొందుతుందన్నారు. అలాగే పోలీసు స్టేషన్ల సందర్శన, సిబ్బంది విధుల నిర్వహణ, జైలు సందర్శన, ఆయుధాల ఉపయోగం, వాటి పనితీరు, పోలీసులు తీసుకుంటున్న కఠోర శిక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్‌రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్.జీవన్‌రెడ్డి, ఇన్స్పెక్టర్లు కరుణాకర్, వెంకటి, చంద్రశేఖర్, శిక్షకులు పాల్గొన్నారు. బోథ్ పోలీస్ స్టేషన్ తనిఖీ బోథ్:అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయా లని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. స్థానిక పోలీ స్‌స్టేషన్‌ను సోమవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాల ని సిబ్బందికి సూచించారు. డయల్ 100, బ్లూకోర్ట్ సిబ్బంది గ్రామాలను సందర్శిస్తూ సమాచార సేకరణలో ముందుండాలని సూచించారు. ఆయన వెంట సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై ప్రవీణ్ ఉన్నారు. -
● కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ● జాతీయ రహదారి– 363 ప్రారంభం.. జాతికి అంకితం ● నాగ్‌పూర్ టు హైదరాబాద్‌కు ఆరు వరుసల రహదారి నిర్మాణానికి హామీ ● హాజరైన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు
రెబ్బెన(ఆసిఫాబాద్): ‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన జిల్లా, ఈ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉంది. ఇక్కడ నివసించే ఆది వాసీలు భూమి కోసం, భుక్తి కోసం ఎన్నో పోరాటా లు చేశారు. అలాంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం’ అని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కుమురంభీం జిల్లా రెబ్బెన మండలంలోని కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద సోమవారం ఏర్పాటు చేసిన ఎన్‌హెచ్– 363 ప్రారంభోత్సవ సభ విజయవంతమైంది. కుమురంభీం జిల్లాతోపాటు మంచిర్యాల, ఆది లాబాద్ జిల్లాల నుంచి బీజేపీ కార్యకర్తలు, ప్రజలు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. ‘అందరికీ నమస్కారం.. బాగున్నారా’ అంటూ కేంద్ర మంత్రి ప్రజ లను ఆత్మీయంగా తెలుగులో పలకరించారు. మంచిర్యాల జిల్లా నుంచి మహారాష్ట్ర సరిహద్దులోని కు మురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి వరకు నిర్మించిన నాలుగు వరుసల జాతీయ రహదారితోపాటు పలు సెక్షన్లలో చేపట్టిన పనులను కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించి జాతికి అంకితం చేశారు.అంతకుముందు ఉదయం 10.48 గంటలకు నాగ్‌పూర్ నుంచి హెలికాప్టర్ ద్వారా కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్డు వద్దకు చేరుకున్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, అధికారులు ఘన స్వాగతం పలికారు. పోలీస్ సిబ్బంది గౌర వ వందనం స్వీకరించిన అనంతరం సభాస్థలికి చేరుకుని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఉదయం 11.47 గంటలకు రూ.3,900 కోట్లతో చేపట్టిన జాతీయ రహదారుల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడుతూ రాను న్న మూడేళ్లలో రూ.2లక్షల కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. గడిచిన పదేళ్లలో దేశంలో జరిగిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని, అసలైన సి నిమా ముందుందన్నారు. జాతీయ రహదారుల వి స్తరణతో అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. అన్ని రాష్ట్రాలను జాతీయ రహదారులతో అనుసంధా నం చేస్తామని, తెలంగాణలో రహదారులను మరింత అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్రంలో రూ.లక్ష కోట్లతో గ్రీన్వే నిర్మాణానికి కృషి చేస్తున్నామని, నాగ్‌పూర్ టు విజయవాడ వరకు చేపట్టే రహదారితో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, విజయవాడ మీదుగా రహదారి నిర్మిస్తున్నామన్నారు. నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు ఆరు వరుసల రహదారికి కృషిచేస్తున్నామని తెలిపారు. 2014 తర్వాత రాష్ట్రంలో రూ.వేల కోట్లతో రహదారులను అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని నరేంద్రమోదీదన్నారు. మధ్యాహ్నం 12.20 గంటల వరకు ప్రసంగించి, 12.30 గంటలకు కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ నుంచి కేంద్ర మంత్రి బయలుదేరి వెళ్లిపోయారు. కార్యక్రమాల్లో ఎంపీలు గోడం నగేశ్, గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీలు దండె విఠల్, మల్క కొమురయ్య, అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్‌బాబు, పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు, రామారావు పటేల్, ప్రేంసాగర్‌రావు, రోడ్డు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రావు, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, ఏఎస్పీ చిత్తరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
కాగజ్‌నగర్‌లో హైవే-363ని జాతికి అంకితమిచ్చిన గడ్కరీ
సాక్షి, సిర్పూర్ కాగజ్‌నగర్: వెనుకబడిన జిల్లాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. చీకటి ఉన్న చోటనే వెలుగులు నింపాలని చెప్పుకొచ్చారు. అలాగే, ఉమ్మడి ఆదిలాబాద్ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు.సిర్పూర్ కాగజ్‌నగర్‌లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటిస్తున్నారు. జిల్లాలో జాతీయ రహదారి 363ని గడ్కరీని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ..‘జాతీయ రహదారులతో దేశాన్ని అనుసంధానిస్తున్నాం. వెనుకబడిన జిల్లాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. కేంద్రమంత్రిగా ప్రజల సమస్యలను అర్థం చేసుకునే అవకాశం వచ్చింది. గడ్చిరోలి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. నేను ఇంజనీర్‌ను కాదు.. కానీ, 13 డాక్టరేట్లు వచ్చాయి. చీకటి ఉన్న చోటనే వెలుగులు నింపాలి. అమృత్ సరోవర్ పేరుతో నీటి నిల్వను పెంచుతున్నాం. తెలంగాణలో కూడా నీటి నిల్వలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. రైతులు ఆత్మహత్యలు చేసుకునే విదర్భ ప్రాంతంలో పనిచేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఉమ్మడి ఆదిలాబాద్ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే అభివృద్ధి చేస్తామన్నారు.అంతకుముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..‘కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనెక్టివిటీని పెంచడం మోదీ సర్కార్ లక్ష్యం. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తీర్ణం 5వేల కి.మీ దాటింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రూ.3,900 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జాతీయ రహదారుల విస్తరణ వల్ల రోడ్డు ప్రమాదాలు, ప్రయాణ సమయం భారీగా తగ్గాయి. రోడ్డు, రైల్వే, విమాన కనెక్టివిటీ పెంచేందుకు కేంద్రం అంకితభావంతో పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా 7 టెక్స్టైల్ పార్కులు మంజూరు చేస్తే తెలంగాణకు కూడా ఒకటి దక్కింది. రూ.6,330 కోట్లతో రామగుండంలో యూరియా ఉత్పత్తి పరిశ్రమను పునరుద్ధరించుకున్నాం. ఇచ్చిన హామీ ప్రకారం నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు మంజూరు చేశాం. ఆదిలాబాద్‌లో డిఫెన్స్ ఎయిర్‌పోర్టు ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దేశంలో 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా రేషన్ బియ్యాన్ని మోదీ ప్రభుత్వం అందజేస్తోంది అని చెప్పుకొచ్చారు. -
ప్రశాంతంగా ‘నీట్’
ఆదిలాబాద్‌టౌన్: వైద్యవిద్య కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) ఆదివారం ప్రశాంతంగా ముగి సింది. జిల్లా కేంద్రంలో ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అభ్యర్థులను లోనికి అనుమతించారు. అందరూ నిర్దేశిత సమయానికి ముందుగానే చేరుకున్నారు. ఆయా సెంటర్ల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించారు. కాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రాల్లోకి బ్యాగ్‌లు, ఆభరణాలు, లోహ, ఎలక్ట్రానిక్ తదితర వస్తువులను అనుమతించమని అధికారులు ముందుగానే ప్రకటించారు. అయితే కొందరు అభ్యర్థులు ఆభరణాలతో రాగా అవి తీసిన తర్వాతే సిబ్బంది వారి ని లోనికి అనుమతించారు. 1,621 మంది హాజరు.. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఏడు కేంద్రాల్లో 1,659 మంది విద్యార్థులకు గాను 1,621 మంది హాజరయ్యారు. 38 మంది గైర్హాజరయ్యారు. పట్ట ణంలోని బంగారుగూడ తెలంగాణ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో 360 మందికి గాను 348 మంది హాజరు కాగా, 12 మంది గైర్హాజరయ్యారు. బంగారుగూడ మైనార్టీ రెసిడెన్షియల్లో 264 మందికి గాను 256 మంది హాజరుకాగా, 8 మంది గైర్హాజరయ్యారు. బాలి కల రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో 240 మందికి గాను 237 మంది హాజరు కాగా, ముగ్గురు గైర్హాజరయ్యారు. ప్రభు త్వ బాలికల పాఠశాలలో 240 మందికి గాను 234 మంది హాజరుకాగా, ఆరుగురు గైర్హాజరయ్యారు. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో 240 మందికి గాను 236 హాజరు కాగా, నలుగురు గైర్హాజరయ్యారు. ట్రైబల్ వెల్ఫే ర్ రెసిడెన్షియల్ కళాశాలలో 340కి గాను 238 మంది హాజరు కాగా, ఇద్దరు గైర్హాజరయ్యారు. మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల కేంద్రంలో 75 మందికి గాను 72 మంది హాజరు కాగా, ముగ్గురు గైర్హాజరయ్యారు. ఆయా కేంద్రాలను కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షించారు. ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ముందుగానే చేరుకున్న విద్యార్థులు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ -
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
ఆదిలాబాద్‌టౌన్: ఆరుగాలం కష్టపడి పంటలు పండించే అన్నదాతలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ‘రైతుల ముగింట్లో శాస్త్రవేత్తలు’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని ఆయా గ్రామాల్లోకి శాస్త్రవేత్తలు వెళ్లి రైతులకు పలు సలహాలు, సూచనలు అందించనున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి ఏవిధంగా సాధించాలనే విషయాలపై అవగాహన కల్పించనున్నారు. తాంసి మండలం పొన్నారి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించనున్నారు. జిల్లాలోని 44 గ్రామాల్లో కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొంటారు. వీరితో పాటు వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ అధికారులు రైతులకు సూచనలు అందించనున్నారు. రైతులను చైతన్యపర్చేందుకు.. రైతులను చైతన్యపర్చేందుకు ప్రభుత్వం రైతు ముగింట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈనెల 5 నుంచి 13 వరకు రైతుల చెంతకు శాస్త్రవేత్తలు వెళ్లనున్నారు. తొమ్మిది బృందాలుగా గ్రామాల్లో పర్యటిస్తారు. సాగు పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించడం, సస్యరక్షణ చర్యలు, ఏయే భూముల్లో ఏయే పంటలు వేయాలి తదితర విషయాలను రైతులకు తెలియజేస్తారు. వారి సందేహాలను నివృత్తి చేస్తారు. కాగా కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఆరుగురు శాస్త్రవేత్తలు, వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ఐదుగురు శాస్త్రవేత్తలు, వ్యవసాయ కళాశాల నుంచి ఏడుగురు శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యవసాయ కళాశాలకు సంబంధించి 14 గ్రామాల్లో, కృషి విజ్ఞాన శాస్త్రవేత్తలు 18 గ్రామాల్లో, వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు 12 గ్రామాల్లో పర్యటిస్తారు. నేటి నుంచి ఈనెల 13 వరకు.. అన్నదాతలకు అవగాహన నేడు పొన్నారిలో ప్రారంభం ఈనెల 13 వరకు కార్యక్రమాలు ఈనెల 5 నుంచి 13 వరకు రైతు ముగింట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని చేపడుతున్నాం. రైతుల చెంతకు వెళ్లి అవగాహన కల్పిస్తాం. అధిక దిగుబడులు ఏవిధంగా సాధించాలి, రసాయనాల వాడకం తగ్గించడం, ఏయే పంటలు సాగు చేయాలి, వాటికి ఆశించే చీడపీడల గురించి తెలియజేస్తాం. సోమవారం పొన్నారి గ్రామంలో ప్రారంభిస్తున్నాం. రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – రాజశేఖర్, కేవీకే శాస్త్రవేత్త -
● పైలట్ ప్రాజెక్ట్‌గా భోరజ్ మండలం ఎంపిక ● నేటి నుంచి గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు ● మూడు ప్రత్యేక బృందాల నియామకం
కై లాస్‌నగర్: భూ సమస్యలు పరిష్కరించి రైతుల కు భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టం అమల్లో భాగంగా జి ల్లాలో కొత్తగా ఏర్పడిన భోరజ్ మండలాన్ని పైల ట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. నేటినుంచి ఈ నెల 16వరకు గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. షెడ్యూల్ ఖరారుతో పాటు తహసీల్దార్ల ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను నియమిస్తూ కలెక్టర్ రాజర్షిషా ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులే స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లనున్న నేపథ్యంలో తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. తహసీల్దార్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు.. భోరజ్ తహసీల్దార్ ఎల్.రాజేశ్వరీ, భీంపూర్ తహసీల్దార్ కె.నలంద ప్రియ, బేల తహసీల్దార్ రఘునాథ్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో టీంలో నాయబ్ తహసీల్దార్, ఇద్దరు ఆర్ఐలు, సర్వేయర్, సీనియర్ అసిస్టెంట్/జూనియర్ అసిస్టెంట్, ఎంపీఎస్వో స్థాయి కలిగిన ఎనిమిది మంది ఉద్యోగులను నియమించారు. వీరితో పాటు జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లతో కూడిన ఎనిమిది మంది ఉద్యోగులతో మరో మూడు హెల్ప్ డెస్క్‌లను నియమించారు. జిల్లాలోని పలు తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ బాధ్యతలను అప్పగించారు. ఒక్కో గ్రామాన్ని ఈ 16 మంది అధికారులు, ఉద్యోగులు సందర్శించి అక్కడి రైతులకు భూ భారతి చట్టం విధి విధానాలపై అవగాహన కల్పిస్తారు. వారి నుంచి భూ సమస్యలపై అర్జీలు స్వీకరించనున్నారు. ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు వీరంతా గ్రామంలోనే ఉండనున్నారు. సంబంధిత రైతులు రాతపూర్వక దరఖాస్తులను అందించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే నిర్ణీత ప్రొఫార్మాను జిల్లాకు పంపించింది. అధికారులు వాటిని అందజేయనున్నారు. దాన్ని పూర్తి చేసి అవసరమయ్యే ధ్రువీకరణ పత్రాలను జతచేసి అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. వాటిని విచారణ అనంతరం పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. సమస్యలు బోలేడు.. గత ప్రభుత్వం అమలు చేసిన ధరణిలో పలు సమస్యలకు సంబంధించి ఆప్షన్లు లేకపోవడంతో గ్రామాల్లో భూ సమస్యలు పేరుకుపోయాయి. వాటి పరిష్కారం కోసం కొన్నేళ్లుగా బాధితులు అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇలాంటి వారంతా కొత్త చట్టంపై ఆశలు పెట్టుకున్నారు. సర్వేనంబర్లలో తప్పిదాలు, భూమి మిస్సింగ్, సరిహద్దుల వివాదం, పేర్ల మార్పిడి, డిజిటల్ సిగ్నిచర్, భూ విస్తీర్ణంలో తేడాలు, విరాసత్, సాదాబైనామా వంటి సమస్యలు ఈ సదస్సుల ద్వారా పరిష్కారమై తమకు లబ్ధి చేకూరుతుందని ఆశపడుతున్నారు. కోర్టా గ్రామంలో ఇటీవల రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు(ఫైల్) సద్వినియోగం చేసుకోవాలి భూభారతి చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు సమస్యలను పరిష్కరించేందు కోసమే గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. సంబంధిత రైతులు సదస్సుకు వచ్చి నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తులు అందజేయాలి. సమస్యలను క్షేత్రస్థాయిలోనే విచారించి జూన్ 2లోగా వాటిని పరిష్కరిస్తాం. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలి. – ఎల్.రాజేశ్వరి, తహసీల్దార్, భోరజ్ సదస్సుల నిర్వహణ షెడ్యూల్ ఇలా.. భోరజ్ మండలంలో మొత్తం 28 రెవెన్యూ గ్రామాలున్నాయి. ఒక్కోరోజు మూడు గ్రామాల్లో సదస్సులు కొనసాగనున్నాయి. తొలిరోజున కోర్టా, గణేశ్‌పూర్, పూసాయి గ్రామాల్లో నిర్వహించనున్నారు. 6న మిర్జాపూర్, కేదార్‌పూర్, అవాల్పూర్, 7న బాలాపూర్, మాండగడ, అకోలి, 8న పిప్పర్వాడ, హత్తిఘాట్, హషంపూర్, 9న గిమ్మ(కే), శేఖాపూర్, సావాపూర్, 12న గిమ్మ(బి), డోల్లారా, దాదాపూర్, 13న లేఖర్వాడ, కామాయి, సిర్సన్న, 14న పౌజ్పూర్, గూడ, పెండల్వాడ, 15న తరోడా, కరన్‌వాడీ, రాంపూర్(టి), 16న భోరజ్ గ్రామాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. వీటి నిర్వహణకు నోడల్ అధికారిగా ఆదిలాబాద్ ఆర్డీవో బి.వినోద్‌కుమార్ వ్యవహరించనున్నారు. -
ఘనంగా భగీరథ మహర్షి జయంతి
కై లాస్‌నగర్: భగీరథ మహర్షి జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉప్పరసగర కులస్తులు, బీసీ సంక్షేమ శాఖ ఉద్యోగులతో కలిసి భగీరథుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ, భగీరథ మహర్షిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు కృషి చేయాలన్నారు. ఇందులో జిల్లా బీసీ సంక్షేమాధికారి కె. రాజలింగు, సూపరింటెండెంట్ సంజీవ్‌కుమార్, ఉప్పరసగర సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్ పాల్గొన్నారు. -
మందుబాబులపై కొరడా●
● బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన పలువురిపై కేసు ● జిల్లా కేంద్రంలో పోలీసుల విస్తృత తనిఖీలు ఆదిలాబాద్‌టౌన్: మందుబా బులపై పోలీసులు కొరడా ఝుళిపించారు. బహిరంగ ప్రదేశాలు, రోడ్ల పక్కన కూ ర్చొని మద్యం తాగే వారిపై కేసులు నమోదు చేశారు. ‘రో డ్లపైనే సిట్టింగ్’ శీర్షికన ‘సాక్షి’లో ఆదివారం కథనం ప్రచురితమైంది. ఈ మేరకు స్పందించిన వన్‌టౌన్, టూటౌన్ సీఐలు పట్టణంలో విస్తత తనిఖీలు చేపట్టా రు. టూటౌన్ పరిధిలో గల ఆర్అండ్బీ విశ్రాంతి భవనం, రవితేజ హోటల్, పంజా బ్ హోటల్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో మద్యం తాగుతున్న వారిని పట్టుకున్నారు. 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు టూ టౌన్ సీఐ కరుణాకర్‌రావు తెలిపారు. అలాగే వన్‌టౌన్ సీఐ సునిల్‌కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి
కై లాస్‌నగర్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు పాల్గొని జయప్రదం చే యాలని ఏఐటీయుసీ జిల్లా అధ్యక్షుడు చిరంజీవి, ప్రధాన కార్యదర్శి దేవేందర్ కోరారు. తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్, వర్క ర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కమిషనర్ సీవీ ఎన్ రాజును శనివారం కలిసి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్మికులు ఎన్నో పోరాటాలు, ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 44 చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి 4 కోడ్లుగా విభజించడాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఇందులో యూనియన్ నాయకులు అశోక్, ఉషన్న, నరేందర్ తదితరులున్నారు. -
లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి●
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జూన్ 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి కె. ప్రభాకరరావు సూచించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని తన చాంబర్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. రాజీమార్గం ద్వారా కేసులు పరి ష్కరించేందుకు లోక్ అదాలత్ ఎంతో తోడ్ప డుతుందన్నారు. రాజీపడదగ్గ కేసులన్నింటి నీ ఇందులో పరిష్కరించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని కోర్టుల్లో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని సద్విని యోగం చేసుకో వాలని సూచించారు. ఇందులో డీఎల్ఎస్ఏ ఇన్చార్జి సెక్రటరీ సీహెచ్ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నిధులు సరే.. పనులెప్పుడో?
● టెండర్లు పూర్తయినా షురూ కాని ‘అమృత్–2’ ● ఎస్టీపీల స్థల సేకరణలో తీవ్ర జాప్యం ● జిల్లా కేంద్రంలో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణాల తీరిది కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ము రుగునీటి సమస్య పరిష్కరించేలా కేంద్ర ప్రభుత్వం అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం చేపట్టాల ని నిర్ణయించింది. ఇందుకోసం అమృత్–2 పథకం కింద రూ.225 కోట్ల నిధులు మంజూరు చేసింది. సంబంధించిన టెండర్ల ప్రక్రియ సైతం పూర్తయిఎనిమిది నెలలవుతుంది. అయినా పనులు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. మురుగునీటిని శుద్ధి చేసే (ఎస్టీపీ) నిర్మాణాలకు అవసరమైన స్థలాల సేకరణ సమస్యగా మారింది. ఫలితంగా నిధులు ఉండి కూడా పనుల ప్రారంభంలో జాప్యమవుతోంది. భూసేకరణే ప్రధాన సమస్య.. జిల్లా కేంద్రంలో అయిదు చోట్ల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ)లను నిర్మించాలని నిర్ణయించారు. చిల్కూరిలక్ష్మినగర్లో 24 ఎంఎల్డీల సామర్థ్యంతో ఆరు ఎకరాల్లో, ఖానాపూర్ చెరువులోనే ఎకరం విస్తీర్ణంలో 4 ఎంఎల్డీల సామర్థ్యం, కేఆర్కే కాలనీలో 1.5 ఎంఎల్డీల సామర్థ్యంలో 1.5 ఎకరం స్థలంలో, ఇందిరమ్మ కాలనీ, బంగారుగూడ కాలనీల్లో ఒక్కో ఎంఎల్డీ సామర్థ్యంతో కూడిన ఎకరం విస్తీర్ణంలో వీటిని నిర్మించాలని నిర్ణయించారు. ఖానాపూర్ చెరువులో నిర్మించనుండగా దీనికి ఎలాంటి స్థల సమస్య లేదు. మిగతా నాలుగు చోట్ల నిర్మాణాలకు అవసరమైన స్థలాలను గుర్తించినప్పటికీ భూ సేకరణ కొలిక్కి రావడం లేదు. దీంతో పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. సెప్టిక్ ట్యాంకుల నిర్మాణాల అవసరం లేకుండా.. భవిష్యత్తులో ఇళ్లలో సెప్టిక్ ట్యాంకుల నిర్మాణాల అవసరం లేకుండా ఈ పథకాన్ని రూపొందించారు. చిల్కూరిలక్ష్మినగర్లో నిర్మించే ఎస్టీపీకి పట్టణంలోని దుర్గానగర్ కాలనీలోని వాగు పక్క నుంచి దస్నాపూర్, టీచర్స్‌కాలనీ, న్యూ హౌసింగ్‌బోర్డు, సుభాష్‌నగర్ మీదుగా వెళుతున్న వాగు ఇరు పక్కల ప్రధాన పైపులైన్ లేదా భారీ డ్రెయినేజీ నిర్మించనున్నారు. టైలర్స్ కాలనీ వద్ద రెండు లైన్లను ఒకే లైన్‌గా మార్చి నేరుగా చిల్కూరిలక్ష్మీనగర్లో నిర్మించే ఎస్టీపీ కేంద్రం వరకు పైపులైన్ వేయనున్నారు. పట్టణ నడిబొడ్డున ఉన్న కాలనీలన్నింటి మురుగు పంజాబ్‌చౌక్ నుంచి మహాలక్ష్మివాడవైపు వెళ్తుండటంతో ఈ మార్గాన్ని ఆ ఎస్టీపీకి అనుసంధానించనున్నారు. జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు, రవీంద్రనగర్, శాంతినగర్ వంటి కాలనీల నుంచి వచ్చే మురుగు ఖానాపూర్ చెరువులో నిర్మించే ఎస్టీపీకి మళ్లించనున్నారు. కేఆర్కే, ఇందిరమ్మకాలనీ, బంగారుగూడలోనూ చుట్టుపక్కల కాలనీలను కలిపి పైపులైన్ వేస్తారు. ఇలా అయిదు ఎస్టీపీలు వాటి కోసం నిర్మించే 14 కిలోమీటర్ల మేర ఉండనున్న పైపులైన్ నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. ప్రతిపాదనలు పంపించాం ఎస్టీపీల నిర్మాణాలకు సంబంధించి నాలుగు చోట్ల స్థలాలను గుర్తించాం. వాటికి భూ సేకరణ చేయాల్సి ఉంది. రెవెన్యూ శాఖ ద్వారా భూములను సేకరించేందుకు అవసరమైన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. భూ సేకరణ ప్రక్రియ ఎప్పుడు పూర్తయితై అప్పుడే పనులు ప్రారంభిస్తాం. – ఎం.గంగాధర్, పబ్లిక్ హెల్త్ ఈఈ -
భూభారతి పైలట్ మండలంగా భోరజ్
● రేపటి నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు ● కలెక్టర్ రాజర్షి షా కై లాస్‌నగర్: భూభారతి నూతన రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా పైలట్ ప్రాజెక్ట్‌గా జిల్లాలోని భోరజ్ మండలాన్ని ఎంపిక చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శనివారం తన క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భోరజ్ మండలంలో 28 గ్రామాల్లో ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిర్వహణ కోసం మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సదస్సుల్లో భూసమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. గ్రామానికి వెళ్లే ముందు రోజు గ్రామస్తులకు తెలిసేలా టామ్ టామ్ వేయించాలన్నారు. సంబంధిత అఽధికారులు ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. జూన్ 2 వరకు పైలెట్ ప్రాజెక్ట్ కింద వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ భూముల్లో పొజిషన్లో ఉన్నవారు, పట్టాలు ఉండి పొజిషన్లో లేని వారి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. హైకోర్టు అనుమతులు రాగానే సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలని, ఈమేరకు అవసరమైన కార్యాచరణ పూర్తిచేయాలన్నారు. ఇందులో అదనపు కలెక్టర్ కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్‌కుమార్, తహసీల్దార్లు, సర్వేల్యాండ్ రికార్‌ుడ్స ఏడీ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
మైనర్లకు బైకులివ్వొద్దు
● నిబంధనలు ఉల్లంఘిస్తే తల్లిదండ్రులపై కేసు ● ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదిలాబాద్‌టౌన్: మైనర్లకు బైక్‌లు ఇచ్చే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ అఖిల్ మహా జన్ అన్నారు. బైక్‌లు నడుపుతూ పట్టుబడ్డ మైనర్ల తల్లిదండ్రులకు పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మైనర్ డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమన్నారు. పద్దెనిమిదేళ్లలోపు వారికి బైక్లిస్తే వాహన యజమానితో పాటు తల్లిదండ్రులు కేసుల పాలవుతారన్నారు. ఒకవేళ మైనర్ ప్రమాదానికి కారణమైతే ఇన్సూరెన్స్ సైతం రాకుండా పోతుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను రాత్రిపూట, రోడ్లపై అనవసరంగా తిరగకుండా గమనించాలన్నారు. ఇటీవల నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 295 మంది మైనర్లు బైక్‌లు నడుపుతూ పట్టుబడగా ఆ వాహనాలను సీజ్ చేశామన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్‌రెడ్డి, పట్టణ సీఐలు సీహెచ్ కరుణాకర్, ప్రణయ్‌కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి. వెంకటి, టి మురళి, బి శ్రీపాల్, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో క్రమశిక్షణతో వ్యవహరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ప్రతీ శనివారం స్థానిక పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించే పరేడ్, యోగా కార్యక్రమాలను ఈ వారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరేడ్ నిర్వహణ ద్వారా సత్సంబంధాలు మెరుగుపడతాయన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేలా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని సూచించారు. ఆయుధాల వినియోగం, ట్రాఫిక్ సిబ్బందికి సిగ్నల్స్‌పై శిక్షణనిచ్చారు. ఇందులో అదనపు ఎస్పీ బి.సురేందర్‌రావు, డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, పట్టణ సీఐలు బి.సునీల్‌కుమార్, సీహెచ్ కరుణాకర్, కే.ఫణిధర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు టి.మురళి, బి.శ్రీపాల్, ఎన్.చంద్రశేఖర్, మావల ఎస్సై వి విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నూతన కార్యవర్గం
కైలాస్‌నగర్: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ జిల్లా నూ తన కార్యవర్గాన్ని స్థానిక టీఎన్జీవోస్ భవన్లో శని వారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్‌గా ఎస్. అశోక్, సెక్రటరీ జనరల్‌గా కే.శివకుమార్, అడిషన ల్ సెక్రటరీ జనరల్‌గా కే. కృష్ణ కుమార్, కోచైర్మన్లుగా కె.కిష్టన్న, మూగ శ్రీనివాస్, సొగల సుదర్శన్, ఎం.శ్రీనివాస్, కే.లక్ష్మారెడ్డి, బి.ప్రవీణ్‌కుమార్, వైస్ చైర్మన్లుగా ఆర్.శివకుమార్, నవీన్‌యాదవ్, కాంబ్లీ విజయ్ కుమార్, డిప్యుటీ సెక్రటరీ జనరల్‌గా నవీన్‌కుమార్, రాథోడ్రామారావు, కాంబ్లీ విజయ్ కుమా ర్, సెక్రటరీలుగా సప్దార్అలీ, జాయింట్ సెక్రటరీ గా తిరుమల్‌రెడ్డి, కృష్ణ,సంజీవరెడ్డి ఎన్నికయ్యారు. -
ఆర్టీసీ ద్వారా మెరుగైన సేవలు
ఆదిలాబాద్: ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రయాణికులకు అందిస్తున్న మెరుగైన సేవలను తెలియజేయాలనే ఉద్దేశంతోనే కీచైన్స్ పంపిణీ చేస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణికులకు శనివారం క్యూఆర్ కోడ్ కీచైన్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్టీసీ అందిస్తున్న సేవలు, సమగ్ర సమాచారాన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ పోశెట్టి, రిజర్వేషన్ ఇన్చార్జి హుస్సేన్, దేవిదాస్, పాల్గొన్నారు. -
నాన్న చూపునకూ నోచుకోకుండానే..!
నిర్మల్/పెంబి: ‘నాన్న.. నువ్వేం ఫికర్ చేయకు. ఇటేం మనసు పెట్టుకోకు. అమ్మా మేము మంచిగనే ఉన్నం. మంచిగ చదువుకుంటున్నం. నువ్వు జాగ్రత్తగా ఉండు. తొందరలనే మనకు మంచి రోజులు వస్తయ్..’ అంటూ నిత్యం తమ తండ్రి మనసులో ఆశలు వెలిగించే ఆ ‘దీపాలు’ అవి నెరవేరకముందే అర్ధంతరంగా ఆరిపోయాయి. తన బిడ్డల చివరిచూపు కోసం ఆ తండ్రి దేశంకాని దేశంలో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. రెక్కల కష్టంతో పెంచుకున్న బిడ్డలిద్దరూ అసువులు బాయడంతో ఆ తల్లి గుండె చెరువైంది. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ సమీపంలో ఎన్‌హెచ్ 44పై శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో నిర్మల్ జిల్లా పెంబి మండలం లోతొర్యతండాకు చెందిన అక్కాచెల్లెళ్లు అశ్విని(21), మంజుల(17) మృతిచెందారు. మారుమూల తండా నుంచి..గ్రామస్తులు, జక్రాన్‌పల్లి ఎస్సై ఎండీ మాలిక్ రహమాన్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతమైన పెంబి మండలం లోతొర్య తండాలో మట్టిగోడలతో రేకుల ఇంట్లో ఉంటున్న బానావత్ సుగుణ, రెడ్డి దంపతులకు ముగ్గురు కూతుళ్లు కుమార్తెలు అశ్విని, మంజుల, నిహారికలతోపాటు కుమారుడు ఆకాశ్ ఉన్నారు. అందరూ చదువుకుంటున్నారు. ఎకరం భూమి మాత్రమే ఉండటంతో రోజువారీ వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. స్థానికంగా సరైన ఉపాధి లేకపోవడంతో మూడేళ్లక్రితం బానావత్ రెడ్డి దుబాయి వెళ్లాడు.ఎలాగైనా చదవాలని..తమకోసం తమ తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూస్తూ పెరిగిన పిల్లలు బాగా చదివి మంచి ఉద్యోగాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెద్దకూతురు అశ్విని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇటీవల ఫైనలియర్ పూర్తిచేసింది. రెండోకూతురు మంజుల ఇచ్చోడలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేసింది. మంజులకు ఈఏపీ ఎంట్రన్స్ టెస్ట్ ఉండటంతో అక్క అశ్విని సమీప బంధువు జాదవ్ హంసరాజుతో కలిసి గురువారం కారులో హైదరాబాద్ వెళ్లారు. అక్కడ పరీక్ష రాసి, శుక్రవారం తండాకు తిరిగి వస్తుండగా నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌వద్ద కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో అక్కాచెలెళ్లు అక్కడే చనిపోగా, బంధువు జాదవ్ హంసరాజు కాలు, చేయి విరిగాయి. అతడిని ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు.చివరిచూపునకూ నోచుకోలేక..మూడేళ్లక్రితం దుబాయి వెళ్లిన బాణావత్ రెడ్డి ఏడాదిపాటు ఓ కంపెనీలో పనిచేశాడు. ఆ ఏడాది పనిచేసినా కంపెనీ ఆయనకు డబ్బులు ఇవ్వలేదు. మోసపోయానని తెలుసుకున్న రెడ్డి బయటకు వచ్చి కలివెల్లి వీసాపై చిన్నచితకా పనులు చేసుకుంటున్నాడు. ఏడాదికాలంగా ఖర్చుల కోసం భార్య సుగుణనే ఇక్కడి నుంచి డబ్బులను పంపిస్తోంది. ప్రస్తుతం ఆయన స్వదేశానికి తిరిగి రావడానికీ డబ్బులు లేవు. తన కన్నబిడ్డలను చివరిచూపు కూడా చూడలేని దయనీయ పరిస్థితి. కనీసం విమాన చార్జీలకు డబ్బులు ఇస్తే.. తన బిడ్డల చివరిచూపైనా చూస్తానంటూ రెడ్డి విలపిస్తున్నాడు. -
వేసవి శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి
ఉట్నూర్‌రూరల్: గిరిజన విద్యార్థులు వేసవి క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సూచించారు. మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్‌లో గల క్రీడామైదానంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ, వేసవి శిక్షణను సద్వినియోగం చేసుకుని క్రీడా సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థులకు క్రీడా పరికరాలను పంపిణీ చేశారు. ఇటీవల స్కోచ్ అవార్డు అందుకున్న పీవోను అధికారులు, పీడీలు, క్రీడా పాఠశాల సిబ్బంది సన్మానించారు. కార్యక్రమంలో డీడీ అంబాజీ, ఏసీఎంవో జగన్, ఏపీవో పీవీటీజీ మెస్రం మనోహర్, గిరిజన క్రీడాధికారి పార్థసారధి తదితరులున్నారు. ● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా -
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్ఆదిలాబాద్టౌన్: పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో శుక్రవారం వైద్యశిబిరం నిర్వహించారు. 400 మంది సిబ్బంది వారి కుటుంబీకులకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఇందులో డీఎస్పీలు పో తారం శ్రీనివాస్, ఎల్.జీవన్‌రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మురళి, నవీన్‌కుమార్, కార్తీక్, పోలీస్ అసో సియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మహిళల భద్రత కోసమే షీటీంలు మహళల భద్రత కోసం షీటీం నిర్వహణ చేపడుతున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో షీటీంలకు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు. జిల్లాలో విస్తృతంగా షీటీం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గతనెలలో 110 గ్రా మాలను ఆయా బృందాలు సందర్శించాయని పేర్కొన్నారు. నాలుగు ఎఫ్ఐఆర్, 10 పీటీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఆపత్కాల సమయంలో షీటీం కోసం 8712659953 నంబర్‌పై సంప్రదించాలని సూచించారు. వీడీసీల అక్రమాలపై ఉక్కుపాదం.. వీడీసీల అక్రమ కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని ఎస్పీ అన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, అక్రమ దందాలు, వసూళ్లు, సెటిల్మెంట్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించాలని తెలిపారు. వీడీసీ బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని పే ర్కొన్నారు. చట్టం చేయాల్సిన పనిని పలుచోట్ల వీడీసీలు తమ చేతిలోకి తీసుకొని పోలీసు, న్యా యస్థానాన్ని ఆశ్రయించకుండా చూస్తున్నారని, వారు చెప్పింది వినకపోతే కొందరు గ్రామాల నుంచి వెలివేస్తామని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఐదు కేసులు నమోదు చేసినట్లు వివరించారు. బేల, జైనథ్, బోథ్, ఇచ్చోడ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలిపారు. -
20న సార్వత్రిక సమ్మె
ఆదిలాబాద్‌టౌన్: ఈనెల 20న చేపట్టనున్న సా ర్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సిర్ర దేవేందర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం రిమ్స్ కృష్ణ ఏజెన్సీ సూపర్వైజర్కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పోరాడి సాధించుకున్న 44 చట్టాలను ప్రభుత్వం రద్దు చేసి నాలుగు కోడ్లుగా తీసుకురావడాన్ని ఖండిస్తున్నామని అ న్నారు. దేశ వ్యాప్త సమ్మెలో శానిటేషన్ సిబ్బంది, పేషెంట్‌కేర్, సెక్యూరిటీ గార్డులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇందులో సంఘం నాయకులు చందు, రమేశ్, సంగీత, పద్మ, సుశీల తదితరులు పాల్గొన్నారు. -
● అనుమతి లేకుండా వాటర్ ప్లాంట్లు ● నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ● క్యాన్లలో అపరిశుభ్ర నీరే సరఫరా ● చోద్యం చూస్తున్న అధికారులు
ఇక్కడ కనిపిస్తున్న వాటర్ ప్లాంట్ ఆదిలాబాద్‌లోని విద్యానగర్ లోనిది. ఈ యజమాని మరో చోట నుంచి వాహనంలో నీటిని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నాడు. ప్యూరిఫైడ్ చేయకుండానే ప్రజలకు విక్రయిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 20 లీటర్ల క్యాన్‌కు రూ.30 చొప్పున వసూలు చేస్తున్నాడు.ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో ప్యూరిఫైడ్ వాటర్ పేరిట ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వేసవి కా వడంతో నీటి దందా జోరందుకుంది. అయితే వీటికి అనుమతులు ఉండవు.. ప్రమాణాలు పాటించరు.. నిర్వహణ సైతం ఇష్టారీతిన కొనసాగుతోంది. రక్షిత నీటిని తాగాలనే ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకుని ప్యూరిఫైడ్ పేరిట ఏటా లక్షలాది రూపాయలు అర్జిస్తున్నారు కొందరు. ప్రజలకు క్యా న్లలో కలుషిత నీటిని అందిస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ‘మామూలు’గా వ్యవహరించడం గమనార్హం. నీటి నిర్ధారణ పరీక్షలు చేయకుండానే... జిల్లాలో సుమారు 700 వరకు వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కదానికి కూడా అనుమతి లేదు. ఐఎస్ఐ నిబంధనలు సైతం పాటించడం లేదు. ఏడాదికోసారి రెన్యూవల్ చేసుకోవాల్సి ఎక్కడా అలాంటి దాఖలాలు కనిపించడం లేదు. ఇళ్లు, దుకాణాలు, పాత గదుల్లోనే ప్లాంట్లను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. నిర్ధారణ పరీక్షలు సైతం ఎక్కడా నిర్వహించడం లేదు. ఏటా వేసవిలో ప్యూరిఫైడ్ నీటికి గిరాకీ ఉంటుంది. వీటిని ఆసరాగా చేసుకుని కొందరు అనుమతి లేకుండా ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. గతంలో పట్టణాలకు పరిమితం కాగా ప్రస్తుతం గ్రామాలకు సైతం విస్తరించాయి. క్యాన్‌కు రూ.20 నుంచి రూ.40 వరకు వసూలు చేస్తున్నారు. వాస్తవంగా 20 లీటర్ల నీటి శుద్ధికి రూ.2 నుంచి రూ.3 మాత్రమే ఖర్చవుతుంది. ఈ క్రమంలో ఖర్చు తక్కువ.. ఆదాయం ఎక్కువగా ఉన్న ఈ వ్యాపారం వైపు మొగ్గుచూపుతున్నారు. కొన్ని ప్లాంట్లలో క్యాన్లు శుద్ధి చేయకుండానే సాధారణ నీటిని నింపి సరఫరా చేస్తున్నారు. కాలం చెల్లిన క్యాన్లు ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆదిలాబాద్‌లోని ఓ వాటర్ ప్లాంట్ నిర్వహణ తీరిలా.. ఇక్కడ కనిపిస్తున్న వాటర్ ప్లాంట్ ఆదిలాబాద్‌లోని కొత్త కుమ్మర్వాడ సమీపంలోనిది. ఇక్కడి నుంచి రోజుకు వందలాది క్యాన్లు సరఫరా అవుతున్నాయి. అయితే రోజుకు 4వేల లీటర్ల నీటిని బోరు నుంచి తోడితే ఇందులో 25 శాతం మాత్రమే ప్యూరిఫైడ్ అవుతుంది. మిగతా 75 శాతం వృథా అవుతుంది. ఇలా నీటి వృథాతో కాలనీలోని ఇళ్లలో ఉన్న బోర్లకి నీరు రావడం లేదని స్థానికులు వాపోతున్నారు. జిల్లా కేంద్రంలో గల్లీకి ఒకట్రెండు చొప్పున ఇలా ప్లాంట్లు అక్రమంగా వెలిసినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నిబంధనలు ఇవి.. వాటర్ ప్లాంట్‌కు మున్సిపల్/గ్రామపంచాయతీ అనుమతి తీసుకోవాలి. పరిశ్రమల శాఖ నుంచి పార్టు–1 లైసెన్సు పొందాలి. నిర్వహణకు బీఎస్ఐ అనుమతి ఉండాలి. ఐఎస్ఐ నిబంధనలు పాటించాలి. ప్లాంట్‌లో మైక్రోబయాలజీ, కెమిస్ట్రి సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి. పీహెచ్ స్థాయి 7 కంటే తగ్గకుండా చూడాలి. తగ్గితే ఆ నీరు తాగిన వారికి కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి. ప్లాంట్‌లో ప్రయోగశాలతో పాటు ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి. నీటిని సరఫరా చేసే క్యాన్ అపరిశుభ్రంగా ఉండకూడదు. ప్రతిరోజు పొటాషియం పర్మాంగనేట్‌తో క్లీనింగ్ చేయాలి. అలాగే ప్రతి క్యాన్‌పై శుద్ధి చేసిన తేది, బ్యాచ్ నంబర్ ఉండాలి. శుద్ధి చేసిన నీటిని 304 గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేసిన పెద్ద ట్యాంకులో నింపి ఓజోనైజేషన్ చేయాలి. అయితే జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క ప్లాంట్‌లో కూడా ఈ నిబంధనలు పాటించడం లేదు.అనుమతి లేని ప్లాంట్లపై చర్యలు జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లను తనిఖీ చేస్తాం. అనుమతులు లేకుండా, నిబంధనలు పాటించని వాటిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – సీవీఎన్ రాజు, మున్సిపల్ కమిషనర్ -
‘నీట్’ పకడ్బందీగా నిర్వహించాలి
ఆదిలాబాద్‌టౌన్: నీట్‌ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. ఈనెల 4న నిర్వహించనున్న పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించా రు. ఆయా కేంద్రాలను ఎస్పీతో కలిసి తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 4న మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల, సాంఘిక సంక్షేమ గు రుకుల బాలికల పాఠశాల, ప్రభుత్వ బాలికల పాఠశాల, ప్రభుత్వ ఆర్ట్స్అండ్ కామర్స్ డిగ్రీ కళా శాల, బంగారుగూడ మోడల్ స్కూల్, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్లో రెండు కేంద్రాలు ఏర్పా టు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షకు 1,659 మంది హాజరుకానున్నారని తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు కేంద్రంలోనికి అనుమతించనున్నట్లు తెలిపారు. ఆయా కేంద్రాల్లో తాగునీరు, వైద్యసేవలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇందులో అదనపు ఎస్పీ సురేందర్‌రావు, డీఎస్పీ జీవన్‌రెడ్డి, కేంద్రీయ విద్యాలయం కోఆర్డినేటర్ అశోక్, వాగ్మారే, ఎంఈవోలు ఉన్నారు. కలెక్టర్ రాజర్షిషా -
జనగణనతోపాటు కులగణన
ఆదిలాబాద్: దేశంలో జనగణనతో పాటు కులగణన సైతం ఎంతో ముఖ్యమైనదని ఆదిలా బాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. కులగణ నపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్‌తో కలిసి ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా కుల గ ణన జరుగుతుందన్నారు. ఈ దిశగా కేంద్ర ప్ర భుత్వం చర్యలు తీసుకోనుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మా నంద్, పట్టణ అధ్యక్షుడు వేద వ్యాస్, రవి, రవి రెడ్డి, భూమేశ్, రాకేశ్, సుభాష్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. -
● జిల్లాలో పడిపోతున్న భూగర్భజలాలు ● ఇచ్చోడలో 30మీటర్ల లోతులోకి.. ● పలుచోట్ల పనిచేయని బోర్లు ● ఇబ్బందులు పడుతున్న జనం ● జూన్ వర్షాలపైనే ఆశలు
ఇది నార్నూర్ మండలంలోని బలాన్పూర్ గ్రామంలోని చెరువు. నెల రోజుల క్రితమే ఎండిపోయింది. ఇటీవల పూడికతీత పనులు మొదలుపెట్టారు. ఈ ఏడాది ఎండల తీవ్రత కారణంగా చాలా చెరువులు ఏప్రిల్‌లోనే ఎండిపోయిన పరిస్థితులు కనిపించాయి.ఇది సిరికొండ మండల కేంద్రంలోని చిక్మాన్ ప్రాజెక్ట్. ఈ ఏడాది ఎండల తీవ్రత కారణంగా ఇది పూర్తిగా ఎండిపోయింది. 2004లో నిర్మించిన ఈ చెరువు ఇప్పటివరకు ఎప్పుడు ఎండిపోలేదు. తొలిసారిగా ఎండిపోవడంతో దీని కింద ఉన్న 2వేల ఎకరాల ఆయకట్టుకు యాసంగిలో నీళ్లు అందని పరిస్థితి. ●సాక్షి,ఆదిలాబాద్: ఇచ్చోడలోని విద్యానగర్, సుభా ష్‌నగర్, టీచర్స్ కాలనీల్లో నీటి ఇక్కట్లు నెలకొన్నా యి. పలు ఇళ్లలో బోర్లలో నుంచి నీరు సరిగా రావ డం లేదు. దీంతోస్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోర్లు కనీసం 15నిమిషాలకు మించి నడవడం లేదని పేర్కొంటున్నారు. గత్యంతరం లేక పలువురు ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. మరికొందరు ద్విచక్రవాహనాలపై సమీపంలోని వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. ఈ మండలంలో జనవరిలో 8.10 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా, ఫిబ్రవరికి ఏకంగా 28.85 మీటర్ల లోతులోకి పడిపోయాయి.తాజాగా 30మీటర్ల లోతుకంటే అధి కంగా నమోదవడం పరిస్థితికి అద్దం పడుతోంది. 30 మీటర్ల లోతునకు.. జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకు మరింత ప డిపోతున్నాయి. వేసవిలో ఎండల తీవ్రత పెరగడంతో కఠిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇచ్చోడలో భూగర్భ జలాల పరిస్థితి తీవ్రంగా ఉంది. ఏకంగా 30 మీటర్ల లోతునకు పడిపోయాయి. ఇక్కడ ఇళ్లలో బోర్లు పావుగంట మించి నడవని పరిస్థితి. దీంతో స్థానికుల ఇక్కట్లు వర్ణనాతీతంగా మారాయి. ఇక ఆదిలాబాద్ పట్టణంలో 10 మీటర్ల లోతులోకి చేరుకున్నాయి. జిల్లా కేంద్రంలో ప్రస్తు తం కొంత పర్వాలేదనుకున్నా ఈనెల చివరిలో మ రింత లోతులోకి పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. దీంతో నీటి సమస్య తీవ్రమవుతుందా అనే పట్టణ వాసుల్లో కనిపిస్తుంది. ఇదీ పరిస్థితి.. గతేడాది మే నెలలో జిల్లాలో భూగర్భలాలు 10.59 మీటర్లకు పడిపోయాయి. దీంతో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్ వరకే ఆ పరిస్థితి కనిపించింది. ప్రస్తుత మే నెలలో పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే చాలా చోట్ల చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. నెర్రెలు బారి దర్శనమిస్తున్నాయి. పలుచోట్ల పూడిక తీత పనులు చేపడుతున్నారు. గతేడాది వర్షాకాలం ముగిసిన తర్వాత జిల్లాలో నవంబర్ నెలలో 5.14 మీటర్ల లోతులోనే జలాల లభ్యత కనిపించింది. ఈ నేపథ్యంలో జూన్ వర్షాలపైనే జిల్లావాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో సగటున భూగర్భ జలాల పరిస్థితి (భూఉపరితలం నుంచి లోతులోకి.. మీటర్లలో) జనవరి : 7.06 ఫిబ్రవరి : 8.54 మార్చి : 8.68 ఏప్రిల్ : 8.82 ఏప్రిల్ నెలలో వివిధ ప్రాంతాల్లో భూగర్భ జలాల పరిస్థితి (మీటర్లలో) ఇచ్చోడ : 30.05 గాదిగూడ : 18.35 గుడిహత్నూర్ : 14.50 భోరజ్ : 14.10 ఇంద్రవెల్లి : 13.10 యాపల్‌గూడ : 10.50 ఆదిలాబాద్ : 10.50 వర్షాలు పడితేనే రీచార్జ్ సమయానికి వర్షాలు కురువని పక్షంలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి వెళ్లిపోయే పరిస్థితి ఉంది. బోర్లు ఎండిపోతున్నాయి. మళ్లీ మంచి వర్షాలు పడినప్పుడే రీచార్జ్ అవుతాయి. ప్రజలు నీటిని పొదుపుగా వాడాలి. – శ్రీవల్లి, భూగర్భజల అధికారి, ఆదిలాబాద్