
ఘనంగా భగీరథ మహర్షి జయంతి
కై లాస్‌నగర్: భగీరథ మహర్షి జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉప్పరసగర కులస్తులు, బీసీ సంక్షేమ శాఖ ఉద్యోగులతో కలిసి భగీరథుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ, భగీరథ మహర్షిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు కృషి చేయాలన్నారు. ఇందులో జిల్లా బీసీ సంక్షేమాధికారి కె. రాజలింగు, సూపరింటెండెంట్ సంజీవ్‌కుమార్, ఉప్పరసగర సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్ పాల్గొన్నారు.