వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్ సమావేశ మందిరంలో ఉట్నూ ర్ సబ్ డివిజన్ అధికారులతో బుధవారం సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ నకిలీ లూజ్ విత్తనాల నియంత్రణకు దృష్టి సారించాలన్నారు. బక్రీద్ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను తనిఖీలు చేయాలని సూచించారు. జిల్లాలో బ్లూకోర్టు, డయల్ 100 సిబ్బంది ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ పోలీసులు మీకోసం కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వానాకాలంలో అత్యవసర సామగ్రి కలిగి ఉండాలని, వాగులు, వంకలు, బ్రిడ్జిలు దాటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ సు రేందర్‌రావ్, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌సింగ్, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, సీహెచ్ నాగేందర్, సీఐలు రహీం పాషా, మొగిలి, రాజు, పండే రావు, గుణవంత్‌రావు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు వెంకటి, మురళి, చంద్రశేఖర్, ఉట్నూర్ సబ్‌డివిజన్ ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.


