సీపీఐ శతాబ్ది ఉత్సవాలు
కై లాస్‌నగర్: సీపీఐ శతాబ్ది ఉత్సవాలను గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని న్యూ హౌసింగ్‌బోర్డు కాలనీ పరిధిలోగల 170 కాలనీలో గు రువారం ఘనంగా జరుపుకొన్నారు. ఆ పార్టీ జిల్లా నాయకుడు కుంటాల రాములు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండా ఆవిష్కరించారు. సీపీఐ 1969లో భూమి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం సాయుధ పోరాటం చేసిందని గుర్తు చేశారు. ప్రజలు, వ్యవసాయ, ఇతర రంగాల కార్మికుల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసిందని తెలిపారు. ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేసిన ఘనత పార్టీకే దక్కిందని పేర్కొన్నారు. 26న సీపీఐ కార్యాలయంలో నిర్వహించనున్న వేడుకలకు పార్టీ శ్రేణులు అధికసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. పార్టీ నాయకులు షేక్ భాషా, రాందాస్, గణేశ్, సురేశ్, ప్రహ్లాద్, దత్తు, కాలనీవాసులు పాల్గొన్నారు.


