అందుబాటులోకి ‘క్రిటికల్ కేర్’
ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ (అత్యవసర సేవల విభాగం) ప్రజలకు అందుబాటులోకి రా నుంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించనున్నారు. 2023లో రిమ్స్‌కు మంజూరు కాగా, ఇటీవల నిర్మాణం పూర్తయింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.23.75కోట్లతో నిర్మాణాలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులు కేటాయించింది. అవసరమైన సాంకేతిక పరికరాలు, ఇతర సామగ్రిని సరఫరా చేసింది. అయితే కొన్నినెలలుగా పరికరాలు సమకూర్చినా, నిర్మాణం పూర్తయినా సేవలు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర సేవలు అందకుండా పోయాయి. తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి క్రిటికల్‌కేర్‌ను ప్రారంభించనున్నా రు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మ హారాష్ట్ర వాసులకు అత్యవసర సేవలు అందనున్నా యి. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి మెరుగైన వై ద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, గుండె, న్యూరో, ఆర్థో, తదితర అత్యవసర చికిత్స అందించనున్నారు. రిమ్స్‌లో ఉన్న వైద్యులతో ఈ సేవలు కొనసాగిస్తామని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. గురువారం క్రిటికల్‌కేర్ భవనం ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరిశీలించారు.
అందుబాటులోకి ‘క్రిటికల్ కేర్’


