● సర్పంచులు, వార్డు మెంబర్లుగా ఎన్నిక ● పల్లె పీఠాలపై య
మెంబర్లు
కై లాస్‌నగర్: నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న పల్లెల్లో నూ సింహభాగం సర్పంచ్, వార్డు మెంబర్ పదవులు కై వసం చేసుకున్నవారిలో అత్యధికులు అక్షరా స్యులే. గ్రామ రాజకీయాల్లో వస్తున్న మార్పునకు ఇ ది నాంది పలుకుతోంది. గతంలో పల్లె రాజకీయాల ను విద్యావంతులు అంతగా పట్టించుకునేవారు కా దు. ఉద్యోగ సాధనే లక్ష్యంగా ఉన్నత చదువులపై దృష్టి సారిస్తున్న గ్రామీణ యువతీయువకులు క్ర మంగా రాజకీయాలపై మక్కువ చూపుతున్నారు. ఇటీవల జరిగిన గ్రామపంచా యతీ ఎన్నికల్లో ఈ విష యం స్పష్టమైంది. ఉన్న ఊరిని ప్రగతిపథంలో నడిపించాలనే ఉద్దేశంతో విద్యావంతులు పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచారు. పల్లె ఓటర్లూ చదువుకున్నోళ్ల కే పట్టం కట్టారు. ఇది గ్రామీణ ఓటర్ల చైతన్యానికి నిదర్శనం. సర్పంచులు, వార్డు మెంబర్లుగా గెలిచినవారిలో అత్యధి కులు విద్యావంతులే ఉండటంతో పల్లె రాజకీయాల్లో వస్తున్న మార్పునకు ఇది నిదర్శనం.
విద్యావంతులే అధికం
జిల్లాలోని గ్రామపంచాయతీలు, వార్డు మెంబర్ల స్థానాలకు ఇటీవల మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇందులో మెజార్టీ స్థానాల్లో విద్యావంతులే గెలుపొందారు. అండర్ గ్రాడ్యుయేట్స్ అ త్యధిక మంది ఉండగా, డిగ్రీ పట్టభద్రులు, ఉన్నత విద్యనభ్యసించిన వారూ ఉండటం పల్లె రాజకీయాలకు శుభపరిణామంగా భావించవచ్చు. పల్లె పాలకవర్గాల్లో విద్యావంతులు ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావా ల్సిన నిధులపై అవగా హన ఉంటుంది. వాటి ని ఏ విధంగా వినియోగించుకుంటే గ్రామాభి వృద్ధి సాధ్యమవుతుందనే దిశగా ఆలోచించే అవకాశమూ ఉంటుంది. గ్రామ సమస్యలపై ఉన్నతాధికారులు, ప్రజాప్రజాప్రతినిధులను కలిసి నివేదించడంతో పాటు వాటి పరిష్కారానికి చొరవ చూపే అవకాశం దక్కనుంది. విద్యావంతులతో పాటు పలువురు నిరాక్షరాస్యులూ స ర్పంచులుగా గెలిచారు. అయితే, గ్రామ సమస్యలపై అవగాహన కలిగి, వాటిని అభివృద్ధి పథంలో నడుపుతారనే నమ్మకం కలిగిన వారికే పల్లె ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. ఈసారి విద్యావంతులే ఎక్కువగా సర్పంచులుగా గెలుపొందడంతో తమ గ్రామాల అభివృద్ధిపై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. వారి నమ్మకాన్ని నిలుపుకొనేలా పనిచేయాల్సిన బాధ్యత విద్యావంతులైన కొత్త సర్పంచులపై ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
సర్పంచులు, వార్డు మెంబర్లుగా ఎన్నకై నవారి విద్యార్హతలు
విద్యార్హత సర్పంచులు వార్డు
గ్రాడ్యుయేట్స్ 35 182
పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 13 87
అండర్ గ్రాడ్యుయేట్స్ 280 1,639
నిరాక్షరాస్యులు 144 1,951
సామాజికవర్గాల వారీగా ఇలా..
సామాజికవర్గం సర్పంచులు వార్డు మెంబర్లు
బీసీలు 72 949
ఎస్సీలు 35 463
ఎస్టీలు 336 2,285
జనరల్ 29 162
మహిళలకు పెద్దపీట
పంచాయతీ ఎన్నికల్లో మ హిళలకు పెద్దపీట వేశారు. 472 గ్రా మపంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు జరగగా 234 మంది మహిళలే సర్పంచ్ పగ్గాలు చేపట్టారు. మరో 238 మంది పంచాయతీల్లో పురుషులు సర్పంచులుగా గెలుపొందారు. వార్డు మెంబర్ల విషయానికి వస్తే 3,870 వార్డులకు గాను 3,859 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 1,816 మంది మహిళలు, 2,043 పురుషులు ఎన్నికయ్యారు. సర్పంచులతో పోల్చితే వార్డు మెంబర్లలో పురుషులే ఎక్కువగా విజయం సాధించారు.
జిల్లాకు సంబంధించిన వివరాలు
జిల్లాలోని పంచాయతీలు 473
ఎన్నికలు జరిగినవి 472
మొత్తం వార్డులు 3,870
ఎన్నికలు జరిగినవి 3,859
● సర్పంచులు, వార్డు మెంబర్లుగా ఎన్నిక ● పల్లె పీఠాలపై య


