సుగుణకు సన్మానం
బోథ్: మండలంలోని పట్నాపూర్ పంచాయతీ సర్పంచ్‌గా రెండోసారి ఎన్నికై న పంద్రం సుగుణను బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు శాలువాతో సన్మానించారు. గు రువారం ఇచ్చోడలో పంద్రం సుగుణ ఆయన ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో మహిళలు, యు వత రాణిస్తూ వరుసగా రెండోసారి గెలవడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్‌లో మరిన్ని మంచి పనులు చేస్తూ గ్రామానికి పేరు తేవాలని ఆకాంక్షించారు. నాయకులు రా వుల రాంనాథ్, పంద్రం శంకర్, కిషన్‌యాదవ్, సుభాష్ సూర్య, గడ్డం భీంరెడ్డి, కొల్లూరి శేఖర్, ఉప సర్పంచ్ ఆత్రం మోహన్ పాల్గొన్నారు.


