కలగానే మినీ స్టేడియం
ప్రారంభానికి ముందే శిథిలావస్థలోకి..
ఆటలకు దూరమవుతున్న క్రీడాకారులు
ఇచ్చోడ: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు నియోజకవర్గానికి ఒక మినీ స్టేడియం ని ర్మించాలని అప్పటి ప్రభుత్వం సంకల్పిచింది. ప్రభు త్వ స్థలాలను గుర్తించి ఐదెకరాల విస్తీర్ణంలో మినీ స్టేడియం నిర్మాణం కోసం రూ. 2.60 కోట్ల నిధులు కూడా మంజూరు చేసింది. కానీ, సంబఽధిత అధికా రులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నిర్మాణ పనులు మ ధ్యలోనే నిలిచిపోయాయి. మరికొన్ని పనులు ప్రా రంభ దశలోనే ఆగిపోయాయి. దీంతో మినీ స్టేడి యం అందుబాటులోకి రాక చాలామంది క్రీడాకా రులు ఆటలకు దూరమవుతున్నారు.
ప్రారంభానికి ముందే..
2009లో మండల కేంద్రంలో 132 సబ్‌స్టేషన్ వద్ద ఐదెకరాల ప్రభుత్వ స్థలాన్ని స్టేడియం నిర్మాణం కో సం కేటాయించారు. స్టేడియం నిర్మాణం పనుల కో సం రూ.2.60 కోట్ల్ల నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. ఇండోర్ స్టేడియంతో పా టు మరో భవన నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఆటస్థలం చదును చేసి చుట్టూ ప్రహరీ నిర్మించి అందుబాటులోకి తీసుకురావాల్సి ఉండగా.. 16 ఏళ్లు గడుస్తున్నా.. పనులు ముందుకు సాగడం లేదు. దీంతో నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అందుబాటులోకి రాకుండానే ప్రజాధనం వృథా అయిందని క్రీడాకారులు వాపోతున్నారు. వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం
ప్రభుత్వ ధనంతో నిర్మించిన స్టేడియం భవనాలను ఉపయోగంలోకి తీసుకురావాల్సిన అధికారులు ప ట్టించుకోని కారణంగానే ప్రభుత్వ సంకల్పం నెరవేరడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అర్ధంతరంగా నిలిచిపోయిన భవనాలను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోలేదు. నిర్మించిన భవనాలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకోకపోవడంతో రూ.కో ట్లు వెచ్చించి నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చే రాయి. దీంతో అవి అసాంఘిక కార్యకలాపాలకు అ డ్డాగా నిలిచి క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారు.


