
బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే చర్యలు
● కలెక్టర్ రాజర్షి షా
కై లాస్‌నగర్: రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను డీలర్లు అందుబాటులో ఉంచాలని, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విత్తన డీలర్లకు కలెక్టరేట్‌లో ఎరువులు, విత్తనాల విక్రయాలు, వివరాల నమోదుపై మంగళవారం ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అనంతరం వారికి ఈపీవోఎస్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతీ దుకాణ ం వద్ద ఎరువులు, విత్తనాల లభ్యత స్టాక్ వివరాలు ప్రదర్శించడంతో పాటు టాస్క్‌ఫోర్స్ సభ్యు ల వివరాలు రైతులకు తెలిపేలా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌స్వామి, ఇచ్చోడ ఏడీఏ రాంకిషన్, సాంకేతిక వ్యవసాయాధికారి విశ్వామిత్ర,తదితరులు పాల్గొన్నారు.