
పాఠశాలల అభివృద్ధిలో హెచ్‌ఎంలదే కీలకపాత్ర
ఆదిలాబాద్‌టౌన్: పాఠశాలల అభివృద్ధిలో ప్రధానో పాధ్యాయులదే కీలకపాత్ర అని వరంగల్ ఆర్‌జేడీ సత్యనారాయణ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సరస్వతినగర్ జెడ్పీఎస్‌ఎస్‌లో ప్రధానోపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్య పెంచడం, నాణ్యమైన విద్య అందించేందుకు దృష్టి సారించాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు చేయాలని పేర్కొన్నారు. అనంతరం సరస్వతినగర్ పాఠశాలలో ఆదిలాబాద్‌రూరల్ ప్రాథమిక ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రాథమిక విద్యావ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. అనంతరం డైట్ కళాశాలలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని, పుస్తకాల గోదాంను పరిశీలించారు. ఇందులో స్టేట్ రిసోర్స్ పర్సన్ అశోక్, రిసోర్స్ పర్సన్లు తిలావత్, ప్రత్యూష, దేవిదాస్, నర్సయ్య, అనురాధ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి
నేరడిగొండ: మండల పరిధిలోని ఎంపీయూపీఎస్, ఎంపీపీఎస్‌ల్లో పనిచేస్తున్న ఎస్జీటీ, పీఎస్‌హెచ్‌ఎంలకు నేరడిగొండ జెడ్పీఎస్‌ఎస్‌లో ఐదు రోజుల ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణ కేంద్రాన్ని వరంగల్ ఆర్‌జేడీ సత్యనారాయణ మంగళవారం పరిశీలించారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఇందులో ఎంఈవో భూమారెడ్డి, ఎంఐఎస్ కోఆర్డినేటర్ రాం, అనిల్, ఆర్‌పీలు గంగాధర్, రాజ్‌కుమార్, సంతోష్, రవీందర్, చంద్ర శేఖర్, శివలీల, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.