
లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి
ఆదిలాబాద్: కార్మికుల హక్కులను హరించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి భీంరావు డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలతో డిపో ఎదుట మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాల ను సవరించడం సరికాదని మండిపడ్డారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీనే కొనుగోలు చేసి నడపాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకం వల్ల సంస్థ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆ సమస్యను వెంటనే పరి ష్కరించాలన్నారు.అంతేకాకుండా ఆర్టీసీలో కార్మి క సంఘాలను అనుమతించాలన్నారు. జూలై 9న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సమ్మె జయప్ర దం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లాఅధ్యక్షుడు భీంరావ్, డిపో కార్యదర్శి ఆశన్న, గంగన్న, నారాయణ, దత్తు, వెంకటి, సురేశ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.