తొలి ప్రయత్నంలోనే సక్సెస్‌ | - | Sakshi
Sakshi News home page

తొలి ప్రయత్నంలోనే సక్సెస్‌

May 7 2025 12:07 AM | Updated on May 7 2025 12:07 AM

తొలి ప్రయత్నంలోనే సక్సెస్‌

తొలి ప్రయత్నంలోనే సక్సెస్‌

–పూజ,ఎస్‌హెచ్‌వో, ఉట్నూర్‌

కుటుంబ నేపథ్యం: మాది నిజామాబాద్‌ జిల్లా ఆర్మూ ర్‌. నిరుపేద కుటుంబం. అమ్మ సాయమ్మ, నాన్న ముత్తన్న ఇద్దరూ కూలీలే. నేను ఒక్కదాన్నే సంతానం.

విద్యాభ్యాసం: పదో తరగతి వరకు ఆర్మూర్‌ ప్రభుత్వ పాఠశాలలోనే చదివా. టెన్త్‌లో మండల టాపర్‌గా నిలిచా. ట్రిపుల్‌ ఐటీ బాసరలో బీటెక్‌ పూర్తి చేశాను. కొద్ది రోజులు సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేశాను. అనంతరం యూపీఎస్సీకి ప్రిపేర్‌ అయ్యాను. ఈ క్రమంలో ఎస్సై నోటిఫికేషన్‌ రావడంతో పరీక్ష రాశాను. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించా.

సమాజంలో మీరు కోరుకుంటున్న మార్పు : మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి.

నిరుద్యోగ యువతకు మీరిచ్చే సలహా: చిన్నతనంలోనే లక్ష్యం ఎంచుకోవాలి. ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగితే విజయం సొంతమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement