ఖానాపూర్: మండలంలోని గోసంపల్లె గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఎస్సై రాహుల్ గైక్వాడ్ కథనం ప్రకారం.. కడెం మండలం లింగాపూర్‌కు చెందిన నీరేటి రాహుల్ (19) ఆదివారం రాత్రి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్‌కు బైక్‌పై పండుగ నిమిత్తం వెళ్లి తిరిగివస్తున్నాడు. ఖానాపూర్ మండలం గోసంపల్లె పొలిమేరలో చెట్టును ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. బైక్‌పై ఉన్న మరో యువకుడు జక్కుల కార్తీక్‌కు సురక్షితంగా బయటపడ్డాడు. యువకుడి అతి వేగం, అజాగ్రత్తగా వాహనాన్ని నడపడంతో ప్రమాదం చోటు చేసుకుందని ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి ఎల్లయ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతూ విద్యార్థి మృతి
కాగజ్‌నగర్‌రూరల్: మండలంలోని అంకుశాపూర్ గ్రామానికి చెందిన గౌత్రే విష్ణుతేజ(12) విద్యార్థి చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు రూరల్ సీఐ శ్రీనివాస్‌రావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో విష్ణుతేజ 7వ తరగతి చదువుతున్నాడు. సెల్‌ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుని నెలరోజుల క్రితం పురుగుల మందు తాగాడు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా పరిస్థితి విషమిండంతో మృతి చెందాడు. సోమవారం స్థానిక పీహెచ్‌సీలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ తెలిపారు.
మేకల మందపై చిరుత దాడి
నర్సాపూర్ (జి): మండలంలోని రాంపూర్ అ నుబంధ దర్యాపూర్ గ్రామశివారులోని అట వీ ప్రాంతంలో మేకల మందపై సోమవారం సాయంత్రం చిరుత పులి దాడి చేసింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఎరుకల శ్రీకాంత్ మేకలను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. మేకలు మేస్తుండగా చిరుత ఒక్కసారిగా మందపై దాడిచేసింది. ఈ ఘటనలో ఓ మేక మేక గాయపడింది. ఈమేకు బాధితుడు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నందున పశువులు, మేకల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అటవీఅధికారులు సూచించారు.

రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి