క్షయ నిర్ధారణ పరీక్షలు చేయాలి
ఆదిలాబాద్‌టౌన్: బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు క్ష య నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ ఆదేశించారు. బుధవారం డీ ఎంహెచ్‌వో చాంబర్‌లో వైద్యాధికారులతో సమావే శం నిర్వహించి మాట్లాడారు. ఎన్‌సీడీ వ్యాధిగ్రస్తులకు క్షయ నిర్ధారణ కోసం ఎక్స్‌రే పరీక్షలు చేయాల ని సూచించారు. పోషకాహార లోపంతో బాధపడే పిల్లలకూ టీబీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించా రు. వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స, మందులు అందించాలని సూచించారు. టీబీ రహిత సమాజా నికి కృషి చేయాలని, వ్యాధి ముదరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాలని ఆదేశించారు. జిల్లా టీబీ నియంత్రణాధికారి సుమలత, ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి శ్రీధర్, ఆర్‌బీఎస్‌కే వైద్యుడు వినోద్, శ్రీకాంత్, పద్మిని, సత్యకుమార్, సరిత, సందీప్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


