పోలీస్ స్టేషన్ తనిఖీ
జైనథ్: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను బుధవారం ఎస్పీ అఖిల్ మహాజన్ తనిఖీ చేశా రు. అనంతరం రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో నేరాల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేయాలని, పోలీస్‌స్టేషన్‌లో పెండింగ్ కేసులు ఉండకుండా చూడాలని, ప్రజలకు చేరువలో ఉంటూ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఆయన వెంట ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, జైనథ్ సర్కిల్ సీఐ శ్రవణ్‌కుమార్, ఎస్సై గౌతమ్ పవార్, ఏఎస్సైలు స్వామి, జీవన్, సిబ్బంది ఉన్నారు.


