భూ‘సర్వే’ వేగవంతమయ్యేనా?
కైలాస్‌నగర్: భూ సమస్యలు పరిష్కరించడమే ల క్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూమాత నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చింది. చట్టం అమలులో భాగంగా భూ సర్వే పనులు పెండింగ్‌లో ఉంచకుండా ఎ ప్పటికప్పుడు పరిష్కరించేలా లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకాలకు శ్రీకారం చుట్టింది. ఇంటర్మీడియ ట్ గణితం, ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఎంపికై న అభ్యర్థులకు 56 రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చి పరీక్షలు నిర్వహించింది. ప్రతిభ కనబరిచినవారికి లైసెన్స్‌లు జారీ చే సింది. తొలివిడత శిక్షణలో ప్రతిభ చాటి సీఎం రే వంత్‌రెడ్డి చేతుల మీదుగా లైసెన్స్‌లు పొందిన జిల్లాలోని 44మందిని ఆయా మండలాలకు కేటాయించింది. సిరికొండ, ఉట్నూర్ మండలాలకు ముగ్గురిని కేటాయించగా, మిగతా మండలాలకు ఇద్దరేసి సర్వేయర్లను నియమిస్తూ కలెక్టర్ రాజర్షి షా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరి లైసెన్స్ రెండేళ్లపాటు అమలులో ఉండనుంది. సర్వే ల్యాండ్స్ రికా ర్డ్స్ శాఖ కమిషనర్ నిర్దేశించిన విధులను మాత్రమే వీరు నిర్వహించాల్సి ఉంటుంది. సర్వేయర్ల కొరతతో సతమతమవుతున్న సర్వే ల్యాండ్స్ రికార్డు శాఖ కు లైసెన్స్‌డ్ సర్వేయర్ల రాకతో ప్రయోజనం కలగనుంది. భూ సర్వే పనులు వేగవంతమై రైతులకు ల బ్ధి చేకూరనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మండలాలవారీగా సర్వేయర్ల వివరాలు
లైసెన్స్‌డ్ సర్వేయర్లు మండలం
రాజు, అభిలాష్‌కుమార్ ఆదిలాబాద్ అర్బన్
మణితేజ, వంశీకృష్ణ ఆదిలాబాద్ రూరల్
అశ్విని, శ్యాంసుందర్ జైనథ్
మౌనిక, సౌందర్య బేల
కిరణ్, బండి సతీశ్ భోరజ్
సాయికిరణ్, సాయిగంగోత్రి సాత్నాల
సిడాం రాము, రాజారథన్ భీంపూర్
సాయిప్రీతం, సిద్దార్థ్‌రెడ్డి తాంసి
ప్రసన్న, హేమంత్‌కుమార్ తలమడుగు
వినాయక్, పరమేశ్వర్‌రావు గుడిహత్నూర్
ఇంద్రాణి, సాయికుమార్ ఇచ్చోడ
రాజేశ్వర్, వినయ్‌కుమార్ బజార్‌హత్నూర్
కరుణాకర్‌రెడ్డి, సింధు సొనాల
ప్రవీణ్, శ్రీకాంత్ బోథ్
జంగు, తేజస్విని నేరడిగొండ
రాజశేఖర్, రాజారథన్,
అనిల్‌కుమార్ సిరికొండ
గంగేశ్వర్, శ్రీలత ఇంద్రవెల్లి
అర్జున్, సంధ్యారాణి గాదిగూడ
సాయితేజు, వెంకటేశ్ నార్నూర్
విఠల్, వెంకటేశ్, అంకిత ఉట్నూర్
కీర్తి, అనుప్‌కుమార్ మావల
భూ‘సర్వే’ వేగవంతమయ్యేనా?
భూ‘సర్వే’ వేగవంతమయ్యేనా?


