కార్యాలయాలకు సామగ్రి
తాంసి: జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వం గృహ నిర్మాణశాఖ మండల కార్యాలయాలు ఏర్పాటు చేయనుంది. మండల కేంద్రాల్లో నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇళ్లను వీటికి కేటాయించనున్నారు. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన చోట కా ర్యాలయాలకు అవసరమైన వివిధ సామగ్రిని తరలిస్తున్నారు. కాగా, బుధవారం తాంసి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గృహ నిర్మాణ మండల శా ఖ కార్యాలయానికి ప్రత్యేక వాహనంలో కుర్చీలు, టేబుళ్లు, ఇతర సామగ్రిని తరలించారు. సామగ్రిని ప్రభుత్వం సరఫరా చేసినట్లు తాంసి హౌసింగ్ ఏఈ నజీర్ తెలిపారు. మండల కేంద్రాల్లో హౌసింగ్ ఏఈ కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ప్రజలకు మెరుగైన సేవలు పొందే అవకాశముంది.


