సోయా, మొక్కజొన్న కొనుగోలు చేయాలి
బజార్‌హత్నూర్: సోయా, మొక్కజొన్న పంటలు కొనుగోలు చేయాలని బుధవారం మండల కేంద్రంలో రైతులు ధర్నా చేశారు. రైతులకు మద్దతుగా వ్యా పారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి సంఘీభావం తెలిపారు. అనంతరం రైతులు తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ విద్యాసాగర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు డుబ్బుల చంద్రశేఖర్, చట్ల వినిల్ మాట్లాడుతూ.. కోత దశలో భారీ వర్షాలు కురిసి పంటలు దెబ్బతిని గింజలు రంగు మారాయని తెలి పారు. పంటలు కొనుగోలు చేయపోవడంతో గింజలు ముక్కిపోతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోళ్లు చేపట్టాలని కో రారు. రబీ సాగుకు యూరియా ఇబ్బందులు తప్పడంలేదని తెలిపారు. యాప్ ద్వారా బుక్ చేసుకుంటేనే యూరియా ఇస్తామంటున్నారని, నిరక్షరాస్యులైన రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. యూరియాను పంట సాగు ఆధారంగా పంపిణీ చేయాలని కోరారు. సర్పంచ్ పరచ సాయన్న, రైతులు లక్కం శంకర్, దీసి రమణ, కొంగర్ల రాజన్న, చట్ల తరుణ్, కిరప్ప శ్రీనివాస్, కర్వల గంగయ్య, పడిపల్లి గణేశ్, భీంరావ్, లింగన్న పాల్గొన్నారు.


