వాజ్‌పేయికి నివాళి
ఆదిలాబాద్: మాజీ ప్రధాని అటల్ బిహారీ వా జ్‌పేయి జయంతి సందర్భంగా బుధవారం జి ల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దీపోత్సవాన్ని నిర్వహించా రు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ హితం కోసం పాటుపడిన మహనీయుడు అటల్ బిహారీ వాజ్‌పేయి అని ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కొనియాడారు. మంగళవారం వాజపేయి జయంతిని పురస్కరించుకుని బుధవారం జి ల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దీపోత్సవ కార్యక్రమాన్ని ని ర్వహించి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాజపే యి అధికారం కోసం తాపత్రయ పడకుండా ప్రజాసేవకు పాటుపడ్డారని పేర్కొన్నారు. బీజే పీ కార్యకర్తలు ఆయన అడుగుజాడల్లో నడిచి దేశ ప్రగతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు సంతోష్, లాలా మున్నా, రాకేశ్, దినేశ్, రా జు, జోగు రవి, రఘుపతి, కృష్ణ యాదవ్, రాజే శ్, ముకుంద, అశోక్‌రెడ్డి తదితరులున్నారు.


