
సమస్యలు సత్వరం పరిష్కరించాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గ్రీవెన్స్‌లో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 23 మంది ఎస్పీకి వినతులు అందజేశారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, ఆయా స్టేషన్ల అధికారులకు ఎస్పీ ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఈ వారం ప్రధానంగా కబ్జాలు, కుటుంబ కలహాలు, అధిక వడ్డీ, కోర్టు కేసులు, గ్రామాల్లో ఎదురయ్యే సమస్యలు తది తర వాటిని ప్రజలు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. బాధితుల సమస్యలను ఓపిగ్గా విని వారికి భరో సా కల్పించేలా వ్యవహరించారు. ఇందులో సీసీ రాజు, ప్రజాఫిర్యాదుల విభాగం అధికారి జైస్వా ల్ కవిత, వామన్, సిబ్బంది పాల్గొన్నారు.