ప్రయాణికులకు మెరుగైన సేవలు
ఆర్టీసీ ఎండీ సజ్జనార్
ఆదిలాబాద్: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఆదిలాబాద్ డిపోను సోమవారం ఆయన సందర్శించారు. ఉద్యోగుల సమస్యలు అడిగి తె లుసుకున్నారు. ముందుగా డిపో ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా మాట్లాడా రు. రాష్ట్రంలో మహాలక్ష్మి పథకంతో మహిళలు ఎంతగానో లబ్ధి పొందుతున్నారన్నారు. ఆర్టీసీ లో ప్రయాణించేటప్పుడు ఎలాంటి ఇబ్బంది క లగకుండా కృషి చేస్తున్నామన్నారు. అలాగే అ వసరం మేరకు ప్రతీ గ్రామానికి బస్సు నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. నూతన బ స్సులను సైతం కొనుగోలు చేస్తున్నామని, ప ర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సులను సైతం పలు రీజియన్లలో ప్రవేశపెట్టామన్నారు. ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సు ల ఏర్పాటు విషయంలో దూరం సమస్యగా మారిందన్నారు. నిజామాబాద్‌లో చార్జింగ్ పా యింట్‌తో అనుసంధానం చేస్తే ఎలక్ట్రిక్ బస్సులు నడపవచ్చన్నారు. ఆయన వెంట డిపో మే నేజర్ కల్పన తదితరులు ఉన్నారు.


