రైతు కష్టం..దొంగలపాలు
కైలాస్‌నగర్(బేల): ఆరుగాలం శ్రమించి కంటికి రెప్పలా కాపాడి పంట పండించిన రైతుకు క న్నీరే మిగిలింది. పత్తిని ఏరి పంట చేనులో గల కొట్టంలో నిల్వ ఉంచగా అపహరణకు గురైంది. బేల మండల కేంద్రానికి చెందిన నీపూంగే రూపేష్ అనే రైతు 16 ఎకరాల భూమిని రూ.4లక్షలకు కౌలుకు తీసుకున్నాడు. ఇప్పటి వరకు 50 క్వింటాళ్ల పత్తి విక్రయించగా, ఇటీవల మార్కెట్‌కు వరుస సెలవులు ఉండడంతో ఏరిన పత్తిని పంట పొలంలోని కొట్టంలో నిల్వ ఉంచాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు 15 క్వింటాళ్ల వరకు నిల్వ ఉంచిన పత్తిని దొంగిలించారు. దుండగులు పత్తిని వాహనంలో నింపి తరలించినట్లు అనుమానం వ్య క్తం చేశాడు. ఈ విషయమై సోమవారం బేల పోలీ సు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై ఎల్.ప్రవీణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నా రు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు వివరించారు.


