వార్షిక నేర నివేదిక విడుదల | - | Sakshi
Sakshi News home page

వార్షిక నేర నివేదిక విడుదల

Dec 30 2025 7:19 AM | Updated on Dec 30 2025 7:19 AM

వార్ష

వార్షిక నేర నివేదిక విడుదల

● ఇటీవల భోరజ్‌ మండలంలోని తరోడ గ్రామ సమీపంలో కారు చెట్టుకు ఢీకొనడంతో ముగ్గురు స్నేహితులు మృతిచెందారు. ● ఉట్నూర్‌ మండల సమీపంలో ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆదిలాబాద్‌ పట్టణంలోని రిక్షా కాలనీలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ● నేరేడిగొండ మండలంలోని బోథ్‌ ఎక్స్‌రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌ నుంచి గోరఖ్‌పూర్‌ వైపు వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టగా ప్రమాదం చోటు చేసుకుంది. ● ఆదిలాబాద్‌ పట్టణంలోని సుందరయ్యనగర్‌కు చెందిన ఓ వ్యక్తి అనుమానంతో తన భార్యను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడు. ● జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్‌కు చెందిన ఓ యు వకుడిని ముగ్గురు కత్తితో పొడిచి హత్య చేశారు. ● ఈ ఏడాది 603 సైబర్‌ క్రైమ్‌ ఫిర్యాదులు అందా యి. 132కేసులు నమోదయ్యాయి. ఇందుకు సంబంధించి రూ.49లక్షల 87వేల 985 నగదు పో గొట్టుకున్న బాధితులకు తిరిగి కోర్టుద్వారా పోలీ సులు అందించారు. జిల్లాలో చాలా మంది సైబ ర్‌ వలలో చిక్కుకొని డబ్బును పోగొట్టుకున్నారు.

రహదారులు రక్తసిక్తం..

జిల్లాలో రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తసిక్తమయ్యాయి. గతేడాది పోల్చితే ఈసారి కొంత తగ్గినప్పటికీ బాధిత కుటుంబాల్లో మాత్రం తీరని విషాదం నెలకొంది.

మర్డర్లు..

సైబర్‌ క్రైమ్‌..

గడిచిన మూడేళ్లుగా కేసుల వివరాలు..

కేసులు 2023 2024 2025

దోపిడీ 01 07 11

పగటి చోరీలు 14 24 47

రాత్రి చోరీలు 81 132 193

సాధారణ దొంగతనాలు 171 194 419

మర్డర్‌ 18 14 13

కిడ్నాప్‌ 24 41 58

అత్యాచారం 38 48 55

చీటింగ్‌ 130 192 655

హత్యాయత్నం 68 48 31

రోడ్డు ప్రమాదాలు 120 129 109

క్షతగాత్రులు 06 25 22

సాధారణ క్షతగాత్రులు 380 389 430

ఇతర కేసులు 1337 1094 1737

మిస్సింగ్‌ కేసులు 242 342 405

అగ్ని ప్రమాదాలు 05 01 13

మొత్తం కేసులు 4128 3979 6486

జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ అఖిల్‌ మహా జన్‌ సోమవారం వార్షిక క్రైమ్‌ నివేదిక వెల్లడించా రు. నూతన విధానాలతో ప్రజలకు పోలీసు శాఖ మరింత చేరువైందని తెలిపారు. 2026 నూతన సంవత్సరంలో డ్రగ్స్‌ నియంత్రణ, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణకు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేసి ఆయా స్టేషన్లలో మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ఇందులో ఏఎస్పీ మౌనిక, డీఎస్పీలు ఎల్‌.జీవన్‌రెడ్డి, శ్రీనివాస్‌, శిక్షణ ఐపీఎస్‌ అధికారి రాహుల్‌కాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

వార్షిక నేర నివేదిక విడుదల1
1/1

వార్షిక నేర నివేదిక విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement