జిల్లాలో ఇదీ పరిస్థితి.. | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఇదీ పరిస్థితి..

May 20 2025 12:28 AM | Updated on May 20 2025 12:30 AM

అవగాహన కల్పిస్తున్నాం..

అగ్నిప్రమాదాలు జరగకుండా ప్రతీ శుక్రవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. షాపింగ్‌ మాల్స్‌, పాఠశాలలు, అపార్ట్‌మెంట్లు, ఆస్పత్రులు, సూపర్‌ మార్కెట్లలో హోజరి మిషన్‌, హెచ్చింగ్‌ మిషన్‌, కెమికల్‌ పౌడర్‌, సీవో2 సిలిండర్లు అందుబాటులో ఉంచుకోవాలి. ఆయా యాజమాన్యాల వద్దకు వెళ్లి ఫైర్‌సేఫ్టీ పాటించాలని తెలియజేస్తున్నాం.

– డి.జైత్‌రాం, ఎస్‌ఎఫ్‌ఓ, ఆదిలాబాద్‌

జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో కార్యా లయ సమీపంలోని ఓ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో నాలుగేళ్ల క్రితం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అస్తినష్టం మినహా ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు.

తాంసి మండలంలోని కప్పర్లలో ఇటీవల అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పశువుల పాకతో పాటు పక్కన నిలిపిన రెండు బొలెరో వాహనాలు కాలిపోయాయి. చుట్టుపక్కల వారు స్పందించి మంటల ను ఆర్పివేశారు. అయితే ప్రమాదం జరిగిన గంట తర్వాత జిల్లా కేంద్రం నుంచి ఫైరింజన్‌ చేరుకుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

రాష్ట్ర రాజధానిలో తాజాగా చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నేపథ్యంలో జిల్లాలో పరిస్థితిపై సర్వత్రా చర్చ మొదలైంది.

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలో ఆయా ఆస్పత్రులు.. అపార్ట్‌మెంట్లు.. పాఠశాలలు..తదితర కార్యాలయా ల్లో అగ్నిప్రమాదాలు వాటిల్లితే ప్రాణాలు గాలిలో కలిసే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్‌ వైద్యశాలల్లో రోగుల ప్రాణాలకు భరోసా లేకపోగా, కాలనీలు, ప్రైవేట్‌ బడుల్లో సైతం రక్షణ చర్యలు కనిపించని పరిస్థితి. కేవలం ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం తప్పా మళ్లీ షరామామూలే అన్నవిధంగా మారింది జిల్లాలోని సంబంధిత శాఖ అధి కారులు తీరు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఆది వారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 17 మంది సజీవ దహనంకాగా, మరికొంత మంది గా యాల పాలయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మనమెంత భద్రమనే అనుమానం వ్యక్తమవుతుంది. గతంలో జిల్లాలోనూ పలు అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అయితే ప్రాణ నష్టం జరగలేదు.

నిబంధనలు బేఖాతరు..

● జిల్లా కేంద్రంలో ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రులు నిత్యం రోగులతో కిటకిటలాడుతూనే ఉంటాయి. రోగుల నుంచి యాజమాన్యాలు భారీగానే ఫీజులు వసూలు చేస్తారు. అయితే భద్రత విషయంలో మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అనుకోని ప్రమా దం జరిగితే రోగులతో పాటు వారి బంధువులు సైతం ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు న్నాయి. చాలా ప్రైవేట్‌ ఆస్పత్రులు ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్నారు. అలాగే పైఅంతస్తుల్లో నిర్వహణ కొనసాగుతుంది. మెట్లు ఇరుకుగా ఉండడంతో ప్రమాదం జరిగితే పరుగు తీసే అవకాశం కూడా లేకుండాపోతోంది. తొక్కిసలాట జరిగితే ప్రాణాలు సైతం పోయే అవకా శం ఉంటుంది.

● మరోవైపు ప్రైవేట్‌ పాఠశాలలు అనుమతులు పొందే సమయంలో తప్పనిసరిగా ఫైర్‌సేఫ్టీ పొందాలి. పాఠశాలల్లో హోజరి, షబ్బింగ్‌ మిషన్‌, వాటర్‌ ట్యాంక్‌, కెమికల్‌ పౌడర్‌ను అందుబాటులో ఉంచాలి. జిల్లాలో చాలా పాఠశాలల్లో ఈ ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు కానరాని పరి స్థితి. యాజమాన్యాలు సంబంధిత అధికారులను మచ్చిక చేసుకొని సర్టిఫికెట్లు పొందుతున్నారనే ఆరోపణలున్నాయి. ఒకవేళ ప్రమాదం జరిగితే పెద్దఎత్తున ప్రాణనష్టం వాటిల్లే అవకాశాముంటుంది.

● జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాల్లోనూ పలు అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు చేపడుతున్నారు. చాలా వాటిలో ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదు. ఇరుకుగా ఉండడంతో ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం సంభవించే అవకాశం లేకపోలేదు. జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో కనీసం ఫైర్‌ ఇంజన్‌ కూడా రాలేని పరిస్థితి. అశోక్‌ రోడ్‌, బ్రాహ్మణవాడ, తిర్పెల్లి, కోలిపుర, పంజేషా తదితర కాలనీల్లో రోడ్లు ఇరుకుగా ఉన్నాయి.

ఫైర్‌ ఇంజన్‌ వెళ్లేసరికి కాలి బూడిదే..

జిల్లాలో మూడు ఫైర్‌స్టేషన్లు ఆదిలాబాద్‌, ఇచ్చోడ, ఉట్నూర్‌లో ఉన్నాయి. జిల్లాకేంద్రంలోని ఫైర్‌స్టేషన్‌లో 2 ఫైరింజన్లు ఉండగా, ఒకటి మార్కెట్‌ యార్డు కు సంబంధించి ఉంది. ఈస్టేషన్‌ ద్వారా ఆదిలాబా ద్‌, జైనథ్‌, బేలతో పాటు తాంసి, తలమడుగు, భీంపూర్‌మండలాల పరిధిలో ప్రమాదాలుజరిగితే ఇక్క డి నుంచే ఫైరింజన్లు వెళ్తాయి. ఉట్నూర్‌, ఇచ్చోడ పరిధిలోని మండలాల్లో దాదాపు 50కిలోమీటర్లకు పైగా దూరంలో ప్రమాదం జరిగినప్పుడు ఫైరింజ న్లు వెళ్లేసరికి ఆస్తులు కాలి బూడిదవుతాయి. బోథ్‌, బేలలో ఫైర్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని కొన్నేళ్లుగా డిమాండ్‌ ఉన్నా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని ఆ ప్రాంతవాసులు పేర్కొంటున్నారు.

అగ్ని ప్రమాదం జరిగితే అంతేనా..

ఆస్పత్రులు, పాఠశాలల్లో కనిపించని ‘ఫైర్‌సేఫ్టీ’

అపార్ట్‌మెంట్లలోనూ కానరాని నిబంధనలు

‘మామూలు’గా వ్యవహరిస్తున్న అగ్నిమాపక శాఖ

జిల్లాలో 200 వరకు ప్రైవేట్‌ పాఠశాలలు ఉండగా, అందులో కేవలం 40 మాత్రమే ఫైర్‌సేఫ్టీ పరికరాలు కలిగి ఉన్నాయి. ఇక 50 వరకు ప్రైవేట్‌ ఆస్పత్రులు ఉండగా, కేవలం ఐదారుకు మించి వాటిలో ఈ పరికరాలు కనిపించని పరిస్థితి. నిబంధనల ప్రకారం ప్రైవేట్‌ పాఠశాలలు 2009 సంవత్సరం తర్వాత అన్నింటికి ఫైర్‌సేఫ్టీ అనుమతి తప్పనిసరి. అలాగే అపార్ట్‌మెంట్లకు 18 మీటర్లు, ఆస్పత్రులు 15 మీటర్ల ఎత్తులో ఉన్నవాటికి అనుమతులు పొందాలి. చాలా అపార్ట్‌మెంట్లలో ఈ పరికరాలు అందుబాటులో లేవు.

జిల్లాలో ఇదీ పరిస్థితి..1
1/2

జిల్లాలో ఇదీ పరిస్థితి..

జిల్లాలో ఇదీ పరిస్థితి..2
2/2

జిల్లాలో ఇదీ పరిస్థితి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement