
ఏఆర్ కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా ప్రమోషన్
ఆదిలాబాద్‌టౌన్: ఏడుగురు ఏఆర్ కానిస్టేబు ళ్లకు హెడ్‌కానిస్టేబుల్‌గా ప్రమోషన్ లభించింది. హెడ్‌కానిస్టేబుల్‌గా ప్రమోషన్ పొందిన ఎన్.కిషన్‌రావు, ఎం.అశోక్, జే దుదిరామ్, ఆర్.గోవింద్, ఎల్.దినేశ్, ఎన్.అరవింద్, ఆర్.రామారావు గురువారం స్థానిక పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వీరికి ప్రమోషన్ చిహ్నం అలంకరించి అభినందనలు తెలిపారు. వీరిని జోన్ పరిధిలోని నిర్మల్, జగిత్యాల జిల్లాలకు బదిలీ చేశారు. అడిషనల్ ఎస్పీ సురేందర్‌రావు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులున్నారు.
అటవీ అధికారులతో
రైతుల వాగ్వాదం
నేరడిగొండ: మండలంలోని పీచర, రాంపూర్ గ్రామాల రైతులకు సంబంధించిన అటవీ భూ ముల్లో రెండురోజులుగా అటవీ అధికారులు వి త్తనాలు చల్లడంతో గురువారం ఇరువర్గాల మ ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గ్రామంలో అ టవీ హక్కుపత్రాలున్న ఆదివాసీ రైతులకు చెందిన 15 ఎకరాల్లో అటవీ అధికారులు విత్తనా లు చల్లారని రైతులు ఆరోపించారు. దీంతో గు రువారం గ్రామస్తులు, అధికారులకు మధ్య వా గ్వాదం చోటుచేసుకుంది. రైతులు ఎమ్మెల్యే అ నిల్ జాదవ్ దృష్టికి తీసుకెళ్లగా.. డీఎఫ్‌వోతో మాట్లాడుతానని చెప్పినట్లు రైతులు తెలిపారు.