
‘ఉపాధి’ పనుల్లో నాణ్యత పాటించాలి
● కలెక్టర్ రాజర్షి షా
బైక్‌పై వెళ్లిన కలెక్టర్..
మండలంలోని చిట్యాల్‌బోరి శివారు అటవీ ప్రాంతంలో ఉపాధి హామీ పనులు కొనసాగుతుండగా అక్కడికి కారు వెళ్లేందుకు రోడ్డు మా ర్గం సరిగా లేదు. ఈ క్రమంలో కలెక్టర్ ఇలా ఐకేపీ ఏపీవో జాకీర్ హుస్సేన్ బైక్‌పై వెళ్లారు.
ఆదిలాబాద్‌రూరల్: ఉపాధి హామీ పనుల్లో నాణ్యత పాటించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మండలంలోని చిట్యాల్‌బోరి, కచికంటి, యాపల్‌గూడ గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న పనులను పరిశీలించారు. యాపల్‌గూడలో రామాలయ ఆవరణలో కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణ పనులు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుక్నారు. కూలీలతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. పనుల నాణ్యత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించారు. ఈ ఏడాది సాధ్యమైనంత త్వరగా మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట డీఆర్‌డీవో రాథోడ్ రవిందర్, ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి, ఈజీఎస్ ఎపీవో జాకిర్ ఉస్సేన్, పీఆర్ ఎఈ సంతోష్, తదితరులు ఉన్నారు.

‘ఉపాధి’ పనుల్లో నాణ్యత పాటించాలి