
● ఈ సారి తొలకరి త్వరగా పలకరించే అవకాశం ● సాగుకు రైతుల స
ఆదిలాబాద్‌అర్బన్: వానాకాలం (ఖరీఫ్) సాగుకు వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో అవసరమ య్యే విత్తనాలు, ఎరువులను ఆయా గ్రామాల రైతులకు అందుబా టులో ఉంచేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది సీజన్ ప్రారంభంలోనే వర్షాలు పడే అవకాశాలున్నందున ఆ దిశగా అన్నదాతలు సైతం సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఇప్పటికే దుక్కులు దున్నే పనులు జోరందుకున్నాయి. రొటవేటర్‌తో చదును చేయడం, పొలాల్లో ఉన్న పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించడం వంటి పనులు కొనసాగుతున్నాయి. వర్షాలు కురిసిన వెంటనే విత్తనాలు విత్తేందుకు రైతులు రెడీ అవుతున్నారు. దీనికి తోడు ఈ సారి నై రుతి రుతుపవనాలు ముందుగానే పలకరించనున్న ట్లు వాతావరణ శాఖ చెప్పిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా రైతులు సిద్ధమవుతున్నారు.
పంట మార్పిడిపై దృష్టి
గతేడాది ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలను మళ్లీ ఈ సీజన్‌లో వేయకుండా రైతులు పంట మార్పిడిపై దృష్టి సారిస్తున్నారు. గతంలో సోయా వేసిన నేలల్లో ఈ సారి పత్తి, కంది, అలాగే పత్తి వేసిన చోట ఈ సారి సోయా లేదా మొక్కజొన్న పంటల సాగు దిశగా ఆలోచన చేస్తున్నారు. అలాగే పెసర, మినుమును అంతర పంటగా వేయాలని భావిస్తున్నారు. పంట మార్పిడిపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు అవగాహన కల్పిస్తుండడంతో ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. మరికొందరు తక్కువ సమయంలో అధిక దిగుబడినిచ్చే పంటలు సాగుకు మొగ్గుచూపుతున్నారు.
6లక్షల ఎకరాల సాగు అంచనా..
జిల్లాలో ఈ ఏడాది 6 లక్షలకుపైగా ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రధానంగా పత్తి ఉండనుంది. తర్వాత సోయా, కంది, మినుము, వరి, జొన్న, మొక్కజొన్న, పెసర పంటలు ఉంటాయని భావిస్తున్నారు. కాగా ఈ ఏడాది ఎరువులు, విత్తనాలకు ఎలాంటి కొరత లేకుండా రైతులకు సరిపడా మించి అందుబాటులో ఉంచినట్లు జిల్లా వ్యవసాయ శాఖ చెబుతోంది.
గత అనుభవాల దృష్ట్యా..
గత అనుభవాల దృష్ట్యా రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని చాలామంది రైతులు గతంలో వర్షాలు సరిగా కురవక రెండు, మూడు సార్లు విత్తనాలు వేసిన సంఘటనలు ఉన్నాయి. దీంతో మళ్లీ మళ్లీ విత్తనాలు కొనుగోలు చేయాల్సి రావడంతో వారిపై ఆర్థిక భారం పడడంతో పాటు కొందరికి నాసిరకం విత్తనాలు సరఫరా అయ్యాయి. పంట ఏపుగా పెరిగినా పూత, కాత లేకపోవడంతో నష్టపోవాల్సి వచ్చింది. వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ సారి ముందుకు సాగుతున్నారు. వ్యవసాయ శాఖ సైతం ఈ సారి అంచనాకు మించి విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాయని వెల్లడించడంతో మార్కెట్‌లో డిమాండ్ రకం విత్తన ప్యాకెట్లు విరివిగా లభ్యమయ్యే అవకాశాలున్నాయి.
ట్రాక్టర్‌తో చదును చేస్తున్న రైతు
నేల తడిసాకే విత్తుకోవాలి
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు చూసి విత్తనాలు వేసుకోవద్దు. వర్షాకాలం ప్రారంభానికి ఇంకా సమయం ఉంది. క్రమం తప్పకుండా కురిసి భూమి కొంత లోతు వరకు తడిసాకే విత్తుకోవాలి. తేలికపాటి వర్షాలకు వేసినట్‌లైతే ఎండ వేడిమికి నేల పొడిబారి విత్తనాలు చెడిపోయే అవకాశం ఉంది. ఈ సారి సరిపడా మించి ఎరువులు, విత్తనాలను సైతం అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాం. ఎలాంటి ఆందోళన అవసరం లేదు.
– శ్రీధర్‌స్వామి, జిల్లా వ్యవసాయాధికారి
ఈ ఏడాది పంటల సాగు అంచనా..
పంట రకం సాగు అవసరమయ్యే
(ఎకరాల్లో) విత్తనాలు(క్వింటాళ్లలో)
పత్తి 4,40,000 11,00,840 ప్యాకెట్లు
సోయాబీన్ 62,500 18,725
కంది 55,000 21,960
జొన్న 1600 66
మొక్కజొన్న 23000 1,834
వరి 1900 489
పెసర 550 22
మినుము 550 44
ఇతర పంటలు 250 12