
కొనసాగిన ఆక్రమణల తొలగింపు
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధానచౌక్‌ల్లో చేపట్టిన ఆక్రమణల తొలగింపు ప్రక్రి య రెండో రోజు కొనసాగింది. సినిమారోడ్, అంబేడ్కర్‌చౌక్, శివాజీచౌక్ ఏరియాల్లో ఫుట్‌పాత్‌లు ఆక్రమించి వేసిన షెడ్లు, టేలాలను అధికారులు బుధవారం తొలగింపజేశారు. ఈ ప్రక్రియను డీఎస్పీ జీవన్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజు పర్యవేక్షించారు. అధికారుల సూచన మేరకు పలువురు స్వచ్ఛందంగానే వాటిని తొలగించుకున్నారు. అనంతరం ప్రత్యామ్నాయంగా కేటాయించిన గణేశ్ థియేటర్ స్థలానికి తరలివెళ్లారు. టౌన్ ప్లానింగ్ అధికారులు సాయంత్రం వరకు అక్కడే ఉండి ప్రక్రియను పూర్తి చేశారు. కార్యక్రమంలో టీపీవో సుమలత, టీపీబీవో సాయికృష్ణ, టీపీఎస్ నవీన్‌కుమార్, ట్రాఫిక్ సీఐ ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట చిరు వ్యాపారుల ధర్నా
తమ షెడ్లను తొలగించడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని చిరువ్యాపారులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రత్యామ్నాయంగా కేటాయించిన స్థల ప్రొసీడింగ్‌లను తాత్కాలికంగా కాకుండా పర్మినెంట్ పదంతో జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో యథావిధిగా తమ వ్యాపారాలను ప్రధాన చౌక్‌ల్లోనే కొనసాగించుకునేలా అవకాశం కల్పించాలని కోరారు. అనంతరం ఆర్డీవో వినోద్ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వారికి ఎంఐఎం, కాంగ్రెస్ మైనార్టీ నాయకులు మద్దతు తెలిపారు.