
ఎనిమిది కాళ్ల వింత మేకపిల్ల జననం
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని బొక్కల్‌గూడలో నివాసం ఉంటున్న రాజలింగుకు చెందిన మేక ఆదివారం ఎనిమిది కాళ్లతో వింత మేకపిల్లకు జన్మనిచ్చింది. కొద్ది సేపటికే మృతి చెందింది. మేక ఈత కోసం యజమాని పశువైద్యశాలకు తీసుకెళ్లాడు. వైద్యుడు దూద్‌రాం రాథోడ్ సిజేరియన్ అవసరం ఉందని గ్రహించి ఆపరేషన్ చేశాడు. ఒక తల, ఎని మిది కాళ్లతో వింతగా జన్మించింది. జన్యులోపం కారణంగా ఇలాంటివి జన్మిస్తాయని, శాస్త్ర పరిభాషలో అక్టోగోట్ ఫీటస్, పాలిమేలియా అంటారని వైద్యుడు తెలిపారు. మేక కు శస్త్ర చికిత్స చేసిన వారిలో రాథోడ్ లావణ్య, సిబ్బంది ఉన్నారు.