
దేశ రక్షణకు ఎప్పుడూ సిద్ధమే..
అమాయకులైన పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదుల స్థావరాలను తుద ముట్టించడమే లక్ష్యంగా భారత సేనలు ముందుకు వెళ్లడం గొప్ప విషయం. ఆ దేశ పౌరులకు ఎలాంటి హాని చేయకుండా సైనిక క్యాంపులకు ఎలాంటి నష్టం కలిగించకుండా కేవలం ఉగ్రవాద శిక్షణ శిబిరాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయింది. భారత సైన్యంలో 21ఏళ్ల పాటు పని చేసిన అనుభవం ఉంది. దేశభద్రత బాధ్యతలు చేపట్టడంలో ఎప్పుడైనా సిద్ధంగానే ఉంటా. ఈ విషయమై ఇండియన్ ఆర్మీకి రిక్వెస్ట్ లెటర్ సైతం పంపించాను.
– గడ్డం అశోక్, మాజీ సైనిక ఉద్యోగి,
మద్రాస్ ఇంజినీర్స్ రెజిమెంట్, ఆదిలాబాద్