‘నీట్’ పకడ్బందీగా నిర్వహించాలి
ఆదిలాబాద్‌టౌన్: నీట్‌ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. ఈనెల 4న నిర్వహించనున్న పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించా రు. ఆయా కేంద్రాలను ఎస్పీతో కలిసి తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 4న మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల, సాంఘిక సంక్షేమ గు రుకుల బాలికల పాఠశాల, ప్రభుత్వ బాలికల పాఠశాల, ప్రభుత్వ ఆర్ట్స్‌అండ్ కామర్స్ డిగ్రీ కళా శాల, బంగారుగూడ మోడల్ స్కూల్, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్‌లో రెండు కేంద్రాలు ఏర్పా టు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షకు 1,659 మంది హాజరుకానున్నారని తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు కేంద్రంలోనికి అనుమతించనున్నట్లు తెలిపారు. ఆయా కేంద్రాల్లో తాగునీరు, వైద్యసేవలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇందులో అదనపు ఎస్పీ సురేందర్‌రావు, డీఎస్పీ జీవన్‌రెడ్డి, కేంద్రీయ విద్యాలయం కోఆర్డినేటర్ అశోక్, వాగ్మారే, ఎంఈవోలు ఉన్నారు.
కలెక్టర్ రాజర్షిషా


