ఫర్టిలైజర్ డీలర్‌కు షోకాజ్
సిరికొండ: ‘యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు’ శీర్షికన ‘సాక్షి’ మెయిన్‌లో బుధవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు మండలకేంద్రంలోని శివ ఫర్టిలైజర్ డీలర్‌కు ఆ శాఖ అధికారులు షోకాజ్ జారీ చేశారు. యూరియా పంపిణీ విషయంలో డీలర్ నిర్లక్ష్యం, అలాగే అధిక ధరకు విక్రయిస్తున్న తీరుపై నిరసిస్తూ రైతులు బుధవారం ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ స్వామి గురువారం సదరు డీలర్‌కు షోకాజ్ జారీ చేశారు.


